పరిచయం
► మనం పాపుల కొరకు ప్రార్థించాలా? పాపుల కొరకు ప్రార్థించమని బైబిల్లో ఎక్కడ చెప్పబడింది?
పాపుల మారుమనస్సు కొరకు మనం ప్రార్థించమని నేరుగా చెప్పే ఒక వచనం బైబిల్లో కనుగొనడం అంత సులభం కాదు. సువార్త ప్రభావవంతముగా వ్యాపించాలి అనే విషయము కొరకు మనం ప్రార్థించాలని చెప్పే అనేక వచనాలు బైబిల్లో మనకు ఉన్నాయి (2 థెస్సలొనీక 3:1, ఎఫెసీయులకు 6:19, కొలొస్సయులకు 4:4, అపొస్తలుల కార్యములు 4:29).
సువార్త విజయవంతం కావాలని ప్రార్థించడంతో పాటు, పాపుల మారుమనస్సు కొరకు ప్రార్థించాలని మనకు తెలుసు. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించమని మనకు బైబిల్లో చెప్పబడింది, ఇందులో పాపుల మార్పు కొరకు ప్రార్థించుట అందులో ఒక భాగమై ఉన్నది. (1 తిమోతి 2:1). ప్రజలను పశ్చాత్తాపము లోనికి తీసుకురావడానికి ప్రయత్నించమని మనకు చెప్పబడింది (2 తిమోతి 2:25), మరియు ఆ పనిలో దేవుని సహాయం కొరకు ప్రార్థించడం సముచితం, తప్పక ప్రార్థించాలి.