పరిచయం
► సువార్త వినకుండా ఒక వ్యక్తి రక్షించబడగలడా? సువార్త ప్రకటన అవసరమా?
ఇశ్రాయేలు ప్రజలతో లేదా మరియు సంఘముతో సంబంధం లేకుండా దేవుని కృప ద్వారా రక్షణ పొందినవారి ఉదాహరణలను లేఖనంలో మనం చూడగలము. మోషే జీవించడానికి ముందు మరియు బైబిల్ గ్రంథం యొక్క ఒక పేజీ కూడా రాయడానికి ముందే యోబు యధార్థవర్తనుడుగా ఉన్నాడు మరియు చెడుతనమును విసర్జించాడు. బిలాము దేవునితో సంబంధములో ఉన్నాడు మరియు కలల ద్వారా కాకుండా నేరుగా దేవుని నుండి సందేశాలను అందుకున్న దీర్గదర్శిగా పిలువబడ్డాడు. "ఖచ్చితంగా దేవుని భయం ఈ ప్రదేశంలో లేదు" అని అబ్రాహాము అనుకున్న తరువాత, అబీమెలెకు అబ్రాహాము కంటే నీతిమంతుడు అని చెప్పబడినది. రోమీయులకు 1:21-32లో అన్యజనులు దేవుని గురించి నేర్చుకోగలిగినప్పటికీ, వారు దేవుని గురించి నేర్చుకున్న వాటిని తిరస్కరిస్తారు, ఇది వారిని దుర్స్థితిలో ఉన్నారని వివరిస్తుంది; (కీర్తన 19 మరియు రోమా 10:18 చూడండి).
"యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులుగల వారికి తెలిసియున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును” (కీర్తన 25:14). నిబంధన అనేది మానవునితో దేవునికి సంబంధించిన నిబంధనలు. అందరూ పాపం చేసినందున, దీనికి కృప అవసరం. ఒక వ్యక్తి పూర్తిగా దేవుని పూజిస్తూ ఉంటే, దేవుడు అతనితో సంబంధం కలిగి ఉండి, అతడు తన యొద్దకు వచ్చు మార్గమును చూపును.
యేసు తప్ప వేరే నామము ద్వారా రక్షణ లేదని బైబిలు చెబుతోంది (అపొస్తలుల కార్యములు 4:12). అయితే, పాత నిబంధనలో రక్షింపబడిన ప్రజలకు యేసు పేరు తెలియదు. వారు దేవుడు వాగ్దానము చేసిన విమోచన మరియు క్షమాపణను నమ్మినవారు, అది యేసు ద్వారా అనుగ్రహించబడెను. అదేవిధంగా, ఇంకా యేసు యొక్క నామము విని ఉండకపోయిన వ్యక్తులు, రక్షణ కొరకు దేవుని యందు నమ్మిక ఉంచి అది యేసు ద్వారా అనుగ్రహించబడును అని ముందుగానే నమ్మిరి.
అందుచేత, రక్షణ వేరే నామము ద్వారా కలుగదు అంటే అర్థం ఏమిటి? రక్షణకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏవి లేవని అర్థం. విమోచన యొక్క ఇతర ప్రణాళిక ద్వారా ఒక వ్యక్తి రక్షించబడలేడు. యేసు గురించి తెలిసిన వ్యక్తి యేసును తిరస్కరించకూడదు అని కూడా దీని అర్థం, ఎందుకంటే యేసును తిరస్కరించడం అంటే రక్షణను తిరస్కరించడం లేదా రక్షణకు ఇతర మార్గాల కొరకు ఎదురు చూడటం లాంటిదే.
యేసు ఇలా చెప్పాడు, “ఎవరైనా తన చిత్తాన్ని చేస్తారో, ఆయన బోధను తెలుసుకుంటారు.” ఇది ఒక వ్యక్తి నిజాయితీగా దేవుణ్ణి వేడుకొనుచున్న వ్యక్తికి ఇవ్వబడిన వాగ్దానము, అతడు ఏమి తెలుసుకోనవలేనో అతనికి దేవుడు చెబుతాడు. "నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది." (యోహాను 1:9). ఒక వ్యక్తి యేసును గురించి వినకపోయినా పరిశుద్దాత్మ వారికి యేసు యొక్క వెలుగును బయలుపరచును.
మానవ సువార్తికుల నుండి సువార్త వినడానికి ముందే చాలా మందికి దర్శనాలు లేదా ఇతర ప్రత్యేక ప్రత్యక్షతల ద్వారా వారు దేవుని యొద్దకు వచ్చిరి. ఉదాహరణకు, ఆధునిక కాలంలో చాలా మంది ముస్లింలు దేవుని నుండి సందేశం అందుకున్న తరువాత మారుమనస్సు పొందిరి.
► సువార్తను నిజముగా అర్థం చేసుకోవడానికి ముందు దేవుని నుండి ప్రత్యేక సంభాషణను పొందిన ఒకరి గురించి మీరు విన్నారా?
[1]కాబట్టి, మానవ సువార్తికుల ద్వారా సువార్త వినకుండా ఒక వ్యక్తి దేవుణ్ణి కనుగొని, రక్షింపబడటం సాధ్యమని మనం చూస్తాము. అయినప్పటికీ, ప్రతి ఒక్కరూ అత్యవసరంగా వినవలసిన సందేశం సువార్త అని బైబిల్ వివరిస్తుంది.
రోమా పత్రిక సువార్త యొక్క అత్యవసరతను వివరిస్తుంది. అపోస్తులుడైన పౌలు రోమీయులకు వ్రాసిన పత్రికలో “రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది అని చెప్పాడు (రోమా 1:16). సువార్తను వారి వద్దకు తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరికీ తాను రుణస్థుడనని చెప్పాడు (రోమా 1:14). అతడు మనము కేవలం దేవుని క్షమాపణ వాగ్దానమును నమ్మి నీతిమంతులమైతిమి అనే సత్యమును స్థాపించాడు (రోమా 3:26; రోమా 5:1).
అప్పుడు, సువార్త యొక్క అత్యవసర భావన వస్తుంది. అతడు వారు ఎలా నమ్మారు అని చెప్పాడు, "వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు?” (రోమా 10:14). “కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును” (రోమా 10:17). వినేవారిలో విశ్వాసాన్ని కలిగించడానికి దేవుడు సువార్తను ఉపయోగిస్తాడు. సువార్త ప్రకటించడం పాపులను రక్షించే దేవుని సాధారణ పద్ధతి.
వర్తమానికుడు లేకుండా వారు రక్షణ పొందగలిగితే, ఒకవర్తమానికుడు ఎందుకు అంత ముఖ్యమైనవాడు?
ఉత్తర భారతాన ఉన్న విస్తారమైన మైదానంలో, మిషనరీ ఎన్నడూ లేని వెయ్యి గ్రామాల పొగను నేను కొన్నిసార్లు ఉదయాన్నే చూశాను - క్రీస్తు లేకుండా, దేవుడు లేకుండా, మరియు ప్రపంచంలో నిరీక్షణ లేకుండా ఉన్న ప్రజలు ఉన్న గ్రామాలు ఎన్నో.
(రాబర్ట్ మోఫాట్).