బైబిల్ సంబంధమైన సువార్త మరియు శిష్యత్వము
బైబిల్ సంబంధమైన సువార్త మరియు శిష్యత్వము
Audio Course Purchase

Search Course

Type at least 3 characters to search

Search through all lessons and sections in this course

Searching...

No results found

No matches for ""

Try different keywords or check your spelling

results found

Lesson 16: నిజమైన శిష్యులు

1 min read

by Stephen Gibson


యేసును అనుసరించుట

► యేసు శిష్యుడిగా ఉండడం అంటే ఏమిటి?

కొంతమంది క్రైస్తవున్నిఒక మంచి వ్యక్తి అని అనుకుంటారు. మరికొందరు క్రైస్తవుడిగా ఉండడం అంటే కొన్ని విషయాలను నమ్మినవాడు అని అనుకుంటారు. ఈ వ్యక్తులలో చాలామందికి, వారి నమ్మకాలు వారి జీవితంలో పెద్దగా మార్పు తీసికొనిరావు.

మరికొందరు సత్యానికి దగ్గరగా ఉంటారు. ఒక వ్యక్తి క్రైస్తవుడైనప్పుడు, మారుమనస్సు పొందిన సమయం ఉండాలి అని వారికి తెలుసు. ఒక వ్యక్తి క్షమించబడ్డాడని నమ్మిన క్షణంలో ఇది జరిగిందని వారు నమ్ముతారు. మారుమనస్సు పొందిన తరువాత వారు ఏమి చేసినా నిజమైన మారుమనస్సు పొందిన వ్యక్తికి పరలోకం యొక్క నిశ్చయత ఉందని చాలామంది నమ్ముతారు.

మారుమనస్సు వాస్తమైనదిగా ఉండాలి అనేది సత్యం. విశ్వాసానికి ప్రతిస్పందనగా క్షమాపణ కృప ద్వారా ఇవ్వబడుతుంది అనేది సత్యం. ఒక క్రైస్తవుడు దేవునికి విధేయతతో జీవిస్తున్నాడన్నది సత్యం. కానీ, అతడు యేసు శిష్యుడు అని దాని అర్ధం కాదు.

విశ్వాసం ఉంచిన క్షణములో క్రైస్తవుడుగా మారుట మాత్రమే ప్రమాణంగా ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో మనం చూడవచ్చు - ఇది యాంటినోమియ ఇజానికి దారితీస్తుంది, అంటే దేవుని ఆజ్ఞలు ఒక క్రైస్తవునిపై కట్టుబడి చేయవు అని దాని అర్థము. ఉచితమైన కృపకు బదులుగా, అది పాపాన్ని సమర్థించే ఊహాత్మక కృపగా మారుతుంది, ఇది చాలా ప్రమాదము.

ఊహాత్మక కృపను ప్రకటన చేసే సంఘములలో, సంఘానికి హాజరయ్యే సభ్యులు చాలా మంది ఉంటారు కాని వారు బహిరంగ పాపంతో జీవిస్తారు. వారి కాపరి మరియు ఇతర నాయకులు సమాజం కంటే మెరుగ్గా జీవిస్తారు, కానీ వారిలో కూడా పాపపు అలవాట్లు ఉండవచ్చు. మనము కృప ద్వారా రక్షింపబడినందున దేవునికి పూర్తి విధేయతతో జీవించాల్సిన అవసరం లేదని వారు అంటున్నారు. వారు యేసు చర్చకు ఇచ్చిన ఆజ్ఞను కోల్పోయారు, అది క్రీస్తు ఆజ్ఞలలో ప్రజలను విధేయతకు తీసుకురావడం. సంఘము యొక్క ప్రత్యేక పని ఏమిటంటే పాపులను దేవుని పరిశుద్ధ ఆరాధకులుగా మార్చడం, మరియు సంఘము ఉనికిలో ఉండటానికి ఇంతకంటే మంచి కారణం మరొకటి లేదు.

దేవునికి విధేయత చూపించాల్సిన అవసరాన్ని కొనసాగించే సంఘములలో కొంతమంది వ్యక్తులు అవిధేయత లోపంలో ఉన్నారు. వారు తమ జీవితాన్ని సరైనదని నమ్ముచునే, తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకొన్నారు, కాని వారికి క్రీస్తులాంటి ఆత్మ లేదు. వారు కఠినమైన మరియు క్షమించరానివారుగా జీవిస్తున్నారు. వారు వినయపూర్వకమైన మరియు కృపగల క్షమాపణ ఇతరుల యెడల చూపలేరు. వారు త్వరగా ఇతరులను తీర్పు తీర్చువారుగా ఉందురు. వారికి కొద్దిమందిపై మాత్రమే నమ్మకం ఉంటుంది. వారు తమ సొంత నీతిని ఎప్పుడూ పరీక్షించుకోరు. వారి యొద్ద ప్రతి సమస్య కొరకు ఒకే సమాధానం ఉంటుంది, మరియు వాటిని విభేదిస్తున్నవారిని వారు గౌరవించరు. తప్పిపోయినవారిని తిరిగి తెచ్చేందుకు వారికి ఎటువంటి ఉత్సాహం ఉండదు, కానీ వారి అభిప్రాయాలను సమర్థించుకోవటానికి గొప్ప ఉత్సాహం ఉంటుంది. వారు తమలో తాము సంతృప్తి చెందుదురు, మరియు వారు తమను మార్చుకోడానికి ప్రణాళిక చేయరు.

ఈ వ్యక్తులు నిజంగా యేసును తెలుసుకున్నారా మరియు ఆయనలాగా వుండాలనుకుంటున్నారా?

క్రైస్తవుడిగా ఉండడం అంటే యేసు శిష్యుడిగా ఉండడం.

[1]శిష్యుడిగా ఉండడం అంటే ఏమిటి? క్రీస్తుకు విధేయత చూపించాలా? ఖచ్చితంగా విధేయత చూపించాలి అని అర్థం మాత్రమే కాదు. ఆయన ఇచ్చిన గొప్ప ఆజ్ఞ, సర్వలోకానికి వెళ్ళి, సువార్త ప్రకటించి, వారిని శిష్యులనుగా చేసి కీస్తు బోధకు లోబడులాగున వారికి బోధించుడి " అన్నారు యేసు ఆజ్ఞలను పాటించడం మాత్రమే శిష్యుడిగా ఉండటము అని కాదు.

యూదుల రబ్బీల శిష్యులు వారితో జీవితాన్ని పంచుకొంటారు, వారి బోధ మాత్రమే కాదు, వారి జీవనశైలిని నేర్చుకున్నారు. వారు వారి వైఖరులు మరియు ప్రాధాన్యతలను కూడా నేర్చుకున్నారు.

యేసు శిష్యులు అని చేసినప్పుడు "వచ్చి నన్ను వెంబడించండి, " అని చెప్పినడానికి సరియైన అర్థం. అతడు ఇప్పటికీ శిష్యులను సువార్త ద్వారా పిలుస్తున్నాడు.

ఒకరు శిష్యుడు ఎలా అవుతారు?

మొదట, మీరు ఆయనను నమ్మాలి - మీరు అతనిని నమ్మకపోతే తప్ప ఆయనను అనుసరించడానికి సాధ్యము కాదు.

మీరు వెళ్లే పద్ధతిను మార్చుకోవాలి. యేసు అనుచరుడిగా ఎవరూ ప్రారంభించరు - మన స్వంత మార్గంలో వెళ్ళడం ప్రారంభిస్తాము. మీ స్వంత మార్గానికి బదులుగా యేసును అనుసరించాలని మీరు నిర్ణయించుకోవాలి. అంటే మీ స్వంత మార్గంలో ఏదో లోపం ఉందని మీరు గమనిస్తునారు. శిష్యత్వం పశ్చాత్తాపంతో మొదలవుతుంది - మీ పాపాలు క్షమించకుండా మీరు ఆయనను అనుసరించలేరు. మీ పాపాలను విడిచిపెట్టడానికి మీరు ఇష్టపడకపోతే, మీరు ఇప్పటికీ మీ స్వంత మార్గంలోనే ఉన్నారు.

ఆయన క్షమాపణ మరియు ఆయనతో మీకున్న సంబంధము మీ అనుభవము కావాలి. మీరు ఆయనను ఎక్కువగా తెలుసుకోవాలి ఆయన వలే మారాలి.

► ఒక విద్యార్థి, సమూహం కొరకు మత్తయి 16:21-25 చదవాలి.

ఆయన శిష్యులతో ఈ సంభాషణలో, యేసు తన మరణాన్ని గురించి వివరించాడు. యేసు మాటలకు పేతురు దిగ్బ్రాంతి చెందాడు. బాధలను, మరణాన్ని యేసుకు తగినట్లుగా పేతురు చూడలేదు. పేతురు యేసుతో వాదించడానికి ప్రయత్నించాడు. మరణమును తిరస్కరించుటకు యేసును ప్రోత్సహించాడు.

యేసు పేతురును మందలించాడు మరియు దేవుని విషయాలు తనకు అర్థం కాలేదని చెప్పాడు. యేసు తనకు శిష్యుడుగ ఉండాలనుకొన్నవాడు తనను తాను ఉపెక్షించుకొని తన సిలువ నెత్తుకొని తనను అనుసరించాలని చెప్పాడు. దీని అర్థం మరణాన్ని స్వయంగా అంగీకరించడం. ఈ మందలింపు సహజమైన మానవ ధోరణులకు స్వీయ-సంతృప్తి, స్వీయ-అతిశయం మరియు స్వీయ-రక్షణకు వ్యతిరేకంగా ఉంటుంది - నిజమైన శిష్యత్వానికి ప్రతిఘటించే విషయాలు ఇవి.

► మానవ స్వభావం సహజంగా శిష్యత్వానికి ఎందుకు వ్యతిరేకతను కలిగి ఉంటుంది?

శిష్యులు బాధలను, మరణాన్ని తమకు తగినట్లుగా చూడలేదు. అతనిని అనుసరించడం అంటే ఏమిటో వారికి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. క్షమించబడటానికి మీకు ఏమీ ఖర్చకాదు, కాని క్రీస్తును అనుసరించడానికి మీకు ప్రతిదీ ఖర్చవుతుంది, తప్పక వెల చెల్లించాలి. అతనిని అనుసరించడం వల్ల హృదయ పరిశోధన, వినయం మరియు మార్పు తప్పక వస్తాయి.

► “ క్రీస్తును అనుసరించడానికి మీకు ప్రతిదీ ఖర్చవుతుంది" అనే సత్యమును వివరించండి.

దేవునితో నిత్యజీవము కొరకు ఒక రకమైన మరణాన్ని స్వీకరించడమే “సిలువను చేపట్టడం”. ఇది స్వీయ మరణం, మీ స్వంత సార్వభౌమత్వానికి మరణించడం. ఇది బాహ్య సమర్పణ మాత్రమే కాదు, కానీ అది గుండె లోతు గుండా వెళుతుంది, ఇది అంతరంగ సమర్పణ. ఇది ఒక వినయం, ఇది ఆయన రాజ్యములోనికి ప్రవేశించడానికి అవసరమైన వినయం.

ఆ మొదటి శిష్యుల మాదిరిగానే, ఈ రోజు కూడా చాలా మందికి శిష్యుడు అంటే ఏమిటో అర్థం కాలేదు. పశ్చాత్తాపపడని వారికి సంఘములు కృపను అందిస్తాయి. అది సరైన రహదారిపై మారుమనస్సును ప్రారంభించదు లేదా రాబోయే వాటిని ఎదుర్కొనుటకు అది సిద్ధం చేయదు. ఇది నిజమైన క్రైస్తవ జీవితానికి చాలా భిన్నంగా ఉంటుంది, ఇది సరియైన రహదారి కాదు.

డైట్రిచ్ బోన్‌హోఫర్ ఒక జర్మన్ కాపరి, అతన్ని అడాల్ఫ్ హిట్లర్ సమయములో ఉరితీశారు. ఈ పంక్తులను తన “ది కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్” “శిష్యత్వపు వెల” అనే పుస్తకంలో రాశారు.

పొలములో దాచబడిన సంపద ఖరీదైన కృప; దాని కొరకు ఒక మానవుడు సంతోషంగా వెళ్లి తన వద్ద ఉన్నవన్నీ అమ్ముతాడు. వ్యాపారి తన వస్తువులన్నింటినీ అమ్మే ఖరీదైన ముత్యమును కొనుగోలు చేస్తాడు. ఇది క్రీస్తు రాజ్య పాలన, తనను ఆటంకపరిచే వాటి నిమిత్తమై ఆటంకముగా ఉన్న కంటిని తీసివేస్తాడు; ఇది యేసుక్రీస్తు పిలుపు, శిష్యుడు తన వలలను విడిచిపెట్టి అతనిని అనుసరిస్తాడు. అలాంటి కృప ఖరీదైనది ఎందుకంటే అది మనలను అనుసరించమని పిలుస్తుంది.

అతనిని అనుసరించడం అతనిలాగా మారడం. ఆయన స్వయంగా పూర్తిగా ఆయనకు అప్పగించి, స్వయానికి మరణించడం. ఇది కొన్ని చెడు పనులు చేయడం మానేయడం మాత్రమే కాదు, యేసును చేర్చుకోనందు వలన వాటిని విడిచిపెట్టడం. యేసు తన పవిత్రత, కరుణ, దయ మరియు క్షమాపణలో ఏమి చేయాలో మనము ప్రయత్నిస్తాము.

మన హృదయం వ్యతిరేకించేటప్పుడు మనం సరైనది చేయము. మన హృదయాలు ఆయన లాగా ఉండాలని మనము కోరుకుంటున్నాము. అతడు ఎవరినీ ద్వేషించలేదు. ఆయనను శత్రువులు అని ఎంచుకున్న వ్యక్తులు ఉన్నారు, కాని అతడు ఎవరికి శత్రువు కాదు. సిలువపై కూడా ఆయన క్షమించినవాడు.

అతని నిజమైన అనుచరులు ద్వేషపూరితమైన వారు కాదు. వారు తమకు చెడు చేసేవారికి మంచి చేస్తారు. వారు వారిని ఆశీర్వదిస్తారు మరియు ఎప్పుడూ శపించరు. వారు క్షమించడాన్ని పరిమితం చేయరు, అపరిమితముగా క్షమిస్తారు. వారు తమ వ్యక్తిగత హక్కులను వదులుకున్నారు మరియు బదులుగా సేవ చేస్తారు.

ఈ సొంతానికి లొంగిపోకుండా జీవించడానికి స్థలం లేదు. తన ఆత్మను కాపాడుకోవడానికి ప్రయత్నించేవాడు దాన్ని కోల్పోతాడు – దానిని త్యాగము చేసేవాడు దాన్ని రక్షించుకొంటాడు.

► శిష్యత్వానికి వారిని సిద్ధం చేసే విధంగా ప్రజలను రక్షణలోనికి ఎలా పిలుస్తాము?


[1]

ఇంతకు ముందు ప్రపంచాన్ని పాలించిన విగ్రహం మన ప్రపంచం మధ్యలో నుండి తొలగించి, సింహాసనాన్ని ఆక్రమించాలని యేసుక్రీస్తు పట్టుబడుతున్నాడు. ఇది విధేయత యొక్క సమూలమైన మార్పు, ఇది మార్పు లేదా కనీసం దాని యొక్క ప్రారంభం. క్రీస్తు తన సరైన స్థానాన్ని, సింహాసనమును పొందిన తర్వాత, మిగతావన్నీ మారడం ప్రారంభిస్తాయి

(ప్రపంచ సువార్త కోసం లాసాన్ కమిటీ, ది విల్లోబ్యాంక్ నివేదిక).