క్రైస్తవ కుటుంబం
క్రైస్తవ కుటుంబం
Audio Course Purchase

Search Course

Type at least 3 characters to search

Search through all lessons and sections in this course

Searching...

No results found

No matches for ""

Try different keywords or check your spelling

results found

క్రైస్తవ కుటుంబం

Lead Writer: Stephen Gibson

Course Description

ఈ కోర్సు జీవితములోని పలు స్తాయిల ద్వారా మానవ అభివృద్ధికి క్రైస్తవ దృష్టికోణమును అందించి, కుటుంబ భూమికలు మరియు సంబంధములకు ఆత్మీయ నియమములను అనువర్తిస్తుంది. 

Introduction

కోర్సు వర్ణన

ఈ కోర్సు, జీవితంలో విభిన్న దశలకు, కుటుంబ సంబంధాలకు, ముఖ్యంగా వైవాహిక జీవితానికి పిల్లల్ని పెంచడానికి అవసరమైన దేవుని సూత్రాల్ని బోధిస్తుంది. ఈ అధ్యయనం ద్వారా, విద్యార్థులు తమ ప్రస్తుత జీవన దశలోను, వాళ్ల సంబంధాల్లోను దేవుణ్ణి గౌరవించడం నేర్చుకుంటారు. వారు ఇతరులకు బైబిలు సూత్రాలను, వాటి అన్వయాల్ని బోధించడానికి సిద్ధపడతారు. విద్యార్థులు తమ స్థానిక సంఘాలతో కలిసి తమ సమాజంలోను, కుటుంబాలలో దైవభక్తి కోసం ప్రభావం చూపడానికి ప్రోత్సహించబడతారు.

విద్యార్థులు, ఇతర విషయాలతో పాటు, పిల్లలు, కౌమారదశలో ఉన్నవారికి కుటుంబ శిష్యత్వ తర్ఫీదును ఎలా చేయాలో (family discipleship) గురించి నేర్చుకుంటారు. 12వ పాఠం 3వ అభ్యాసంలో, ఈ కోర్సు చేస్తున్న తల్లిదండ్రులు, వారి కుటుంబంలో అనుదిన వాక్యధ్యాన సమయాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి సూచనలు ఉన్నాయి.  కుటుంబ బోధనా సాధనాలు , అనే కుటుంబ శిష్యత్వాన్ని గురించిన పుస్తకాన్నిShepherds Global Classroom రూపొందించింది. దీనిని తల్లిదండ్రులు వారి కుటుంబ ఆరాధనలో వాడుకోవచ్చు. shepherdsglobal.org. నుండి ఈ పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

తరగతి నాయకులకు సూచనలు

చర్చా ప్రశ్నలు, క్లాసులో చేయాల్సిన కార్యకలాపాలను ► గుర్తుతో సూచించడం జరిగింది. చర్చా ప్రశ్నల కోసం, తరగతి నాయకుడు ప్రశ్న అడిగి, విద్యార్థులు చర్చించుకోవడానికి తగినంత సమయం ఇవ్వాలి. ఒకే విద్యార్థి పదే పదే జవాబు చెబుతుంటే, లేక కొందరు విద్యార్థులు అస్సలు మాట్లాడకుండా ఉంటే, నాయకుడు ఒక విద్యార్థిని ప్రత్యేకంగా ప్రశ్నించవచ్చు: “అభయ్, ఈ ప్రశ్నకు నువ్వెలా సమాధానం చెబుతావు?”

ప్రతి పాఠం చివర చర్చ కోసం కొన్ని ఐచ్ఛిక ప్రశ్నలు ఉన్నాయి. గ్రూపులో ఏ ప్రశ్నలు చర్చించాలో తరగతి నాయకుడు ఎన్నుకోవచ్చు.

కోర్సులో చాలా బైబిలు వచనాలను ఉపయోగించడం జరిగింది. తరగతిలో బిగ్గరగా చదవాల్సిన వాక్యభాగాలు బాణం గుర్తుతో ఉన్నాయి. ఒక విద్యార్థి వాక్యభాగాన్ని బిగ్గరగా చదువుతుండగా, మిగిలిన వాళ్ళంతా దాన్ని చూడాలి. కొన్నిసార్లు, లేఖన భాగాలు అదనపు వివరణతో ఉంటాయి. ఉదాహరణకు: (ఎఫెసీయులకు 6:1). అవి వాక్యభాగానికి సహాయకరంగా ఇచ్చాం. ప్రతిసారీ అదనపు వివరణతో ఇచ్చిన వాక్యభాగాల్ని చదవాల్సిన అవసరం లేదు.

ఈ కోర్సు ముగింపులో, రెండు ప్రత్యేక విషయాల్ని ఉద్దేశించి చిన్న చర్చలు ఉన్నాయి. ఈ విషయాలు ఏ ఇతర పాఠానికి సంబంధించినవి కాదు, అలాగని పూర్తి పాఠాలు కూడా కాదు. అయినప్పటికీ, వాటిని క్రైస్తవ దృక్కోణంలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. 3వ పాఠం తర్వాత, తరగతి అంతా అనుబంధం A ను, మరియు 10వ పాఠం తర్వాత, అనుబంధం B ను అధ్యయనం చేసి చర్చించాలి. ఈ విషయాన్ని గుర్తు చేసే సూచనలు ఆ రెండు పాఠాల చివర్లో ఉన్నాయి.

ప్రతి పాఠం, అభ్యాసంతో ముగుస్తుంది. తరువాత పాఠంలోకి వెళ్లే ముందు, అభ్యాసాన్ని పూర్తి చేసి, అప్పగించాలి. ఒకవేళ ఎవరైనా అభ్యాసం పూర్తి చేయకపోతే, తర్వాత చేయొచ్చు. అయితే, విద్యార్థులు తరగతిలోనే ఎక్కువగా నేర్చుకునేలాగా నాయకుడు సమయపాలనను ప్రోత్సహించాలి. ప్రతి పాఠంలో ఇచ్చిన అభ్యాసాలను పూర్తి చేయడంతో పాటుగా, తరువాత నేర్చుకోబోయే పాఠాన్ని ముందుగానే చదివి సిద్ధంగా ఉండాలి.

విద్యార్థి Shepherds Global Classroom నుండి సర్టిఫికేట్ పొందదలచుకుంటే, వారు క్లాస్ సెషన్లు హాజరై అభ్యాసాలను పూర్తి చెయ్యాలి. పూర్తైన అభ్యాసాలను నమోదు చేయడానికి కోర్సు చివర్లో ఒక ఫారం ఉంటుంది.

Ready to Start Learning?

Select a lesson from the sidebar to begin your journey through this course.