పరిచయం
► ఒక విద్యార్థి సమూహము కొరకు 1 కొరింథీయులకు 1:17-25 చదవాలి. నశించిపోయిన వారిని రక్షించడానికి దేవుని పద్ధతి ఏమిటి?
యూదులు తమ దేశాన్ని విడిపించుకొనుటకు అధికారం కొరకు చూస్తున్నారు. అది పనిచేస్తుందని నిరూపించడానికి శక్తి సాధనాలతో కూడిన శక్తివంతమైన సందేశాన్ని వారు కోరుకున్నారు.
అన్యజనులు జీవితాన్ని అర్థం చేసుకోవడానికి మరియు ప్రపంచంలో విజయం సాధించడానికి జ్ఞానం కోరుకున్నారు. వారు కోరుకున్నది ఎలా పొందవచ్చో అని వివరించే సందేశాన్ని వారు కోరుకున్నారు.
సిలువ అనగా అప్పగించుకోనుట మరియు త్యాగమును సూచిస్తుంది. శక్తికోరుకున్న యూదులకు, ఇది బలహీనతగా కనిపించింది. లోకసంబంధమైన జ్ఞానం కోరుకున్న అన్యజనులకు, ఇది అవివేకము వంటిదిగా కనిపించింది. వాస్తవానికి, క్రీస్తు మరణంలో దేవునిశక్తి మరియు దేవునిజ్ఞానం ప్రదర్శించబడ్డాయి. సిలువ దేవుని బలహీనత మరియు అజ్ఞానము లాగా ఉంటుంది, కాని ఇది మనుష్యుల ఉత్తమ ప్రయత్నాల కంటే గొప్పది.
సువార్త సందేశం మానవుల యొక్క సహజమైన, పాపపు కోరికలకు వ్యతిరేకంగా ఉంటుంది. ఇది పశ్చాత్తాపపడుటకు మరియు దేవునికి లోబడుటకు పిలుస్తుంది. ఇది ఒక అవివేక సందేశంగా అనిపిస్తుంది, ఎందుకంటే ప్రజలు తమకు కావలసినదాన్ని ఎలా పొందాలో వినాలని కోరుకుంటారు.
ప్రజలను రక్షించడానికి దేవుడు సువార్తను ఉపయోగించుకున్నాడు. అతడు విశ్వాసులకు సువార్తను సంభాషించే పనిని ఇచ్చాడు. బోధ అనేపదం సమూహముతో మాట్లాడే వ్యక్తిని మాత్రమే సూచించదు, కానీ సువార్తను వివిధ రూపాల్లో బోధ చేయడాన్ని సూచిస్తుంది. ఈ భాగం యొక్క వాదన దేవుడు కేవలం బహిరంగ బోధనే ఇష్టపడతాడని కాదు. అతి ప్రధాన విషయం ఏమిటంటే, సువార్త దేవుని పద్ధతి.
► సిలువను ప్రకటించడం, విశ్వాసములేనివారికి అవివేకమని చెప్పినప్పుడు ఈ వాక్యభాగముయొక్క అర్థము ఏమిటి?