Search Course
Search through all lessons and sections in this course
Searching...
No results found
No matches for ""
Try different keywords or check your spelling
యేసు జీవితమూ పరిచర్య
Course Description
ఈ కోర్సు 21 వ శతాబ్దంలో పరిచర్యకు మరియు నాయకత్వానికి మాదిరిగా ఉండుటకు యేసు జీవిత అధ్యయనం బోధిస్తుంది.
Introduction
ఈ కోర్సు యేసు జీవితాన్ని, పరిచర్యను నేటి దినాల్లోని పరిచర్యకు, జీవితానికి ఒక మాదిరిగా అధ్యయనం చేస్తుంది. ఇది సువార్తల సమగ్ర అధ్యయనం కాదు. ఈ కోర్సు యేసు పరిచర్యలోని కొన్ని నిర్దిష్టమైన కోణాలను పరిశీలించి, నేటి పరిచర్యకు పాఠాలను అందిస్తుంది. మీరు క్రీస్తు జీవితమంతా అధ్యయనం చేయాలంటే, పుస్తకం చివర్లో సిఫార్సు చేసిన పుస్తకాల జాబితా భాగాన్ని చూడండి.
ఒకవేళ బృందంగా అధ్యయనం చేస్తే, వనరులను/మెటీరియల్ ను ఒకరి తరువాత మరొకరు చదవచ్చు. చర్చ కోసం మధ్య మధ్యలో కొంత సమయం కేటాయించాలి. తరగతి నాయకుడుగా, చర్చ అనేది అధ్యయనం చేస్తున్న మెటీరియల్ కు సంబంధించినదిగానే ఉండేలా జాగ్రత్తపడడం మీ బాధ్యత. ప్రతి చర్చా సమయపు కాల పరిమితికి ఇది సహాయపడుతుంది.
చర్చా ప్రశ్నలు, తరగతిలో చేసే కార్యకలాపాలు ఈ గుర్తుతో సూచించబడతాయి ►. వీటిని చూసినప్పుడల్లా, దాని క్రిందున్న ప్రశ్నలు అడిగి, విద్యార్థులు సమాధానం గురించి చర్చించేలా చేయండి. అర్థవంతమైన చర్చకు సమయం కేటాయించండి. ఇలా చేయకపోతే, విద్యార్థులు యేసు పరిచర్య అధ్యయనాన్ని నేటి పరిచర్యతో అనుసంధానించటంలో విఫలమౌతారు.
కోర్సు అంతటిలో ప్రధాన విషయాల్లో (main text) చివరి సూచనలు (footnotes) రెంటిలోను అనేక లేఖన భాగాలు ఇవ్వడం జరిగింది. తరగతి గదిలో బిగ్గరగా చదవాల్సిన వాక్యభాగాలు కూడా బుల్లెట్ పాయింట్లతో సూచించబడ్డాయి ►. విద్యార్థులు, పెద్ద వాక్యభాగాలను క్లాసు మొదలయ్యేముందే చదవాలి. చిన్న వాక్యభాగాలు క్లాసులో చదవచ్చు.
“నిశిత పరిశీలన” అనే పేరుగల భాగాలు, పాఠం చర్చకు సంబంధించిన ప్రత్యేక విషయాలపై దృషిపెడతాయి.
ప్రతి పాఠంలో ఒకటి లేక రెండు అభ్యాసాలు ఉన్నాయి. విద్యార్థి Shepherds Global Classroom (షెఫర్డ్ గ్లోబల్ క్లాస్ రూమ్) నుండి ధృవీకరణ పత్రం (సర్టిఫికెట్) పొందాలంటే, తరగతి సెషన్లలో హాజరై, అభ్యాసాలు పూర్తి చేయాలి. పూర్తి చేసిన అభ్యాసాలను గురించి నివేదించటానికి కోర్సు ముగింపులో ఒక ఫారం ఇవ్వడం జరుగుతుంది.
ఈ కోర్సులో ముఖ్యమైన ఉద్దేశ్యాలలో ఒకటి విద్యార్థులను బోధకులుగా తయారుచేయడం. క్లాసు లీడరు విద్యార్థులు తమ బోధనా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు అవకాశాలు ఇవ్వాలి. ఉదాహరణకు, క్లాసు లీడరు కొన్నిసార్లు విద్యార్థికి తరగతిలో పాఠంలోని ఒక చిన్న భాగాన్ని బోధించే అవకాశం ఇవ్వాలి.
Ready to Start Learning?
Select a lesson from the sidebar to begin your journey through this course.