కుటుంబ బోధనా సాధనాలు
కుటుంబ బోధనా సాధనాలు
Audio Course Purchase

Search Course

Type at least 3 characters to search

Search through all lessons and sections in this course

Searching...

No results found

No matches for ""

Try different keywords or check your spelling

results found

కుటుంబ బోధనా సాధనాలు

Lead Writer: Shepherds Global Classroom

Course Description

Shepherds Global Classroom కుటుంబ శిష్యత్వ పుస్తకమును, కుటుంబ బోధనా సాధనాలు, తయారు చేసింది. తల్లిదండ్రులు ఈ పుస్తకాన్ని తమ కుటుంబ ప్రార్థన సమయంలో ఉపయోగించవచ్చు.

Introduction

తల్లిదండ్రులకు: 1 & 2 సాధనాలు

ప్రశ్నోత్తరాల ద్వారా బోధించడం

కుటుంబ బోధనా సాధనాలు పుస్తకానికి సంబంధించిన ఈ పరిచయం, అనుబంధంలో లేదా అదనపు ఫైళ్ళలో, సగం పేజీ పరిమాణంలో చూడటానికి లేదా ముద్రించుకోవడానికి అందుబాటులో ఉంది.

ప్రశ్నలు అడగడం, క్లుప్తంగా సులభంగా జవాబులు ఇవ్వడం, శతాబ్దాలుగా వాడుతున్న ప్రభావవంతమైన బోధనా విధానం.

ఈ పుస్తకంలోని ప్రశ్నలు జవాబులు, ప్రాథమిక క్రైస్తవ నమ్మకాల్ని పరిచయం చేస్తాయి.

సాధనం 1 చిన్న పిల్లలకు బోధించడానికి ఉపయోగపడుతుంది. ఇది వారు పెరిగే కొద్దీ మరింత శిక్షణ కోసం ఒక బలమైన పునాదిని అందిస్తుంది.

సాధనం 2 పిల్లలకు, అలాగే క్రొత్తగా విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళకి బోధించడానికి ఉపయోగపడుతుంది. ఇచ్చిన సమాధానాలు, మరింత చర్చకు, నేర్చుకోవడానికి అవకాశాలను కల్పించే సంక్షిప్త వివరణలు. ఈ బోధన ఒక ఇంటి బయటి ఆకారం లాంటిది: ఇది దానికదే సంపూర్ణం కాదు, కానీ క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన వివరాలను నిర్మించడానికి ఒక ప్రాథమిక నిర్మాణాన్ని అందిస్తుంది.

ఒక కుటుంబంగా సాధనాలను ఎలా ఉపయోగించాలి

ఈ వనరుల్లో ఏదైనా సరిగా ఉపయోగించాలంటే, ప్రతి ప్రశ్నకు ఇవ్వబడిన జవాబును ఉన్నది ఉన్నట్లుగా కంఠస్తం చెయ్యాలి. జవాబుల్ని సంగ్రహించకూడదు లేక వివరించకూడదు. బదులుగా, ఉన్నది ఉన్నట్లుగా అవే పదాలు కంఠస్తం చెయ్యాలి. అవే పదాలు కంఠస్తం చేయడంవల్ల ఎక్కువ కాలం గుర్తుంటాయి. అలాగే, విద్యార్థులు కచ్చితత్వంతో ఉండటం కూడా నేర్చుకుంటారు.

ప్రతిరోజు 10 నిముషాలు కేటాయించి, ఈ పుస్తకంలోని ప్రశ్నలు జవాబులు సమీక్షించాలి. అందరూ కలిసి ఉండే భోజన సమయం అధ్యయనానికి ఉత్తమమైన సమయమని కొన్ని కుటుంబాల భావన.

కేవలం బోధనా సమయాన్ని నడిపించే నాయకుడి చేతిలో మాత్రమే ఈ పుస్తకం ఉంటుంది. నాయకుడు, మొదట ప్రశ్న చదివి, అందరూ వింటుండగా జవాబు చదువుతాడు. ఆ తర్వాత అందరూ కలిసి చెప్పాలి.

ప్రశ్న, జవాబులను మళ్ళీ చదువుతుండగా, చిన్న పిల్లలు అతని వెంబడి చెప్పాలి. అతడు ప్రశ్నను అలా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండాలి. క్రమంగా (కొన్ని రోజుల్లో) జవాబు చెప్పడం ఆపెయ్యాలి, పిలల్లు ఆ పదాలు కంఠస్తం చేస్తూ ఎలాంటి సహాయం లేకుండా చెప్పగలుగుతారు. నాయకుడు అడుగుతాడు, పిల్లలు జవాబిస్తారు-ఇదే ప్రశ్న-జవాబు పాఠం యొక్క ఉద్దేశ్యం.

సాధనం 2 కొరకు అదనపు సూచనలు

మునుపటి జవాబును అందరూ కంఠస్తం చేసిన వెంటనే మరో క్రొత్త ప్రశ్న చదవాలి.

జాబితాలో ముందుకు వెళ్తూ, మరలా మరలా సమీక్షించండి. మునుపటి ప్రశ్నోత్తరిలోని చాలా పదాలు కంఠస్థం చేసిన తర్వాత, నెమ్మదిగా కొత్త ప్రశ్నలను జోడించండి.

ఒక్కసారి ప్రశ్నల భాగమంతటిని కలిసి చెప్పగలిగినప్పుడు, జవాబులు ఎక్కువ కాలం గుర్తుండేలాగా వారానికి ఒకసారి భాగమంతటినీ మళ్ళీ పునరావృతం చెయ్యాలి.

కొత్త అంశాలను నెమ్మదిగా జోడించడం మరియు వాటిని పదేపదే పునరావృతం చేయడం - ఈ రెండు పద్ధతులు ఆసక్తి ఉన్న ఉపాధ్యాయుడు, స్నేహితుడు లేదా తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో కాస్త సమయం కేటాయించే విద్యార్థులలో అద్భుతమైన ఫలితాలను చూపిస్తాయి. అభ్యాసాన్ని సరదాగా చేయండి మరియు విద్యార్థి విజయాన్ని వేడుకలా జరుపుకోండి.

ప్రశ్నోత్తరాలను అనుదిన కుటుంబ ఆరాధనలో భాగంగా చేసుకోవచ్చు. పిల్లల మధ్య పోటీగా, వాటిని చిన్నపిల్లల సంఘ కార్యక్రమాల్లో వాడొచ్చు. పిల్లలకు అర్థమయ్యేలా మరిన్ని వివరణలు, ఉదాహరణలు మీరు ఉపయోగించవచ్చు.

ఒక కుటుంబ ఆరాధన ప్రణాళిక

అనేక రకాలైన కుటుంబ ఆరాధనలు ఉన్నాయి. బహుశా ఈ సాధనాలు ఉపయోగించగల ఒక కుటుంబ ఆరాధన క్రమం ఇది:

1.     ఒక పాట పాడాలి.

2.     అపొస్తలుల విశ్వాస ప్రమాణం చదవాలి.

3.     ప్రశ్నోత్తరాలలో ఒక భాగం కంఠస్తం చేసేలా చూడాలి.

4.     బైబిల్లో ఒక అధ్యాయం లేక ఒక భాగం చదవాలి (మత్తయి, మార్కు, లూకా, మరియు యోహాను సువార్తలతో మొదలుపెట్టాలి.)

5.     కలిసి ప్రార్థించాలి. ప్రార్థించే ముందు, ఏ విషయం గురించి ప్రార్థించాలో కుటుంబ సభ్యుల్ని అడగాలి. (“మీ కోసం యేమని ప్రార్థించాలి?” మరియు “ఇతరుల కోసం యేమని ప్రార్థించాలి” అని అడగొచ్చు)

6.     పరలోక ప్రార్థనతో ముగించాలి.

అపొస్తలుల విశ్వాస ప్రమాణం

పరలోక భూలోకముల సృష్టికర్తయగు తండ్రియైన దేవుని
నేను నమ్ముచున్నాను;

ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభువైన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను.
పొంతు పిలాతు కాలమందు బాధపడి,
సిలువవేయబడి, చనిపోయి, పాతిపెట్టబడి
అదృశ్యలోకములోనికి దిగెను.
మూడవ దినమున చనిపోయినవారిలో నుండి తిరిగిలేచి,
పరలోకమునకెక్కి
సర్వశక్తిగల తండ్రియైన దేవుని కుడిచేతి వైపున కూర్చుండియున్నాడు,
సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చును.

పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను.
పరిశుద్ధ సార్వత్రిక సంఘమును
పరిశుద్ధుల సహవాసమును
పాపక్షమాపణను
శరీర పునరుత్థానమును
నిత్యజీవమును నమ్ముచున్నాను. ఆమేన్.

పరలోక ప్రార్థన

పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక.

నీ రాజ్యము వచ్చుగాక.

నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక.

మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము.

మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము.

మమ్మును శోధనలోకి తేక,

దుష్టునినుండి మమ్మును తప్పించుము.

ఏలయనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్.

- మత్తయి 6:9-13

Ready to Start Learning?

Select a lesson from the sidebar to begin your journey through this course.