మునుపటి పాఠం చివరిలో చెప్పబడిన పరీక్షను విద్యార్థులకు ఇవ్వండి. విద్యార్థులు ఏ నోట్స్ చూడకుండా లేదా ఒకరితో ఒకరు మాట్లాడకుండా జ్ఞాపకశక్తిలో నుండి సమాధానాలు రాయాలి.
పరిచర్య కొరకు శిక్షణ పొందటానికి మరియు పద్ధతులను నేర్చుకోవడానికి మనము మన వంతు కృషి చేసినప్పుడు, పరిచర్య కొరకు మానవ సామర్ధ్యాలపై ఆధారపడే ప్రమాదం ఉంటుంది. కానీ, అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా, “మేమే సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది” (2 కొరింథీయులకు 3:5).
పౌలు తాను మానవ జ్ఞానంతో లేదా మానవ ఒప్పిదము ద్వారా బోధించలేదని చెప్పాడు; కానీ అతడు పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతపై ఆధారపడ్డాడు, తద్వారా వినేవారి విశ్వాసం మానవ జ్ఞానం మీద ఆధారపడి ఉండదు, కానీ దేవునిపై ఆధారపడి ఉంటుంది (1 కొరింథీయులకు 2:4-5). పౌలు విద్యావంతుడు, కానీ తన జ్ఞానం మరియు నైపుణ్యం అధ్యాత్మిక ఫలితాలను ఇస్తుందని అతడు ఊహించలేదు.
థెస్సలొనీకయులకు వ్రాస్తూ, పౌలు ఇలా అన్నాడు, “మా సువార్త, మాటతో మాత్రముగాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను మీయొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియును” (1 థెస్సలొనీక 1:5). దేవుని శక్తి కారణంగా వారు సువార్త ద్వారా ఒప్పించబడ్డారు.
పరిశుద్ధాత్మ పాపం, నీతి మరియు తీర్పును గూర్చి ఒప్పిస్తూ లోకాన్ని దోషిగా చేస్తుందని యేసు, అపొస్తలులకు వాగ్దానం చేశాడు (యోహాను 16:8). తండ్రి వారిని ఆకర్షించితేనె తప్ప ఎవడును తన యొద్దకు రాడని యేసు చెప్పారు (యోహాను 6:44).
పరిశుద్ధాత్మ పని యొక్క కొన్ని సంగతులు
అతడు పాపిని దోషిగా ఒప్పిస్తాడు – (యోహాను 16:8)
అతడు దోషిగా ఒప్పుకొనిన పాపిని మారుస్తాడు – (యోహాను 3:5)
అతడు మార్చబడిన పరిశుద్ధున్ని సంరక్షిస్తాడు – (ఎఫెసీయులకు 1:13, 4:30)
అతడు సంరక్షించబడిన పరిశుద్ధునికి ఆజ్ఞ ఇస్తాడు – (అపొస్తలుల కార్యములు 13:2, 4)
అతడు నియమించబడిన పరిశుద్ధునికి అధికారం ఇస్తాడు – (అపొస్తలుల కార్యములు 1:8)
అతడు నేర్చుకున్న పరిశుద్ధులను నడిపిస్తాడు – (యోహాను 16:3, అపొస్తలుల కార్యములు 8:29)
అతని నేతృత్వంలో ఎవరు పరిశుద్ధులుగా నడిపించబడుదురో, వారి శరీరం యొక్క క్రియలు చంపివేసి మరియు తద్వారా నీతినిబట్టి అతనిని స్థిరపరచును – (రోమీయులు 8:13)
► పరిశుద్ధాత్మపై ఆధారపడటం సువార్త ప్రచారానికి మన విధానాన్ని ఎలా నిర్దేశిస్తుంది? మనం పరిశుద్ధాత్మపై ఆధారపడటం వల్ల భిన్నంగా ఏమి చేయాలి?
శిక్షణ యొక్క విలువ
► శిక్షణ మరియు సువార్త ప్రచార పద్ధతుల గురించి మనం ఏమి ఆలోచించాలి?
దేవుని సత్యాన్ని తెలియజేయడానికి మనలను పిలిచాడు. మనం అర్థం చేసుకోగలిగినంత ఉత్తమంగా దానిని వివరించాలి.
మనం పరిశుద్ధాత్మపై ఆధారపడటం వల్ల, శిక్షణ ద్వారా మన సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోకూడదని మనం అనుకోకూడదు, తప్పక మన సామర్త్యమును అభివృద్ధి చేసుకోవాలి.
ప్రజలను ఒప్పించడానికి ప్రయత్నించానని పౌలు చెప్పాడు (2 కొరింథీయులకు 5:11). దేవుని సత్యాన్ని సరిగ్గా తెలియజేయడానికి అధ్యయనము చేయమని తిమోతికి చెప్పాడు (2 తిమోతి 2:15). పెద్ద యొక్క అర్హతలలో ఒకటి, అతనికి బోధించే సామర్థ్యం తప్పక ఉండాలి (2 తిమోతి 2:24).
అపోల్లో సువార్తికుడుగా చాలా ప్రభావవంతంగా పనిచేశాడు. అతడు అనర్గళంగా, లేఖనములలో శక్తివంతమైనవాడు, ఆత్మలో ఉత్సాహవంతుడు (అపొస్తలుల కార్యములు 18:25-26). అతని సహజ సామర్ధ్యాలు, అధ్యాత్మిక వరములకు సంబంధించి, అతనికి గొప్ప ఆశీర్వాదం ఇచ్చాయి.
అపొస్తలుడైన పేతురు సువార్త యొక్క నిరీక్షణను వివరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని చెబుతాడు (1 పేతురు 3:15).
ఈ లేఖనాలు మనకు ఏమి తెలియజేయు విషయం ఏమిటంటే దేవుడు సహజమైన సామర్ధ్యాలను ఆశీర్వదిస్తాడు మరియు ఉపయోగిస్తాడు మరియు మనం ఆయనకు అర్పించుకొంటే ఎంతో ప్రయోజనము. అతడు మన బలాన్ని సమర్పించుకోమని పిలుస్తాడు మరియు ఆయన పనికి సామర్థ్యం ఇస్తాడు.
ఆత్మ నింపుదల
[1]అపోస్తలుల కార్యములు 1:4-5, యేసు ఇలా చెప్పారు, తండ్రి వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము కొరకు వేచి ఉండమని చెప్పాడు." ఈ సంఘటనలో సర్వలోకానికి సాక్ష్యమిచ్చే శక్తి యొక్క ప్రభావము ఉంటుంది (అపొస్తలుల కార్యములు 1:8).
శిష్యులు రక్షింపబడినప్పటికీ, యేసు శారీరకంగా కనిపించే నాయకత్వం లేకుండా పరిచర్యకు సిద్ధంగా ఉండటానికి ముందే వారికి అంతర్గత శక్తి అవసరం ఉంటుంది. గొప్ప గురువు మూడు సంవత్సరాల శిక్షణ కూడా వారిని పూర్తిగా సిద్ధం చేయలేదు, ఎందుకంటే వారి అంతర్గత సమస్య అలాగే ఉంటుంది. దేవుని ప్రణాళిక ప్రకారం, పరిశుద్ధాత్మ చేత అధికారం మరియు మార్గనిర్దేశం చేయబడే ముందు, పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యేక పని ద్వారా వారు హృదయంలో ఒక ఖచ్చితమైన నింపుదల కలిగి ఉండాలి.
మూడేళ్ల శిక్షణలో ఈ సమస్య వివిధ సందర్భాల్లో కనిపించింది. వారు కొన్నిసార్లు ప్రతీకారం తీర్చుకున్నారు, వారిని తిరస్కరించిన వ్యక్తులపై అగ్ని దిగిరావాలని వారు కోరుకున్నారు (లూకా 9:54-55). వారు కొన్నిసార్లు గర్వంగా ప్రవర్తించారు, వారు, వారివలే అధికారం లేని ఒక వ్యక్తిని అతని పరిచర్యను నిషేధించినప్పుడు (మార్కు 9:38), వారు స్వార్థపూరితంగా మరియు గర్వంగా కనిపించారు, ఇద్దరు ఉన్నత పదవులు అడిగినప్పుడు మరియు ఇతరులు ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు (మార్కు 10:35-41) వారిలో అంతర్గత సమస్య అలాగే ఉంది అనుటకు రుజువులు.
వారిలో ఎవరు గొప్పఅని వారు వాదించుకోన్నారు (మార్కు 9:33-34). వారు ఏమి మాట్లాడుతున్నారని యేసు అడిగినప్పుడు వారు సిగ్గుపడుతున్నారనే వాస్తవం, వారి ఉద్దేశాలు మెరుగ్గా ఉండాలని వారు స్పృహలోనే ఉన్నారని తెలుస్తుంది. వారి ఆఖరి భోజనం పస్కా భోజనము ఆచరిస్తుండగా, యేసు శిష్యుల పాదములను కడిగి మీరును ఈ సేవకత్వ అదే వైఖరి కలిగి ఉండాలని వారికి చెప్పాడు (యోహాను 13:14). వారిలో అప్పటికి ఇంకా వారిలో వినయం లేదు; అదే రోజు సాయంత్రం వారు ఒకరికొకరు సేవ చేయడానికి నిరాకరించారు. సమస్య జ్ఞానం లేకపోవడం కాదు, వారిలో ఉన్నఅహంకారం.
ఒకరికొకరు తమ ప్రాణాలను అర్పించుకునేంత బలంగా ఉండే ప్రేమ వారికి ఉండాలని యేసు వారితో చెప్పాడు (యోహాను 15:12-13). వారు ఈ ప్రేమను కలిగి ఉన్నారని వారు భావించారు, కానీ వాస్తవానికి వారిలో లేదు; వారు మరణం ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుసుకొన్నప్పుడు, యేసును గెత్సేమనేలో పట్టుకొన్న సమయంలో పారిపోయారు (మార్కు 14:31, 50).
క్రీస్తు తన భౌతిక ఉనికి లేకుండా, సంఘాన్ని నడిపించే మరియు విస్తరించే బాధ్యత ఈ మనుష్యులకు అప్పగించాడు. యేసు వారు ఈ పరిచర్యకై సిద్ధంగా లేరని, వారి అంతరంగములో కొదువ కలిగి ఉన్నారని ఎరిగి, తండ్రి వాగ్దానము కొరకు యెరూషలేములో కనిపెట్టమని చెప్పాడు (అపోస్తలులకార్యములు 1:4-5). ఈ వాగ్దానం పరిశుద్ధాత్మ బాప్తిస్మముగా గుర్తించబడింది. ఆత్మ సహాయము లేకుండానే వారు సంఘాన్ని స్థాపించడం మరియు ముందుకు నడిపించడము అసాధ్యము.
వారికి అవసరమైనది ఎక్కువ శిక్షణ, లేదా సుదీర్ఘవృద్ధి, ప్రక్రియ అని ఆయన వారికి చెప్పలేదు. అధ్యాత్మిక గొప్ప సంభవము సంభవించడానికి వారు యెరూషలేములో వేచి ఉండాల్సి వచ్చింది.
పెంతేకొస్తు పండుగ రోజున శిష్యులు ఈ అనుభవాన్ని, పరిశుద్ధాత్మతో నింపినట్లుగా వర్ణించబడింది (అపొస్తలుల కార్యములు 2:4). ఆ సంఘటనలో అనేక విషయాలు ఉన్నప్పటికీ, పేతురు తరువాత ఆత్మ యొక్క ముఖ్యమైన పని, వారి హృదయాలను శుద్ధిపరచుట అని వివరించాడు (అపోస్తలులకార్యములు 15:8-9). ఇది శిష్యులకు అవసరం. వారి అంతర్గత అవసరానికి సంబంధించిన అన్ని ఆధారాలు గుండెలో ఒక సమస్య ఉంటుంది, వారసత్వంగా వారిలో వచ్చిన పాప స్వభావము, వీటిలో అవి శుద్ధి కావాలి. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము (లేదా నింపడం) ద్వారా ఈ శుద్దీకరణ సంభవించినప్పుడు, వారు ఇకపై తమ స్వంత భద్రత లేదా గొప్పతనము ప్రధాన లక్ష్యంగా పరిగణించరు.
[2]పెంతేకొస్తు రోజున జరిగిన సంఘటన సంఘముని శక్తివంతమైన సువార్త ప్రచార యుగంలోకి ప్రవేశపెట్టింది. సిద్ధాంతపరమైన విభేదాలు, యూదామత విశ్వాసాల, అంతర్గత ఫిర్యాదులు, కపటవాదులు, అపవిత్రాత్మల ప్రతిఘటన, హింస మరియు కష్టాలు ఉన్నప్పటికీ సంఘము ఆనందంగా మరియు విజయవంతంగా ముందుకు సాగింది.
నేటి విశ్వాసికి నాటి శిష్యులకు ఉన్న అవసరం అదే ఉండవచ్చు. ఈ అవసరాన్ని పరిశుద్ధాత్మతో నింపబడడం ద్వారా తీర్చవచ్చు.
పరిశుద్దాత్మ నింపుదల గురించి కొని తప్పు ఆలోచనలు:
1. ఈ ప్రత్యేక నింపుదల వచ్చేవరకు విశ్వాసిలో పరిశుద్ధాత్మ ఉండడు.
2. ఈ నింపుదల జరిగే వరకు పరిశుద్ధాత్మ యొక్క పనులు ఇవి ఏవీ నమ్మినవారిలో జరగవు.
3. హృదయాన్ని శుభ్రపరిచే ఈ ఆత్మతో పాటు ఆత్మ నింపుదల కూడా లేదు.
4. ఈ ఆత్మచేత నింపబడే ప్రతి వ్యక్తికి అపోస్తులుల పరిచర్య ఇవ్వబడుతుంది.
మన అనుభవం శిష్యుల అనుభవం లాగా ఉంటుందని మనం అనుకోకూడదు. ఏదేమైనా, హృదయాన్ని శుద్ధిచేయడం మరియు పరిచర్యకు సాధికారత అవసరం ఇంకా మనము చాలా ముఖ్యం.
శిష్యుల ఉదాహరణ నుండి దీనిని మనం చూడవచ్చు:
1. ఒక వ్యక్తికి ఈ అవసరం ఉంటే, అతడు పరిచర్యకు లేదా పరిశుద్ధ జీవితానికి పూర్తిగా సిద్ధంగా లేడు.
2. ఒక వ్యక్తిని ఈ స్థితిలో వదిలేయడానికి దేవుడు ఇష్టపడడు.
3. సమస్య పరిష్కారం, శిక్షణ లేదా దీర్ఘకాలిక అధ్యాత్మిక ఎదుగుదల కాదు.
4. సరైన కోరిక తర్వాత, ఈ అవసరము క్షణంలో తీర్చడం సాధ్యమవుతుంది.
పరిశుద్ధాత్మ యొక్క ఈ పనిని విశ్వాసి ఎలా స్వీకరించగలడు?
అది విశ్వాసం ద్వారా స్వీకరించబడిందని పేతురు చెప్పాడు (అపొస్తలుల కార్యములు 15:8-9). శిష్యులకు వాగ్దానం చేసి, నిరీక్షణను కల్పించడం ద్వారా విశ్వాసం కలిగి ఉండటానికి యేసు వారిని సిద్ధం చేశాడు.
గనుక, ఒక వ్యక్తి తన అవసరాన్ని మరియు దానిని తీర్చడానికి దేవుని చిత్తమును గుర్తిస్తే విశ్వాసం ద్వారా ఈ కృపను పొందగలడు.
యజమానుడు వారి చేతులకు అప్పగించుచున్న శక్తివంతమైన పని మనిషి యొక్క శక్తికి మించినది. అందువల్ల ఆయన వారికి పరిశుద్ధాత్మ యొక్క అనంతమైన వనరులను అందించాడు. పరిశుద్ధాత్మ పాపం, నీతి మరియు తీర్పును గూర్చి ప్రపంచాన్ని ఒప్పించవలసి ఉంది; అందువల్ల, అతను వారి పరిచర్యలో అద్భుతమైన శక్తి మరియు ఆశ్చర్యకరమైన ఫలితాలను ఇచ్చుటకు వారితో కనిసి ఉన్నాడు.
వారు శక్తివంతమైన సాక్ష్యులుగా ఐక్యపరచబడిన, అభిషిక్తుల బృందంగా మారారు: దేవుని పిలుపును అనుసరించి, దేవుని శక్తిని బట్టి, మరియు దేవుని మహిమ కోసం పనిచేస్తున్నారు.
పాఠం 6 అసైన్మెంట్లు
ప్రతి విద్యార్థి తనను తాను ప్రార్థనలో పరీక్షించుకుని ఈ ప్రశ్నలకు లిఖితపూర్వకంగా సమాధానం వ్రాయాలి. ఈ పేపర్‌ను తరగతి లీడర్‌కు ఇవ్వాల్సిన అవసరం లేదు.
నేను పరిశుద్ధాత్మపై ఆధారపడుతున్నానా, లేదా నా సామర్ధ్యాలు అనుమతించే వాటిని మాత్రమే చేయగలుగు చున్నానా?
శిష్యులకు పరిశుద్ధాత్మ నింపుదల అవసరమని చూపించిన కొన్ని లక్షణాలు నాలో ఉన్నాయా?
నా చర్యలు, అలవాట్లు, వైఖరులు లేదా లక్ష్యాలు దేవునికి లోబడేవిగా ఉన్నాయా?
నేను దేవుని మహిమ కొరకు ఉపయోగించబడేలా, పరిశుద్ధాత్మ నన్ను పూర్తిగా శుద్ధిచేయబడుటకు నేను సిద్ధంగా ఉన్నానా?
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.