పరిచయం
తరగతి నాయకుడికి గమనిక: ఈ సెషన్ ప్రారంభంలో, విద్యార్థులు మునుపటి పాఠంలో నేర్చుకున్న పద్ధతిలో సువార్తను పంచుకొన్న వారి అనుభవాలను చెప్పాలి. విద్యార్థులు ఒకరినొకరు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గుర్తుంచుకోండి. సువార్తను పంచుకున్న ప్రతి విద్యార్థి వినేవారు సానుకూలముగా స్పందించక పోయినా ముఖ్యమైనదాన్ని వారు పంచుకొవాలి.
ఈ పాఠం కొరకు, తరగతికి రేఖాచిత్రాన్ని చూపించడానికి బోర్డు, వైట్‌బోర్డ్ లేదా పెద్ద కాగితం ఉండేలా చూసుకోండి.
మాతోకూడ మీకును సహవాసము కలుగునట్లు మనము చూచినదానిని వినినదానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోకూడ ఉన్నది (1 యోహాను 1:3).
► సువార్తను పంచుకోవడానికి అపొస్తలుడు ఏ కారణం చెప్పాడు?
దేవునిని తెలిసికోనడము మరియు రక్షింపబడటం అంటే ఏమిటో మనము అనుభవించాము, ఆయనతో సహవాస సంబంధాన్ని ప్రారంభించాము. దేవునితో సంబంధం ఉన్న ఇతరులతో కూడా మనము ప్రత్యేక సంబంధం కలిగి ఉంటాము. మనము సువార్త ఇతరులకు ప్రకటించి నప్పుడు, మనము దేవునితో మరియు తెలిసిన ఇతరులతో సహవాసములోనికి వస్తాము. ఆ సహవాసములోనికి ఇతరులను కూడా ఆహ్వానించాలి.





