ఈ అధ్యాయమును ఉపయోగించు మూడు మార్గములు
1. స్థానిక బోధకులను అభివృద్ధి చేయుటకు తర్ఫీదుదారుడు ఈ అధ్యాయములోని పద్ధతులను ఉపయోగించవచ్చు. స్థానిక సంఘములో బోధించు సామర్థ్యతగలవారు లేకపోతే, వెంటనే స్వతంత్రముగా నిర్వహించబడగల స్థానిక కార్యక్రమమును తర్ఫీదుదారుడు ఆరంభించలేడు. తర్ఫీదుదారుడు సామర్థ్యత ఉన్న బోధకులను కనుగొని, వారిని అభివృద్ధి చేయాలి. స్థానిక బోధకులను ఎలా తర్ఫీదుచేయాలో ఈ అధ్యాయము తెలియజేస్తుంది.
2. వారి విద్యార్థుల కొరకు ఈ పద్ధతిని ఉపయోగించుటకు తర్ఫీదుదారుడు స్థానిక బోధకులను సిద్ధపరుస్తాడు. క్రొత్త స్థలములోని స్థానిక బోధకులు ఇప్పటికే బోధించ సమర్థులైయుంటే, తర్ఫీదుదారుడు ఈ అధ్యాయములోని అభ్యాసములను ఉపయోగించవలసిన పనిలేదు. వారి విద్యార్థులను అభివృద్ధి చేయుట కొరకు తర్ఫీదుదారుడు పద్ధతిని స్థానిక బోధకులకు బోధించాలి.
3. స్థానిక బోధకుడు విద్యార్థులను అభివృద్ధిచేస్తాడు. ప్రతి బోధకుడు విద్యార్థుల యొక్క పరిచర్య నైపుణ్యతలను అభివృద్ధిచేయుటకు ప్రయత్నించాలి. విద్యార్థులు సమూహములతో మాట్లాడుట ఆరంభించుటకు ఈ అధ్యాయములో వర్ణించబడిన పద్ధతులు సహాయముచేయగలవు.