బైబిల్ భాష్యానికి సూత్రాలు
బైబిల్ భాష్యానికి సూత్రాలు
Audio Course

Search Course

Type at least 3 characters to search

Search through all lessons and sections in this course

Searching...

No results found

No matches for ""

Try different keywords or check your spelling

results found

బైబిల్ భాష్యానికి సూత్రాలు

Lead Writer: Randall McElwain

Course Description

ఈ కోర్సు మన జీవితము దేవునితో సరియైన సంబంధాన్ని కలిగిఉండడానికి, బైబిలును సరిగ్గా వ్యాఖ్యానించే సూత్రాలను మరియు పద్ధతులను బోధిస్తుంది.

Introduction

ముద్రించగల PDF ఇక్కడ మరియు Additional Files/అనుబంధం/అదనపు ఫైళ్ళు లో అందుబాటులో ఉంది.

ఈ కోర్సు బైబిలు భాష్యానికి ప్రాథమిక సూత్రాలను పరిచయం చేస్తుంది. దీనిలో చెప్పే చాలా విషయాలు హావార్డ్ మరియు విలియం హెండ్రిక్స్ రాసిన లివింగ్ బై ద బుక్ గ్రంథాన్ని బట్టి జీవించడం (Living by the Book, by Howard and William Hendricks) నుండి తీసుకోవడం జరిగింది. మీరు ఆ పుస్తకాన్ని కలిగి ఉన్నట్లయితే, ఈ కోర్సులో చెప్పిన సూత్రాలను అభ్యాసం చేయడానికి కొన్ని ప్రశ్నలను చూడవచ్చు మరియు ప్రతి సూత్రంపై మరింతగా చర్చించవచ్చు. అయితే, ఈ కోర్సు చేయడానికి మాత్రం ఆ పుస్తకం అవసరం లేదు. అవసరమైన మెటీరియల్ అంతా ఈ పాఠాలలో ఇవ్వడం జరిగింది.

ప్రతి విద్యార్థి తరగతికి రాకముందే ప్రతి పాఠం చదవాలి. ఇంటి వద్ద అభ్యాసాలకు వెచ్చించే సమయానికి అదనంగా ప్రతి తరగతి సెషన్ కు 90-120 నిమిషాల సమయాన్ని వెచ్చించాలి. ఈ కోర్సు ప్రాథమికంగా ఆచరణాత్మ కార్యాచరణలపై ఆధారపడి ఉంది గనుక పాఠాన్ని ఒకటి కంటే ఎక్కువ సమావేశాలుగా విభజించవచ్చు. ఇది విద్యార్థులు కార్యచరణలను చేయడానికి ఎక్కువ సమయం వెచ్చించడానికి సహాయం చేస్తుంది.

చాలా పాఠాలలో, ప్రతి పాఠంలో చెప్పిన సూత్రాలను/ నియమాలను అభ్యాసం చేయడానికి అనేక కార్యాచరణలు ఉన్నాయి. ఈ కార్యాచరణకు చేయడానికి విద్యార్థులు తగినంత సమయం తీసుకోవడం ప్రాముఖ్యం. ఈ కార్యాచరణల్లో అనేక లేఖన భాగాలు ఉంటాయి. పాఠాన్ని ముగించడానికి తొందరపడవద్దు. ఈ కార్యాచరణల్లో చాలా మట్టుకు విద్యార్థులకు క్రొత్త గనుక ఈ కార్యాచరణలు ఎలా పూర్తి చేయాలో ప్రతి విద్యార్థి అర్థం చేసుకునేలా జాగ్రత్త పడాలి. ప్రాథమిక లక్ష్యం, ఒక నిర్దిష్టమైన సమాధానాన్ని కనుగొనడం కాదు; బైబిల్ ని అధ్యయనం చేయడం, భాష్యం చెప్పడంలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం ప్రధాన లక్ష్యం.

కోర్సు ముగిసే సమయానికి, విద్యార్థి లేఖనంలోని అనేక భాగాలను జాగ్రత్తగా అధ్యయనం చేసి, అవగాహన పొందుతాడు. ప్రతి విద్యార్థి, వాళ్ళు అధ్యయనం చేసిన నోట్స్‌ను భవిష్యత్‌లో ఉపయోగించడానికి నోట్‌బుక్‌లో ఉంచాలి. ఈ కోర్సు కోసం చేసిన పని ప్రసంగాలు మరియు బైబిల్ పాఠాలను తయారుచేయడంలో ఉపయోగపడుతుంది.

చర్చించే ప్రశ్నలు మరియు తరగతి గది కార్యచరణలు ► ఈ బాణం గుర్తుతో సూచించబడినవి. చర్చించే ప్రశ్నల విషయంలో, సమాధానాన్ని గురించి విద్యార్థులే చర్చించాలి. తరగతిలో ఉన్న విద్యార్థులందరూ పాల్గొనేలా చూడాలి. అవసరమైతే, విద్యార్థులను పేరు పెట్టి పిలవాలి.

ప్రతి విద్యార్థి, కోర్సు అంతటిలో కోర్సు ప్రాజెక్టుపై పని చేస్తాడు. 10వ పాఠం తరువాత, వాళ్ళు తరగతికి ఒక ప్రెజెంటేషన్ చేస్తారు లేదా తరగతి నాయకునికి ఒక పేపర్ సమర్పిస్తారు. 10వ పాఠంలోని అభ్యాసాల విభాగంలో ప్రెజెంటేషన్ లేదా పేపర్ కొరకు సూచనలు ఇవ్వబడినాయి.

పాఠం 2 & 7 చివర్లో కొన్ని ఇతర అభ్యాసాలు కూడా ఉన్నాయి. విద్యార్థులు, వాళ్ళు పూర్తి చేసిన పనిని తరగతి నాయకునికి చూపించాలి, కానీ వాళ్ళ పుస్తకంలో ఒక కాపీని ఉంచుకోవాలి.

Ready to Start Learning?

Select a lesson from the sidebar to begin your journey through this course.