“నేటి సంఘము ఈ రోజులలో మంచి సాధనాలు లేదా, క్రొత్త సంస్థను నడిపించే సమర్ధులైన మనుష్యులు అవసరము లేదు, గాని శక్తివంతమైన ప్రార్ధన చేసే విశ్వాసులు కావాలి. పరిశుద్దాత్మ పద్దతుల ద్వారా పని చేయడు, కానీ ప్రార్థించే మనుష్యుల ద్వారా పని చేస్తాడు. అతడు సాధనాలపై కాదు, మనుష్యులపైకి దిగి వస్తాడు. అతడు ప్రణాళికలను అభిషేకం చేయడు, కాని ప్రార్థించే మనుష్యులను అభిషేకం చేస్తాడు.”[1]
► పై స్టేట్మెంట్లో సరిచేయడానికి ఈ.యం బౌండ్స్ ఏ లోపమును గూర్చి వ్రాసాడు?
ప్రార్థన యొక్క చర్య దేవునిపై ఆధారపడటను తెలియజేస్తుంది. ప్రార్థన చేయడానికి చాలా బిజీగా ఉన్న వ్యక్తి తన ప్రార్థనలకు ప్రతిస్పందనగా దేవుడు చేసేపని కంటే తనపని ముఖ్యమని అనుకుంటాడు.
మనం పరిశుద్ధాత్మపై ఆధారపడినందున, ప్రార్థన మనకు ముఖ్యం. సువార్త వ్యాప్తి కొరకు ప్రార్థించమని పౌలు విశ్వాసులను కోరాడు (2 థెస్సలొనీక 3:1, కొలొస్సయులకు 4:3, ఎఫెసీయులకు 6:19).
► విశ్వాసికి ప్రార్థన ముఖ్యమని మనకు తెలుసు. సువార్తికుడు అయిన వ్యక్తికి ఇది చాలా ముఖ్యమైనది, దానికి కొన్ని కారణాలు ఏమిటి?
సువార్తికునికి ప్రార్థన ముఖ్యం:
1. సువార్తికుడు అధ్యాత్మికంగా సజీవంగా ఉండడానికి. ప్రార్థన అనేది ఆత్మ యొక్క శ్వాస. సువార్తికుడు ఇతరులను తాను ఇప్పటికే అనుభవించిన దేవునితో గల సంబంధంలోకి నడిపిస్తాడు.
[1]2. ప్రార్థనలో దేవునితో సమయం గడపకుండా సువార్తికుడు పరిచర్య పట్ల సరైన అభిరుచిని కొనసాగించలేడు. ప్రార్థన లేకుండా, సువార్త ప్రకటన చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తికి తప్పు ప్రేరణలు ఉంటాయి (వ్యక్తిగత విజయాన్ని కోరుకోవడం లేదా వాదనలలో ఆనందిచడం).
3. పాపిని దోషిగా నిర్ధారించడానికి మరియు రక్షించబడాలనే కోరికను ఇవ్వడానికి సువార్తికుడు పరిశుద్ధాత్మపై ఆధారపడాలి. సువార్త ప్రకటన కేవలం మానవప్రయత్నం కాదు. సువార్తికుడు పరిశుద్ధాత్మశక్తిపై ఆధారపడతాడు. మానవ తార్కికం మాత్రమే పాపి తన అపరాధాన్ని మరియు దేవుణ్ణి వెతకాలనే కోరికను అంగీకరించదు (యోహాను 16:8, యోహాను 6:24).
4. సువార్తికుడు తన గ్రంథాన్ని ఉపయోగించడాన్ని ఆత్మ అభిషేకముపై, దేవుని పై ఆధారపడి ఉంటాడు (రోమా 1:16, యెషయా 55:11).
5. సువార్తికునికి తన పరిచర్యలో దేవుని మార్గదర్శకత్వం అవసరం (అపొస్తలుల కార్యములు 11:12).
నేర్చుకోవాలనే మీ కోరిక, ఆత్మల రక్షణ కంటే మించి ఉంటే, ఆత్మల పట్ల మీ కోరిక, మీ అభ్యాస కోరికను మించే వరకు ఆగి, ప్రార్థించండి.
(యూనియన్ బైబిల్ కాలేజీ వ్యవస్థాపకుడు విలియం స్మిత్).
ప్రార్థన యొక్క అభ్యాసం
వ్యక్తిగత ప్రార్థన జీవితం
ప్రతి క్రైస్తవుడు రోజువారి ప్రార్థనలో నమ్మకముగా ఉండాలి, మరియు సువార్త ప్రకటనలో ప్రభావవంతంగా ఉండాలని కోరుకునే వ్యక్తికి ప్రాముఖ్యత మరింత ఎక్కువ ప్రార్థనే.
అతడు దేవునితో ఒంటరిగా గడుపుటకు ప్రతిరోజు అతనికి ఒక ప్రత్యేక సమయం ఉండాలి. వీలైతే, అతడు ఒక ఏకాంత ప్రదేశంలో ఉండాలి. అతడు ఉదయాన్నే లేవవలసి ఉంటుంది, తద్వారా అతడు రోజు బిజీగా ఉండటానికి ముందు పరధ్యానం లేకుండా ప్రార్థన చేయవచ్చు. అతడు తన ప్రత్యేక ప్రార్థన సమయాన్ని ముందుగా గడపలేకపోతే, అతడు దేవునితో మాట్లాడటానికి, రోజు ప్రారంభ గడియలలో కొన్ని నిమిషాలు కేటాయించాలి.
[1]అతడు ప్రతిరోజు దైవ గ్రంథాన్ని కొంతభాగం చదివి దాని గురించి ధ్యానం చేయాలి, దేవుడు తన జీవితంలో ధ్యానించిన సత్యాన్ని నెరవేర్చమని ప్రార్థించాలి.
ప్రార్థన జాబితా
మనం ప్రార్థించవలసిన విషయాలను జాబితా తయారు చేయడం మంచిది. లేకపోతే, మనము బహుశా కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోకపోవచ్చు. లోకమంతటా సువార్త వ్యాప్తి చెందాలని మనం ప్రార్థిస్తూ ఉండాలి, ముఖ్యంగా క్రైస్తవులు హింసించబడే దేశాల కొరకు, మన దేశంలో సువార్త విజయవంతం కావాలని ప్రార్థిస్తూ ఉండాలి. మన స్వంత స్థానిక సంఘము మన సమాజం కొరకు దేవుని లక్ష్యాన్ని నెరవేర్చాలని ప్రార్థించాలి. సువార్తను సమర్థవంతంగా పంచుకోవడానికి దేవుడు వ్యక్తిగతంగా మనకు సహాయం చేస్తాడని మనం ప్రార్థించాలి.
ఒక వ్యక్తికి ఏకాగ్రత సాధించడంలో ఇబ్బంది ఉన్న సమయాల్లో ప్రార్థన చేయడానికి కూడా ఈ జాబితా సహాయపడుతుంది.
మీరు ప్రార్థించిన ప్రతిసారీ ప్రార్థన జాబితాను ఉపయోగించ అవసరం లేదు. కొన్ని విషయాలను గురించి ప్రార్థించాల్సిన అవసరం కొన్నిసార్లు మీకు అనిపిస్తుంది, అప్పుడు మీరు జాబితా లేకుండా వాటిని గుర్తుంచుకోని ప్రార్ధించవచ్చు.
► ప్రార్థన జాబితాలో ఏ ఇతర విషయాలు ఉండాలి?
ప్రార్థన కొరకు పేర్ల జాబితా
వ్యక్తిగతంగా మీకు తెలిసిన పదిమంది వ్యక్తుల పేర్ల జాబితాను రూపొందించండి. వారు మీరు తరచుగా సంప్రదిస్తున్న వ్యక్తులు అయి ఉండాలి. ప్రతిరోజు వారి కొరకు ప్రార్థన చేయడానికి కట్టుబడి ఉండండి. దేవుడు అవకాశాన్ని ఇస్తే వారితో మాట్లాడండి; వారితో మాట్లాడటానికి అవకాశం లేకపోతే, ప్రార్థన కొనసాగించండి. ఇలా ప్రార్థన చేసిన వారి సాక్ష్యం ప్రకారం, మీరు దీన్ని చేస్తే, ఒక సంవత్సరం గడిచే లోపు వారిలో కొంతమంది రక్షింపబడతారు.
ప్రార్థన భాగస్వాములు
ఒక క్రైస్తవుడు క్రమం తప్పకుండా ప్రార్థన చేయడానికి స్నేహితుడిని కలిగి ఉండటం మంచిది. వారు కలిసి అవసరాలు మరియు విజయాలను పంచుకోవాలి. వారు ప్రతి వారం లేదా మరింత తరచుగా కలుసుకొని ప్రార్ధించవచ్చు.
భార్యాభర్తలు కలిసి ఈ విధంగా ప్రార్థించవచ్చు; కానీ భర్తతో ప్రార్థన చేయడానికి మరొక పురుషుడు ఉంటే మంచిది, మరియు ప్రార్థన భాగస్వామిగా ప్రార్థన చేయడానికి భార్యకు మరొక స్త్రీ ఉంటే మంచిది.
► ప్రార్థన భాగస్వాములతో తరగతి సభ్యులకు ఇప్పటికే ఎలాంటి అనుభవాలు ఉన్నాయి?
ప్రార్థనచేస్తూ నడవడము
ప్రార్థన నడక చేయవచ్చు ఎందుకంటే ప్రార్థన పరిచర్య తమ పొరుగు ప్రజల బాధ్యత అని భావిస్తుంది. ఒక సమూహం లేదా వ్యక్తి దాని అవసరాల కొరకు ప్రార్థిస్తూ ఈ ప్రాంతం గుండా నడుస్తారు. ప్రార్థన మౌనంగా చేయవచ్చు. వారు కలుసుకున్నఎడల వారితో మాట్లాడవచ్చు, కాని నడక యొక్క ప్రాధమిక ఉద్దేశ్యం ప్రార్థన. ప్రార్థన నడక ఒక ప్రాంతంలో పరిచర్య ప్రారంభంలో లేదా తరువాత అయిన ప్రార్థన చేయవచ్చు.
ప్రార్థన కేంద్రం
కొన్ని సంఘములు చాలా మంది ప్రయాణిస్తున్న బహిరంగ ప్రదేశంలో తాత్కాలిక ప్రార్థన స్థలం కేంద్రము. వారు “ప్రార్థన కేంద్రము” అని ఒక బోర్డును ఉంచుదురు మరియు దానిని చూచి ప్రయాణిస్తున్న వారు ప్రార్థన చేయమని ప్రతిపాదించుదురు. వారు ప్రయాణిస్తున్న వారితో కలిసి ప్రార్ధనలు చేస్తారు ఇంకా “ఏదైనా అవసరాలకు సంబంధించి నేను మీ కోసం ప్రార్థించాలని మీరు కోరుకుంటున్నారా?” అని అడుగుతూ ఉంటారు వారు అవసరాలకు శ్రద్ధ చూపుతారు మరియు వారితో వాదనలు ప్రారంభించరాదు. తరచుగా వారికి సువార్తనుగాని, కరపత్రిక గాని పంచుకునే అవకాశం కూడా ఉంటుంది.
► మీ ప్రాంతంలో ప్రార్థన కేంద్రము కొరకు మంచి ప్రదేశం ఏది?
ప్రపంచానికి సువార్త ప్రకటించే ప్రారంభ బాధ్యతను తమ భుజాలపై వేసుకున్న మనుష్యులు యేసు వద్దకు ఒక అత్యున్నత అభ్యర్థనతో వచ్చారు. వారు, “ప్రభువా, బోధించడానికి మాకు నేర్పండి, ” “ప్రభువా, అద్భుతాలు చేయడాని నేర్పండి” లేదా “ప్రభువా, జ్ఞానవంతులుగా ఉండటానికి మాకు నేర్పండి” అని వారు అనలేదు… కాని వారు, “ప్రభువా, ప్రార్థన నేర్పండి” అని అన్నారు
(బిల్లీ గ్రాహం ).
బైబిల్ ప్రార్థనలు
యేసు మరియు అపొస్తలులు ప్రార్థించిన ప్రార్థనలు మనం ప్రార్థించవలసిన విషయాలను చూపిస్తాయి, ఎందుకంటే వారు దేవుని చిత్తంతో ప్రార్థించారని మనకు తెలుసు. ఇక్కడ మూడు ఉదాహరణలు ఉన్నాయి.
ప్రభువు యొక్క ప్రార్థన: మత్తయి 6:9-13, ప్రార్థనను గూర్చి యేసు శిష్యులకు చెప్పిన ఒక నమూనా ఉంటుంది. మనము ఈ పదాలను ప్రార్థించాలి, కాని మనం సాధారణంగా ఈ పదాలనే కాదు వాటి ప్రాధాన్యతలతో ప్రార్థించాలి.
ఎఫెసీయుల కొరకు పౌలు చేసిన ప్రార్థన: ఎఫెసీయులకు 3:14-19లో, విశ్వాసుల అధ్యాత్మిక స్థిరతకై పౌలు ప్రార్థించాడు. మనము, ఇతరుల కొరకు కూడా అదే ప్రార్థించాలి.
కోతను గూర్చిన ప్రార్థన: లో మత్తయి 9:36-38, యేసు తనవలే పాపులకై కనికరము కలిగి ఉండాలని మరియు కోత కొరకు కోత యజమానుని ప్రార్ధించమని కోరాడు.
ఉపవాసం యొక్క సాధన
ఉపవాసం అనేది భౌతిక మరియు తాత్కాలికమైన వాటి నుండి దూరంగా ఉంటూ అధ్యాత్మిక మరియు నిత్యమైన వాటిపై మన దృష్టిని ఉంచే సాధనం. భౌతిక మరియు తాత్కాలికమైన విషయాల కంటే అధ్యాత్మిక మరియు నిత్యమైన విషయాలు మనకు ముఖ్యమని ఇది చూపిస్తుంది. ఇది మన విశ్వాసాన్ని బలపరిచే సాధనం.
► ఏదో చేయటానికి దేవుణ్ణి మార్చటానికి ఆకలితో ఉన్న వ్యక్తికిని, ఉపవాసం ఎలా భిన్నంగా ఉంటుంది?
ఉపవాసమును గూర్చి లేఖన ఉదాహరణలు
తమ జీవితంలో దేవుని జోక్యం చేసుకోవడం గురించి ఎవరైనా చాలా గంభీరంగా ఉన్న సమయాల్లో గ్రంథంలో నమోదు చేయబడిన ఉదాహరణలు ఇవి. బైబిల్ సాధారణంగా ఉపవాసానికి అనుకూలంగా మాట్లాడుతుందని చూపించడానికి ఈ ఉదాహరణలు లేఖనంలోని అనేక సూచనలలో ఎంచుకోబడ్డాయి. లేఖనలలో, అది తరచుగా దేవుని జోక్యం ఎందుకు అవసరమో వివరణ భాగంగా పేర్కొనబడినది.
► తరగతిలో ఒకరు ఉపవాసం గురించి వ్రాయబడిన గ్రంథాన్ని చదివి, క్రింది భాగములో వివరించిన పరిస్థితిని ఒకరితో ఒకరు చర్చించాలి.
లేఖనము
ఉపవాసం మరియు ప్రార్థన యొక్క ఫలితం
2 దినవృత్తాంతములు 20
ఒక జాతీ ఉపవాసం యుద్ధంలో విజయం సాధించింది.
ఎజ్రా 8:21
ఎజ్రా ఉపవాసం మరియు ప్రమాదం నుండి దేవుని రక్షణ కొరకు ప్రార్థించాడు.
ఎస్తేరు 4:16
ప్రణాళికాబద్ధమైన మరణమును తప్పించు విషయమై దేవుని జోక్యం కొరకు యూదులు ఉపవాసం ఉన్నారు.
యోనా
దేవుని కృప కొరకు నీనెవె వారు ఉపవాస ఉన్నారు.
న్యాయాధిపతులు 20:26
ఒక యుద్ధంలో దేవుని మార్గదర్శకత్వం పొందడానికి ఇశ్రాయేలు ఉపవాసం ఉన్నారు.
1 సమూయేలు 7:6
క్షమాపణ మరియు విమోచన కొరకు ఇశ్రాయేలు ఉపవాసం ఉన్నారు.
నెహెమ్యా 1:4
పట్టణము యొక్క పునర్నిర్మాణాన్ని ప్రారంభించడానికి నెహెమ్యా దేవుని కొరకు ఉపవాసం ఉన్నాడు.
దానియేలు 9:3
ఇశ్రాయేలు బబులోను చెర నుండి విడుదల కొరకు దానియేలు ఉపవాసం ఉన్నాడు.
యోవేలు 2:12
పశ్చాత్తాపంతో పాటు తీర్పును నివారించడానికి ఉపవాస పిలుపు ఇవ్వబడినది.
మత్తయి 4:2
యేసు భూసంబంధమైన పరిచర్య సిద్దపాటు కొరకు 40 రోజుల ఉపవాసం ఉన్నాడు.
లూకా 2:37
అన్నా ఒక ప్రవక్త్రి, ఆమె ఉపవాసం మరియు ప్రార్థనలను గడిపింది.
అపొస్తలుల కార్యములు 10:30
దేవుని నుండి సందేశం వచ్చినప్పుడు కొర్నేలి ఉపవాసం ఉన్నాడు.
అపొస్తలులకార్యములు 13:2-3
ఉపవాసం ఉన్నప్పుడు, మిషనరీలను పంపమని సంఘానికి దేవుడు చెప్పాడు.
అపొస్తలుల కార్యములు 27:21
పౌలు సంక్షోభ సమయంలో ఉపవాసం మరియు ప్రార్థనలు చేశాడు.
యేసు సూచనలు
యేసు భౌతికంగా శిష్యులు వారితో లేనప్పుడు వారు ఉపవాసము చేస్తారు అని చెప్పాడు (మత్తయి 9:15). ఉపవాసానికి సరైన విధానం గురించి ఆయన వారికి సూచించాడు. ఉపవాసం ఇతర వ్యక్తులు చూడటానికి ప్రకటన కాదని అన్నారు.
మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారులవలె దుఃఖముఖులై యుండకుడి; తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసికొందురు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని, నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని, నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును (మత్తయి 6:16-18).
ఉపవాసం యొక్క చారిత్రక ఉదాహరణలు
ప్రారంభ సంఘములోని కొంతమంది విశ్వాసులు వార్షిక ఉపవాస దినాలను క్రమపరచి చేయడంతో పాటు ప్రతి బుధవారం మరియు శుక్రవారం భోజనం మానివేసారు. మార్టిన్ లూథర్, జాన్ కాల్విన్, జాన్ నాక్స్, జోనాథన్ ఎడ్వర్డ్స్, చార్లెస్ ఫిన్నీ, మరియు డిఎల్ మూడీ అందరూ ఎక్కువ ఉపవాసం ఉన్నారు. జాన్ వెస్లీ మరియు ప్రారంభ మెథడిస్టులు ఉపవాసానికి ప్రసిద్ది చెందారు. ప్రతి పునరుజ్జీవనం ప్రార్థన మరియు ఉపవాసంతో ప్రారంభమై అది స్థిరముగా ఉంటుంది.
► ఉపవాసం ద్వారా మంచి ఫలితాలను పొందిన వ్యక్తులు మీకు ఎవరైనా తెలుసా?
ఆధునిక సంఘము యొక్క బలహీనత
యేసు శిష్యులతో, అవిశ్వాసం కారణంగా అపవిత్రాత్మ చేత పీడించబడిన వ్యక్తికి సహాయం చేయడంలో విఫలమయ్యారు. అప్పుడు అతడు, "ఈ రకమైనది ప్రార్థన మరియు ఉపవాసం ద్వారా మాత్రమే సాధ్యము" అని చెప్పాడు (మత్తయి 17:21). విశ్వాసం సాధించడానికి ప్రార్థన మరియు ఉపవాసం మార్గమని ఆయన సూచించారు; మరియు అందువల్ల, అవిశ్వాసానికి నివారణ ఉపవాస ప్రార్థన. సంక్షోభం తలెత్తినప్పుడు మాత్రమే శిష్యులు ఉపవాసం ఉండాలని ఆయన అర్థం కాదు; క్రమం తప్పకుండా ప్రార్థన మరియు ఉపవాసం వారి జీవితంలో ఒక భాగంగా ఉండాలని, తద్వారా సంక్షోభాలను ఎదుర్కోవటానికి అవసరమైన విశ్వాసం వారికి ఉంటుందని ఆయన అర్థం.
యేసు మాటల నుండి మరియు ఉపవాసం యొక్క అనేక లేఖనాత్మక మరియు చారిత్రక ఉదాహరణల నుండి, అనేక స్థాయిలుగా విభజించబడిన పిరమిడ్ చిత్రంతో మనకు లభించే ఆశీర్వాదాలను రేఖాచిత్రం నుండి గమనించ వచ్చు. ప్రార్థన ద్వారా మాత్రమే మన విశ్వాసం ద్వారా దిగువ స్థాయి ఆశీర్వాదాలు పొందవచ్చు. ప్రార్థన మరియు ఉపవాసం ద్వారా మన విశ్వాసం ద్వారా మాత్రమే ఉన్నత స్థాయి ఆశీర్వాదం లభిస్తుంది.
సరిగ్గా ఉపవాసం ఎలా చేయాలి
ప్రార్థన మరియు ఉపవాసాలను కలపండి, తద్వారా ఉపవాసం కేవలం బాహ్య చర్య కాదు, ఆత్మ యొక్క పునరుద్ధరణ మరియు మీ విశ్వాసం యొక్క వృద్ధి.
అహంకారం కొరకు కాకుండా దేవుని మహిమపరచాలనే ఉద్దేశ్యంతో ఉపవాసం చేయండి.
మీరు ప్రార్థన మరియు ఉపవాసం ఉన్నప్పుడు, మీ అభ్యర్థనకు సంబంధించి దేవుని చిత్తాన్ని వెతకండి.
విధేయత కొరకు ఉపవాసాలను ప్రత్యామ్నాయం చేయవద్దు.
ఉపవాసము ద్వారా మీ శరీరానికి హాని చేయవద్దు.
► తరగతిలోని వారు ప్రార్థన మరియు ఉపవాసం యొక్క కార్యాచరణ గురించి చర్చించాలి.
ఉపవాసం సురక్షితంగా ఎలా చేయాలి
సరిగ్గా చేస్తే, ఉపవాసం అనారోగ్యకరమైనది కాదు. సరియైన ఉపవాసంతో వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి.
ఉపవాస సమయంలో నీరు త్రాగాలి. నీరు లేకుండా ఉపవాసం చేయవద్దు.
ఒకరోజు ఉపవాసం ద్వారా ప్రారంభించండి. క్రమంగా ఎక్కువ కాలం అలా పెంచుతూపొండి. ఒకరోజు లేదా అంతకంటే ఎక్కువ ఉపవాసాల మధ్య ఒక వారం సాధారణ ఆహారం తీసుకోండి.
వికారం లేదా తలనొప్పి యొక్క సంభవాలు ఉపవాసము అలవాటు లేనివారికి సాధారణంగా వస్తాయి. మంచి ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి క్రమం తప్పకుండా ఉపవాసం ఉంటే, అతడు సాధారణంగా మొదటి కొన్ని సార్లు తర్వాత ఆ లక్షణాలను కలిగి ఉండడు. ఉపవాస సమయములో శరీరం విషపూరిత వ్యర్థాలను తొలగిస్తున్నందున నోటిలో చెడు రుచి మరియు చెడు శ్వాస వస్తుంది.
సుదీర్ఘ ఉపవాసంలో, కొన్ని అసౌకర్య లక్షణాలు కొన్ని రోజుల తర్వాత ఆగిపోతాయి.
రసంతో సుదీర్ఘ ఉపవాసం ఆపి వేయండి, తరువాత తేలికపాటి ఆహారం తీసుకోండి.
పాఠం 7 అసైన్మెంట్లు
(1) ప్రతి విద్యార్థి తన ప్రార్థన సాధనను అభివృద్ధి చేసుకోవడానికి ఏమి చేస్తాడో ఆలోచించాలి. అతడు ప్రతిరోజు ప్రార్థన కొరకు కేటాయించడానికి ఒక సమయాన్ని మరియు స్థలాన్ని ఎన్నుకోవాలి. అతడు సాధారణ ఉపవాసాలను క్రమపరచి చేయడాన్ని పరిగణించాలి.
(2) విద్యార్థి ఉపవాసం గురించి రెండు భాగాలను చదవాలి. ప్రతి దాని గురించి మంచి పేరా వ్రాయండి, ఉపవాసం యొక్క పరిస్థితిని మరియు ఫలితాన్ని వివరించండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.