(1) వీలైతే, వారానికొకసారి కలవడానికి సమూహాన్ని క్రమపరచండి. కొంతమంది పిల్లల సంరక్షణకొరకు ఏర్పాటు అవసరం కావచ్చు.
(2) సమావేశాల విధానము (1) వాక్య పఠన సమయము, తరువాత (2) వ్యక్తిగత అవసరాలను పంచుకోవడం తరువాత (3) ప్రార్ధించడం.
సమూహం యొక్క ప్రాధమిక ఉద్దేశ్యం అధ్యయనము అయితే, అధ్యాయన సమయం ఎక్కువ మరియు ఇతర భాగాలు తక్కువగా ఉండవచ్చు; కానీ మూడు భాగాలను ఇంకా చేర్చాలి. సమూహం యొక్క ఉద్దేశ్యం అధ్యాత్మిక జవాబుదారీతనం అయితే, అధ్యాయన సమయం తక్కువగా ఉండవచ్చు, కాని వారు చదువుతున్న కొన్ని విషయాలు ఉండాలి.
ఒక సమూహానికి వ్యక్తిగత పంచుకోవడము మరియు చర్చ ఉంటే కానీ అధ్యయనము చేయడానికి పాఠ్య అంశాలు లేకపోతే, అది అస్తవ్యస్తంగా మారుతుంది. ఇది కొంతమంది సభ్యుల వ్యక్తిత్వాలచే ఆధిపత్యం చెలాయించబడును. పాఠం వారి మనస్సులో ఉన్నడానికి మించి సత్యానికి ప్రతిస్పందించేలా చేస్తుంది.
(3) కూడికలను సమయానికి ప్రారంభించండి మరియు సమయానికి ముగించండి.
మీరు ప్రారంభించి ఆలస్యంగా ముగించినట్లయితే, వారి స్వంత విలువైన సమయాన్ని వృధావారు అవుతారు, వారు ఆలస్యముగా రావడం ప్రారంభిస్తారు లేదా కొన్ని సమావేశాలకు రారు.
(4) కూడిక ఎప్పుడు ముగుస్తుందో తేదీని నిర్ణయము చేయండి.
సభ్యులు తమ సమర్పణ ఎంతకాలం ఉందో తెలుసుకోవాలి. సాధారణంగా, క్రొత్త సమావేశాల ప్రారంభము తరువాత క్రొత్త సభ్యులను సమూహములో చేరడానికి అనుమతించకూడదు, క్రొత్తగా మారుమనస్సు పొందినవారికి సమూహము వారి కోసం తిరిగి మళ్ళి అవే పాఠాలను చెప్పేటప్పుడు తప్ప. సమూహం పాఠాల శ్రేణిని అధ్యయనము చేస్తుంటే, పాఠాల సంఖ్య వారు కలిసే వారాల సంఖ్యను అనుక్రమపరచండి. వారు అధ్యాత్మిక జవాబుదారీతనం కొరకు కలుస్తుంటే, వారు ఆరు నెలల వ్యవధిని నిర్ణయించవచ్చు. చివరికి, వారు మళ్ళీ కార్యక్రమమును నిర్వహించవచ్చు. ఆ సమయములో కొంతమంది సభ్యులకు వదిలివేయవచ్చు, మరియు సమూహం క్రొత్త సభ్యులు చేరడానికి అనుమతిస్తూ వుందో లేదో పరిగణించవచ్చును.
(5) అధ్యయనము చేసేటప్పుడు, జ్ఞానం కోసమే కాక జీవితాన్ని మార్చే ఉద్దేశ్యాన్ని దాని స్వంత ప్రయోజనం కొరకు నొక్కి చెప్పండి.
అధ్యయనము నుండి వ్యక్తిగత, ఖచ్చితమైన అన్వయములను చేయగలిగితే సమూహం విలువైనదని ఒక సభ్యుడు భావిస్తాడు.
(6) తీర్మానాలుపై అనుసరించండి.
ఎవరైనా ఒక సమస్యను పంచుకున్నట్లయితే, అతడు ఒక ఖచ్చితమైన చర్య తీసుకోవాలని తీర్మానము చేస్తాడు, అతడు చేస్తానని చెప్పినట్లు అతడు చేశాడా అని తదుపరి సమావేశంలో అడగండి.
(7) అధ్యాత్మిక మార్గదర్శకత్వం ఇవ్వడానికి వ్యక్తిగతంగా సభ్యునితో కలవడానికి నాయకుడు అందుబాటులో ఉండాలి.
ఇతర సభ్యులు ప్రోత్సాహం కొరకు ఇతర సమయాల్లో కూడా వారిని కలువండి.
(8) మంచి సమావేశ స్థలాన్ని ఎంచుకోండి.
ఇది ఇంటి వాతావరణంతో అనధికారిక సమావేశ స్థలంగా ఉండాలి. సీటింగ్ వీలైనంత వృత్తాకారంగా ఉండాలి, తద్వారా ప్రతి సభ్యుడు ప్రతి ఇతర సభ్యుల ముఖాన్ని చూడగలడు. ఇది పాల్గొనడాన్ని ప్రోత్సహిస్తుంది. అంతరాయాలు లేదా పరధ్యానం లేని ప్రదేశంలో కలుసుకోండి.
(9) మంచిగా వినే అలవాట్లను పాటించండి.
మంచి శ్రవణ గుర్తులు కంటి పరిచయం, కేంద్రీకృత వ్యక్తీకరణ, పరధ్యానాన్ని విస్మరించడం మరియు ప్రాయకుని యొక్క హాస్యం లేదా ఇతర భావోద్వేగాలకు ప్రతిస్పందన ఉండాలి.
(10) ఏ సభ్యుడు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండకుండ నిర్ధారించుకోండి.
పెద్దగా మాట్లాడని సభ్యునికి ఒక ప్రశ్నను అడగండి (“నవీన్, దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు?”).
(11) వ్యక్తిగతంగా ఏదైనా పంచుకోవాలని సభ్యునిపై ఒత్తిడి చేయవద్దు.
బదులుగా, అతడు మాట్లాడటానికి సంకోచించని వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నించండి. సభ్యుడిని కంటిచూపుతో చూడడము ద్వారా మరియు అతడు చెప్పినదాన్ని ప్రశంసించడం ద్వారా అతని విశ్వాసాన్ని పెంచుకోండి.
(12) వారి విశ్వాసాన్ని పెంపొందించడానికి వారు సమాధానం చెప్పగల ప్రశ్నలను అడగడానికి ప్రయత్నించండి.
ఎవరైనా తప్పు సమాధానం ఇస్తే, సరిచేయడానికి ముందు సమాధానం గురించి ఏదైనా మంచిగా ధృవీకరించడానికి ప్రయత్నించండి.
(13) ప్రతి వ్యాఖ్యను విమర్శించే ముందు ఏదో ఒక విధంగా దానిని ధృవీకరించడానికి ప్రయత్నించండి.
(14) ఎవరైనా ఎక్కువగా మాట్లాడటం మరియు అన్ని ప్రశ్నలకు తానే సమాధానం చెప్పే ధోరణి ఉంటే, అతన్ని పరిమితం చేయడానికి ఒక మార్గాన్ని కనుగొనండి.
ఖచ్చితమైన సభ్యులకు ప్రశ్నలను నిర్దేశించడం ఒక మార్గం. లేదా "మిగతావాళ్ళు ఏమనుకుంటున్నారు?" ఒక చర్చలో, “ఇంకా దీని గురించి మాట్లాడని వ్యక్తి నుండి వినండి” అని మీరు అనవచ్చు.
ఒక సభ్యుడు ఇంకా ఎక్కువగా మాట్లాడితే, నాయకుడు సమావేశానికి వెలుపల అతనితో మాట్లాడవచ్చు. అతడు ఇలా చెప్పగలడు: “ నవీన్, మీరు త్వరగా ఆలోచించేవారు మరియు చర్చలలో త్వరగా స్పందించగలరు, కాని మనం అన్నింటికి త్వరగా సమాధానం ఇస్తే మరికొందరు పాల్గొనరని నేను ఆందోళన చెందుతున్నాను. ప్రతి ఒక్కరిని పాల్గొనడానికి మీరు నాకు సహాయం చేయగలరా? ”
(15) సమూహాన్ని విస్మరిస్తూ ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులను వారిలో వారే స్వంత చర్చకు అనుమతించవద్దు.
ఎవరైనా ఎవరిని గురించి అయిన చాలా సేపు వాదిస్తూ ఉండాలనుకుంటే, సమావేశం వెలుపల చర్చను ముగించాల్సి ఉంటుందని అతనికి చెప్పండి.
(16) ఇతరులను అంతరాయం కలిగించడానికి ఎవరినీ అనుమతించవద్దు.
మీ చేతిని పైకెత్తి, అంతరాయాన్ని నిశ్చయంగా ఆపండి మరియు మొదటి ప్రాయకుడిని పూర్తి చేయడానికి అనుమతించండి. లేకపోతే, చర్చ ఎల్లప్పుడూ తక్కువ మర్యాదగల సభ్యులచే ఆధిపత్యం చెలాయించబడును. తక్కువ నిశ్చయత కలిగిన వ్యక్తులు తమ వాక్యాలను పూర్తి చేయలేరని నిరాశ చెందుతారు.
(17) ఫిర్యాదులను వినండి.
ఏదైనా ఫిర్యాదు సరిదిద్దగల సమస్యను చూపవచ్చు. అసంతృప్తి గుర్తులను విస్మరించవద్దు. సమూహము సమావేశంలో ఎవరైనా అసంతృప్తిగా ఉంటే, అతడు ప్రయోజనం అర్థం చేసుకోకపోవచ్చు లేదా అతనికి చెల్లుబాటు అయ్యే ఫిర్యాదు ఉండవచ్చు.
(18) ఒక సభ్యుడు నిరంతరం వ్యతిరేకత, విఘాతం కలిగించే, వాదించే లేదా విసుగు చెందితే, అతడు సమూహం యొక్క లక్ష్యాలను గ్రహించాలేదని గుర్తించండి.
సమూహం అతడు ఊహించినది కాకపోవచ్చు. సమూహం యొక్క ఉద్దేశ్యాన్ని చూడటానికి అతనికి సహాయపడటానికి అతనితో వ్యక్తిగతంగా మాట్లాడండి.
(19) నాయకుడు ప్రతి సమస్యకు సమాధానం తెలుసుకోవలసిన అవసరం లేదు.
అతని పాత్ర అన్నింటికీ సమాధానం కలిగి ఉండటమే కాదు, ప్రార్థనలో భారాలను భరించడానికి సమూహాన్ని నడిపించాలి.
(20) కార్యక్రమములో అంతరాయాలతో సౌకర్యవంతంగా మరియు ఓపికగా ఉండండి.
మన జీవితంలోని సంఘటనలు దేవుని అభివృద్ధిలో భాగమని గుర్తుంచుకోండి. అందులో సమస్య ఒక అవకాశం.
(21) ఒక సభ్యుడు తన అవసరాలను పంచుకోవడానికి మొత్తం సమావేశాన్ని తరచూ తీసుకుంటే, మరొక సమయంలో అతనికి సలహా ఇవ్వండి.
ఇలా జరిగితే, సమావేశం వారి నుండి దొంగిలించబడిందని ఇతర సభ్యులు భావిస్తారు. సమూహం దాని ప్రయోజనాన్ని కోల్పోనివ్వవద్దు, సభ్యులు కలిసి అంగీకరిస్తే తప్ప ప్రయోజనం మార్చబడాలి.
(22) చర్చలు దెబ్బతినడానికి అనుమతించవద్దు.
స్థానిక సంఘము మరియు ఇతర నాయకులను విమర్శించడానికి ఈ బృందం ఒక వేదికగా మారవద్దు.
(23) సమూహం యొక్క ప్రభావం, దాని ద్వారా పనిచేసే దేవుని శక్తిపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.
సమూహం దేవుడు ఉపయోగించే ఒక లేఖన నిర్మాణం మాత్రమే.