బైబిల్ సంబంధమైన సువార్త మరియు శిష్యత్వము
బైబిల్ సంబంధమైన సువార్త మరియు శిష్యత్వము
Audio Course Purchase

Search Course

Type at least 3 characters to search

Search through all lessons and sections in this course

Searching...

No results found

No matches for ""

Try different keywords or check your spelling

results found

బైబిల్ సంబంధమైన సువార్త మరియు శిష్యత్వము

Lead Writer: Stephen Gibson

Course Description

ఈ కోర్సు సువార్త ప్రకటించు పద్ధతులకు మార్గనిర్దేశం చేసే బైబిల్ సూత్రాలను అందిస్తుంది. ఇది సువార్త ప్రకటించే పద్ధతులను వివరిస్తుంది మరియు క్రొత్తగా మారుమనస్సు పొందినవారి క్రమశిక్షణకై ఉపయోగించటానికి పాఠాలను అందిస్తుంది.

Introduction

కోర్సు యొక్క వివరణ

ఈ కోర్సు సంఘము తన పరిచర్యను నెరవేర్చడంలో సహాయపడే ఒక సాధనం.

ఈ కోర్సు స్థానిక సంఘమే కేంద్రము అనే విషయమును నొక్కి చెబుతుంది, సువార్తయే సంఘము యొక్క లక్ష్యం అని చూపిస్తుంది మరియు సువార్త యొక్క స్వభావమే సంఘానికి ఆకారమును ఇస్తుంది.

సువార్త యొక్క ప్రాథమిక సత్యాలను వివరించడం ద్వారా, పాపిని నిజమైన మారుమనస్సు మరియు సరియైన క్రైస్తవ జీవితములోనికి నడిపించే ఆధునిక పద్ధతులలోని కొన్ని లోపాలను ఇది సరిదిద్దుతుంది.

విద్యార్థి తన పరిచర్యను అభివృద్ధి చేసుకోనుటకు సన్నద్ధమవుతారు.

కోర్సులోని చాలా పాఠాలు వివిధ రకాల సమూహాలకు పూర్తి అంశాలుగా బోధించబడతాయి. ఉదాహరణకు:- ఒక పాఠాన్ని సువార్తను ప్రకటించడానికి ఒక పద్ధతినిగా ఉపయోగించవచ్చు.

ఈ కోర్సులో శిష్యులను ఎలా తయారు చేయాలో విద్యార్థులు నేర్చుకుంటున్నారు. శిష్యత్వం కోసం ప్రత్యేకంగా కొత్త విశ్వాసులతో ఉపయోగం కోసం రూపొందించబడిన ఒక సాధనం షెపర్డ్స్ గ్లోబల్ క్లాస్‌రూమ్. మీరు కల్టివేట్ శిష్యత్వ పాఠాలు శిష్యత్వ పాఠ్య పుస్తకాన్ని shepherdsglobal.org నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కల్టివేట్ శిష్యత్వ పాఠాలు 26 పాఠాల్లో ప్రతిదానికి విద్యార్థి పేజీలు మరియు టీచర్ గైడ్ ఉన్నాయి.

కోర్సు యొక్క లక్ష్యాలు

(1) సంఘము యొక్క స్వభావం మరియు రూపకల్పన కొరకు సువార్త లోని తాత్పర్యంను వివరించుట.

(2) సువార్త యొక్క ప్రాథమిక సిద్ధాంతాలను సమీక్షించుట.

(3) విశ్వాసులకు ఆచరణాత్మక పద్ధతుల్లో సువార్త వివరిచుటకై శిక్షణ ఇచ్చుట.

(4) శిష్యత్వానికి సంబంధించిన సంఘము యొక్క బాధ్యతను అర్థం చేసుకొనుట.

(5) శిష్యత్వములోని బాధ్యతలు నిర్వచించుట మరియు వివరించుట.

(6) శిష్యత్వము కొరకు ఒక చిన్న సమూహాన్ని నడిపించడానికి ఆచరణాత్మక పద్ధతులను నేర్పించుట.

(7) క్రొత్తగా నమ్మిన వారిని శిష్యత్వములో నడిపించుటకు ఉపయోగించాల్సిన పాఠాల  అందించుట.

తరగతి నాయకులకు వివరణలు మరియు పద్ధతులు

తరగతి నాయకులకు గమనికలు, పాఠం యొక్క ఖచ్చితమైన భాగాలకు సూచనలతో కోర్సు అంతట చేర్చబడతాయి. అవి ప్రత్యేకముగా వ్రాయబడిఉన్నాయి.

► అనేది చర్చా ప్రశ్నలు మరియు తరగతి కార్యకలాపాలను సూచిస్తుంది. చర్చా ప్రశ్న వేసేటప్పుడు, తరగతి నాయకుడు దానిని అడగాలి మరియు తరగతికి ప్రతిస్పందించడానికి అవకాశం ఇవ్వాలి. చర్చ ప్రశ్నకు సమగ్ర ప్రతిస్పందనను అందించాల్సిన అవసరం లేదు. ప్రశ్న పాఠ్య ప్రణాళికలో ప్రస్తావించబడుతుంది. నాయకుడు ఒక విద్యార్థిని ఇలా అడగవచ్చు, "ఐసయ్య, ఈ ప్రశ్నకు మీరు ఎలా సమాధానం ఇస్తారు?" వారు సాధారణంగా ముందుగా సమాధానం ఇచ్చినట్లయితే లేదా కొంతమంది విద్యార్థులు సమాధానం ఇవ్వకూడదని ఎంచుకుంటే.

ప్రతి పాఠం ప్రత్యకమైన పనుల (అసైన్‌మెంట్‌లు) చేత ముగుస్తుంది. అసైన్‌మెంట్‌లు పూర్తి చేసి , తదుపరి పాఠము సమయానికి ముందే అప్పగించాలి. ఒక విద్యార్థి అప్పగింతను పూర్తి చేయకపోతే, అతడు దానిని తరువాత చేయవచ్చు, సమయము యివ్వండి. ఏదేమైనా, నాయకుడు విద్యార్థులను ప్రస్తుత క్రమపరచిన పాఠాల నుండి కొనసాగించమని ప్రోత్సహించాలి, తద్వారా వారు తరగతి నుండి మరింత నేర్చుకుంటారు.

విద్యార్థులు అనేక రకాల వ్రాతపూర్వక పనులను పూర్తి చేస్తారు. సాధారణంగా తరగతి నాయకుడు, తరగతి సమయం ప్రారంభంలోనే వ్రాతపూర్వక పనులను సేకరించాలి. రెండు అసైన్‌మెంట్‌లు (పాఠం 6, అసైన్‌మెంట్ 1, మరియు పాఠం 14, అసైన్‌మెంట్ 1) అయిపొయయి అని సమాచారం ఇస్తే సరిపోతుంది. వాటిని రాతపూర్వక పేపర్ లో తిరగండి అవసరం లేదు.

తరగతిలో నేర్చుకున్న పద్ధతులను ఉపయోగించి విద్యార్థులు సువార్తను చాలా మందికి ప్రకటిస్తారు. ప్రతి ప్రెజెంటేషన్ తరువాత, వారు తమ ముఖ్యమైన అనుభవమును గురించి వ్రాస్తారు మరియు ప్రెజెంటేషన్లు ఎలా చెప్పారో తరగతిలో పంచుకుంటారు. వారు పెద్దలకు సువార్త ప్రకటనను మరియు పిల్లలకు ఒక పాఠాన్ని సిద్ధం చేస్తారు. ఈ కోర్సులో 5 మరియు 10 పాఠాలకు పైగా రెండు పరీక్షలు ఉన్నాయి. విద్యార్థులు ఏ అంశమును చూడకుండా లేదా ఒకరితో ఒకరు మాట్లాడకుండా జ్ఞాపకశక్తిలో నుండి సమాధానాలు వ్రాయాలి. తరగతి నాయకుడికి జవాబు కీ ఇవ్వబడలేదు, ఎందుకంటే అన్ని సమాధానాలు పాఠంలో సులభంగా కనిపిస్తాయి. తరగతి నాయకుడు కూడా పాఠంపై చక్కని అవగాహన కలిగి ఉండాలి.

పాఠం 13 లో సువార్త పత్రాలను పంపిణీ చేయడానికి ఆజ్ఞలు ఉన్నాయి. పంపిణీ కొరకు కొన్ని మార్గాలను ఎక్కడ పొందాలో విద్యార్థులు తెలుసుకోవాలి. వీలైతే, ఆ తరగతి సెషన్‌కు సరఫరాను చేయాలి.

విద్యార్థి Shepherd’s Global Classroom నుండి సర్టిఫికేట్ సంపాదించాలనుకుంటే, అతడు తరగతులన్ని సెషన్స్‌కు హాజరుకావాలి మరియు అన్ని వ్రాతపరీక్షలను పూర్తిచేయాలి. పూర్తి చేసిన పనులను రికార్డ్ చేయడానికి కోర్సు చివరిలో ఒక ఫారం అందించబడుతుంది.

Ready to Start Learning?

Select a lesson from the sidebar to begin your journey through this course.