ఈరిక్ తన సంఘము యొక్క ప్రారంభ సంవత్సరాల గురించి మాట్లాడటానికి ఇష్టపడుచున్నాడు. “మనము ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఒక పార్కులో సంఘ సమావేశమును ప్రారంభించాము. చలి కాలములో, మనము ఒక పాత బస్సులో కూడుకున్నాము. ఆ సమయములో మనకు బాత్రూమ్లు లేవు. తరువాత , మనము కొంతకాలం వ్యాయామశాలలో కూడుకున్నాము, తరువాత పాత సంఘ భవనంను అద్దెకు తీసుకున్నాము.”
ఈరిక్ సంఘము ఆ సంవత్సరాల్లో సంఖ్య పెరిగింది. ఆ సంఘక్రమానికి కట్టుబడి ఉన్న ప్రజలు భవనం పట్ల ఆకర్షితులుకాలేదు. వారు ప్రజల సమూహాన్నిబట్టి ఆకర్షించబడ్డారు.
ఈ పాఠంలో, సంఘమును ఎలా డిజైన్ చేయాలో మాట్లాడేటప్పుడు, మనము ఒక భవనం గురించి మాట్లాడటం లేదు. చాలా గొప్ప సంఘములు క్లిష్ట పరిస్థితులలో ఎలా ప్రారంభించబడ్డాయో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి.
కొన్ని సంఘములు ప్రజలను ఆకర్షించలేవని, ఎందుకంటే వారి భవనం తగినంతగా లేదు. సత్యం ఏమిటంటే, భవనం కంటే ముఖ్యమైనవి ఆత్మసంబంధమైనవి వారికి లేవు.
ప్రతిచోటా క్రైస్తవులు తమ సంఘములను సందర్శించడానికి ప్రజలను ఆహ్వానిస్తారు. సందర్శకులు సంఘమును ఇష్టపడాలని మరియు రావడం కొనసాగించాలని వారు ఆశిస్తున్నారు. సందర్శకులు సువార్తకు ప్రతిస్పందిస్తారని వారు ఆశిస్తున్నారు.
► మీరు ఒకరిని సంఘానికి ఆహ్వానించినప్పుడు, ఆ ఆహ్వానం అర్థం ఏమిటి? మీరు వారికి ఎలాంటి ఆహ్వానమును అందిస్తున్నారు?
మతపరమైన వ్యాయామాలలో పాల్గొనమని వారిని అడగడం లేదు, అది ఒక అవసరాన్ని తీర్చగలదు లేదా విధిని నెరవేరుస్తుంది. విశ్వాసం లేని వ్యక్తికి మతపరమైన ఆచారాలు పాటించడం ప్రభావవంతంగా ఉంటుందని మనము నమ్మము.
వారు మారుమనస్సు పొందనప్పుడు వారు దేవుని ఆరాధనను అర్థం చేసుకుంటారని మనము ఆశించము.
వారు ప్రజల స్నేహాన్ని ఇష్టపడతారని మరియు మళ్ళీ వారితో ఉండాలని మనము ఆశిస్తున్నాము.
వారు సువార్తకు ప్రతిస్పందిస్తారని మనము ఆశిస్తున్నాము.
కొన్ని సంఘములు తమ కార్యక్రమాన్ని అధ్యాత్మిక ఆసక్తిలేని వ్యక్తులకు ఆకర్షణీయంగా మార్చడానికి ప్రయత్నిస్తాయి. ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఆనందిస్తే, వారు హాజరవుతారని వారు ఆశిస్తున్నారు. సమస్య ఏమిటంటే, వినోదం విజయవంతమైతే, అది సరైన అధ్యాత్మికత లేని వ్యక్తుల సమూహాన్ని ఆకర్షిస్తుంది. ఈ సమాజం మిశ్రమ సమూహంగా మారుతుంది, ఇందులో ఆరాధన పట్ల ఆసక్తి లేని, కానీ వినోదాన్ని ఆస్వాదించే చాలామంది ఉన్నారు. ఆరాధన నాయకులు మరియు సంగీతకారులు, ప్రకటనకారులు ఎక్కువ అవుతారు. చివరికి, ఆరాధనపై ఆసక్తి లేని ఆరాధన నాయకులు అభివృద్ధి చెందుతారు. ఆరాధన పాడైంది.
► ఈ ప్రశ్నను మళ్ళీ పరిశీలించండి. మీరు ఒకరిని సంఘానికి ఆహ్వానించినప్పుడు, మీరు ఏమి అందిస్తున్నారు? మీరు ఎలాంటిది అందిచాలి?
ఒక వ్యక్తి మారుమనస్సు పొందినప్పుడు జరిగే గొప్ప మార్పు గురించి ఆలోచించండి. అతడు తన పూర్వ మతాన్ని విడిచిపెట్టాడు, అ మార్పు అతనిని కుటుంబం మరియు స్నేహితుల నుండి కూడా వేరు చేస్తుంది. అతడు పాపం గురించి పశ్చాత్తాప పడుతున్నాడు, అంటే అతడు ఆనందించగలడని అనుకున్న చాలా విషయాలను వదిలివేయవచ్చు. అతడు తన జీవిత నియంత్రణను దేవునికి అప్పగిస్తాడు.
మారుమనస్సులో జరిగే గొప్ప మార్పు కారణంగా, ఒక వ్యక్తి సాధారణంగా తాను వదిలి వెళ్ళే సంఘం మరియు అతడు ప్రవేశించే సంఘం గురించి ఆలోచించకుండా మారుమనస్సుని అంగీకరించడు. ఒక వ్యక్తి క్రైస్తవుని సాక్ష్యము ద్వారా ఆకర్షితుడైతే, క్రైస్తవుడు ప్రాతినిధ్యం వహిస్తున్న విశ్వాసి సంఘాన్ని చూడాలనుకుంటున్నాడు. విశ్వాసము నిజముగా ఎలా జీవించిందో చూడాలని అతడు కోరుకుంటాడు. అతడు వింటున్న సువార్త సందేశం ఇప్పటికే మారుమనస్సు పొందినట్లయితే అతడు ప్రవేశించాలనుకొన్న విశ్వాస సమాజాన్ని సృష్టించాడని అతడు ఊహిస్తాడు. అప్పుడు అతడు ఇలా అడుగుతాడు' ఈ సందేశం ద్వారా మరియు ప్రత్యక్ష నమ్మకం వ్యక్తుల సమూహం ఎక్కడ? నేను ఆ సమూహములో ఉండటం ఎలా ఉంటుంది? అని అడుగుతాడు'
యేసు “రాజ్య సువార్తను” బోధించాడు మరియు పరలోకరాజ్యం గురించి తరచుగా మాట్లాడాడు. దేవుని రాజ్యం తమ వద్దకు వచ్చిందని ఆయన చెప్పాడు (లూకా 10:9). దేవుని రాజ్యంలోకి ప్రవేశించిన ప్రజలు దేవుని పాలనను అంగీకరించారు, ఆయన ద్వారా జీవించారు, అపోస్తలులకార్యములు కలిసి జీవితాన్ని పంచుకున్నారు. దేవుని పట్ల [1]వారికున్న విధేయత వారిని విశ్వాస సమాజంగా మార్చింది.
సువార్త సృష్టించిన విశ్వాస సమాజాన్ని ప్రజలు చూడవలసిన అవసరం ఉన్నందున, వ్యక్తులను ఒప్పించే నాయకులు మాత్రమే సువార్త ప్రకటించలేరు. అంటే స్థానిక సంఘము అవసరం. స్థానిక సంఘము విశ్వాస సమాజంగా ఆకర్షణీయమైనదిగా ఉండాలి.
► విశ్వాస సమాజములోనికి చేరే ముందు ఒక వ్యక్తి ఏమి చూడాలనుకుంటున్నారు?
సంఘానికి దేవుడు రూపొందించిన స్వభావం ఉంటుంది మరియు దేవుడు ఇచ్చిన పరిచర్య ఉంటుంది. ప్రతి స్థానిక సంఘము దేవుని ప్రమాణం ప్రకారం ఉత్తమంగా ఉండాలి. ప్రజలను ఆకర్షించడానికి మనము సంఘముని భిన్నమైనదిగా మార్చకూడదు. సంఘమును విభిన్నమైనదిగా చూపించడానికి మనం ప్రయత్నించకూడదు.
దేవుడు ఇచ్చిన ఉద్దేశ్యాన్ని ఒక సంఘము నెరవేర్చినట్లయితే, అది సరైన వ్యక్తులను ఆకర్షిస్తుంది మరియు సమర్పణ గల సమూహాన్ని నిర్మిస్తుంది.
మరణం మరియు పాతాళము యొక్క అన్ని శక్తులపై సవాలు చేస్తూ మరియు విజయం సాధించే సంఘము యొక్క నిర్మాణాన్ని యేసు తన శిష్యులలో నిర్మించాడు. ఇది ఆవగింజ లాగా చిన్నదిగా ప్రారంభమైంది, కానీ అది పరిమాణం మరియు బలం పెద్దగా పెరుగుతుంది...
(రాబర్ట్ కోల్మన్, ది మాస్టర్స్ ప్లాన్).
ఆకర్షణీయమైన స్థానిక సంఘము యొక్క లక్షణాలు
(1) సభ్యులు దేవునితో తమ సంబంధం నిజమైనదని మరియు సంతృప్తికరంగా ఉందని చూపిస్తారు. రక్షింపబడని వ్యక్తికి దేవునితో సంబంధం లేదు. దేవునితో జీవితం ఎలా ఉంటుందో చూసినప్పుడు, అతడు ఒక అవసరాన్ని అనుభవిస్తాడు. దేవునిని తెలుసుకున్న ఆనండానికి సాక్ష్యమివ్వడం ద్వారా మరియు సమర్పణతో జీవించడం ద్వారా సభ్యులు దీనిని చూపిస్తారు. ఒక సభ్యుడు సంఘములో లేనప్పుడు పాపంతో జీవిస్తుంటే, అతడు దేవునితో సంతృప్తి చెందలేదని చూపిస్తాడు.
(2) సంఘము సిద్ధాంతాలను నిజముగాను మరియు దేవునితో ఉన్న సంబంధానికి రుజువులుగాను చూపిస్తుంది. మనము సిద్ధాంతాన్ని బోధిస్తాము ఎందుకంటే ఇది సత్యం, కానీ అది సత్యము మాత్రమే కాదు జీవితం. సిద్ధాంతం అంటే మనం తెలుసుకోవలసిన విషయం ఎందుకంటే మనం దేవునితో జీవించాలనుకుంటున్నాము. వివాహం నిబంధనలతో సంబంధం ఉన్నట్లే, దేవునితో మన సంబంధానికి సమర్పణ యొక్క నిబంధనలు ఉన్నాయి. మనము సంబంధంలో ఎలా జీవిస్తున్నామో సిద్ధాంతం వివరిస్తుంది.
(3) సంఘము దేవుణ్ణి ఆరాధించే ఆనందాన్ని ప్రదర్శిస్తుంది. ఆరాధన యొక్క ఆనందం, వినోదం యొక్క ఆనందం వలె ఉండదు. నిజమైన దేవున్ని ఆరాధించని వ్యక్తులు ఆయనను ఆరాధించడం వల్ల కలిగే ఆనందాన్ని అనుభవించరు. మనము ఆరాధన కొరకు రూపొందించబడ్డాము; అందువల్ల, సంతోషకరమైన ఆరాధనను చూసే ఒక రక్షింపబడని వ్యక్తి తన అవసరాన్ని అనుభవిస్తాడు.
(4) సంఘము సభ్యులు నిత్య దృక్పథంతో జీవితానికి ఉద్దేశ్యాన్ని చూపుతారు. క్రైస్తవులు తమ జీవితం ముఖ్యమైనదా అని ఆశ్చర్యపోనవసరం లేదు. క్రైస్తవులకు జీవితంలో కష్ట సమయాల్లో ఓదార్పు మరియు ధైర్యం ఉంటుంది. రక్షింపబడని ప్రజలు జీవితానికి సంతృప్తికరమైన ఉద్దేశ్యాన్ని కనుగొనటానికి కష్టపడతారు మరియు మరణం మరియు నిత్యత్వాన్ని ఎలా ఎదుర్కోవాలో వారికి తెలియదు.
(5) సంఘము స్వార్థపరమైన వాటికి బదులుగా సంబంధాల ప్రాధాన్యతను చూపిస్తుంది. సంఘము తన సంస్థను నిర్మించాలనే ఉద్దేశ్యంతో దాని సమాజానికి సువార్త ప్రకటించదు లేదా పట్టించుకోదు. లోకములోని ప్రజలు సంబంధాలను నిర్లక్ష్యం చేస్తారు లేదా స్వార్థ లక్ష్యాల కొరకు సంబంధాలను ఉపయోగిస్తారు.
(6) సంఘము యొక్క సందేశం లోతైన అధ్యాత్మిక అవసరాలను సంతృప్తిపరుస్తుంది. రక్షింపబడని వ్యక్తికి అధ్యాత్మిక ఆకలి ఉంటుంది, అది ప్రపంచం అందించే దేని ద్వారా నైన సంతృప్తిపరచదు. సంఘము యొక్క బోధ మరియు ప్రకటన మరియు సలహా ప్రజల నిజమైన అవసరాలకు సరిపోవాలి.
(7) సంఘము దాని సభ్యులను ప్రేమించే మరియు శ్రద్ధ వహించే విశ్వాస కుటుంబం. ఇతర రకాల సమూహాలు వారి సభ్యుల యొక్క కొన్ని అవసరాలకు సహాయపడవచ్చు, కాని క్రైస్తవులు మాత్రమే నిజమైన క్రైస్తవ సహవాసం కలిగి ఉంటారు.
► సంఘము ఈ లక్షణాలను చూపించగల కొన్ని ఖచ్చితమైన మార్గాలు ఏమిటి? సరైన ప్రాధాన్యతలను బాగా చూపించడానికి సంఘము ప్రారంభించాల్సిన కొన్ని విషయాలు ఏమిటి?
సువార్త ప్రకటించుట కొరకు సంఘ సిద్ధపాటు
సంఘము దాని కార్యక్రమాలు మరియు సువార్త ప్రకటన మరియు శిష్యత్వ లక్ష్యాన్ని నెరవేర్చడంలో సహాయపడుతుందని నిర్ధారించుకోవాలి. సంఘము చేసే ప్రతిదీ ఆ ప్రాధాన్యతకు అనుగుణంగా ఉండాలి.
సందర్శకులను ఆహ్వానించుట
సందర్శకులను స్వాగతించడానికి మరియు వారికి ఆదరణకరంగా ఉండటానికి సంఘము సిద్ధంగా ఉండాలి. కొంతమందికి సంఘములోని ఆచారాలు తెలియవు. వారు ఒక సంఘముని సందర్శించి నప్పుడు, వారు ఏమి కోరుకోవాలో తెలియదు. వారి నుండి సంఘము ఏమి ఆశించబడుతుందో వారికి తెలియదు. వారు సంఘానికి వచ్చిన మొదటి కొద్ది నిమిషాల్లోనే, వారు వచ్చినందుకు వారు సంతోషిస్తారు లేదా వారు రాకూడదని కోరుకుంటారు. సందర్శకులను స్వాగతించడానికి ప్రజలు సిద్ధంగా ఉండటానికి సంఘము కొందరిని ఏర్పాట్లు చేయాలి.
సంఘము ఎప్పుడూ పేదరికం కారణంగా ప్రజలను నిరాకరించకూడదు. సంఘములో ప్రజలు ధరించే దుస్తులను బట్టి పేదలను మినహాయించకూడదు.
తల్లిదండ్రులు లేకుండా వచ్చే పిల్లలకు పరిచర్య చేయడానికి సంఘము సిద్ధంగా ఉండాలి. సంఘానికి వచ్చే పిల్లలకు బోధించడానికి ప్రజలను నియమించి శిక్షణ ఇవ్వాలి.
సందర్శకుడిని ఒక చిన్న సమూహము సమావేశానికి లేదా ఇంటిలో జరిగే సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానించాలి, అక్కడ అతడు అనేక విషయాలు నేర్చుకోవచ్చు మరియు ప్రశ్నలు అడగవచ్చు.
వెలుపల లోకములో ఉన్నవారిని సువార్త ద్వారా చేరుట
సంఘము యొక్క మొదటి బాధ్యత సమాజంలోని సమర్పణ గల సభ్యులను జాగ్రత్తగా చూసుకోవడం. ఏదేమైనా, సంఘము ఎల్లప్పుడూ పొరుగువారిని సువార్త ద్వారా చేరుకోవాలి. సంఘానికి వెలుపల ఉన్నవారు సంఘము యొక్క పనిని చూస్తున్నారని మరియు సువార్తను వింటున్నారని నిర్ధారించుకునే కార్యకలాపాలు సంఘములో ఉండాలి. ఈ కార్యకలాపాలు కొన్ని ఆకస్మికంగా జరగవచ్చు. నాయకులు ఇతరులు వాటిని నిర్వహించడానికి అవసరం. ఈ కార్యకలాపాలకు నమ్మకమైన సామర్థ్యాలున్న సభ్యులను ఆహ్వానించి వారికి శిక్షణ ఇవ్వాలి.
సంఘము పరిసరాల్లోని అవసరాలకు స్పందించే మార్గాలను కనుగొనాలి. దేవుని ప్రేమను చూపించడం మరియు బైబిల్ సూత్రాలను ప్రదర్శించడం ఎల్లప్పుడూ ప్రాధాన్యతగా ఉండాలి.
చిన్న సమూహముల మధ్య పరిచర్య
ఒక వ్యక్తి రక్షింపబడినప్పుడు అతన్ని ఆరాధన సేవకు మాత్రమే ఆహ్వానించకూడదు. వెంటనే శిష్యత్వ శిక్షణలోకి ఆయనను ఆహ్వానించాల్సిన అవసరం ఉంటుంది. ఇది పాస్టర్ గారి యొక్క వ్యక్తిగత సందర్శనలతో ప్రారంభమవుతుంది. వారానికి కలిసే ఒక చిన్న సమూహంలోకి అతన్ని ఆహ్వానించవచ్చు.
ఆరోగ్యకరమైన సంఘము సాధారణంగా అధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించే చిన్న చిన్న సమూహాలను కలిగి ఉంటుంది. ఈ సమూహాలు ఇంటిలో సంఘములు, ఆదివారం పాఠశాల తరగతులు లేదా ఇతర రకాల సమూహాలు కావచ్చు. అధ్యాత్మిక జవాబుదారీతనం మరియు జీవిత మార్పు సాధారణంగా చిన్న సమూహాలలో జరుగుతాయి. ఈ ప్రయోజనాలను సాధించగల సామర్థ్యము, చిన్న సమూహాలకు శక్తి ఉన్నదని సంఘము నాయకులు నిర్ధారించుకోవాలి. సంఘములో ఉన్న నిర్మాణాలు అధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించకపోతే, తప్పక మార్పులు అవసరం.
కనిపించే సంఘసభ్యత్వం
సంఘానికి కట్టుబడి ఉండాలనుకునే వ్యక్తులు, సమర్పణ అంటే ఏమిటో ప్రత్యేకంగా తెలుసుకోవాలి. కొన్ని సంఘములు సభ్యత్వము లేదని పేర్కొన్నాయి, కాని ప్రతి సంఘానికి దాని ప్రజలు ఎవరో తెలుసుకోవడానికి ఒక మార్గం ఉంటుంది. సంఘమును ఏర్పాటు చేసే వ్యక్తులు ఎవరో అందరూ తెలుసుకోవాలి.
సభ్యత్వానికి ఏ తీర్మానాలు అవసరమో అందరూ తెలుసుకోవాలి. సభ్యత్వం పొందడానికి ప్రక్రియ యొక్క అవసరాలు మరియు వివరణ ముద్రించబడాలి అవి సభ్యులకు అందించబడాలి.
మారుమనస్సు పొందిన వ్యక్తి సంఘానికి కట్టుబడి ఉండడానికి సిద్ధంగా ఉండి వెంటనే సంఘానికి సహాయం చేయగలగాలి. అతనికి స్థానం లేదా నాయకత్వ బాధ్యతలు ఇవ్వాలి అని కాదు. అతడు సంఘములో భాగమని తెలుసుకోవడం అతనికి ముఖ్యం.
శిష్యత్వం మారుమనస్సుతో ప్రారంభమవుతుంది. క్రొత్తగా మారుమనస్సు పొందినవారికి అనేక అత్యవసర అవసరాలు ఉంటాయి. అతడు ఇప్పుడే ప్రారంభమైన దేవునితో సంబంధాన్ని కొనసాగించడానికి, అతడు ప్రార్థన మరియు బైబిల్ ఎలా చదవాలో తెలుసుకోవాలి. అతడు తన పాత స్నేహితులను విడిచి పెడతాడు ఎందుకంటే అతనికి క్రొత్త స్నేహితులు సంఘంలో కూడా అవసరం. అనేకమైన జీవనశైలి సమస్యలలో అతనికి మార్గదర్శకత్వం, నడిపింపు అవసరం.
సంఘము క్రొత్తగా మారుమనస్సు పొందినవారికి శిష్యత్వాన్ని వెంటనే ప్రారంభించాలి. వెంటనే అంటే తరువాత ఆదివారం కాదు. అతడు రక్షింపబడాలని ప్రార్థించి తల ఎత్తిన వెంటనే. కనీసం మొదటి వారమైనా క్రొత్తగా నమ్మిన వారితో రోజువారీ పరిచయం కొరకు ఎవరైనా బాధ్యత తీసుకోవాలి. అతడు స్థానిక సంఘములో అనేక ఇతర క్రైస్తవులను కలవాలి. తనకు జరుగుతున్న మార్పులను చర్చించడానికి మరియు ప్రశ్నలు అడగడానికి అతనికి అవకాశాలు ఉండాలి.
మారుమనస్సు పొందినవారిని ఒక చిన్న సమూహంలో చేరమని ఆహ్వానించాలి, అక్కడ అతడు ప్రశ్నలు అడగవచ్చు మరియు ప్రోత్సాహాన్ని పొందవచ్చు. వీలైతే, అతడు హాజరయ్యే మొదటి సమావేశానికి ముందు రోజుల్లో అతడు సమూహములోని అనేకమందికి పరిచయం చేయాలి. అనేక మంది సభ్యులు అతని పరిచయాన్ని పొందడానికి మరియు సమూహానికి స్వాగతం పలకడానికి ముందుగానే అతనికి ఫోన్ కాల్ చేయవచ్చు. ఇది సమాజంలో ఉన్న అతని భావనను నిర్మించడం ప్రారంభిస్తుంది.
క్రొత్తగా నమ్మినవారు దాని తదుపరి సమావేశంలో సమూహంలో చేరాలి. పాఠాలను ఒకరి తరువాత ఒకరు కవర్ చేయాలి, తద్వారా సభ్యుడిని ఎప్పుడైనా ఆ సమూహములో చేర్చవచ్చు. ఈ విధంగా క్రొత్తగా నమ్మిన వారు సమూహము యొక్క మద్దత్తును పొందుతారు. సభ్యులు అన్ని పాఠాలు పూర్తి చేసినప్పుడు ఒక్కొక్కటిగా కోర్సు నుండి గ్రాడ్యుయేట్ చేస్తారు.
అవసరాలపై శ్రద్ధ
సంఘము ప్రజల ఆర్థిక అవసరాలను పట్టించుకోవాలి. సంఘము నాయకుల పరిపాలన లేకుండా ఒకరికొకరు సహాయపడటం ద్వారా చాలా అవసరాలను తీర్చాలి. చాలా మంది సభ్యులు ఇతరులకు సహాయం చేయాల్సిన బాధ్యత భావించకపోతే, వారు ఇంకా పరిణతి చెందిన సంఘముని ఏర్పాటు చేయలేదు.
సంఘములో పరిచారకులు ఉండాలి, అది అవసరాలను గమనించేలా చేస్తుంది. అపోస్తలుల కార్యములలో ఆదిమ సంఘము ఈ ప్రయోజనం కొరకు మొదటి పరిచారకులను నియమించింది.
సువార్త ప్రకటన కొరకు అవసరమయ్యే వాటిని జాగ్రత్త గుర్తించాలి. అప్పుడు సంఘము ఒకరినొకరు చూసుకునే విశ్వాస కుటుంబం అని ప్రజలు చూడగలరు.
పాఠం 15 అసైన్మెంట్లు
ఈ పాఠంలో వివరించిన అన్ని పనులను చేసే సంఘమును ఊహించుకోండి. ఒక వ్యక్తి సంఘాన్ని సందర్శించి, మారుమనస్సు పొంది, మరియు సంఘము యొక్క సమర్పణ కలిగిన సభ్యునిగా ఎలా మారాడో ఊహించి అతనిని గురించి వ్రాయండి. ఇవన్నీ ఎలా జరుగుతాయో దానిని వివరించండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.