తరగతి నాయకుడికి గమనిక: ఈ పాఠంలో చర్చించిన లేఖన భాగాలతో పాటు, ఫుట్నోట్స్లో అనేక లేఖన సూచనలు అందించబడ్డాయి. తరగతి సెక్షన్లో వాటిని చూసేందుకు మరియు చదవడానికి తగినంత సమయం ఉండకపోవచ్చు. తరగతి నాయకుడు చదవడానికి కొన్ని బైబిల్ లేఖనాలను ఎంచుకోవచ్చు.
మారుమనస్సు అనే పదం ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు జరిగే మార్పును సూచిస్తుంది. మారుమనస్సు అనుభవానికి పాపిని నడిపించడమే సువార్త ప్రకటన యొక్క ముఖ్యలక్ష్యం.
► 1 థెస్సలొనీక 1వ అధ్యాయము చదవండి. థెస్సలొనీక మారుమనస్సు పొందినప్పుడు వారిలో జరిగిన మార్పు వివరాలు ఏమిటి?
ఒక వ్యక్తిని ఎందుకు మారుమనస్సు పొంద అవసరం ఉందో అర్థం చేసుకోవడానికి, మరియు ఒక వ్యక్తి Zమారుమనస్సు పొందినప్పుడు ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి, మారుమనస్సుకు ముందు పాపి యొక్క స్థితిని మనం అర్థం చేసుకోవాలి.
► ఒక వ్యక్తి రక్షింపబడటానికి ముందు అతని పరిస్థితిని మీరు ఎలా వివరిస్తారు?
ఆదాము చేసిన పాపం వల్ల, ప్రతి వ్యక్తి పుట్టినప్పుడు దేవుని నుండి వేరు చేయబడతాడు (రోమా 5:12). అంటే ప్రతి వ్యక్తి స్వార్థపరుడు మరియు తనదైన సొంత మార్గంలో వెళ్తాడు.
పాపి యొక్క నాలుగు లక్షణాలు క్రింది పేరాల్లో ఇవ్వబడ్డాయి.
ఒక వ్యక్తి ఎన్నుకోవడము ప్రారంభించిన వెంటనే, అతడు పాపం చేయడం ప్రారంభిస్తాడు. ప్రతి పాపి అనేక పాప క్రియల్లో దోషి (రోమా 3:23).
పాపం దేవుని ధర్మశాస్త్రమును మీరడమే (1యోహాను 3:4. యాకోబు 2:10-11). ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు, పాపాన్ని చూచి చూడనట్లుగా ఉండడు మరియు ప్రతివ్యక్తి అతడు చేసిన దానికి తీర్పు తీర్చును (2 కొరింథీయులకు 5:10, ప్రకటన 20:12-13). వ్యక్తి యొక్క అపరాధమును గూర్చిన ప్రశ్న, లేదా అతని తీర్పును గురించి ప్రశ్న లేదు. ప్రతిపాపి ఇప్పటికే ఖండించబడ్డాడు (యోహాను 3:18-19).
పాపి దేవునికి శత్రువు (రోమా 5:10). దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాలను తీసివేయకపోతే పాపి దేవునితో సంబంధంలోనికి రాడు.
పాపి కూడా తన కోరికలు అపరిశుద్ధమైనందున దేవునితో సంబంధానికి అనర్హుడిని అనే స్థితిలో ఉన్నాడు.(ఎఫెస్సి 2:3) అతడు పాపానికి దాసుడు అయినందున, పాపి తన పరిస్థితిని మార్చుకొనుటకు శక్తిలేనివాడు (రోమా 5:20, 7:23).
కాబట్టి పాపికి అవసరమైన రక్షణ ఏమిటి? పాపి దోషి కాబట్టి, రక్షణ అంటే పాప క్షమాపణ. అతడు దేవుని శత్రువు కాబట్టి, రక్షణ అంటే దేవునితో సంధి. అతడు అపవిత్రుడు కాబట్టి, రక్షణ అంటే ప్రాయశ్చిత్తం. అతడు శక్తిలేనివాడు కాబట్టి, రక్షణ అంటే శక్తివంతమైన విమోచన. ఇవి పాపికి అవసరమైన రక్షణకు సంబంధించిన కొన్ని అంశాలు మాత్రమే.
మారుమనస్సు సమయంలో, పాపి క్షమించబడతాడు, దేవునితో రాజీపడతాడు, పరిశుద్ధపరచబడతాడు మరియు పాపపు శక్తి నుండి విమోచన పొందుతాడు. కొరింథీయులకు విశ్వాసుల మునుపటి పాపపు పరిస్థితిని పౌలు వివరించాడు, ఇందులో చాలా భయంకరమైన పాపాలు ఉన్నాయి. అతడు ఇలా అన్నాడు "మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని, ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చబడితిరి" (1 కొరింథీయులకు 6:11).
సిలువ యొక్క అవసరం
ఏ వ్యక్తి తన పాపానికి తానే వెల చెల్లించలేడు. పాపం అనంతుడైన దేవునికి వ్యతిరేకంగా ఉంటుంది, మరియు మానవాళికి చెల్లించడానికి అనంతమైన విలువ ఏమీ లేదు.
ఒక వ్యక్తి తన అవసరం గురించి ఏమీ చేయలేడు; అందువల్ల, రక్షణను పొందటానికి మానవాళికి ఎటువంటి ప్రయత్నము సరిపోదు (గలతీయులకు 3:21) మానవుడు తనకుతానే రక్షణ పొందటం సాధ్యమైతే, యేసు సిలువపై చనిపోవడం అవసరం లేదు (గలతీయులకు 2:21).
► దేవుడు క్షమించాలి అనుకొంటే, కేవలం సిలువ లేకుండా ఎందుకు క్షమించలేడు?
దేవుడు పరిశుద్ధుడు గనుక, ఆయన తన సత్యం మరియు న్యాయము ప్రకారమే తీర్పు చేయాలి (రోమ 2:5-6)
క్రీస్తు బలి జరగకపోతే, ఊహించుకోండి. ప్రాయశ్చిత్తం లేకుండా దేవుడు పాపాలను క్షమించినట్లయితే?
ప్రాయశ్చిత్తం లేకుండా దేవుడు పాపాన్ని క్షమించినట్లయితే,
పాపం ముఖ్యం కాదని అనిపిస్తుంది.
దేవుడు అన్యాయస్థుడు, అపవిత్రుడని కూడా అనిపిస్తుంది.
దేవుని దృష్టిలో ఒక వ్యక్తి సరైన పని చేసిన దానికి మరియు తప్పు పని చేసే వ్యక్తికి మధ్య చాలా తక్కువ తేడా ఉన్నట్లు అనిపిస్తుంది.
క్షమాపణ ప్రాయశ్చిత్తం లేకుండా ఉంటే, దేవునిని న్యాయమైన మరియు పరిశుద్ధమైన దేవునిగా ఆరాధించలేము. ప్రాయశ్చిత్తము లేకుండా క్షమించడం చివరికి దేవుని గౌరవించుటకు బదులుగా అవమానపరుస్తాము.
కానీ , దేవుడు ప్రేమగలవాడు మరియు క్షమించాలని కోరుకుంటున్నాడు. మానవాళి శిక్షకు అర్హులే అయినప్పటికీ, మానవాళిని శాశ్వతంగా కోల్పోయిన పాపపుస్థితిలో వదిలేయడానికి ఆయన ఇష్టపడలేదు.
సిలువపై యేసు చేసిన త్యాగం అనంతమైన విలువతో కూడిన త్యాగాన్ని అందించింది. యేసు అర్హత (1) పాపము చేయకపోవడం ద్వారా (2 కొరింథీయులకు 5:21) (ఆయన పరిపూర్ణుడు గనుక తనకు రక్షణ అవసరము లేదు ), మరియు (2) ఆయన దేవుడు మరియు మానవుడు.
ప్రాయశ్చిత్తం క్షమాపణకు అవసరమైనదాన్ని అందిస్తుంది. ఇప్పుడు, దేవుడు తన వాగ్దానం పై నమ్మిక ఉంచువారిని క్షమించగలడు. సిలువపై చేసిన త్యాగాన్ని అర్థం చేసుకున్న ఎవరూ కూడా దేవుడు పాపాన్ని తమాషాగా లేదా మామూలుగా భావిస్తాడని నమ్మలేరు.
ప్రాయశ్చిత్తం దేవుడు తన వాగ్దానాన్ని విశ్వసించే పాపిని నీతిమంతుడిగా పరిగణించే మార్గాన్ని అందిస్తుంది, మరియు దేవుడు ఇంకా న్యాయంగా ఉండగలుగుతాడు. ప్రాయశ్చిత్తం ఎలా పనిచేస్తుందో రోమా 3:20-26 తార్కిక వివరణ ఇస్తుంది.
దేవుడు కలుగజేసిన రక్షణమార్గమే, ఖచ్చితమైనమార్గం అని బైబిలు చెబుతుంది. ఒక వ్యక్తి క్రీస్తుపై విశ్వాసం ద్వారా కృప చేత కలుగు రక్షణను తిరస్కరిస్తే, అతడు ఎన్నటికి రక్షింపబడడు (మార్కు 16:15-16, అపోస్తలులకార్యములు 4:12, హెబ్రీయులకు 2:3)
రక్షణ యొక్క సిద్ధాంతాన్ని కృపద్వారా మాత్రమే తెలుసుకోవడం, విశ్వాసంద్వారా మాత్రమే పొందడం చాలా ముఖ్యం. రక్షణ కృపవల్ల మాత్రమే, ఎందుకంటే దాన్ని సంపాదించడానికి లేదా అర్హత సాధించడానికి మనం ఏమీ చేయలేము. ఇది విశ్వాసంద్వారా మాత్రమే ఎందుకంటే దానిని పొందటానికి మనం ఏమీ చేయలేము. మనము దేవుని వాగ్దానాన్ని మాత్రమే నమ్మగలము.
మొదటిది కృప
► మొదట ఏది జరుగుతుంది: దేవునికి మానవుని ప్రతిస్పందన లేదా మానవునిలో దేవుని పని?
దేవుని కృప పాపి హృదయంలోకి ప్రవేశించి, అతని పాపాలను ఒప్పింప చేస్తుంది మరియు క్షమాపణ కోరుకునేలా చేస్తుంది (తీతు 2:11, యోహాను 1:9, రోమా 1:20) దేవుని సహాయం లేకుండా పాపి తన పాపాలను విడిచిపెట్టుట సాధ్యము కాదు. విడిచిపెట్టడానికి శక్తిలేనివాడు (యోహాను 6:44) దేవుడు పాపికి, సువార్తకు ప్రతిస్పందించే సామర్థ్యాన్ని ఇస్తాడు. ఒక వ్యక్తి రక్షింపబడకపోతే, అది అతనికి కృప లేకపోవడం వల్ల కాదు; అయితే దేవుడు ఇచ్చిన కృపకు స్పందించలేక పోవడమే.
సర్వలోక పాపాల కొరకు యేసు మరణించాడు, మరియు ప్రతివ్యక్తి రక్షింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు (2 పేతురు 3:9, 1 యోహాను 2:2, 1 తిమోతి 4:10) దేవునికృప ప్రతివ్యక్తికి ప్రతిస్పందించే సామర్థ్యాన్ని ఇస్తుంది, కాని అతడు ఎవరిని బలవంతం చేయడు. అందుకే పశ్చాత్తాపం చెందడానికి మరియు విశ్వసించుటకు దేవుడు పాపిని పిలుస్తాడు (మార్కు 1:15)
పశ్చాత్తాపం యొక్క నిర్వచనము
► పశ్చాత్తాపం అంటే ఏమిటి?
పశ్చాత్తాపం అంటే, ఒక పాపి తననుతాను దోషిగా మరియు శిక్షకు అర్హుడిగా గుర్తించుట మరియు అతడు తన పాపాలను విడిచిపెట్టడానికి సిద్ధపడుట.
యెషయాలోని ఈ వచనం పశ్చాత్తాపాన్ని వివరిస్తుంది:
భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారియందు జాలిపడును వారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును (యెషయా 55:7).
పశ్చాత్తాపం అంటే, దేవుడు తనను క్షమించే ముందు, పాపి తన జీవితాన్ని సరిచేసుకొని తననుతాను నీతిమంతునిగా చేసుకోవాలి అని కాదు. అది అసాధ్యం, ఎందుకంటే ఒక వ్యక్తి పాపానికి దాసుడుగా ఉన్నాడు మరియు తననుతాను విడిపించుకోలేడు; పాపి తన పాపములనుండి విమోచించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని గ్రహించాలి.
► రక్షణ కృప ద్వారానే లభిస్తుంది; కాబట్టి, రక్షణకు పశ్చాత్తాపం ఎందుకు అవసరం?
క్షమాపణకు విశ్వాసం మాత్రమే అవసరం, కాని క్రీస్తుపై నిజమైన విశ్వాసం ఒక వ్యక్తి తన పాపాలకు పశ్చాత్తాపం చెందుతాడు. క్రీస్తు వైపు తిరగడం (విశ్వాసం) మరియు పాపములను విడిచిపెట్టుట (పశ్చాత్తాపం) ఈ రెండు అదే సమయంలో జరుగుతాయి, కాని విశ్వాసం పాపానికి దూరంగా ఉండడాన్ని సాధ్యం చేస్తుంది. ఈ రక్షించే విశ్వాసం దేవుని వరం (ఎఫెస్సి 2:8-9). ఎందుకంటే పశ్చాత్తాపం లేకుండా రక్షణ ఉండదు. ఒక వ్యక్తి పశ్చాత్తాపం చెందడానికి ఇష్టపడకపోతే, అతడు పాపం నుండి రక్షింపబడడానికి ఇష్టపడడు.
ఒక వ్యక్తి పశ్చాత్తాపపడక పోతే, అతడు పాపం యొక్క చెడును, చెడుగా అంగీకరించడు. అతడు పాపం ఎందుకు విడిచిపెట్టాలో అతడు చూడకపోతే, తన పాపం నిజముగా చెడ్డదని అతడు చూడలేడు. తన పాపం చెడు అని అతడు చూడకపోతే, అతనికి క్షమాపణ ఎందుకు అవసరమో అతనికి నిజముగా అర్థం కాలేదు.
ఒక వ్యక్తి సాకు లేకుండా తననుతాను నిజముగా దోషిగా చూడకపోతే, అతడు శిక్షకు అర్హుడు, అతడు పశ్చాత్తాపపడలేదు. అతడు పాపి అని ఒప్పుకున్నా, పాపం కొనసాగించడానికి అనుకూలమైన మతాన్ని కోరుకుంటే, అతడు పశ్చాత్తాపపడలేదు ఎందుకంటే అతన్ని దోషిగా చేసిన పనిని కొనసాగించాలని కోరుకుంటున్నాడు.
రక్షించే విశ్వాసము యొక్క నిర్వచనము
► ఒక వ్యక్తికి రక్షించే విశ్వాసం ఉంటే, అతడు ఏమి నమ్ముతున్నాడని అర్థం?
(1) తనకుతాను నీతిమంతునిగా చేసికొనుటకు తాను ఏమీ చేయలేనని అతడు గ్రహిస్తాడు.
మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు (ఎఫెసీయులకు 2:8-9).
అతడు తాను ఏమీ చేయలేడు (క్రియలు) పాక్షికంగా కూడా రక్షింపబడటానికి అర్హుడు కానని అతడు గ్రహిస్తాడు.
(2) తన పాప క్షమాపణకు క్రీస్తు బలి సమృద్ధిగా సరిపోతుందని అతడు నమ్ముతాడు.
ఆయనే మన పాపములకు శాంతికరమైయున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమైయున్నాడు (1 యోహాను 2:2).
శాంతికరము అంటే మన క్షమాపణను సాధ్యం చేసే బలియాగము.
(3) విశ్వాసం యొక్క స్థితిపై దేవుడు తనను క్షమించాడని అతడు నమ్ముతాడు.
మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును (1 యోహాను 1:9).
క్షమించబడుటకు ఇతర పరిస్థితులు కూడా ఉన్నాయని అతడు అనుకుంటే, కృపద్వారా పూర్తిగా కాకుండా క్రియలద్వారా కొంతవరకు రక్షింపబడాలని అతడు ఆశిస్తాడు.
మారుమనస్సు
► ఒక విద్యార్థి, సమూహం కొరకు అపొస్తలుల కార్యములు 26:16-18 చదవాలి. పౌలు పరిచర్యలో ఈ వచనాలు ఏమి చెబుతున్నాయి?
[1]ప్రజలను మారుమనస్సులోనికి నడిపించడం పౌలు యొక్క ప్రధాన పరిచర్య. 18వ వచనం మారుమనస్సుని వివరిస్తుంది. చీకటిలో నుండి వెలుగులోనికి మరియు సాతాను శక్తి నుండి దేవుని వైపుకు తిరగడం ఇందులో ముఖ్యమైనది. పరిశుద్ధపరచబడినవారు క్షమాపణపొందుట మరియు వారసత్వాన్నిపొందడం ఇందులో ఉన్నాయి. ఇది క్రీస్తుపై విశ్వాసం ద్వారా జరుగుతుంది.
పాపి నుండి క్రైస్తవునిగా మారడం గొప్ప పరివర్తన. బైబిల్ దీనిని క్రొత్త జన్మ అని పిలుస్తుంది (2 కొరింథీయులకు 5:17). కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతనసృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను.
మారుమనస్సు పొందిన వ్యక్తి విగ్రహాలను మరియు దేవుని పట్ల పూర్తి విధేయతకు వ్యతిరేకంగా విభేదించే మతపరమైన ఆచారాలను వదిలివేస్తాడు (1 థెస్సలొనీక 1:9).
జీవిత మార్పు సాధారణంగా ఇతరులను ఆశ్చర్యపరుస్తుంది (1 పేతురు 4:3-4). ఒక వ్యక్తి ఎందుకు అంతగా మారుతాడో వారికి అర్థం కాదు. ఆ వ్యక్తి యొక్క సన్నిహితులు మరియు బంధువులు అతన్ని హింసించవచ్చు (మత్తయి 10:34-36).
మార్చబడిన వ్యక్తి ఇకపై ప్రపంచంలోని కోరికలు మరియు ప్రాధాన్యతలయందు ఆనందించడు. ఈ వ్యత్యాసం అతడు మారుమనస్సు పొందాడు అను సాక్ష్యాలలో ఒకటి (1 యోహాను 2:15). మారుమనస్సు పొందిన వ్యక్తి ఇతర విశ్వాసులను ప్రేమిస్తాడు మరియు వారితో సహవాసం కోరుకుంటాడు (1 యోహాను 3:14).
మారుమనస్సు పొందిన వ్యక్తి కోరికలు మారుతాయి. అతడు ఇంకా శోధనలను కలిగి ఉంటాడు, కాని అతడు పాపపు శోధనలను ఎదిరించగలడు ఎందుకంటే అతడు ఇకపై పాపపు కోరికల ద్వారా నియంత్రించబడడు. అతడు దేవుని కృపను అనుభవించినందున అతనికి దేవుని వాక్యముపై అమితమైన ఆశ ఉంటుంది (1 పేతురు 2:2-3).
మారుమనస్సు పొందిన వ్యక్తి దేవున్ని ప్రేమించాలి మరియు దేవుణ్ణి సంతోషపరచాలను కొంటాడు. అతడు దేవుని ఆజ్ఞలను కఠినమైన మరియు అసహ్యకరమైనదిగా పరిగణించడు (1 యోహాను 5:2-4).
మారుమనస్సు పొందిన వ్యక్తి దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కొనసాగిస్తాడు, ముఖ్యంగా ప్రార్థనలో ప్రతి విషయాన్ని దేవునికి తెలియజేస్తాడు (1 కొరింథీయులకు 1:2).
► మీ స్వంత మాటలలో, ఒక వ్యక్తి మారినప్పుడు సంభవించే పరివర్తన గురించి చెప్పండి.
చిత్తశుద్ధితో ఉన్న పాస్టర్ “నిర్ణయాలతో” సంతృప్తి చెందడు, కాని క్రీస్తుతో తమ సంబంధాన్ని ఆసక్తిగా కొనసాగించే విశ్వాసులతో; దేవుని వాక్యానికి ఆకలితో ఉన్న విశ్వాసులు, క్రైస్తవ ప్రేమలో నడుచుకునేవారు, క్రీస్తు మరణం మరియు పునరుత్థానంపై విశ్వాసం ద్వారా నిరంతరం పంచుకునేవారు, మరియు ఆపకుండా ప్రార్థన చేసేవారు.
(తిమోతి కీప్, “బైబిల్ ఎవాంజెలిజం మరియు మార్పిడి యొక్క సమగ్రత”)
క్రొత్త జన్మ యొక్క లక్షణాలు
ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించి నప్పుడు, అన్ని విషయాలు క్రొత్తగా మారుతాయని బైబిలు చెబుతోంది. క్రొత్త విషయాలలో ఈ క్రింది విధంగా ఉన్నాయి:
క్రొత్త స్వభావం - దైవిక స్వభావం (2 పేతురు 1:4).
క్రొత్త యజమాని - పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు (మత్తయి 23:10, రోమా 8:14 ).
దేవుని వాక్యాము కొరకు క్రొత్త ఆకలి (1 పేతురు 2:2).
ప్రేమ యొక్క క్రొత్త వైఖరి (రోమా 5:5, 1 యోహాను 4:7-8).
కుమారునిగా లేదా కుమార్తెగా దేవునితో క్రొత్త సంబంధం (యోహాను 1:12).
పరిశుద్ధాత్మలో క్రొత్త సహాయకుడు (యోహాను 14:16, రోమా 8:26-27).
మనం పాపంలో పడితే యేసుక్రీస్తులో క్రొత్త న్యాయవాది (1 యోహాను 2:1).
నిత్యజీవానికి క్రొత్త మరియు సజీవ నిరీక్షణ (రోమా 8:12, 1 యోహాను 3:2).
రక్షణ యొక్క వ్యక్తిగత నిశ్చయత
► ఒక వ్యక్తి తాను క్రైస్తవుడని భావించడానికి ఏ సరిగాని కారణాలు ఉండవచ్చు?
ఒక వ్యక్తి తాను క్రైస్తవుడని అనుకోవచ్చు ఎందుకంటే
అతడు బాప్తిస్మం తీసుకున్నాడు.
అతడు సంఘ సభ్యుడు.
అతడు కొన్ని క్రైస్తవ సిద్ధాంతాలను నమ్ముచున్నాడు.
అతడు కొన్ని మతపరమైన ఆచారాలను అనుసరించుచున్నాడు.
అతడు సరైన క్రియల ప్రమాణాన్ని అనుసరించుచున్నాడు.
అతడు అధ్యాత్మిక అనుభవాలు కలిగి ఉన్నాడు.
అతడు విశ్వాసం యొక్క నిర్ణయం మరియు వృత్తిని ఎన్నుకున్నాడు.
బైబిల్ ప్రకారం, వీటిలో ఏదీ అతడు క్రైస్తవుడని నిశ్చయత ఇవ్వడానికి సరిపోదు.
మనం రక్షింపబడ్డామని ఖచ్చితంగా తెలుసుకోవచ్చని బైబిలు చెబుతుంది. దేవుడు మనలను అంగీకరించాడని మనకు విశ్వాసం ఉంటుంది. మనం భయంతో జీవించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం దేవుని దత్తపుత్రులమని దేవుని ఆత్మ మనకు నిశ్చయత ఇస్తున్నాడు (రోమా 8:15-16).
తీర్పు దినం గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు (1 యోహాను 4:17). ఎందుకంటే ఈ నిశ్చయత చాలా సమగ్రమైనది. కొందరు పరలోకానికి ప్రవేశం పొందుతారని ఆశిస్తున్నారు, కానీ అది మనకు లభించే ఉత్తమమైన నిశ్చయత కాదు. దాని కంటే గొప్ప నిశ్చయత మనకు లభిస్తుంది. మానవాళి అందరికీ రక్షణ అందుబాటులో ఉందని భావించడం సరిపోదు. ఒక వ్యక్తి తన స్వంత రక్షణ గురించి తెలుసుకోవాలి.
► ఒక వ్యక్తి తాను రక్షింపబడ్డాడని ఎలా ఖచ్చితంగా తెలుసుకోగలడు?
కొంతమంది వారి భావాలపై ఆధారపడి ఉంటారు, కాని భావాలు మారిపోగలవు మరియు భావాలు తప్పుదారి పట్టించగలవు.
ఒక వ్యక్తి యొక్క మార్పు చెందినా జీవితం, సాక్ష్యం ఇస్తుంది, కానీ ఆ సాక్ష్యం కొన్ని సార్లు సరిపోదు. ఆ సాక్ష్యం అనేది ప్రారంభం నుంచి కనిపించదు. రక్షణ యొక్క ఫలితాలు కనిపించడానికి సమయం పడుతుంది. అందువల్ల, మారిన జీవితం మాత్రమే నిశ్చయతకి ఆధారం కాదు.
విశ్వాసి రక్షణకు లేఖనాధార మార్గాన్ని అనుసరించాడని తెలుసుకోవడం ద్వారా తన రక్షణకు ఖచ్చితంగా నిశ్చయత తెలుసుకోవచ్చు. ఒకరు నిజముగా పశ్చాత్తాపపడి బైబిల్ నిర్దేశించినట్లు విశ్వసిస్తే, దేవుడు తనను క్షమించాడని నమ్మడానికి అతనికి హక్కు ఉంటుంది. అతడు మారుమనస్సు పొందుతాడు మరియు దేవున్ని నమ్ముతాడు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అతడు దేవుని బిడ్డగా మారాడు అని సాక్ష్యమిస్తాడు, అదే రక్షణ నిశ్చయత.
ఒక వ్యక్తి నిజముగా పశ్చాత్తాపపడనప్పుడు తాను రక్షించబడ్డానని భావించడానికి ప్రయత్నిస్తే, అతడు గందరగోళానికి గురవుతాడు మరియు తననుతాను మోసం చేసుకోవచ్చు.
ఒక వ్యక్తి (1) నిజముగా పశ్చాత్తాపపడితే, (2) దేవుని వాగ్దానాన్ని గ్రంథంలో విశ్వసిస్తే, (3) ఆత్మ యొక్క సాక్ష్యాన్ని స్వీకరిస్తే, అతడు ఎప్పటికి మోసపోడు. ఈ నిశ్చయత దేవుని వాక్యంపై ఆధారపడింది, ఇది ఖచ్చితంగా నమ్మదగినది. దేవుడు ఎల్లప్పుడు తన వాగ్దానాలను నెరవేర్చువాడు.
రక్షణకు సంబంధించిన 10 పదాలు
సమాధనపరచుట: ఈ పదం యొక్క అర్థము శత్రువులుగా ఉన్నవారు మళ్ళీ సమాధానమును పొందుట. రక్షణలో, మనము దేవునితో సమాధానము పొందియున్నము (2 కొరింథీయులకు 5:19, రోమా 5:1).[1]
తుడిచివేయబడుట: ఈ పదం యొక్క అర్థము వ్రాయబడిన వ్రాతను తుడిచివేయుట. రక్షణలో, మన పాపాల పత్రము తుడిచివేయబడి, తొలగించబడుతుంది (హెబ్రీయులకు 8:12).
శాంతపరచుట: ఈ పదం యొక్క అర్థము ఒకరి కోపాన్ని మళ్ళించడానికి వాడే పదాన్ని సూచిస్తుంది. రక్షణలో, యేసు బలి మనకు వ్యతిరేకంగా ఉన్న దేవుని కోపాన్ని దూరం చేస్తుంది (1 యోహాను 2:2).
విమోచన: ఈ పదం యొక్క అర్థము ఎవరైనా ఒకరిని ఒక శక్తి నుండి రక్షించుట. రక్షణలో, మనల్ని సాతాను మరియు పాపపు శక్తి నుండి బయటకు తీసుకొనివచ్చుట (లూకా 1:74, రోమా 6:6, 12-18).
వెలచెల్లించుట: ఈ పదం యొక్క అర్థము ఎవరినైన విడిపించుటకై ధర చెల్లించబడును. రక్షణలో, యేసు మరణం వెల ద్వారా, మన పాపం యొక్క దాసత్వము మరియు శిక్ష నుండి విడుదల పొందాము (ఎఫెస్సి 1:7, తీతు 2:14).
నీతిమంతులనుగా చేయుట: ఈ పదానికి అర్థము ఎవరైనా నీతిమంతులుగా, లేదా నిర్దోషులుగా ప్రకటించబడుట. రక్షణలో, అపరాధి పాపిని, నీతిమంతులుగా పరిగణిస్తారు ఎందుకంటే యేసు అతని స్థానంలో బాధపడ్డాడు (2 కొరింథీయులకు 5:19, రోమా 5:1).
పరిశుద్ధపరచుట: ఈ పదానికి అర్థము ఎవరైనా పవిత్రులు అని అర్ధం. రక్షణలో, పాపి దేవుని పరిశుద్ధ కుమారునిగా మార్చబడతాడు (1 కొరింథీయులకు 1:2, ఎఫెస్సి 1:1, కొలొస్సయులకు 1:1, ఫిలిప్పి 1:1).
దత్తత: ఈ పదం యొక్క అర్థము ఎవరైనా మరొకరికి చట్టబద్దమైన బిడ్డ అగుట. రక్షణలో మనం దేవుని పిల్లలు అవుతాం (యోహాను1:12, రోమా 8:15).
పునర్జన్మ/ క్రొత్త జన్మ: ఈ పదానికి అర్థము ఎవరైనా మళ్ళీ జీవితాన్ని ప్రారంభించుట. రక్షణలో విశ్వాసి క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు (ఎఫెస్సి 2:1, యోహాను 7:38-39, గలతీయులకు 4:29, యోహాను 3:5).
ముద్రించుట: ఈ పదం యొక్క అర్థము ఎవరు యజమానుడుగా ఉన్నాడో చూపించడానికి ఏదో గుర్తు గుర్తించబడిందని అర్థం. రక్షణలో, మనలోని పరిశుద్ధాత్మ, మనలను దేవునికి చెందిన వ్యక్తిగా గుర్తిస్తాడు (ఎఫెస్సి 1:13).
[1]ఈ వచనాలు నీతిమంతత్వము మరియు సమాధానమును గూర్చి మాట్లాడుచున్నవి.
నివారించడానికి లోపం: పశ్చాత్తాపం లేని మతం
విశ్వాసం ద్వారా కృప చేత రక్షణ అని విన్నప్పుడు తాను రక్షింపబడ్డానని సులభంగా భావించే ఒక రకమైన వ్యక్తి ఉన్నాడు. అతడు నిజంగా పశ్చాత్తాపపడలేదు ఎందుకంటే అతడు అది అవసరం లేదని. దేవుని తీర్పుకు అర్హుడైన పాపిగా తననుతాను ఎప్పుడూ చూడలేదు. కృప అంటే అతడు తన సొంత మార్గంలో వెళ్ళగలడని అతడు భావిస్తాడు. అతడు క్రైస్తవ మతం యొక్క సత్యాన్ని అంగీకరించినందున, అతడు క్రైస్తవుడని అనుకుంటాడు, అయినప్పటికీ అతనికి పరివర్తన లేదు. అతడు తన సొంత ఇష్టానికి ఎప్పుడూ లొంగిపోలేదు; బదులుగా, అతడు దేవుణ్ణి తన జీవితంలో ఒక భాగంగా అంగీకరించాడు మరియు ఇప్పటికీ తన ఇష్టానుసారంగా ఎక్కువగా జీవిస్తాడు. లేఖన వివరణ ప్రకారం, ఇది దేవునితో రక్షించే సంబంధానికి నాంది కాదు.
పాఠం 2 అసైన్మెంట్లు
(1) ఈ పాఠంలో రక్షణకు సంబంధించిన అంశాల కొరకు 10 పదాలను అధ్యయనము చేసాము. కొన్ని పేరాగ్రాఫ్లలో, దేవునితో మీ సంబంధంలో మీకు ఏవి చాలా ముఖ్యమైనవిగా ఉన్నాయో వివరించండి. మీరు మరింత లోతుగా ఆలోచించాల్సినవి ఏవైనా ఉన్నాయా?
(2) మీ దేశంలో మరియు ముఖ్యంగా మీ స్వంత ప్రాంతంలో కనిపించే క్రైస్తవ మతం యొక్క పద్ధతుల ఆధారంగా, క్రైస్తవుడిగా ఉండటానికి ప్రజలు ఏమి అనుకుంటున్నారు? 2-3 పేజీలలో, అనేక రకాల వ్యక్తులను వివరించండి మరియు ఒక క్రైస్తవుడు అనగానే వారు ఏమి చెబుతారు. వారి పశ్చాత్తాపం, రక్షించే విశ్వాసం లేదా ఇతర సిద్ధాంతాల గురించి వారి అభిప్రాయంలో ఏమి తప్పున్నాయను వివరించండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.