ఈ చివరి పాఠంలో, విశ్వాసుల కొరకు పౌలు చేసిన ప్రార్థనలు మన ప్రార్థన మరియు పరిచర్యకు ఎలా మార్గనిర్దేశం చేస్తాయనే దాని గురించి సమూహం అధ్యయనము చేస్తుంది.
అప్పుడు, పాఠం శిష్యత్వానికి సంబంధించిన పాఠాలలోని శ్రేణిని పరిచయం చేస్తుంది. ఈ పాఠాన్ని అధ్యయనము చేసేటప్పుడు తరగతి మరికొన్ని పాఠాలను చూడాలి, ఆపై సాధన చేయవలసిన దానిని ఎలా చేయాలో ప్లాన్ చేయాలి.
ఈ నియామకాన్ని నెరవేర్చడానికి సమూహం ఒకటి కంటే ఎక్కువసార్లు కలుసుకోవాలి.
కోర్సు కొరకు పాఠాలు పూర్తి చేసిన విద్యార్థులు బైబిల్ సువార్తీకరణ మరియు శిష్యత్వం క్రొత్తగా మారుమనస్సు పొందినవారి కొరకు ఈ పాఠాలను అభ్యసించాలి. మొదట, సమూహానికి ఒకరికి బోధించడం ద్వారా పాఠం ఎలా నేర్పించాలో ఎవరైనా ఒకరు దానిని ప్రదర్శించాలి. అప్పుడు, ఈ తరగతి ప్రతి సభ్యులు సాధన చేయాలి, వారి సాధన కొరకు కనీసం ఒక పాఠమైన ఉండాలి. సమూహం ప్రదర్శించిన పాఠాన్ని చూసిన తరువాత, వారు చిన్న సమూహాలుగా విభజించబడతారు, తద్వారా ఎక్కువ మంది ఒకే సమయంలో ఆ పాఠంను ప్రముఖంగా సాధన చేయవచ్చు. నలుగురి సమూహాలలో, ప్రతి సభ్యుడు ఒక పాఠానికి సాధన చేయాలి మరియు మిగతా ముగ్గురు సభ్యులను ప్రతి ఒక్కరూ ఒక పాఠానికి గమనించాలి.
విశ్వాసుల కొరకు పౌలు చేసిన ప్రార్థనలను ప్రార్థించడం
విశ్వాసుల కొరకు పౌలు చేసిన ప్రార్థనలు క్రొత్త క్రైస్తవునికి ఏమి కావాలో తెలియజేస్తాయి. ఈ ప్రార్థనలు యవ్వన క్రైస్తవుల కొరకు ప్రార్థించడంలో మనకు మార్గనిర్దేశం చేస్తాయి, ఎందుకంటే పౌలు ప్రార్థించిన అంశాలను కూడా మనం ప్రార్థించాలి. ఈ ప్రార్థనలు మన పరిచర్యకు కూడా మార్గనిర్దేశం చేస్తాయి, ఎందుకంటే దేవుడు వారి కొరకు ఏమి చేస్తున్నాడో దానికి మనము సహకరించాలి.
మూడు వేర్వేరు సమూహాల కొరకు పౌలు చేసిన ప్రార్థనలను చూద్దాం.
థెస్సలొనీకయుల కొరకు పౌలు చేసిన ప్రార్థన
► 1 థెస్సలొనీక 5:23-24 చదవండి.
థెస్సలొనీకయులకు వ్రాసిన మొదటి లేఖన పరిశుద్ధతకు పిలుపునిచ్చింది. ప్రతి విశ్వాసి విజయం మరియు పవిత్రతో జీవించడానికి పిలువబడ్డారు, మరియు విశ్వాసం ద్వారా అది సాధ్యమని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రతి విశ్వాసిని విజయం మరియు పవిత్రతలోనికి తీసుకురావాలనే లక్ష్యంతో మనం ప్రార్థన చేయాలి మరియు బోధించాలి.
ఫిలిప్పీయుల కొరకు పౌలు చేసిన ప్రార్థన
► ఫిలిప్పీయులకు 1:9-11 చదవండి.
ఈ వచనాలు నమ్మినవారి జీవితంలో కొనసాగుతున్న ప్రక్రియ గురించి చెబుతారు. అతని ప్రేమ నిరంతరం పెరుగుతూ ఉండాలి. అది జరిగినప్పుడు, ఏది ఉత్తమమో తెలుసుకునే అతని సామర్థ్యం కూడా పెరుగుతుంది. అతడు గ్రహించినప్పుడు, అతడు తన జీవితాన్ని ఉత్తమమైన వాటిపై దృష్టి పెట్టడానికి అనుగుణంగా మార్చుకుంటాడు. అతడు స్వచ్ఛమైన జీవితం జీవించడానికి మరియు నేరారోపణ లేకుండా ఉండటానికి ఇది జరగాలి.
ఈ వచనాలలో పౌలు వ్రాసిన విశ్వాసులు కొంతకాలంగా క్రైస్తవులే. అయినప్పటికీ, వారు దేవునిపట్ల తమ ప్రేమను అభివృద్ధి పొందుదురని , ఆ ప్రేమ ద్వారా , వారి పట్ల దేవుని చిత్తాన్ని బాగా అర్థం చేసుకోగలరని పౌలు ప్రార్థిస్తున్నాడు.
యవ్వన విశ్వాసి పరిగణించవలసిన కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి:
ఒక వైఖరి, అలవాటు లేదా చర్య ఉత్తమమైనది కాదని దేవుడు నాకు చూపించినప్పుడు నేను నా జీవితంలో మార్పు కొరకు తీసుకొన్నఉదాహరణ ఏమిటి?
నా జీవితంలో నాకు సందేహాలు ఏమైనా ఉన్నాయా?
దేవుడు ప్రార్ధన ద్వారా నేను మార్చుకోవాల్సినవి తెలియజేయుటకు నేను సిద్ధంగా ఉన్ననా ?
కొలొస్సయుల కొరకు పౌలు చేసిన ప్రార్థన
► కొలొస్సయులకు 1:9-12 చదవండి.
జ్ఞానం మరియు అధ్యాత్మిక అవగాహనతో వారు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని ఆయన ప్రార్థించారు. క్రొత్తగా మారుమనస్సు పొందిన వారికి తమ జీవనశైలి కొరకు దేవుని చిత్తం గురించి ఇంకా అర్థం కాలేదు. తన జీవితంలో కొన్ని అలవాట్లు, మాటలు మరియు వైఖరులు మారాలని అతడు క్రమంగా గ్రహిస్తాడు. అతడు దేవుణ్ణి ప్రేమిస్తున్నందున, అతడు తన జీవితాన్ని దేవుని చిత్తానికి అనుగుణంగా మార్చుకొంటాడు. శిష్యుడు ప్రార్థన చేయాలి మరియు దేవుని చిత్తాన్ని గుర్తించమని యవ్వన క్రైస్తవునికి జాగ్రత్తగా బోధించాలి.
దేవుని చిత్తాన్ని బాగా అర్థం చేసుకున్న ఫలితంగా, వారు "ప్రభువుకు తగిన నడకను కలిగి ఉంటారు" అని ఆయన అన్నారు. వారు దేవునికి మరింత సరైన ప్రతినిధులు అవుతారు. వారి జీవితాలు కృపతో రూపాంతరం చెందుతూ, వారి వృత్తికి సరిపోయినట్లుగా వారు జీవిస్తారు. శిష్యుడు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ ప్రక్రియ కొంతకాలం కొనసాగేవరకు, యవ్వన క్రైస్తవుడి జీవితంలో కొన్ని అసమానతలు కనిపిస్తాయి.
“యోగ్యమైన నడక” యొక్క ఒక భాగంలో "ప్రతి శ్రేష్టమైన పనిలో ఫలభరితముగా ఉండాలి" ప్రతి శ్రేష్టమైన పనిలో ఒక యవ్వన క్రైస్తవుడు బాగా ఫలించకపోయినప్పుడు మనం ఆశ్చర్యపోనవసరం లేదు. అతడు ఇంకా బాధ్యతగా మరియు క్రైస్తవ పని పట్ల స్పృహలో ఉండకపోవచ్చు.
"సహనంతో మరియు దీర్ఘాయువుతో కూడిన ఆనందముతో" ఉండగలమని కూడా ఈ వచనాల ద్వారా చెబుతున్నాడు. అతడు సేవ చేస్తున్నప్పుడు మరియు భారము భరిస్తున్నప్పుడు ఆ వ్యక్తి క్రైస్తవ ఆనందాన్ని అనుభవిస్తూ కొంత అధ్యాత్మిక పరిపక్వతను పొందాతాడు.
పౌలు ప్రార్థనల గురించి ముగింపు తీర్మానాలు
యవ్వన క్రైస్తవులకు పౌలు చేసిన ప్రార్థనలు శిష్యత్వపు పని గురించి చాలా చెబుతాయి. విశ్వాసుల అభివృద్ధికి సరైన లక్ష్యాలను కలిగి ఉండాలి. మనం అభివృద్ధిని గుర్తించగలగాలి. యవ్వన క్రైస్తవుడిలో అసమానతలు, అపార్థాలు మరియు బాధ్యతారాహిత్యాన్ని చూసి మనం ఆశ్చర్యపోనవసరం లేదు. క్రైస్తవ లక్షణాలన్నీ అకస్మాత్తుగా కనిపిస్తాయని మనం ఆశించకూడదు.
పౌలు వారి పరిచర్య శిక్షణ లేదా పరిచర్య నైపుణ్యాల అభివృద్ధి గురించి పెద్దగా పట్టించుకోలేదని మనం గమనించాలి. వారి విశ్వాసం మరియు క్రైస్తవ స్వభావం యొక్క అభివృద్ధి గురించి అతడు చాలా శ్రద్ధ వహించాడు. కొందరు చక్కగా పరిచర్య చేయగలరు కాని క్రైస్తవ స్వభావం లేని వ్యక్తులతో మనం సంతృప్తి చెందకూడదు.
ఉపాధ్యాయుడు తన ఉదాహరణ మరియు సమాచారం విలువైనదిగా వివరించుట ముఖ్యమైనది. పై రెండు ప్రార్థనలలో అభ్యాసం నొక్కి చెప్పబడింది. జ్ఞానం అధ్యాత్మిక జీవిత ప్రవర్తనలు ఇమిడి ఉంటుంది. గురువు తన మాదిరిని చూపడము ద్వారా గొప్ప ప్రభావాన్ని చూపుతాడు.
మనం ప్రభావితం చేసే యవ్వన క్రైస్తవుల కొరకు పౌలు వలె ప్రార్థనలు చేయాలి. ఈ ప్రక్రియలు వారి జీవితంలో జరగడానికి మనము పరిశుద్ధాత్మపై ఆధారపడాలి.
క్రింది ప్రార్థన క్రొత్తగా నమ్మిన క్రైస్తవుల కొరకు పౌలు చేసిన ప్రార్థనల మీద ఆధారపడి ఉంటుంది.
యవ్వన క్రైస్తవుల కొరకు నమూనా ప్రార్థన
పరలోకమందున్నతండ్రీ,
మీరు అతన్ని సంపూర్ణంగా పరిశుద్దపరచాలని నేను ___________ కొరకు ప్రార్థిస్తున్నాను. అతడు తన చర్యలు, వైఖరులు మరియు ఉద్దేశ్యాలలో పవిత్రంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను.
మీ పట్ల అతని ప్రేమ పెరుగుతూ ఉండటానికి సహాయపడండి, తద్వారా అతని పట్ల మీ పరిపూర్ణ సంకల్పం ఏమిటో అతడు బాగా అర్థం చేసుకుంటాడు. ఏది ఉత్తమమో మరియు ఎల్లప్పుడూ దానిని ఎన్నుకోవటానికి అతనికి సహాయపడండి, తద్వారా అతని జీవితం మీ మహిమకు ఫలాలను ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను.
క్రైస్తవుడిలా ప్రతిరోజు జీవించడానికి అతనికి సహాయపడండి, ప్రతి విషయంలోనూ మిమ్మల్ని సంతోషపరచుటకు మరియు మీ మార్గాలను గురించి మరింత తెలుసుకోనుటకు సహాయపడండి. మీ నుండి బలాన్ని పొందటానికి అతనికి సహాయపడండి, తద్వారా అతడు విజయంతో జీవించగలడు మరియు శ్రమలను, పరీక్షలను ఆనందంతో భరించగలడు. మీరు ఇచ్చే కృపకు ఆయన ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపు విధముగా సహాయము చేయండి.
యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను తండ్రీ, ఆమేన్.
Print Course
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.