► ఒక విద్యార్థి, సమూహం కొరకు మత్తయి 19:16-22 చదవాలి. ఈ మనుష్యునికి యేసు ఇచ్చిన సమాధానం గురించి మీరు ఆశ్చర్యపోతున్నారా? నిత్యమైన జీవితాన్ని ఎలా పొందాలో అడిగిన వ్యక్తికి ఒక స్నేహితుడు ఆ సమాధానం ఇస్తారని మీరు విన్నట్లయితే, మీరు మీ స్నేహితుడికి ఏమి వివరించాలనుకుంటున్నారు?
మీరు మంచి ఆరోగ్యంతో ఉన్నారని ఊహించుకోండి, కానీ ఒక స్నేహితుడు మీ వద్దకు వచ్చి ఒక ఖచ్చితమైన ప్రాణాంతక వ్యాధికి నివారణను కొన్నానని చెప్పాడు.[1] దానిని కొనడానికి, అతడు తన ఇంటిని మరియు తన వద్ద ఉన్న ప్రతిదాన్ని విక్రయించాడు. అతడు మీ కొరకు నివారణను కొన్నాడు అనుకోండి, ఇది వినడానికి ఎలా ఉంటుంది.
► మీ స్నేహితుడికి ఆ బహుమతి మీకు ఇచ్చినప్పుడు మీరు అతనితో ఏమి చెబుతారు?
అతని దాతృత్వం కొరకు మీరు అతనికి కృతజ్ఞతలు తెలుపుతారు, కానీ మీకు ఆ బహుమతి ఏమిటో అర్థం కాలేదు. మీకు అవసరం లేనిదాన్ని మీ కొరకు కొనడానికి అతడు ఎందుకు అంత ఎక్కువ ఇస్తాడు?
ఇప్పుడు వేరే కథను ఊహించుకోండి. మీరు ఒక వైద్యుడి వద్దకు వెళ్లి మీకు ప్రాణాంతక వ్యాధి ఉందని కనుగొన్నారు. నివారణ చాలా ఖరీదైనది, మరియు దాని కొరకు మీరు చెల్లించడానికి వేరే మార్గం లేదు. మీరు ఇంటికి వెళ్లి మరణం గురించి ఆలోచించారు, మీ కుటుంబం మిమ్మల్ని కోల్పోతుందని గ్రహించి, మీరు జీవితం నుండి ఆశించినదాన్ని మీరు ఎప్పటికీ అనుభవించలేరు అని అనుకొంటున్నా సమయములో.
అప్పుడు ఒక స్నేహితుడు వచ్చి, మీ కొరకు నివారణ కొనడానికి అతడు తనకు ఉన్నదంతా ఇచ్చాడని చెప్తాడు. మీరు మొదట మీ అవసరాన్ని అర్థం చేసుకున్నందున మీరు దానిని అభినందిస్తున్నారు. అతని బహుమతి మీకు అసమానమైనది మాత్రమే కాదు అది జీవితం.
ఇప్పుడు లోక ప్రజలు సువార్త విన్నప్పుడు వారి ప్రతిస్పందన గురించి ఆలోచించండి. సువార్త అనగా ఇది శుభవార్త, కానీ చాలా మంది ప్రజలు అది అర్థం కాలేదు.
రాజు అనే వ్యక్తిని ఊహించుకోండి. అతని స్నేహితుడు అతనితో, “యేసు మీ పాపాలను క్షమించటానికి బలిగా సిలువపై మరణించాడు.”అని చెప్పాడు.
రాజు ఇలా అనుకుంటాడు, “నేను చెడ్డ వ్యక్తిని కాదు. నేను నా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు మంచివాడిని. నా పాపాలకు ఇంత గొప్ప త్యాగం ఎందుకు అవసరం? క్షమాపణ ఎందుకు అంత ముఖ్యమైనది?” తాను ఇంత చెడ్డ పాపిని అని తన స్నేహితుడు భావిస్తున్నాడని రాజుకు కోపం రావచ్చు, నా క్షమాపణ కొరకు యేసు మరణం అవసరమా అనే ప్రశ్న రావచ్చు.
ప్రజలు సిలువను బట్టి ఆటంకపరచబడ్డారని బైబిలు చెబుతుంది. ప్రజలు తమనుతాము సమర్థించుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొనాలనుకుంటున్నారు. తమకు యేసు బలి అవసరమని వారు అనుకోరు, కాబట్టి సిలువ వారికి మూర్ఖత్వంలా అనిపిస్తుంది (1 కొరింథీయులకు 1:18).
ఒక వ్యాధి నివారణ గురించి దృష్టాంతం వలె, ప్రజలు సిలువను మెచ్చుకోరు ఎందుకంటే వారికి ఎందుకు సిలువ అవసరం అని అర్థం కాలేదు.
సువార్త కొరకు ప్రజలను సిద్ధం చేయడానికి బైబిల్ మార్గం వారికి ఎందుకు అవసరమో వారికి చూపించాలి. వారు త్వరలోనే దేవునిచే తీర్పు తీర్చబడే పాపులని వారు గ్రహించాలి.
► ఒక వ్యక్తి సువార్త వినడానికి ఎందుకు ఆనందంగా ఉండాలి?
[1]ఈ పాఠం యొక్క చాలా విషయాలను “రే కంఫర్ట్” గారి “హెల్ యొక్క బెస్ట్-కెప్ట్ సీక్రెట్” (నరకము యొక్క శ్రేష్ట రహస్యాలు) అనే ఉపన్యాసంలో మరియు అదే శీర్షికతో పుస్తకాన్ని ప్రచురించారు. Http://www.livingwaters.com లో మరిన్ని విషయాలు అందుబాటులో ఉన్నాయి.
తీర్పు యొక్క ప్రాముఖ్యత
పాపులు తీర్పు తీర్చబడతారు మరియు శిక్షించబడతారు అనే వాస్తవం ఒక పాపికి అర్థమైనప్పుడు సువార్త వినడానికి సంతోషంగా దానిని అంగీకరించడానికి ఇష్టపడును.
మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును (హెబ్రీయులకు 9:27).
మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును (మత్తయి 12:36).
►ప్రకటన యొక్క వివరణను ప్రకటన 20:12-15లో చదవండి.
ప్రతి పాపికి రక్షణ అవసరం ప్రధాన కారణం పాపుల భవిష్యత్తు తీర్పు ఉంటుంది.
పశ్చాత్తాపం చెందమని దేవుడు ప్రతి ఒక్కరికీ ఆజ్ఞాపిస్తున్నాడు, "తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చబోయెడి ఒక దినమును నిర్ణయించియున్నాడు" (అపొస్తలుల కార్యములు 17:30-31).
ఒక వ్యక్తి తన పాపం తీవ్రమైనదని అర్థం చేసుకోకపోతే, రక్షణను కోరుకునే అతి ముఖ్యమైన కారణం అతనికి అర్థము కాదు.
►తన పాపం తీవ్రమైనదని అని ఒక వ్యక్తి ఎలా గ్రహిస్తాడు?
ధర్మశాస్త్రము యొక్క ఉపయోగం
తమను దోషులుగా భావించనందున చాలా మందికి సువార్త పట్ల ఆసక్తి లేదు. చాలా మంది ప్రజలు తమనుతాము మంచివారని భావిస్తారని బైబిలు చెబుతోంది (సామెతలు 20:6). అతడు మంచి వ్యక్తి కాదా అని మీరు ఒకరిని అడిగితే, అతడు చాలావరకు “అవును” అని చెప్పి, తనకొరకు వాదించడానికి సిద్ధంగా ఉంటాడు. చాలా మంది తమ పాపాలు చెడ్డవి కావు, మరియు అవి క్షమించబడును అని అనుకుంటారు. ఆ ప్రజలకు కృప మరియు క్షమాపణ యొక్క అర్థము తెలియదు.
ఆ వ్యక్తి తననుతాను పాపిగా చూడాలి మరియు కృప అవసరం ఉందని తనలోతనను చూడకముందే అతని మనస్సాక్షికి తాను దోషి అని అర్థము కావాలి. పాపంను చూపించడానికి దేవుడు ధర్మశాస్త్రమును ఇచ్చాడు.
ధర్మశాస్త్రము అనే పదం ద్వారా మనము ప్రత్యేకంగా పాత నిబంధన యొక్క ఆచార అవసరాలు ఆలయంలో ఆరాధనను సూచించడము లేదు. ఇశ్రాయేలు ప్రభుత్వానికి ఇచ్చిన చట్టాల గురించి కూడా మనము మాట్లాడటం లేదు, అవి మనకు అదే విధంగా వర్తించవు. మనము దేవుని ధర్మ ప్రమాణం గురించి మాట్లాడుతున్నాము. దావీదు రాజు 119 వ కీర్తనలో తాను దేవుణ్ణి ప్రేమించినట్లే దేవుని ధర్మశాస్త్రాన్ని ఎలా ప్రేమిస్తున్నాడో వ్రాసాడు, ఎందుకంటే ధర్మశాస్త్రము దేవుని స్వంత పరిశుద్ధ లక్షణం నుండి వచ్చింది.
మనం ఎలా జీవించాలో దేవుని ధర్మశాస్త్రం చూపిస్తుంది, దానికి అవిధేయత చూపినందుకు మనం దోషులము. ప్రతి ఒక్కరూ ఇప్పటికే పాపం చేసినందున ధర్మశాస్త్రమును పాటించడం ద్వారా ఎవరూ అంగీకరించబడరు (గలతీయులకు 2:16, రోమా 3:20). ఒక వ్యక్తి ధర్మశాస్త్రమును తప్పుగా ఉపయోగిస్తున్నాడు, దానిని అనుసరించడానికి ప్రయత్నించడం వలన తన రక్షణను పొందుతాడని అనుకొంటున్నాడు.
దేవుని ధర్మశాస్త్రం మన జీవితాన్నినడిపిస్తుంది (1 కొరింథీయులకు 9:21), కానీ అది మన రక్షణకు సాధనం కాదు. ధర్మశాస్త్రము మనలను రక్షణలోనికి తీసుకురాలేదు ఎందుకంటే పుట్టుకతోనే దాని అవసరాలను సంపూర్ణంగా తీర్చగల సామర్థ్యం మనకు లేదు (రోమా 8:3, గలతీయులకు 3:21).
దేవుని ప్రణాళికలో సువార్తకు ధర్మశాస్త్రము వ్యతిరేకం కాదు. పాపి తన రక్షణ అవసరాన్ని గ్రహించే ఉద్దేశ్యంతో ధర్మశాస్త్రము ఉపయోగపడుతుందని బైబిలు చెబుతుంది. సువార్త ధర్మశాస్త్రాన్ని నాశనం చేయలేదు (మత్తయి 5:17) లేదా దానిని మనకు సంబంధం లేనిదిగా చేయలేదు. ఈ ధర్మశాస్త్రము సువార్తకు సరైన సన్నాహకంగా పనిచేస్తుంది, గతంలోనే కాదు ఇప్పటికి కూడా.
క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను (గలతీయులకు 3:24). కొంతమంది ధర్మశాస్త్రము యొక్క కాలం ముగిసిందని అనుకుంటారు, మరియు ఇప్పుడు కృప యొక్క కాలం ఉంటుంది. వాస్తవం ఏమిటంటే, ప్రతి వ్యక్తి దేవుని ధర్మశాస్త్రాన్ని ఎదుర్కోవాలి మరియు కృపను అర్థం చేసుకోకముందే అతడు ధర్మశాస్త్రము ద్వారా ఖండించబడ్డాడు. అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు, "ధర్మశాస్త్రమువలననే గాని పాపమనగాఎట్టిదో నాకు తెలియకపోవును" (రోమా 7:7).
పాపులు దోషులుగా మరియు సాకు లేకుండా చూపించటానికి ధర్మశాస్త్రము ఇవ్వబడింది అని పౌలు చెప్పాడు; ఎందుకంటే , ధర్మశాస్త్రము ప్రకారం ప్రజలు తాము పాపులని గ్రహించారు (రోమా 3:19-20). ప్రతి వ్యక్తి అతడు రక్షింపబడే వరకు “ధర్మశాస్త్రము ప్రకారం” దాని చేత ఖండించబడును.
తన పాపం తీవ్రమైనదని తెలియని వ్యక్తికి సువార్త శుభవార్త కాదు. తాను దోషి అని తెలిసిన మరియు త్వరలోనే దేవుని తీర్పును ఎదుర్కోబోయే వ్యక్తికి సువార్త శుభవార్తయే.
► ఒక విద్యార్థి, సమూహం కొరకు లూకా 18:10-14 చదవాలి. దేవుని కృపతో తనను క్షమించవచ్చని ఎవరైనా పరిసయ్యుడికి చెప్పినట్లయితే, అతడు ఎలా స్పందించాడు?
ఆధునిక సువార్తీకరణ లోపాలు
ఈ రోజులలో చాలా మంది సువార్తికులు ప్రతి వ్యక్తి పాపము విషయమై దోషి అని మరియు దేవుని తీర్పుకు అర్హుడని నొక్కి చెప్పడం ఇష్టం లేదు.
వారు వ్యతిరేక విషయాలకు బదులుగా సానుకూల విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నారు.
వారు శాశ్వతమైన వాటి కంటే రక్షణ యొక్క సంబంధించిన తక్షణ ప్రయోజనాలను అందించాలనుకుంటున్నారు, ఎందుకంటే వారు భూసంబంధమైన విషయాల గురించి ఆందోళన చెందుతున్న వ్యక్తులతో మాట్లాడుతున్నారు.
దేవుని ధర్మశాస్త్రం ఒక చెడ్డ విషయం, రక్షణకు అది శత్రువు, క్రియల ద్వారా రక్షింపబడాలని కోరుకునే ప్రజలకు మాత్రమే ఇది ముఖ్యమని వారు సూచిస్తున్నారు. ధర్మశాస్త్రము మంచిది మరియు పరిశుద్ధమైనదని బైబిల్ చెబుతుంది (రోమా 7:12-14); దేవుణ్ణి సంతోషపెట్టాలనుకునే వ్యక్తి జీవితములో దేవుని సూచనలను అనుసరించడానికి ప్రయత్నిస్తాడు (కీర్తన 119:1-8).
దేవుని ప్రమాణం అసాధారనమైనది మరియు అసమంజసమైనది మీ పాపాలకు మీరు కారణం కాదని అది వారు సూచిస్తున్నారు.
సమస్య ఏమిటంటే, ఒక వ్యక్తి నిజముగా అపరాధి కాకపోతే, అతడు నిజముగా పశ్చాత్తాపపడలేడు. అతడు తప్పు చేయాలని ఎంచుకున్నాడని తెలియకపోతే అతడు చేసిన పనికి క్షమాపణ వేడుకోలేడు. ఒక వ్యక్తి క్షమాపణ కోరినప్పుడు తననుతాను పాపి అని నిజముగా నమ్మకపోతే, ఒప్పుకొనకపోతే, అతడు నిజముగా తన మానవ తప్పిదాలను దేవుని అంగీకరించమని అడుగుతున్నాడు.
వాస్తవం ఏమిటంటే పాపపు స్వభావంతో జన్మించినందుకు పాపులు ఖండించబడరు. వారు ఉద్దేశపూర్వక పాపాలకు మరియు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు యొక్క వైఖరికి ఖండించారు (యూదా 15).
చాలా మంది దేవుడు ప్రేమాస్వరూపి మరియు క్షమించేవాడు అని నమ్ముతారు, కానీ వారు ఒక నీతిగల న్యాయాధిపతి అని నమ్మరు. వారు మారుమనస్సు పొందక పోయినా దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు తప్పక క్షమిస్తాడు అని నమ్ముదురు. వారు విన్న ఈ అసంపూర్ణ సువార్త వారి పాపాలలో వారికి మరింత సౌకర్యంగా ఉండడానికి ద్రోహదపడును.
ఒక వ్యక్తి క్రైస్తవుడైతే అతనికి సంతోషకరమైన జీవితం ఉంటుందని చాలా మంది ఆధునిక సువార్తికులు నొక్కిచెప్పారు. పాపం సంతృప్తి చెందదని వారు చెప్తారు, కాని దేవుడు దానిని చేస్తాడు. ఒక వ్యక్తి ప్రేమ, శాంతి మరియు ఆనందాన్ని పొందుతారని వారు అంటున్నారు. ప్రతి వ్యక్తి జీవితానికి దేవునికి అద్భుతమైన ప్రణాళిక ఉందని, అది ఒక వ్యక్తి రక్షణలోనికి వస్తే ఆ ప్రణాళిక నెరవేరుతుందని వారు అంటున్నారు.
ఈ వాగ్దానాలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. దేవుడు ప్రేమను, శాంతిని ఇస్తాడు, కాని దేవుణ్ణి తిరస్కరించే వ్యక్తులతో ఈ విభేదాలు ఉంటాయి (మత్తయి 10:34-36). అతడు ఆనందాన్ని పాడుతాడు., కానీ అదే సమయంలో హింస ఉండవచ్చు (1 థెస్సలొనీక 1:6). అతడు ప్రతి వ్యక్తిని గూర్చి అద్భుతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు, కాని ఒక క్రైస్తవుడు కఠినమైన పరిస్థితులను మరియు విషాదాలను, శ్రమలను అనుభవించవచ్చు (2 కొరింథీయులకు 11:24-27). ఒక వ్యక్తి క్రైస్తవుడిగా మారాలని నిర్ణయించుకుంటే, అతని జీవిత పరిస్థితి బాగుంటుందని అతడు భావిస్తే, అతడు నిరాశ చెందవచ్చు. కొంతమంది వారు క్రైస్తవులు కాబట్టి తీవ్రంగా బాధపడుతున్నారు.
క్రైస్తవులుగా, మనం కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ, దేవునితో జీవితం అద్భుతమైనదని మనము అర్థం చేసుకున్నాము. దేవుని సేవ చేయడం అద్భుతమైన జీవితం అని మనం చెప్పగలం. అయినప్పటికీ, చాలా మంది సేవ చేయని వ్యక్తులకు అద్భుతమైన జీవితం అంటే ఏమిటో సరైన ఆలోచన లేదు. అద్భుతమైన జీవితాన్ని వివరించమని మీరు వారిని అడిగితే, వారు ఆరోగ్యం, డబ్బు, స్వేచ్ఛ, శాంతి మరియు ఇతర మంచి పరిస్థితుల గురించి మాట్లాడుతారు. హింసించబడిన, బాధపడుతున్న క్రైస్తవుడికి అద్భుతమైన జీవితం ఉందని వారు అర్థం చేసుకోలేరు. కాబట్టి, ఒక క్రైస్తవుడైతే అతనికి అద్భుతమైన జీవితం లభిస్తుందని మీరు ఒక పాపికి చెబితే, మీరు వాగ్దానం చేస్తున్నది ఆయనకు అర్థం కాలేదు.
సువార్త గురించి తప్పు అవగాహనతో మరో సమస్య ఉంటుంది. ఒక వ్యక్తి తననుతాను తీర్పుకు అర్హుడైన పాపిగా చూడకుండ సందేశాన్ని అంగీకరించవచ్చు. అతడు పాపం యొక్క తీవ్రతను చూడనందున, అతడు నిజముగా పశ్చాత్తాపపడడు. అతడు పాపం నుండి రక్షణ కొరకు కాదు, ఇతర ప్రయోజనాల కొరకు చూస్తున్నాడు. అతడు రక్షింపబడ్డాను అని అనుకుంటాడు కానీ అతడు రక్షింపబడలేదు.
అతని జీవితములో రక్షణ కొరకైన నిజమైన మేలులు పొందలేడు ఎందుకంటే అతడు రక్షంచబడలేదు, రక్షించబడినట్లు అతడు కొద్దిసేపు ప్రయత్నిస్తాడు, తరువాత నిరాశతో వదులుకుంటాడు.
సరిగాని సువార్త యొక్క చెత్త ఫలితం ఏమిటంటే, నిరాశ చెందిన వ్యక్తి భవిష్యత్తులో సువార్తకు ప్రతిస్పందించే అవకాశం తక్కువ.
సారాంశంలో, ఆశీర్వాదకరమైన జీవితం యొక్క సువార్తతో సమస్యలు
దేవుడు వాగ్దానం చేయని దాన్ని నేను వాగ్దానం చేస్తున్నాను.
నేను పాపిని తప్పుగా అర్థం చేసుకున్నాను.
ఒక వ్యక్తి నిజముగా మార్చబడకపోవచ్చు.
అతడు ఆశించిన ప్రయోజనాలను అతడు పొందడు.
అతని భవిష్యత్తులో సువార్తను అంగీకరించే అవకాశం తక్కువ.
► ఒక విద్యార్థి, సమూహం కొరకు అపొస్తలుల కార్యములు 14:21-23 చదవాలి. అపొస్తలులు క్రొత్తగా నమ్మిన వారికి ఏమి చెప్పారు?
క్రీస్తు నందు విశ్వాసమును బట్టి లోకము వారిని ద్వేశించును అని యేసు తన శిష్యులకు చెప్పాడు. చివరి వరకు వారు సహిస్తే తప్ప వారు రక్షింపబడరని ఆయన వారితో చెప్పాడు. సువార్త రచయితలలో ముగ్గురు ఈ పదాలను వ్రాసారు (మత్తయి 10:22, మార్కు 13:13, లూకా 21:17). అసలు అపొస్తలులలో దాదాపు అందరు క్రీస్తు కొరకు మరణించారు.
వారి విశ్వాసం కొరకు మిలియన్ల మంది క్రైస్తవులు చంపబడ్డారు. ఇది పురాతన సమస్య మాత్రమే కాదు. క్రైస్తవ అమరవీరులలో సగానికి పైగా 20 వ శతాబ్దంలో చంపబడ్డారు.
ఒక వ్యక్తి సులువైన జీవితంపొందడు అను వాగ్దానం లేకుండా, రక్షణ యొక్క వాగ్దానం కారణంగా మార్చబడితే, అతడు కఠినమైన జీవితం కారణంగా ప్రభువును వదులుకోడు. నిత్యమైన రక్షణ కొరకు పరీక్షలను భరించడానికి అతడు సిద్ధంగా ఉంటాడు. పరీక్షలు రక్షణలో అతనికి మరింత విలువైనవిగా అనిపిస్తాయి.
మారుమనస్సు అనేది గత జీవితముతో వేరుగా ఉంటుంది, అది మరణ పరంగా చెప్పబడుతుంది. మనము క్రీస్తుతో సిలువ వేయబడ్డాము. అతని శిలువ ద్వారా, మనము భక్తిలేని ప్రపంచానికి, దాని దృక్పథానికి మరియు దాని ప్రమాణాలకు మరణించాము
(ప్రపంచ సువార్త కోసం లాసాన్ కమిటీ,
ది విల్లోబ్యాంక్ రిపోర్ట్).
ప్రదర్శించు ప్రేమను
► ఒక విద్యార్థి, సమూహం కొరకు 2 తిమోతి 2:24-26 చదవాలి. ఈ వచనాలు సువార్తికుడి యొక్క విధానం గురించి మనకు ఏమి చెబుతుంది?
సువార్తికుడు తాను సువార్త ప్రకటించిన వ్యక్తులతో పోరాడుతున్నట్లు అనిపించకూడదు. సాతాను శత్రువు, మరియు పాపులు అతని బందీలు. మనం సత్యాన్ని సౌమ్యతతో వివరించాలి. మన ఉద్దేశ్యం వారికి సహాయం చేయడమే తప్ప, వాదనలో వారిని ఓడించడము కాదు. ఈ భాగములో ఉపయోగించిన పదాలలో సౌమ్యత, సాత్వీకము మరియు సహనం ఉన్నాయి.
► ఒక విద్యార్థి, సమూహం కొరకు తీతు 3:2-5 చదవాలి. సువార్తికుడి యొక్క ప్రవర్తన గురించి ఈ భాగం ఏమి చెబుతుంది?
దేవుని కృప లేకుండా మనం లోక ప్రజలలాగే ఉంటామని గుర్తుంచుకోవాలి. దేవుడు మన దగ్గరకు వచ్చాడు తీర్పుతో కాదు, కృప మరియు ప్రేమతో వచ్చాడు.
ఒక సువార్తికుడు పాపిపై కోపంగా అనిపించకూడదు, కానీ పాపం మరియు సాతానుపై కోపించాలి. అతడు పాపిపై కఠినంగా ఉండరాదు. అతడు వారి లోపాలను కనుగొన్నందుకు సంతోషంగా అనిపించకూడదు, కానీ వారి రక్షణకు సంబంధించినదిగా ఉండాలి.
దేవుడు వాగ్దానం చేయని విషయాలను వాగ్దానం చేయడం ద్వారా పాపికి ప్రేమ చూపించవద్దని మనము అధ్యయనము చేసాము. వారి నిత్య విధి కంటే వారి జీవిత సమస్యలు చాలా ముఖ్యమైనవిగా వ్యవహరించడం ద్వారా మనం కరుణ చూపించము.
మెస్సీయ హింసాత్మకమైన వ్యక్తి కాదని, సౌమ్యంగా ఉంటాడని, అప్పటికే పాపంతో గాయపడిన వ్యక్తిని చితకబాదలేడు అనే అంచనాను యేసు నెరవేర్చాడు (మత్తయి 12:19-20).
► మనం సువార్త ప్రకటించినప్పుడు దేవుని ప్రేమను ప్రదర్శించే కొన్ని మార్గాలు ఏమిటి?
లేఖన ప్రకారమైన సువార్తీకరణ
సువార్త ప్రకటించడానికి బైబిల్ విధానం ఏమిటంటే, సువార్తను స్వీకరించడానికి ప్రజలను సిద్ధం చేయడానికి దేవుని ధర్మశాస్త్రాన్ని ఉపయోగించడం జరిగింది. ధర్మశాస్త్రము పాపులను దోషులుగా నిర్ధారిస్తుంది మరియు వారు క్షమించబడకపోతే వారు తీర్పు తీర్చబడతారని చూపిస్తుంది.
ప్రభువు రాక కొరకు సిద్ధం కావడానికి మరియు తీర్పు నుండి తప్పించుకోవడానికి ప్రజలు పశ్చాత్తాపపడాలని బాప్తీస్మమిచ్చు యోహాను బోధించాడు (మత్తయి 3:1-12).
యేసు తీర్పు మరియు నరకం గురించి చాలాసార్లు బోధించాడు. వారి పాపాలను ఒప్పుకోను వారికి ఆయన కృప చూపించాడు.
► ఒక విద్యార్థి, సమూహం కొరకు లూకా 7:36-50 చదవాలి. దేవుడు ఏ రకమైన వ్యక్తికి క్షమాపణ ఇస్తాడు?
వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడనీ వారికి పాప క్షమాపణ కలుగదని యేసు తన పరిచర్య అంతట చెప్పాడు.. అతడు తీర్పు గురించి ప్రజలను హెచ్చరించాడు. చాలా మంది ప్రజలు గోపురము కూలి చంపబడిన ఒక విపత్తు తరువాత, వారు పశ్చాత్తాపపడకపోతే వారంతా అలాగే నశిస్తారని యేసు జనసమూహానికి చెప్పాడు (లూకా 13:1-5).
సుంకరి మరియు పరిసయ్యుడు చేసిన వ్యతిరేక ప్రార్థనను ప్రభువు ప్రస్తావించాడు.. పన్ను వసూలు చేసిన వ్యక్తి, సుంకరి పాపము విషయమై పశ్చాతాపపడి క్షమాపణ అందుకున్నాడు. పరిసయ్యుడు తననుతాను సమర్థించుకోవడానికి ప్రయత్నించాడు. పరిసయ్యుడు తనకు క్షమాపణ అవసరమని నమ్మకపోవడంతో క్షమాపణ పొందలేకపోయాడు.
అపొస్తలుడైన పేతురు నిత్యజీవపు వాగ్దానాన్ని బోధించాడు మరియు పశ్చాత్తాపపడి క్షమాపణ పొందమని ప్రజలను పిలిచాడు (అపొస్తలుల కార్యములు 2:38, 3:19, 5:31).
స్తెఫెను , యూదా నాయకులకు బోధిస్తూ, కృపను గూర్చి కాదు గాని, వారు దేవుని ప్రతిఘటిస్తున్నారు మరియు ధర్మశాస్త్రమును మీరుచున్నారని బోధించాడు (అపొస్తలుల కార్యములు 7:51-53).
దేవుడు పాపాన్ని క్షమించడు కాబట్టి ప్రజలు పశ్చాత్తాపపడాలని పౌలు బోధించాడు (అపొస్తలుల కార్యములు 17:30-31).
క్రైస్తవుడిగా ఉండడం వల్ల కలిగే ఆనందం మరియు ఆశీర్వాదం గురించి మాట్లాడటం తప్పు కాదు; కానీ బైబిల్లో సువార్తికుల యొక్క ప్రాధమిక పద్ధతి పాపం మరియు పశ్చాత్తాపం గురించి బోధించడం, తీర్పు నుండి రక్షణను అందించడం గురించి బోధించాలి.
► ఒక విద్యార్థి, సమూహం కొరకు 2 కొరింథీయులకు 5:11 చదవాలి. అపోస్తలుడు ప్రేరణను గురించి ఏమని చెప్పాడు?
► ఒక విద్యార్థి, సమూహం కొరకు అపొస్తలుల కార్యములు 24:25 చదవాలి. పౌలు ఫెలిక్స్ తో ఏమి మాట్లాడాడు? అది ఫెలిక్స్ ను ఎలా ప్రభావితము చేసింది?
బైబిల్ సువార్తీకరణ యొక్క ఉదాహరణ
రాజుని కలిసినప్పుడు కుమార్ సంఘానికి రమ్మని ఆహ్వాన పత్రమును ఇచ్చాడు.
రాజు: నాకు సంఘము అవసరం లేదు.
కుమార్: ప్రతి వ్యక్తి తన పాపాలకు తీర్పు తీర్చడానికి దేవుని ముందు నిలబడతాడని బైబిలు చెబుతోంది. దేవుడు మిమ్మల్ని ఇలాగే అంగీకరిస్తాడు అని మీరు అనుకుంటున్నారా?
రాజు: అవును, నేను అలా అనుకుంటున్నాను.
కుమార్: మీరు మంచి వ్యక్తినా?
రాజు: అవును, నేను మంచివ్యక్తినే.
కుమార్: చాలా మందితో పోలిస్తే మీరు మంచివారు కావచ్చు. బహుశా మీరు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు మంచివారు. కానీ , దేవుడు ఉపయోగించే ప్రమాణం మీకు తెలుసా? దేవుడు సరైన విధముగా తప్పును ఎలా తీర్పు తీర్చాడో బైబిల్ చెబుతుంది. ఉదాహరణకు, కొన్ని నియమాలను పది ఆజ్ఞలు అంటారు. మీకు పది ఆజ్ఞలు తెలుసా?
రాజు: వాటిలో కొన్నితెలుసు.
కుమార్: ఉదాహరణకు, “అబద్ద సాక్ష్యమివ్వవద్దు” అని ఒక ఆజ్ఞ చెబుతుంది. మీరు మీ జీవితంలో ఎప్పుడైనా సత్యం కాని విషయం చెప్పారా?
రాజు: వాస్తవానికి, ప్రతి ఒక్కరూ కొన్నిసార్లు అలా చేసారు.
కుమార్: అయితే అబద్ధం దేవుని ఆజ్ఞను ఉల్లంఘిస్తోంది. మరొకటి దొంగిలించకూడదు. మీరు ఎప్పుడైనా ఏదైనా దొంగిలించారా?
రాజు: చిన్న విషయాలు మాత్రమే, మరియు నేను వారి నుండి దొంగిలించడం ద్వారా ఎవరినీ బాధపెట్టలేదు.
కుమార్: కాని మనం ఏమి దొంగిలించవచ్చో నిర్ణయించుకోవడానికి దేవుడు మనలను వదిలిపెట్టడు. అతని ఆజ్ఞ ఏమిటంటే మనం దొంగిలించవద్దు. ఇంకొకటి ఏమిటంటే, మనం ఎప్పుడూ దేవుని పేరును వ్యర్థముగా ఉచ్చరించరాదు, భక్తి లేకుండా పేరు చెప్పడం లేదా శాప పదంగా ఉపయోగించడం వంటిదే.
ప్రతి ఆజ్ఞను ఉపయోగించవచ్చు, కానీ అన్నీ ఒకే సంభాషణలో ఉపయోగించాల్సిన అవసరం లేదు. క్రింద ఉదాహరణలు ఉన్నాయి.
వ్యభిచారం చేయవద్దని దేవుడు మనకు చెప్తాడు, మరియు యేసు స్త్రీ పట్ల కామపు చూపు చూడడము అంటే మీ హృదయంలో వ్యభిచారం చేయడమే అని చెప్పాడు.
చంపవద్దని దేవుడు చెప్పాడు, యేసు ఒకరిని ద్వేషించడం హృదయంలో హత్యకు సమానం అని చెప్పాడు.
దేవుడు తన విశ్రాంతి దినమును పవిత్రంగా ఉంచమని చెబుతాడు. ప్రతి వారం మీరు ఎల్లప్పుడూ ప్రభువు విశ్రాంతి దినమును పవిత్రంగా ఆచరిస్తున్నారా?
దేవుడు మనకు ఇతరమైన వాటిని ఆశించ వద్దు అన్నాడు, దేవునికి బదులుగా ఏ విషయాలు మనల్ని సంతోషపరుస్తాయని అనుకొంటున్నాము అదే ఆశించుట, ఇతరులు కలిగి ఉన్నదాన్ని మనకు కలిగి ఉండాలని కోరుకుంటాడు అదే ఆశించుట..
దేవుని కంటే ఏదైనా మనకు ముఖ్యం కారాదు, దేవుడు తప్ప ఏ ఇతర దేవులు ఉండరాదు అని దేవుడు తెలియ జెప్పుచున్నాడు. మరియు దేవుని చెందవలసిన ఆరాధన మరియు విధేయత దేవునికే చెందాలి అని చెప్పుచున్నాడు.
[పాపి దోషి అని చూపించడానికి అనేక ఆజ్ఞలను ఉపయోగించిన తరువాత, మనము పాపులము అని నిర్ధారణకు వచ్చాము.]
కుమార్: ఈ రోజు దేవుడు మిమ్మల్ని తీర్పు తీర్చినట్లయితే, మీరు దేవుని ఎదుట మంచివాడని నిరూపించుకోనలేరు. దేవుని కోణములో మీరు దోషిగానే ఉంటారు. మీరు దేవుని తీర్పుకు భయపడనవసరం లేకుండా క్షమించబడాలని తెలుసుకోవాలనుకుంటున్నారా?
[అప్పుడు, సువార్తికుడు సువార్తను పంచుకోవచ్చు మరియు పాపిని పశ్చాతాప ప్రార్థనకు ఆహ్వానించవచ్చు.]
► ఇద్దరు విద్యార్థులు ఈ సంభాషణను ప్రదర్శించాలి, ఇందులో పది ఆజ్ఞలను ఉపయోగించి ఒకరు సువార్తను ప్రదర్శిస్తారు. సమూహం వారి ప్రకటన గురించి చర్చించవచ్చు. అప్పుడు విద్యార్థులు జంటలుగా విభజించి ఈ ప్రకటనను అభ్యసించాలి.
► సువార్త ప్రకటన విజయవంతమైందో, లేదో మీకు ఎలా తెలుసు?
ఒక వ్యక్తి పశ్చాత్తాపం చెందాలని మరియు మన సువార్త ప్రకటన తర్వాత రక్షింపబడాలని ముందుకు వస్తే ఎంచుకుంటే, అది విజయవంతమైందని మనకు తెలుసు. కానీ, అది విజయానికి కొలత మాత్రమే కాదు. వినేవారి హృదయంపై సత్యాన్ని కట్టుకోవలసిన బాధ్యత దేవుడే. మీరు వినేవారికి అర్థమయ్యే విధంగా సువార్తను ప్రకటించినట్లయితే, మీరు ఫలితాలను ఎప్పుడూ చూడకపోయినా మీరు ముఖ్యమైనదాన్ని అనగా చేయవలసిన కార్యమును చేస్తారు. ఒకవేళ అతనికి మీరు చెప్పేది అర్థమై మరియు అతనికి సహాయపడాలి అని అతనికి అనిపిస్తే మంచిది. ఒకవేళ అతడు కోపంగా లేదా అపహాస్యం చేసినట్లయితే, మీరు విఫలమయ్యారని కాదు, ప్రత్యేకించి అతడు సత్యం మీద కోపంగా ఉంటే. సువార్త సందేశం ద్వారా దేవుడు గౌరవించబడ్డాడు; మీరు దాన్ని ప్రకటన చేసినప్పుడు, మీరు ముఖ్యమైన వాటిలో విజయవంతమయ్యారు అని అర్థము.
తరగతి నాయకుడికి గమనిక
సువార్తను ప్రదర్శించడానికి ఇది సమర్థవంతమైన పద్ధతి. విద్యార్థులు దీనిని ఉపయోగించడం నేర్చుకోవడం ముఖ్యం. మీ తదుపరి తరగతి సెషన్లో, వారు ఈ పద్ధతిలో సువార్తను పంచుకోవడానికి ప్రయత్నించి నప్పుడు వారి అనుభవాల గురించి చెప్పడానికి వారికి సమయం ఇవ్వండి. వారు ఒకరినొకరు ప్రోత్సహించి, సలహా ఇవ్వనివ్వండి. సెషన్‌ను ఈ విధంగా గడపడం మరియు తదుపరి పాఠానికి వెళ్ళడానికి తదుపరి సమయం వరకు వేచి ఉండటం విలువైనదే కావచ్చు.
పాఠం 8 అసైన్మెంట్లు
ఈ పాఠంలో కుమార్ చేసిన విధంగా కనీసం ముగ్గురు వ్యక్తులకు సువార్తను అందించండి. ప్రతి సంభాషణను వివరించే పేరా వ్రాయండి. తదుపరి తరగతి సెషన్లో దాని గురించి చెప్పడానికి సిద్ధంగా ఉండండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.