రోమా పత్రిక
రోమా పత్రిక
Audio Course Purchase

Search Course

Type at least 3 characters to search

Search through all lessons and sections in this course

Searching...

No results found

No matches for ""

Try different keywords or check your spelling

results found

రోమా పత్రిక

Lead Writer: Stephen Gibson

Course Description

ఈ కోర్సు రోమా పత్రికలో  వివరించిన విధంగా రక్షణ మరియు సువార్త పొలము అనే వేదాంతశాస్త్రాన్ని బోధిస్తుంది, సంఘములోని వివాదాస్పదమైన అనేక విషయాలను చర్చిస్తుంది.

Introduction

కోర్సు వివరణ

పౌలు రోమా విశ్వాసులకు రాసిన పత్రిక, అతని మిషన్ ని, సందేశాన్ని వివరిస్తుంది. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సువార్త ఎందుకు అవసరమో వివరించడానికి గాను, సువార్త యొక్క దైవశాస్త్ర వేదాంతాన్ని ఆయన వివరించాడు. ఈ పత్రిక, చరిత్ర అంతటా సంఘంపై గొప్ప ప్రభావాన్ని చూపింది. అనేక వివాదాస్పదమైన సిద్ధాంతాలు, అక్కడే వేళ్ళూనుకొని ఉన్నాయి. ఈ కోర్సు, రోమా గ్రంథ బోధనలను పరిశీలించి, వాటిని క్రైస్తవ జీవితానికి అన్వయిస్తాయి.

కోర్సు లక్ష్యాలు

1.   దేవుని రక్షణను, విశ్వాసపు అవసరతను చూడడం.

2.  సువార్తను వినని ప్రజలకు సంబంధించిన సౌవార్తిక విషయాలను గురించి చర్చించడం

3.  ఒక విశ్వాసికి సాధారణమైన మరియు సాధ్యమయ్యే పాపం పై విజయమును అర్థం చేసుకొనుట

4.  దేవుని ప్రణాళికలో ఇశ్రాయేలుకు, సంఘానికి మధ్యనున్న సంబంధాన్ని అధ్యయనం చేయడం.

5.  సంఘంలో సిద్ధాంతపరమైన వివాదాలకు కారణమైన వ్యాఖ్యల సందర్భాన్ని అర్థం చేసుకోవడం.

6.  లోకాన్ని సౌవార్తీకరించాల్సిన, సంఘ మిషన్ పట్ల ఆశను, ఆకాంక్షను కలిగి ఉండడం.

పాఠ్య రూపకల్పన

ఈ కోర్సులోని ఒక్కో పాఠాన్ని ఒక్కో సెషన్ లో చెప్పగలిగే విధంగా రూపొందించడం జరిగించండి, అయితే ప్రతి పాఠముకు రెండు లేదా అంతకంటే ఎక్కువ సెషన్లు అవసరమవుతాయి. చిన్న సెషన్లు అవసరమైతే, పాఠములను తక్కువ మెటీరియల్ కలిగినవిగా విభజించుకోవచ్చు.

పాఠములో తరగతి నాయకునికి అవసరమైన సూచనలు, ఇటాలిక్ (Italics) లో ఉన్నాయి.

తరగతి, పాఠముకు 1కి ముందు కనిపించే “రోమా పత్రిక సంక్షిప్త వివరణ (ఔట్లైన్)” తరచుగా చూస్తూ ఉండాలి. తరగతి ప్రతి లేఖన భాగాన్ని అధ్యయనం చేస్తూ ఉండగా, పుస్తకంలోని ఆ భాగపు సందర్భంతోను, మొత్తం పుస్తకం యొక్క సందర్భంతోను ఈ లేఖన భాగం ఎలా సరిపోతుందో విద్యార్థులకు గుర్తు చేయాలి.

ప్రతి పాఠానికి పునఃశ్చరణ ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి తరగతి ప్రారంభంలో, తరగతి నాయకుడు గత పాఠానికి సంబంధించిన పునఃశ్చరణ ప్రశ్నలను అడగాలి మరియు దానికంటే ముందున్న పాఠం నుండి మరికొన్ని ప్రశ్నలు అడగాలి. విద్యార్థులందరూ సమాధానాలు చెప్పగలగడానికి సహాయపడాలి. ఎవరైనా చురుకుగా పాల్గొనకపోతే, వారి పేరు పిలిచి, వారినొక ప్రశ్నను అడగండి. ఒకవేళ మెటీరియల్ ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటే, వాటిని సరిచేయడానికి ఇదే సరైన సమయం. పునఃశ్చరణ ప్రశ్నలనే, చివరి ప్రశ్నలుగా వాడుకోవచ్చు. అవసరాన్ని బట్టి సమాధానాలను పునఃశ్చరణ చేయాలి, సరిచేయాలి. తరగతిలో పాల్గొన్నవారికి సహాయం చేసే నాయకులు, అవసరమైతే సమాధానాల పత్రాన్ని, shepherdsglobal.org నుండి పొందవచ్చు.

చర్చించే ప్రశ్నలు మరియు తరగతిలో చేసే కార్యచరణలు, ► - ఈ గుర్తుతో సూచించబడతాయి. చర్చించే ప్రశ్నల కొరకు, తరగతి నాయకుడు, ప్రశ్నను అడిగి క్లుప్తంగా సమాధానాలు చెప్పడానికి కొంతమంది విద్యార్థులను అనుమతించాలి. కొన్నిసార్లు అడిగే ప్రశ్న, అప్పటివరకు అధ్యయనం చేసిన అంశాలను పునఃశ్చరణ చేసేదిగా ఉంటుంది. అలాంటి సమయాల్లో, విద్యార్థులు సరైన సమాధానాలు ఇవ్వగలిగేలా ఉండాలి. మరికొన్ని సమయాల్లో, ప్రశ్న క్రొత్త విషయాలను పరిచయం చేస్తుంది. అలాంటప్పుడు విద్యార్థులు ఖచ్చితమైన సమాధానాలు ఇవ్వాల్సిన, ఒక తుదినిర్ణయానికి రావాల్సిన అవసరం ఉండదు. ఆ ప్రశ్న, క్రొత్త అంశాలను నేర్చుకోవడానికి మాత్రమే సిద్ధం చేస్తుంది.

బ్రాకెట్స్ లో ఉన్న ప్రతి లేఖన భాగాన్ని చూడాల్సిన అవసరం లేదు. లేఖనాలు, చెప్పిన విషయాలను బలపరచడానికి మాత్రమే ఇవ్వబడ్డాయి.

పాఠములో లేదా కోర్సులోని మరొక భాగంలో ఉన్న ఇతర విషయాలను ఎక్కడ కనుగొనాలో చూపించడానికి పుట్ నోట్ ఉపయోగపడుతుంది. తరగతిలో ఉన్న వారికి తక్షణమే మరింత వివరణ అవసరమైతే తప్పా ఆ విషయాల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు.

పాఠములో అక్కడక్కడా కొంతమంది ప్రముఖులు చెప్పిన వ్యాఖ్యలను బాక్సులో పేర్కొనడం జరిగింది. వాటిని వివరించమని తరగతి నాయకుడు, విద్యార్థిని అడగవచ్చు.

చాలా పాఠములు, రోమా పట్టణాన్ని గూర్చిన ఒక చిత్రాన్ని మరియు చారిత్రక వివరణను కలిగి ఉంటాయి. ఆ వివరణ పాఠ్యాంశానికి సంబంధించినది కాదు. పాఠాన్ని చెప్తున్నప్పుడు చారిత్రక వివరణను ఉపయోగించాల్సిన అవసరం లేదు.

ప్రతి తరగతి ప్రారంభంలో, తరగతి నాయకుడు గత తరగతి ఆధారంగా రాసిన అసైన్మెంట్లను సేకరించి, వారు రాసిన విషయాలను గురించి క్లుప్తంగా చర్చించాలి.

విద్యార్థుల కొరకు అసైన్మెంట్స్

ఇది బైబిల్ తరగతి. విద్యార్థులు తమ బైబిళ్ళను తెరిచి, వాళ్ళు అధ్యయనం చేస్తున్న లేఖన భాగాలను చూడాలి.

పూర్తి చేసిన అసైన్మెంట్ల రికార్డును నిర్వహించడానికి ఒక పట్టిక ఉంది. ఆ పట్టిక కోర్సుకి వెనుక వైపు ముద్రితమైంది.

ఈ కోర్సు జరుగుతున్న వారాల్లో, విద్యార్థి మూడు ప్రసంగాలను సిద్ధపడి లేదా రోమా పత్రికలోని వాక్యభాగాలను ఆధారం చేసుకొని పాఠాలను సిద్ధపడి వాటిని తరగతికి కాకుండా ఇతర గ్రూపులకు బోధించాలి. బోధించిన తరువాత, తన బోధను ఎలా మెరుగుపరచుకోవాలో చెప్పమని తన బోధనను విన్నవారిలో కొద్దిమందిని అడగాలి. అతను బోధించిన నోట్స్ యొక్క కాపీని, తాను మాట్లాడిన దానిని గురించి బృంద వివరణను, సంఘటనను మరియు మెరుగుపరచుకోవడానికి తన ప్రణాళికలను తరగతి నాయకునికి ఇవ్వాలి.

విద్యార్థి తన సిద్ధాంతానికి భిన్నమైన సంఘాలకు చెందిన విశ్వాసులతో కనీసం రెండు సంభాషణలను/చర్చలను సిద్ధపరచాలి. వాళ్ళు ఎందుకు ఆ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారో వివరించమని అడగాలి. రోమా పత్రిక నుండి ఆ అంశానికి సంబంధించిన లేఖన భాగాలను అతను వివరించాలి. అతను సంభాషణను గూర్చిన వివరణను రాసి, దానిని తరగతి నాయకునికి ఇవ్వాలి. 9వ పాఠాన్ని అధ్యయనం చేసిన తరువాత ఈ అసైన్మెంట్ ను ముగించడం ఉత్తమం.

12వ పాఠముకు తప్ప, మిగిలిన ప్రతి పాఠమునకు “రాతపూర్వక అసైన్మెంట్” ఉంటుంది. వీటిలో ప్రతిదానిని, తరువాతి తరగతి కంటే ముందే పూర్తి చేయాలి. వాటిని తరగతి ప్రారంభమవ్వడానికి ముందే తరగతి నాయకునికి ఇవ్వాలి. తరగతి నాయకుడు, విద్యార్థుల రచనపై క్లుప్తమైన చర్చను జరపాలి.

కోర్సు ముగింపులో తుది పరీక్ష ఉంటుంది. విద్యార్థులు, ఎలాంటి మెటీరియల్ ని చూడకుండా వ్యక్తిగతంగా పరీక్షను రాయాలి. ఈ కోర్సు ముగింపులో ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. చివరి పాఠమును బోధించిన తరువాత గాని, మరొక సమయంలో గాని అదే సెషన్ కొరకు పరీక్షను ఏర్పాటు చేయొచ్చు. పరీక్ష రాసే సమయాన్ని తగ్గించడానికి, టీచర్ 20 ప్రశ్నలను ఎంపిక చేయవచ్చు. 20 ప్రశ్నలకు సమాధానం రాయడానికి కొంతమంది విద్యార్థులకు గంట సమయం పట్టొచ్చు. మీరు ఏ ప్రశ్నను వారికి ఇస్తారో విద్యార్థులకు తెలియకూడదు మరియు వాళ్ళు పునఃశ్చరణ ప్రశ్నలన్నింటిని అధ్యయనం చేయాలి.

విద్యార్థులు, ప్రతి తరగతిలోనూ ఉండాలి. విద్యార్థి ఒక సెషన్ కు హాజరు కాకపోతే, అతను దానిని ఖచ్చితంగా నేర్చుకోవాలి, తరగతి నాయకునితో కలిసి పునఃసమీక్ష చేయాలి మరియు అసైన్మెంట్ రాయాలి.

Ready to Start Learning?

Select a lesson from the sidebar to begin your journey through this course.