Search Course
Search through all lessons and sections in this course
Searching...
No results found
No matches for ""
Try different keywords or check your spelling
క్రైస్తవ ఆరాధనకు పరిచయం
Course Description
ఈ కోర్సు నమ్మిన వారి జీవితంలోని అన్ని అంశాలను ఆరాధన ఎలా ప్రభావితం చేస్తుందో వివరిస్తుంది మరియు వ్యక్తిగత మరియు సంఘ ఆరాధన పద్ధతులకు మార్గనిర్దేశం చేసే సూత్రాలను వివరిస్తుంది.
Introduction
ఈ కోర్సు ఆరాధన యొక్క మౌలిక నియమములను పరిచయం చేస్తుంది.
మీరు సమూహముగా చదువుతుంటే, ఈ విషయములను వంతులవారిగా చదవండి. తరగతి సంభాషణ కొరకు మధ్య మధ్యలో మీరు ఆగాలి. తరగతి నాయకునిగా, అధ్యయనము చేయుచున్న విషయముల నుండి సంభాషణ దారిమళ్ళకుండా చూచుట మీ బాధ్యత. ప్రతి సంభాషణా సమయము కొరకు సమయ పరిమితిని నియమించుట సహాయకరముగా ఉంటుంది.
సంభాషణ ప్రశ్నలు మరియు తరగతిలో చేయు అభ్యాసములు యారో బులెట్ పాయింట్లతో సూచించబడినవి. వీటిని మీరు చూచినప్పుడు, తరువాత ఉన్న ప్రశ్నలను అడిగి, విద్యార్థులు జవాబును చర్చించుటకు అనుమతి ఇవ్వండి. తరగతిలోని విద్యార్థులందరు సంభాషణలో పాలుపంచుకొనునట్లు చూడండి. అవసరమైతే, మీరు విద్యార్థులను పేరు పెట్టి పిలువవచ్చు.
ఈ కోర్సులో అనేక లేఖనభాగములు ఉపయోగించబడినవి. తరగతిలో బిగ్గరగా చదవవలసిన వాక్యభాగములు కూడా యారో బులెట్ పాయింట్లతో సూచించబడినవి. వచనములను చూడమని విద్యార్థులను కోరండి మరియు సమూహములో వంతులవారిగా చదవమని చెప్పండి.
ప్రతి పాఠం అభ్యాసములతో ముగుస్తుంది. అభ్యాసములు తరువాత పాఠం సమయమునకు పూర్తిచేసి అప్పగించాలి.
ప్రతి పాఠం కొరకు ఒక పరీక్ష ఉంటుంది, దానిలో లేఖన కంటస్థం కూడా ఉంటుంది. ప్రతి తరగతి యొక్క ముగింపులో, నాయకుడు ఈ ప్రశ్నలను విద్యార్థులతో కలిసి సమీక్షించవచ్చు. తదుపరి తరగతి సెషన్ ఈ ప్రశ్నల మీద పరీక్షతో ఆరంభమవ్వాలి. కోర్సు పుస్తకము, వ్రాయబడిన నోట్స్, బైబిలు, లేక తోటి విద్యార్థులను సంప్రదించకుండా పరీక్షలను వ్రాయవలసియుంటుంది. తరగతి నాయకుడు పరీక్ష జవాబుల కీని Shepherds Global Classroom (షెఫర్డ్స్ గ్లోబల్ క్లాసురూమ్) నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పాఠం 1లో, విద్యార్థులకు 30-దినముల ప్రాజెక్టు ఇవ్వబడుతుంది. ఈ ప్రాజెక్టు ముగిసిన తరువాత, ప్రతి విద్యార్థి ప్రాజెక్టులో చదివిన విషయముల సారాంశం తెలుపుతూ ఒక-పేజీ రిపోర్టును వ్రాయాలి. విద్యార్థులు వారి ప్రాజెక్టు యొక్క దినచర్యను అప్పగించకూడదు.
విద్యార్థులకు Shepherds Global Classroom (షెఫర్డ్స్ గ్లోబల్ క్లాసురూమ్) నుండి సర్టిఫికేట్ కావాలంటే, వారు తరగతి సెషన్లకు హాజరై, అభ్యాసములను పూర్తిచేయాలి. పూర్తిచేయబడిన అభ్యాసములను వ్రాయుటకు కోర్సు ముగింపులో ఒక ఫారం ఇవ్వబడుతుంది.
Ready to Start Learning?
Select a lesson from the sidebar to begin your journey through this course.