[1]► ఒక విద్యార్థి, సమూహం కొరకు మత్తయి 18:2-6, 10-14 చదవాలి. ఈ వచనాలలో మనం చూసే హెచ్చరికలు ఏమిటి? పిల్లలలో దేవుడు చూసే ప్రాముఖ్యతను మీరు ఎలా వివరిస్తారు?
కొన్నిసార్లు పిల్లలు తరువాత తరం, సంఘము యొక్క భవిష్యత్తు మరియు భవిష్యత్ నాయకులు కాబట్టి పిల్లలు ముఖ్యమని ప్రజలు చెబుతారు. అన్నీ నిజమే; కానీ మొదట, పిల్లలు ముఖ్యం ఎందుకంటే వారు ప్రజలు. పిల్లలు తరువాత పెద్దలు, నిత్యమైన ఆత్మలు మరియు తెలియని సామర్థ్యం ఉన్నవారని కొన్నిసార్లు పెద్దలు మరచిపోయినట్లు అనిపిస్తుంది.
ఒక ప్రయాణికుడు ఒక చిన్న గ్రామంలో ఆగిపోయాడు. అతను వీధి పక్కన కూర్చొని ఉన్న ఒక వృద్ధుడిని చూసి, “నేను ఈ గ్రామం గురించి ఇంతకు ముందెన్నడూ వినలేదు. గొప్ప మనుష్యులు ఎవరైనా ఇక్కడ జన్మించారా? ” అని అడిగాడు, అప్పుడు వృద్ధుడు, “లేదు, పిల్లలు మాత్రమే జన్మించారు ” అన్నాడు.
దేవుడు ప్రాచీన ఇశ్రాయేలు ప్రజలకు ఒక నిబంధన ఇచ్చాడు. వారిని ఆశీర్వదించి, శ్రద్ధ వహిస్తానని వాగ్దానం చేశాడు. అతడు వారికి పాటించాల్సిన ఆజ్ఞలు ఇచ్చాడు.
ఈ నిబంధన తరతరాలకు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆయన వారితో, “నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి” (ద్వితీయోపదేశకాండము 6:7) అని చెప్పాడు.
దేవుని చిత్తాన్ని అనుసరించడానికి పిల్లలను పెంచడం నిబంధనకు ముఖ్యమైనది, ఎందుకంటే దేవుని ఎక్కువ ఆశీర్వాదాలు షరతులతో కూడినవి, మరియు ఆయనపై ఆధారపడటం ప్రజల నిరంతర విధేయత. తరువాత తరం దేవునికి విధేయత చూపించకపోతే, వారు ఆయనతో సంబంధం యొక్క ప్రయోజనాలను కోల్పోతారు. అంటే పిల్లలకు జాగ్రత్తగా బోధించడం అవసరం.
► ఇశ్రాయేలీయులు తమ పిల్లలు దేవుణ్ణి అనుసరించే నిర్ణయం తీసుకుంటారని నిర్ధారించుకోవడానికి ఏమి చేయగలరని మీరు అనుకుంటున్నారు?
వారి పిల్లలకు శిక్షణ ఇవ్వడానికి దేవుడు వారికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు.
నీవు నీ యింట కూర్చుండునప్పుడు త్రోవను నడుచునప్పుడు పండుకొనునప్పుడు లేచునప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ యింటి ద్వారబంధముల మీదను నీ గవునుల మీదను వాటిని వ్రాయవలెను (ద్వితీయోపదేశకాండము 11:19-20).
దేవుడు ఏ విషయం చెప్పాడు? వారు అప్పుడప్పుడు మాత్రమే కాకుండా, శ్రద్ధగా, నిరంతరం మరియు స్థిరంగా వారి పిల్లలకు బోధించాలి. వారు కనిపించే ప్రదేశాలలో దేవుని ధర్మశాస్త్రం యొక్క గుర్తులు కలిగి ఉండాలి. వారు ప్రతిచోటా లేఖనాలను చూడవలసి ఉంటుంది. వారు దేవుని ఆజ్ఞలను మరచిపోరాదు లేదా విస్మరించరాదు.
స్థిరమైన బోధ అంటే వారికి దేవుని ధర్మశాస్త్రానికి విరుద్ధమైన అలంకరణలు లేదా వినోదాలు లేదా ప్రవర్తనలు ఉండరాదు.
కాబట్టి, ఈ వచనాలు తమ పిల్లలకు దేవుని విలువలను నిరంతరం మరియు స్థిరంగా నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని మరియు దీనికి విరుద్ధంగా చేసే బోధలు మరియు ఉదాహరణల నుండి వారిని కాపాడాలని నొక్కి చెబుతున్నాయి.
► ఈ ఆజ్ఞ తల్లిదండ్రులకు ఇవ్వబడ్డాయి. సంఘము యొక్క పరిచర్యకు మనం ఏ కార్యక్రమాలు చేయాలి?
మొదట, పిల్లల శిక్షణ తల్లిదండ్రుల బాధ్యత అని మనకు తెలుసు. సంఘము తల్లిదండ్రులకు, తమ పిల్లలకు ఎలా నేర్పించాలో తల్లిదండ్రులకు బోధించాలి. తల్లిదండ్రులు దీన్ని చేయలేరు గనుక పిల్లలకు సంఘము నుండి మాత్రమే అధ్యాత్మిక బోధ చేయాలని మనము ఎప్పుడూ అనుకోకూడదు.
రెండవది, సంఘము వారి కుటుంబ నేపధ్యములో వీలైనంత వరకు పిల్లలకు సేవ చేయాలి. తల్లిదండ్రులకు సహాయం చేయడం ద్వారా పిల్లలకు సహాయం చేయండి. సువార్త ప్రకటన చేసేటప్పుడు, సంఘము కుటుంబాలకు, కుటుంబాలను ఆకర్షించడానికి సంఘము ప్రయత్నించాలి.
కాని కొంతమంది పిల్లలు క్రైస్తవేతర గృహాలకు చెందినవారు సంఘానికి వచ్చి రక్షించబడుదురు. అలా జరిగినప్పుడు, సంఘము ఆ కుటుంబానికి సేవ చేయడానికి ప్రయత్నించాలి. తల్లిదండ్రులు స్పందించకపోతే, సంఘము ఆ పిల్లలకు అధ్యాత్మిక కుటుంబంగా ఉండాలి. సంఘములోని సభ్యులు అధ్యాత్మిక సంరక్షణ చూపించే పాత బంధువులా ఉండాలి.
పిల్లలకు పరిచర్య చేయగల స్థానిక సంఘ సామర్థ్యం యొక్క నాణ్యతను విమర్శించడం.
► ఒక ఖచ్చితమైన సంఘములో పిల్లల పరిచర్య యొక్క విజయాన్ని మీరు ఎలా అంచనా వేయగలరు?
క్రింది విషయాలు నిజం అయినప్పటికీ, మీ పిల్లల పరిచర్య విజయవంతమని అనుకోవలసిన అవసరం లేదు:
మీ ఉపాధ్యాయులకు గొప్ప సామర్థ్యాలు ఉన్నాయి.
పిల్లలు, ఉపాధ్యాయుల సంఖ్య పెరుగుతోంది.
పిల్లలు బైబిల్ సమాచారాన్ని నేర్చుకుంటున్నారు.
ఉపాధ్యాయులు అధిక-నాణ్యతగల మాధ్యమాలను ఉపయోగిస్తారు.
పిల్లలు పరిచర్యలో ఆనందిస్తారు.
పిల్లల పరిచర్య విజయవంతం కావాలంటే, దానికి ఈ లక్షణాలు ఉండాలి. పిల్లల పరిచర్యలో ఈ లక్షణాలు లోపిస్తే, అది సమస్యలను ఎదుర్కొంటుంది. ఏదేమైనప్పటికీ, కొన్నిసార్లు ఒక పరిచర్యలో కొన్నిలేదా అన్ని లక్షణాలు ఉన్న కూడా ఆ పరిచర్య విఫలమవుతుంది.
మీ పరిచర్య పిల్లలకు విజయవంతమైతే...
పిల్లలు మారుమనస్సు పొందుదురు మరియు రక్షణకు నిశ్చయత కలిగి ఉంటారు.
పిల్లలు క్రమంగా అధ్యాత్మికగా పరిపక్వం చెందుతున్నారు.
పిల్లలు పెద్దయ్యాక వారు క్రైస్తవ లేఖనాలను అనుసరిస్తారు.
మీ పరిచర్య పిల్లలకు విజయవంతం కాక పోతే...
వారు క్రైస్తవులు కాలేరు.
లోకమును మాదిరిగా ఎంచుకొంటారు.
వారు పెద్దయ్యాక అపవిత్రమైన వినోదం మరియు లోక సంబంధాలను అనుసరిస్తారు.
తన జీవితం కొరకు దేవుని చిత్తాన్ని తిరస్కరిస్తారు మరియు వ్యక్తిగత ఆశయాలను, ఆశలను అనుసరిస్తారు.
దేవుని సత్యానికి సరిపోయేలా జీవితాన్ని రూపొందించడం శిష్యత్వపు పని. ఒక వ్యక్తిని యేసు కొరకు పరిణితి చెందిన అనుచరుడిగా అభివృద్ధి చేయడం శిష్యత్వపు పని. మారుమనస్సు పొందిన క్షణములో ఒక వ్యక్తి యొక్క ఆలోచనా విధానాలు, వైఖరులు, ఊహలు మరియు జీవనశైలి అంతటా దేవుని సత్యాన్ని దానంతటత అదే ఏకీకృతం చేయదు. సత్యం యొక్క ఏకీకరణకు సమయం పడుతుంది. అదే శిష్యత్వములో నిజమైన పని.
పిల్లలకు పరిచర్య చేయుటయే మొదటి అవసరత
► పిల్లలకు పరిచర్య చేయడానికి మీకు అవసరమైన మొదటి విషయం ఏమిటి?
పిల్లల కొరకు పరిచర్యలో పాల్గొనేవారి సమూహాన్ని త్వరగా సమకూర్చబడుతుంది, ఇందులో పిల్లలు మరియు పాల్గొన్న పెద్దలు ఉంటారు. ఆ సమూహంలో సహజ నాయకులు ఉన్నారు, వారు అధికారిక స్థానాల్లో లేనప్పటికీ, వారి వ్యక్తిత్వాల ద్వారా ఇతరులను ప్రభావితం చేసే వ్యక్తులు. పెద్దలలో మరియు పిల్లలలో సహజ నాయకులు కూడా ఉన్నారు.
పరిచర్యకు మొదటి అవసరం సానుకూల అధ్యాత్మిక వాతావరణం ఉన్న క్రైస్తవ వాతావరణం ఉండాలి. అక్కడ మీరు పరిపక్వత లేని క్రైస్తవులను మానసికంగా, శారీరకంగా, అధ్యాత్మికగా మరియు సామాజికంగా పెంచుకోవచ్చు.
అంటే పెద్దలు అధ్యాత్మిక మాదిరిలు ఉండాలి. మీరు పిల్లల పరిచర్య కొరకు అధ్యాత్మికమైన తీవ్రత లేని క్రైస్తవులను ఉపయోగించరాదు. మీ సందేశాన్ని తిరస్కరించడానికి ఇతరులను తీవ్రంగా ప్రభావితం చేసే పిల్లలను ఈ పరిచర్యలో మీరు చేర్చలేరు.
పిల్లలకు మీ పరిచర్య ఇప్పటికే విఫలమైతే...
పెద్దలు ఎవరైతే ఈ పరిచర్యలో సహాయ పడుతున్నారో వారు కొన్ని ప్రత్యేక సామర్థ్యం లేదా ఇతర కారణాలచే అక్కడ ఉంటున్నారు. కానీ వారు పిల్లలకి ఒక ఆత్మీయుడిగా/ఆత్మీయరాలిగా ఒక ఉదాహరణగా ఉండలేకపోతున్నారు.
అధ్యాత్మిక విషయాలపై ఆసక్తి లేని పిల్లలు సమూహం యొక్క సంభాషణ మరియు సామాజిక పరస్పర క్రియలను ఆధిపత్యం చేస్తారు.
అన్ని అధ్యాత్మిక కార్యకలాపాలను పిల్లలు పెద్దగా పాల్గొనకుండా పెద్దలు మాత్రమే నడిపిస్తారు.
కొద్దిమంది పిల్లలు మాత్రమే సహకరించాలని మరియు అధ్యాత్మిక ఆసక్తిని చూపించాలని కోరుకుంటారు, మరియు వారిని చాలా మంది సామాజికంగా అంగీకరించరు.
పిల్లల సమూహాన్ని చూడండి మరియు ఈ ప్రశ్నలను మీరే అడగండి. ఒక క్రొత్త బాలుడు మా పరిచర్యకు రావడం ప్రారంభిస్తే, సమూహంలోని ఏ పిల్లలను అతడు ఎక్కువగా అనుసరిస్తాడు? ఒక క్రొత్త అమ్మాయి నమోదు చేయబడితే, ఆమె ఎవరిని అనుసరిస్తుంది? ఆ ప్రభావాలు మంచివిగా ఉన్నాయా లేదా చెడ్డవిగా ఉన్నాయా?
పరిచర్య యొక్క మొదటి అవసరం సానుకూల క్రైస్తవ వాతావరణం. ఈ మొదటి అవసరాన్ని బట్టి పిల్లల పరిచర్యను ప్రారంభించాలి. పరిచర్య ఇప్పటికే ఆలాంటి వాతావరణము కోల్పోయినట్లయితే, మరలా అది ఏదో ఒక క్రొత్త ప్రారంభం చేయాలి, లేదా అది సరైన ప్రయోజనాన్ని సాధించదు.
సంభాషణ జీవితానికి సూత్రము
సంబంధాల ద్వారా దేవుని జ్ఞానము వస్తుంది.
దేవుని యాకోబుతో మాట్లాడినపుడు, దేవుడు తననుతాను బయలుపరచుకొన్నాడు. "నేను సర్వలోకము యొక్క దేవుడను" లేదా "నేను ప్రపంచాన్ని సృష్టించిన దేవుడను" అని అతడు అనలేదు; ఆ ప్రకటనలు సత్యం అయినప్పటికీ. అతడు, "నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను" (ఆదికాండము 28:13) అని చెపుతాడు. దేవుడు ప్రజల ద్వారా బయలుపరచుకుంటాడు.
అబ్రాహాము విశ్వాసము గల మానవుడుగా మారిపోయాడు మరియు ఇతరలు అబ్రాహామును చూచి దేవుని యందు విశ్వసముంచారు. అతని సేవకుడు ఎలీయెజరు “నా యజమానుడగు అబ్రాహాము దేవుడవైన యెహోవా” అని ప్రార్థించాడు (ఆదికాండము 24:12).
ఈ దేవుడు మీ దేవుడు కాబట్టి ఆయన గురించి బాగా తెలుసుకొనినా వ్యక్తులు ఉండాలి.
కొన్నిసార్లు మనం శిష్యత్వము అంటే ప్రజలకు తెలుసుకోవలసినది మరియు వారు ఏమి చేయాలో చెప్పడం అని అనుకుంటాము, అది కాదు. మొదట, వారు అనుసరించాలనుకునే జీవితాన్ని మీరు వారికి చూపించాలి. వారు మీలాగే జీవించాలనుకుంటే, వారు దీన్ని ఎలా చేయాలో అప్పుడు మీ ఆజ్ఞలను వారు వింటారు.
శిష్యత్వం అనేది జీవితం యొక్క సంభాషణ. ఒక జీవనశైలి, దాని ఉద్దేశ్యాలు మరియు ప్రధాన విలువలతో, శిష్యుడి నుండి శిష్యుడికి బదిలీ అందించబడుతుంది.
జీవిత బదిలీ సూత్రం ప్రకారం, ఒక ఉపాధ్యాయుడు తన జీవనశైలిని, దాని ఉద్దేశ్యాలు మరియు ప్రధానమైన విలువలను విద్యార్థిలో అమర్చినప్పుడు, ప్రభావవంతమైన శిష్యత్వం ఏర్పడుతుంది.
మొదటి శతాబ్దపు యూదా రబ్బీలు శిష్యత్వము అంటే జీవిత బదిలీ అని అర్థం చేసుకున్నారు. ఒక యువకుడు రబ్బీ శిష్యుడిగా ఉండాలని కోరుకున్నప్పుడు, అతన్ని అంగీకరించమని రబ్బీని అడుగుతాడు. అంగీకరించినట్లయితే, అతడు రబ్బీ జీవితాన్ని అనుసరించడానికి ప్రారంభిస్తాడు. అతడు తన బోధను నేర్చుకోవడమే కాదు, జీవితానికి సంబంధించిన విధానాన్నికూడా నేర్చుకుంటాడు.
యేసు శిష్యులుగా ఉండమని అడగని మనుష్యులను ఎన్నుకోవడం ద్వారా యేసు ఆ కాలపు కట్టుబాటు నుండి తప్పుకున్నాడు. అయినప్పటికీ, అతను జీవిత అనుభవాలను బదిలీ చేయడానికి ఇతరులతో జీవితాన్ని పంచుకునే శిష్యరికం ఆచారాన్ని అనుసరించాడు.
యేసు మరణం మరియు పునరుత్థానం తరువాత, అతని శిష్యులలో కొంతమందిని బందీ చేసి, అతన్ని దోషిగా తేల్చిన అదే కోర్టు ముందుకు వారిని తీసుకువెళ్లారు. యేసు చనిపోయి నప్పటి నుండి వారి సమస్యలు ముగిశాయని సన్ హేద్రిన్ మహాసభవారు బహుశా అనుకున్నారు. యేసు అనుచరులను భయపెట్టడానికి మరియు వారిని నిశ్శబ్దం చేయడానికి కొన్ని బెదిరింపులు సరిపోతాయని వారు భావించారు. వారు శిష్యులను పరిశీలించినప్పుడు, వారు ఉన్నత విద్యావంతులు కాదని, కోర్టు సభ్యులకన్నా తక్కువ విద్యావంతులు అని వారు చూడగలిగారు. కానీ, వారు యేసుతో ఉన్నారని సన్ హేద్రిన్ గమనించినట్లు లేఖనము చెబుతుంది (అపొస్తలుల కార్యములు 4:13). యేసు తన జీవితాన్ని వారిపై ముద్ర వేసాడు.
ఆ శిష్యులలో వారు యేసులో ఏమి చూశారు? అది అతని ప్రవర్తన శైలి లేదా మాట్లాడే శైలి? బహుశా; వారి వాటికంటే ఎక్కువే చూసారు. దైవిక పిలుపులో నుండి వచ్చిన ధైర్యాన్ని వారు చూశారు. వారు ఏ త్యాగానికైనా సరిపోయే సత్యానికి స్థిరమైన నిబద్ధతను చూశారు. వారు అధికారం పట్ల గౌరవం చూశారు. కాని వారు రాజీపడేతత్వమును మరియు కపటత్వాన్ని తిరస్కరించే క్రీస్తును చూసారు. ఆ అవినీతి రాజకీయ నాయకులు, మరియు మత కపటవాదుల వారి సమస్యలు ఇప్పుడే మొదలయ్యాయని గ్రహించిన వారి హృదయాలు కదిలి ఉండాలి. శిష్యులలో యేసు తన ప్రభావాన్ని ఎక్కువ చేసాడు, మరియు శాశ్వతం చేశాడు.
డాక్టర్ పౌలు బ్రాండ్ తన యువ వైద్య విద్యార్థులను భారతదేశంలోని ఒక ఆసుపత్రిలో రోగులను పరీక్షించడం మరియు రోగ నిర్ధారణ చేయడం వంటివి గమనిస్తున్నాడు. వారిలో ఒక వైద్య విద్యార్థి రోగితో సున్నితంగా వ్యవహరించడాన్ని అతడు చూస్తుండగా, వైద్య విద్యార్థి ముఖంపైకి వచ్చిన ఒక ఖచ్చితమైన వ్యక్తీకరణను చూసి అతడు ఆశ్చర్యపోయాడు. ఈ వ్యక్తీకరణ ఇంగ్లాండ్‌లో డాక్టర్ బ్రాండ్‌కు శిక్షణ ఇచ్చిన సర్జన్ డాక్టర్ పిల్చర్ ముఖంతో సరిగ్గా సరిపోతుంది, అలాగే ఉంటుంది. డాక్టర్ పిల్చర్ భారతదేశానికి ఎన్నడూ రాలేదని తనకు తెలుసు, మరియు వైద్య విద్యార్థి అతనిని ఎలా అనుకరించగలదో అతనికి అర్థం కాలేదని డాక్టర్ బ్రాండ్ వైద్య విద్యార్థులకు వివరించాడు. చివరగా, వైద్య విద్యార్థులలో ఒకరు, "మనకు డాక్టర్ పిల్చర్గారి ఎవరో తెలియదు, కానీ డాక్టర్ బ్రాండ్ మనకు తెలుసు, అది అతడు ధరించిన మీ వ్యక్తీకరణ" అని చెప్పాడు. [1]
మీరు బోధించడానికి ప్రయత్నించి నప్పుడు మీరు బోధించేది చాల మంది మీద చాలా ప్రభావం చూపుతుంది. మీరు ఏదైనా నేర్పడానికి ప్రయత్నించి నప్పుడు మీరు ఎక్కువగా పదేపదే బోధిస్తారు. ఎవరో చెప్పినట్లుగా, మీరు చెప్పేదాని ద్వారా మీరు కొంచెం బోధిస్తారు, మీరు చేసే పనుల ద్వారా ఎక్కువగా బోధిస్తారు, మరియు చాలా వరకు మీరు ఏమి చేస్తారు అదే అనేకుల మీద ప్రభావము చూపును."
మీ మాదిరి జీవితము యొక్క శక్తి గురించి జాగ్రత్త వహించండి. మీరు ఎల్లప్పుడూ బోధిస్తున్నారు. మీరు మీ జీవనశైలి ద్వారా ఎక్కువగా శిష్యులకు బోధిస్తారు.
మీ సమస్యలకు మీరు స్పందించే విధానం ద్వారా అతని సమస్యలకు ఎలా స్పందించాలో మీరు అతనికి చూపిస్తారు. అది అసలైన మాదిరి.
పిల్లలకు సహాయం చేయడానికి దయ, మర్యాద మరియు సహనం ముఖ్యమైనవి. కొంతమంది ఇతరులతో పోలిస్తే పిల్లలతో దయగా, మర్యాద పూర్వకంగా, ఓపికగా ఉండగలుగుతారు.
మీరు ఒక వ్యక్తి యెడల పూర్తి శ్రద్ధ వహిస్తే మీరు అతన్ని విలువైనవానిగా చూపిస్తారు. మీరు అతనితో మాట్లాడేటప్పుడు తొందరపడకండి. మీ బాడీ లాంగ్వేజ్ ఏమి చెబుతుందో దానిని దృష్టిలో ఉంచుకోండి, మీరు దూరంగా ఉండటం , మీ తదుపరి పనిలో నిమగ్నమవ్వడం, అతడు మాట్లాడుతున్నప్పుడు ఏదైనా పని చేయడం లేదా మీ దృష్టిని వేరొకరి వైపుకు మరల్చడానికి ప్రయత్నించండి.
మంచిగా వినే అలవాట్లను పాటించండి. మంచిగా వినే గుర్తులలో ఒకటి కంటితో చూడడం, ఏకాగ్రత కలిగి ఉండడం, పరధ్యానాన్ని విస్మరించడం మరియు ప్రసంగీకుని యొక్క హాస్యం లేదా ఇతర భావోద్వేగాలకు ప్రతిస్పందించడం మంచి అలవాటు.
మీరు నిజముగా రద్దీగా ఉండి మరియు వినలేక పోతే, మీరు దానిని వివరించవచ్చు. మీరు సాధారణంగా బోధించే వారికి ప్రత్యేకమైన శ్రద్ధ ఇస్తే వారు బాధపడరు. సాధారణంగా మీరు "ఏదో ఒక ప్రాముఖ్యమైనపని చేయవలసి ఉంటుంది" అని అనుకుంటూ, వారికి సమయం కేటాయించటానికి చాలా బిజీగా అనిపిస్తే, మీరు ఆగి మీ అసలు పని లేమితో గ్రహించాలి.
► మీ జీవితములో పిల్లల ప్రాముఖ్యత ఏమిటి? వారు ముఖ్యమైనవారు అని మీరు వారికి చూపించగల కొన్ని మార్గాలు ఏమిటి? మీరు మార్చవలసిన కొన్ని అలవాట్లు ఏవైనా ఉన్నాయా?
మన సామర్ధ్యాల కన్నా దేవునికి మన లభ్యత చాలా ముఖ్యం. మన సామర్ధ్యాల కన్నా దేవునికి మన లభ్యత అవసరం. దేవుడు తన పిలుపును నెరవేర్చడానికి అవసరమైన సామర్ధ్యాలను తరువాత ఇస్తాడు.
యువకులు చాలా విషయాలలో అస్థిరంగా ఉంటారు. ఒక రోజు నుండి మరో రోజు వరకు వారు అధ్యాత్మిక స్థితి నుండి తిరుగుబాటు స్థితికి, ఉదార స్వభావము నుండి స్వార్థ స్వభావానికి లేదా పరిణతి చెందిన స్థితి నుండి పిల్లతనంలోనికి [2]వరకు మారవచ్చు. వారు కపటంగా ఉండటం వల్ల కాదు. వారు ఇంకా అభివృద్ధి చెందుచూ ఉన్నారు, మరియు వారి వ్యక్తిత్వం ఇంకా స్థిరంగా లేదు.
యువకులు అస్థిరంగా ఉన్నారు, కానీ వారు మీ పర్యవేక్షనలో స్థిరంగా ఉండాలి. వారు చక్కగా లేని రోజులలో వారు ఎప్పటికీ విలువైనవారు కాదని మీరు వారికి చెబితే, మీరు వారిని గురించి వారి నిరీక్షణను తగ్గిస్తారు. వారు ఏమి చేయబోతున్నారో వారికి ఇంకా తెలియదు మరియు మీ పర్యవేక్షణ వారు ఎలా అవుతారో దానిని ప్రభావితం చేస్తుంది.
వారి జీవితం కొరకు దేవుని ప్రత్యేక ప్రణాళిక గురించి వారితో చాలా మాట్లాడండి. దేవుడు ప్రతి ఒక్కరికి ప్రత్యేక సామర్థ్యాలను ఇచ్చాడని వారికి చెప్పండి. దేవుని చిత్తాన్ని కనుగొనుటను గురించి వారితో మాట్లాడండి.
నాయకత్వ సామర్థ్యం ఉన్న యువకుడికి చాలా ఆలోచనలు ఉండవచ్చుకానీ చెడు వాటిని తొలగించడానికి కష్టపడతారు. మంచి మరియు చెడు ఆలోచనల మధ్య వ్యత్యాసాన్ని చెప్పగల సామర్థ్యం పరిపక్వతకు సూచిక. అతనికి జ్ఞానాన్ని పొందడంలో సహాయపడండి, కానీ అతని ఆలోచనలను నిరుత్సాహపరచవద్దు
అన్నింటికంటే మించి, ప్రతి వ్యక్తికి దేవుడు అంతిమ ప్రణాళికను కలిగి ఉన్నాడని గుర్తుంచుకోండి మరియు అంతిమ ప్రణాళికను తీసుకురావడానికి కృషిచేస్తోంది. వివేచన కొరకు ప్రార్థించండి, తద్వారా మీరు విద్యార్థి కొరకు దేవుని అభివృద్ధి ప్రణాళికతో పని చేయవచ్చు. విద్యార్థి జీవితంలో కృప మరియు దేవుని అనుగ్రహము యొక్క అద్భుతాల కొరకు ప్రార్థించండి, అది అతన్ని సరైన పద్ధతిలో మారుస్తుంది.
[1]Paul Brand and Philip Yancey, In His Image. (Grand Rapids: Zondervan, 1984), 18-19
ఒక వ్యక్తికి ఇకపై యువకుల పట్ల సానుభూతి లేనప్పుడు, భూమిపై అతని ఉపయోగం ముగిసింది
(జార్జ్ మెక్‌డొనాల్డ్).
బోధనా పద్ధతులను మెరుగుపరచుకోనుట
► మంచి బోధనా శైలి యొక్క కొన్ని లక్షణాలు ఏమిటి? ఎవరైనా బోధించడం మీరు చూసినప్పుడు, అతడు మంచి బోధకుడు అని మీకు ఎలా తెలుసు?
బోధనా శైలిపై ఉపాధ్యాయుడికి నియంత్రణ ఉంటుంది. శైలి యొక్క అనేక అంశాలు ఉపాధ్యాయుడు జాగ్రత్తగా ప్లాన్ చేయాలి.
(1) బోధనా స్థాయి
ప్రజలు ఇరుకైన మెడతో పొడవాటి కుండీలలా ఉన్నారు. మీరు ఆ కుండీలలో ఏదైనా చాలా త్వరగా పోస్తే, కొందరి లోపలికి అది వెళ్ళదు. మీరు సమాచారాన్ని చాలా త్వరగా నేర్పిస్తే, వారు దానిని నేర్చుకోనలేరు. ఒక వ్యక్తి క్రొత్త సమాచారాన్ని నేర్చుకున్నప్పుడు, అతడు దానిని తనకు ఇప్పటికే తెలిసిన దానితో కనెక్ట్ చేయాలి. ఈ సమాచారం తన జీవితానికి ఎలా వర్తిస్తుందో కూడా అతడు ఆలోచించాలి. అందువల్ల, ఒక వ్యక్తి సమాచారాన్ని నేర్చుకోగల వేగానికి పరిమితులు ఉన్నాయి.
వారు మరచిపోయే అనేక అంశాలను కవర్ చేయడం కంటే మరపురాని విధంగా ఒక అంశమును నేర్పించడం మంచిది. వారు ఎటువంటి ప్రాముఖ్యత లేని సమాచారాన్ని వినడం కంటే ఒక ప్రధాన భావనను నిజముగా ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడం వారికి మంచిది.
(2) సమూహము చర్చ
చాలా మందికి నేర్చుకునేటప్పుడు ఇతరులతో కొంత చర్చ అవసరం. వారు ప్రశ్నలు అడగగలగాలి మరియు వారి స్వంత మాటలలో ఒక భావనను పునరావృతం చేయాలి. ఉపాధ్యాయుల బోధనా శైలి శ్రోతల నుండి పరస్పర చర్యను అనుమతించకపోతే, వారు అంతగా నేర్చుకోరు.
“ఇది ఎందుకు ముఖ్యం...?” వంటి ప్రశ్నతో మీరు అంశమును పరిచయం చేయవచ్చు. లేదా “మీకు తెలిసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటి...?” అని ప్రశ్నించి పరిచయ చర్చకు ఎక్కువ సమయం కేటాయించవద్దు, కానీ వారికి ఆసక్తి కలిగించడానికి దాన్ని ఉపయోగించండి.
కొంత సమాచారాన్ని చెప్పిన తరువాత, మీరు ఒక ప్రశ్నను అడగవచ్చు, అది వారి స్వంత మార్గాన్ని భావనను వివరించేలా చేస్తుంది. ఉదాహరణకు, “కథలోని వ్యక్తి చేసిన తప్పు ఏమిటి...?” లేదా “మనకు అది ఎందుకు ముఖ్యం...?” అవును లేదా కాదు అని క్లుప్త సమాధానమిచ్చే ప్రశ్నలకు బదులుగా వివరణతో సమాధానం ఇవ్వవలసిన ప్రశ్నలను అడగండి. ప్రశ్నలు చాలా తేలికగా ఉండాలి, వాటిలో ఎక్కువ భాగం పిల్లల నుండి మంచి సమాధానాలు వస్తాయి. వారి సమాధానాలు సాధారణంగా తప్పు అయితే వారు ఆసక్తిని చూపరు.
వ్యక్తిగతంగా ఏదైనా తప్పక పంచుకోవాలని విద్యార్థిపై ఒత్తిడి చేయవద్దు. బదులుగా, అతడు వ్యక్తిగతంగా పంచుకోవడానికి సంకోచించని వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నించండి.
నిర్దిష్ట వ్యక్తులు ప్రత్యేకంగా మాట్లాడకుండా నిరోధించండి. మీరు నిశ్శబ్దముగా ఉండే సభ్యుడికి ఒక ప్రశ్నను అడగవచ్చు: " నవీన్ మీరు ఏమనుకుంటున్నారు?" "మీలో మిగిలినవారు ఏమనుకుంటున్నారు " అడగడం ద్వారా ఇతరులను కూడా పాల్గొనేవిదంగా ప్రోత్సహించవచ్చు.
సమూహాన్ని విస్మరిస్తూ తరగతిలోని వ్యక్తులు వారికి వారే స్వంత చర్చలు జరపడానికి అనుమతించవద్దు.
మాట్లాడుతున్న పిల్లవాడిని కూడా అడ్డుకోవడానికి ఎవరినీ అనుమతించవద్దు.
ప్రతి వ్యాఖ్యను విమర్శించే ముందు ఏదో ఒక విధంగా మంచిదే అని ధృవీకరించడానికి ప్రయత్నించండి. దీనికి దిద్దుబాటు అవసరమైతే, దాన్ని విస్తరించడం ద్వారా సరిదిద్దడానికి ప్రయత్నించండి.
(3) వారికి సరిపోయేదిగా ఉండాలి
"ఈ విషయము ఎందుకు ముఖ్యమైనది?" అని ప్రతిసారి మిమల్ని మీరు ప్రశ్నించుకోవాలి. మీకు తెలియకపోతే వారికి కూడా తెలియదు. వాటిలో ఏ తేడా ఉండాలి? అప్పుడు వారిలో ఏమి మార్పు ఉంటుంది? వారు వారి జీవితాలకు చేయవలసిన ఖచ్చితమైన అనువర్తనాలు ఇందులో ఉన్నాయా? మీరు దేని గురించి ఆలోచించలేకపోతే, వారు కూడా ఆలోచించలేరు.
అంశము తమకు సంబంధించినదని వారు చూస్తే, వారు దానిని బాగా వింటారు. తరగతిని నియంత్రించడానికి, క్రమశిక్షణను కొనసాగించడం కంటే ఆసక్తికరంగా చేయడానికి ఎక్కువ దృష్టి పెట్టండి.
(4) ప్రాముఖ్యత
మీరు బోధిస్తున్న సత్యము యొక్క ఫలితాలను చూపించు. ప్రజలు దానిని తెలుసుకున్నప్పుడు మరియు దానిని అనుసరిస్తే ఏమి జరుగుతుంది? ప్రజలు ఈ సత్యాన్ని తిరస్కరించినప్పుడు ఏమి జరుగుతుంది?
గొప్ప ఉదాహరణలతో వారిని ప్రేరేపించండి. చిన్న సమస్యలపై ఎక్కువ సమయం గడపడం మానుకోండి. మీరు పంచుకుంటున్న సత్యంతో జీవించిన ఇతరుల గురించి వారికి జరిగిన సంభవాలు చెప్పండి. వారు మీ పాఠ ప్రణాళిక గుర్తుంచుకోరు, కానీ వారు మీరు చెప్పిన సంభవాలు గుర్తుంచుకుంటారు.
వారికి వీరుల గురించి చెప్పండి. వారు ప్రజలను ఆరాధించడానికి మరియు అనుకరించడానికి చూస్తున్నారు. విశ్వాస వీరుల గురించి చెప్పండి - గొప్ప అద్భుతాలను చూసిన వారికే కాదు, దేవుని శక్తితో గొప్ప పనులను సాధించిన వారిని గురించి చెప్పండి. సువార్తను వ్యాప్తి చేయడానికి మరియు శిష్యులను చేయటానికి సంఘము యొక్క లక్ష్యం ప్రపంచంలోనే గొప్ప సవాలు మరియు నెరవేర్చిన పని అని వారికి సహాయపడండి.
(5) దృశ్యరూపాలు
వీలైతే , కథలు చెప్పేటప్పుడు రంగురంగుల చిత్రాలను ఉపయోగించండి. భావనలను బోధించేటప్పుడు, బోర్డులో ప్రధాన పదాలు మరియు ప్రకటనలను వ్రాయండి. వారు చూస్తూ విన్నట్లయితే వారు వాటిని బాగా గుర్తుంచుకుంటారు.
(6) అభినయం
అభినయం చేయడం ద్వారా ప్రజలు నేర్చుకుంటారు. పిల్లలు ఏదో తయారు చేయడం ద్వారా లేదా కథను నటించి చూపడం ద్వారా నేర్చుకోవచ్చు. గురువు చెప్పినట్లుగా బైబిల్ కథను నటించడంలో కూడా వారిని నడిపించవచ్చు. దీనికి సమయం పడుతుంది, కాబట్టి మీరు ప్రతిసారీ మొత్తం కథ కొరకు అభినయం తీసుకోలేకపోవచ్చు, కానీ మీరు ప్రతిసారీ కొంత అభినయాన్ని తీసుకునే మార్గాల కొరకు వెతకాలి.
► కొంతమంది సభ్యులు వారు సమర్పించిన ఇటీవలి పాఠాలు లేదా ఉపన్యాసాల గురించి మాట్లాడవచ్చు మరియు వారు శైలి యొక్క ఈ అంశాలను ఎలా బాగా ఉపయోగించుకోవాలో వివరించవచ్చు. ఈ అంశాలను అన్వయించడానికి వారు ఇప్పటికే ఏమి చేస్తున్నారో కొందరు వివరించవచ్చు.
పిల్లలకు సువార్త ప్రకటించు విధానం: పదాలు లేని పుస్తకం
పదాలు లేని పుస్తకం యొక్క ప్రతి పేజీ వేరే రంగు మరియు సువార్తలో కొంత భాగాన్ని సూచిస్తుంది.
ప్రతి పేజీతో వెళ్ళే సందేశం యొక్క సారాంశం క్రింద ఉంటుంది. మీరు పదాలు లేని పుస్తకాన్ని ఉపయోగించినప్పుడు, మీరు మరింత వివరణను ఇవ్వాలి మరియు పిల్లలను మాట్లాడనివ్వండి మరియు ప్రశ్నలను కూడా అడగనివండి.[1]
గమనిక: కొంతమంది బంగారు పేజీని మొదట, తరువాత నల్లగా ఉంచుదురు మరియు క్రింద ఇవ్వబడిన అదే క్రమంలో రంగువ కాగితాలను కలిగిఉండండి.
నలుపు: నలుపు మనము చేసిన పాపాలను, మనం చేసిన చెడు పనులను గుర్తు చేస్తుంది. అందరూ పాపం చేశారని బైబిలు చెబుతోంది. పాపం కారణంగా, మనము దేవునికి దూరంగా ఉన్నాము. (ఈ సమయంలో, అతడు పిల్లవాడిని తాను పాపి అని అంగీకరించమని మీరు అడగాలి.)
ఎరుపు: శుభవార్త ఏమిటంటే, దేవుని కుమారుడైన యేసు మనకొరకు చనిపోయాడు కాబట్టి మనం క్షమించబడతాము. ఎరుపు యేసు రక్తాన్ని సూచిస్తుంది. యేసు చనిపోయారు, కాని ఆయన మరణము నుండి లేచి మనకు పరలోకం ఇవ్వగలరు.
తెలుపు: దేవుడు మనలను క్షమించినప్పుడు ఆయన మన హృదయమును శుభ్రంగా చేస్తాడు. మనం చేసిన పాపాలన్నిటినీ ఆయన తీసివేస్తాడు. మీరు క్షమించమని దేవుడిని ప్రార్థించవచ్చు మరియు అడగవచ్చు. మీ పాపాలను క్షమించమని అడిగి ఉంటే దేవుడు మిమ్మల్ని క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు.
బంగారం: బంగారం పరలోకాన్ని సూచిస్తుంది, దేవుడు మన కొరకు సిద్ధం చేస్తున్న ప్రదేశం పరలోకము. ఇక్కడ మన జీవితం ముగించబడినప్పుడు, మనం దేవునితో పరలోకంలో జీవిస్తాము, అక్కడ ఎప్పుడూ దుఃఖం, నొప్పి లేదా చెడు ఉండదు.
ఆకుపచ్చ: మీరు క్షమించబడినప్పుడు, మీరు దేవుని బిడ్డగా మార్పు చెందుదురు. మీరు దేవునితో సంబంధం కలిగి ఉండి అందులో అభివృద్ధి చెందుదురు. ఆకుపచ్చ అభివృద్ధి చెందుటను సూచిస్తుంది. మీరు దేవుని గురించి మరింత నేర్చుకుంటారు మరియు మీరు ఎలా జీవించాలని ఆయన కోరుకుంటారు. మీరు మీ బైబిల్‌ను ప్రతి రోజు చదవాలి, ప్రతిరోజు ప్రార్థించాలి మరియు దేవునికి దగ్గరగా ఎలా జీవించాలో తెలిసిన ఇతరుల ద్వారా వినండి.
(1) “సంభాషణ జీవితానికి సూత్రము” పేరుతో ఉన్న ఈ పాఠంలోని విషయాలను మళ్ళీ చూడండి. పిల్లలతో మీ పరస్పర చర్యను పరిగణించండి, బోధలోనే కాదు, ఎప్పుడైనా మీరు వారిని ప్రశించవచ్చు. మీలో మీరు ఏమి మార్చుకోవాలి? అని మీ గురించి బాగా తెలిసిన వారితో సంభాషించండి. అతనికి (లేదా ఆమె) విషయాన్ని చూపించండి మరియు మీ పరిశీలనను గురించి వివరించండి. వారి నిజాయితీ అభిప్రాయం అడగండి. మీరు ఈ నియామకాన్ని చేశారని మీరు చెప్పాలి, కానీ మీ పరిశీలన యొక్క వివరాలను వారికి వివరించాలో లేదా వివరించకూడదో అని మీరు నిర్ణయించుకోవచ్చు.
(2) పిల్లలకు పాఠం లేదా సందేశము సిద్ధం చేయండి. ప్రసంగ శైలి లోని ఆరు అంశాలను ఉపయోగించడానికి జాగ్రత్తగా డిజైన్ చేయండి. మీరు దీన్ని ఎలా రూపొందించారో వివరించడానికి సిద్ధంగా ఉండండి.
(3) మాటలు లేని పుస్తకాన్ని కొనడానికి లేదా తయారు చేయడానికి ఒక మార్గాన్ని కనుగొనండి. దానిని వివరించడం ఎలానో నేర్చుకోండి మరియు కనీసం ముగ్గురు వ్యక్తులకు దానిని అందించండి. ప్రతి అనుభవాన్ని వివరించే ఒక పేరా వ్రాయండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.