Lesson 8: స్థానిక షెఫర్డ్స్ ఇన్స్టిట్యూట్ ను నిర్వహించుట
1 min read
by Stephen Gibson
పరిచయం
SGC కోర్సులు పలు కార్యక్రమాలలో ఉపయోగించబడతాయి. కొన్ని హై స్కూళ్లు (వీటిని కొన్నిసార్లు మాధ్యమిక పాటశాలలు అని కూడా పిలుస్తారు) కొన్ని కోర్సులను ఉపయోగిస్తాయి. కొన్ని సంఘములు వారి సండే స్కూల్ లో ఈ కోర్సులను ఉపయోగిస్తారు. గృహ బైబిలు అధ్యయన సమూహములు అధ్యయనము చేయుటకు కోర్సులను ఎన్నుకుంటారు. ప్రసంగము మరియు బోధనలలో ఉపయోగించుటకు కాపరులు కోర్సులలోని విషయములను ఎన్నుకుంటారు.
ఈ అధ్యాయములోని నిర్దేశనములు సంపూర్ణ అధ్యయన కార్యక్రమము కొరకు 20 SGC కోర్సులను ఉపయోగించు స్థానిక ఇన్స్టిట్యూట్ ను నిర్వహించుట కొరకు అనువర్తించబడతాయి.
SGC కోర్సుల యొక్క సంపూర్ణ వర్గములో బైబిలు కళాశాల పాఠ్యాంశములలోని అత్యంత ప్రాముఖ్యమైన విషయములు ఉంటాయి. కఠినమైన పదములు లేకుండా ఇది ఉద్దేశ్యపూర్వకముగా వ్రాయబడినది.
కోర్సులను అవి రూపించబడిన విధముగా అధ్యయనం చేయుటకు ఒక విద్యార్థికి చదువుట మరియు వ్రాయుట వచ్చియుండాలి.
క్రొత్తగా మారుమనస్సుపొందినవారిని శిష్యులను చేయుటకు ఈ కోర్సులు రూపొందించబడలేదు, కాని ఈ మెటీరియల్ చాలా వరకు దీని కొరకు ఉపయోగపడుతుంది.
సమూహము చేయదగిన ఉత్తమమైన పనులు ఏవనగా, ప్రతి విద్యార్థి
1. కోర్సు కాపీను కలిగియుండాలి
2. అన్ని అభ్యాసములను పూర్తి చేయాలి
3. సమూహమునకు విషయములను ప్రెసెంట్ చేయుటను అభ్యసించుటకు అవకాశం పొందాలి
4. స్థానిక సంఘముతో మంచి సంబంధం కలిగియుండాలి, మరియు
5. సమూహము వెలుపల తరచుగా పరిచర్యను చేయాలి.
ఈ ఆచారములను అనుసరించు బోధకుడు విద్యార్థులను పరిచర్య కొరకు ప్రభావవంతముగా తర్ఫీదుచేయగలడు.
పరిచర్య కొరకు సిద్ధపడని విద్యార్థుల సమూహముల కొరకు విద్యార్థి ఎడిషన్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థి ఎడిషన్లు కోర్సుల యొక్క క్లుప్త వెర్షన్లైయున్నవి. వీటిని హై స్కూళ్లు (మాధ్యమిక పాటశాలలు) మరియు సండే స్కూల్స్ లో ఉపయోగిస్తారు. ఈ విద్యార్థులు సాధారణ అభ్యాసములను చేయరు ఎందుకంటే వారు పరిచర్యను అభ్యసించుటలేదు లేక పరిచర్య కొరకు సిద్ధపడుట లేదు. విద్యార్థి ఎడిషన్లను పరిచర్య కొరకు సిద్ధపడుతున్న మరియు పరిచర్య తర్ఫీదు సర్టిఫికేట్ ను పొందగోరుతున్న విద్యార్థుల కొరకు ఉపయోగించకూడదు. ఈ విద్యార్థుల బోధకులు వాస్తవిక SGC కోర్సు విషయముల నుండి బోధించాలి ఎందుకంటే విద్యార్థి ఎడిషన్ అసంపూర్ణమైనది.
SGC ఒక అధ్యయన డిగ్రీని ఇవ్వదు. కొన్ని చోట్ల SGC కోర్సులను ఉపయోగించు స్థానిక లేక జాతీయ సంస్థలు వారి సొంత ఆవసరతల ఆధారముగా ఒక డిగ్రీని లేక సర్టిఫికేట్ ను ఇస్తారు. విద్యార్థి ఆ సంస్థతో రిజిస్టర్ చేసుకొని, వారు అవసరతలను పూర్తిచేయాలి.
అధ్యయన డిగ్రీ అందుబాటులోలేని చోట్ల, కార్యక్రమమును ప్రొఫెషనల్ తర్ఫీదుగా పరిగణించాలి. వ్యాపార లోకములో ప్రొఫెషనల్ తర్ఫీదు కార్యక్రమాలు నైపుణ్యతగల వృత్తిలో పనిచేయుటకు వ్యక్తిని సిద్ధపరుస్తాయి. ఆ కార్యక్రమాలు డిగ్రీలను అందించవు, కాని ఆ వ్యక్తి తర్ఫీదు పొందాడు అను సర్టిఫికేట్ ను ఇస్తాయి. అదే విధముగా, SGC కార్యక్రమము కూడా పరిచర్య కొరకు ప్రొఫెషనల్ తర్ఫీదు అయ్యున్నది.
అవసరమైన సామగ్రి
కోర్సులతో పాటుగా కేవలం బైబిలు మాత్రమే అవసరమవుతుంది, కాని కోర్సులు తదుపరి అధ్యయనం కొరకు అదనపు మెటీరియల్ ను ప్రతిపాదించవచ్చు. విద్యార్థులు ఉపయోగించుటకు స్థానిక ఇన్స్టిట్యూట్ ఒక గ్రంథాలయమును అభివృద్ధిచేయుటకు ప్రయత్నించాలి.
తరగతి షెడ్యూల్
స్థానిక పరిస్థితుల ఆధారంగా, స్థానిక ఇన్స్టిట్యూట్ తరగతుల కొరకు సొంత షెడ్యూల్ ను కలిగియుండవచ్చు. అయితే, కావలసినంత సమయమును కేటాయించాలి. సంభాషణ మరియు విద్యార్థుల అభ్యాసము లేకుండా బోధకుడు కేవలం విషయములను మాత్రమే బోధిస్తే, తక్కువ సమయం గడుపుట జరుగుతుంది, కాని తరగతి విద్యార్థులను సరియైన రీతిలో సిద్ధపరచలేదు. సమూహము విషయములను మరియు పూర్తిచేయబడిన అభ్యాసములను చర్చిస్తూ సమయము గడిపితే, కోర్సు పూర్తిచేయుటకు ముప్పైగంటల కంటే ఎక్కువ తరగతిలో గడపవలసియుంటుంది. తరగతి వెలుపల అభ్యాసములను చేయుటకు విద్యార్థులు అదనపు సమయమును గడపాలి.
కోర్సుల క్రమము
ఒక క్రమము అవసరములేదు. ప్రతి తరగతి సంపూర్ణమైనది మరియు కొనసాగుటకు మరొక తరగతి మీద ఆధారపడదు. కార్యక్రమమును ఒక క్రమములో నడుపుతూ, ప్రతి కోర్సు యొక్క ఆరంభములో క్రొత్త విద్యార్థులు చేరుటకు అనుమతించవచ్చు. సంవత్సరము ఆరంభమైయ్యే వరకు వారు వేచియుండకుండా ఒక ఇన్స్టిట్యూట్ క్రొత్త విద్యార్థులను చేర్చుకోవచ్చు. ప్రతి కోర్సు యొక్క ఆరంభములో వ్యక్తిగత విద్యార్థులు చేరి, వారు కోర్సులన్నిటిని ముగించు వరకు ఆ క్రమములో కొనసాగుతారు.
నైపుణ్యతను నియంత్రించుట
విద్యార్థుల హాజరు యొక్క రికార్డులను బోధకుడు పాటించాలి. కనీసం 75 శాతం తరగతులకు హాజరుగని, నూరు శాతం అవసరమైన అభ్యాసములను పూర్తి చేయని విద్యార్థులు కోర్సులో ఉత్తీర్ణులు కాకూడదు. కొన్ని విశేష పరిస్థితులలో, తరగతికి హాజరుకాని పక్షమున దానికి ప్రత్యామ్నాయంగా బోధకుడు అదనపు అధ్యయన అవసరతలను ఇవ్వవచ్చు.
చివరి గ్రేడు న్యాయముగాను, ఖచ్చితముగాను ఉండుటకు బోధకుడు విద్యార్థులు పూర్తిచేసిన అభ్యాసముల యొక్క నివేదికలను జాగ్రత్తగా భద్రపరచాలి. వారి అభ్యాసములు లేక హాజరు వారి గ్రేడులను తగ్గిస్తుందేమో విద్యార్థులకు తెలిసియుండునట్లు బోధకుడు చూచుకోవాలి.
స్థానిక ఇన్స్టిట్యూట్ సంస్థల అసోసియేషన్ లో భాగమైయుంటే, ప్రాంతీయ తర్ఫీదుదారులు పరీక్షించుట కొరకు హాజరు మరియు అభ్యాసముల నివేదికలు అందుబాటులో ఉండాలి. సంస్థ తరచుగా అవసరతలను పూర్తిచేయలేకపోతే, సర్టిఫికేట్ కు విలువ ఉండదు.
స్థానిక ఆర్ధిక మద్దతు
ప్రతి స్థానిక ఇన్స్టిట్యూట్ స్థానికంగా నడిపించబడాలి. స్థానిక సంఘము తరగతి గదిని ఇస్తుంది. బోధకులు స్థానిక పరిచర్యలో భాగముగా సేవిస్తారు. కోర్సులను ప్రింట్ చేయు ఖర్చును స్థానిక పరిచర్య లేక విద్యార్థులు భరిస్తారు. ఒక ఇన్స్టిట్యూట్ ఒక సంస్థల అసోసియేషన్లో భాగమైయుంటే, కోర్సులను ప్రింట్ చేయుటకు మరియు స్థానిక ఇన్స్టిట్యూట్ స్టాఫ్ కు జీతమిచ్చుటకు కేంద్ర పాలకవర్గం విద్యార్థుల యొద్ద కొంత ఫీజును తీసుకోవచ్చు.
ఆర్థిక విషయములన్నిటిలో స్థానిక ఇన్స్టిట్యూట్ స్టాఫ్ నిజాయితీగా, పారదర్శకముగా ఉండాలి (2 కొరింథీ. 8:21). ఎంత డబ్బు సేకరించబడింది మరియు దానిని ఎలా ఖర్చుపెట్టుట జరిగిందో అందరికి తెలిసియుండాలి. నిధులను నిర్వహించుటకు ఒక కమిటీ అవసరం. ఆర్థిక విషయముల యొక్క ఉదాహరణలు ఏవనగా, స్థానిక ఇన్స్టిట్యూట్ లేక కేంద్ర పాలకవర్గమునకు విద్యార్థులు చెల్లించు ఫీజు, కోర్సులను ప్రింట్ చేయు ఖర్చు, స్థానిక బోధకుల మద్దతు, సేకరించబడిన మరియు ఖర్చుపెట్టిన ఇతర ధనము.
క్రైస్తవ ప్రవర్తనలో నిజాయితీ ఒక మౌలిక గుణము కాబట్టి, నిజాయితీలేని వ్యక్తి మంచి క్రైస్తవ ఉదాహరణగా ఉండుట సాధ్యము కాదు. నిజాయితీలేని వ్యక్తి ఏ విధమైన పరిచర్య స్థానమును పట్టుకొనియుండకూడదు. ప్రతి విధమైన నిజాయితీలేని కార్యము SGC తో నాయకుని యొక్క సంబంధమును ప్రభావితము చేస్తుంది.
ఒక మిషన్ సంస్థ/జాతీయ పరిచర్య మరియు స్థానిక ఇన్స్టిట్యూట్ యొక్క భాగస్వామ్యం
స్థానిక ఇన్స్టిట్యూట్లను స్థాపించుటలో సంఘములకు సహాయము చేయు జాతీయ పరిచర్యను ABC అని పిలుద్దాము. స్థానిక ఇన్స్టిట్యూట్ల కొరకు ABC ఉపయోగించు సైట్ ఒప్పందము క్రింద పేజీలో ఇవ్వబడినది. ABC ప్రతినిధులు స్థానిక ఇన్స్టిట్యూట్ సైటులను తరచుగా దర్శిస్తూ, ఈ అధ్యాయము యొక్క చివరి పేజీలో ఇవ్వబడిన ప్రశ్నలను అడుగుతారు.
వారి జాతీయ పరిచర్య మరియు స్థానిక ఇన్స్టిట్యూట్ మధ్య ఉన్న సంబంధమును వివరించుటకు ABC ఈ ఫారంను ఉపయోగిస్తుంది.
పరిచర్య నాయకులను అభివృద్ధి చేయుటలో సంఘమును సిద్ధపరచుట ద్వారా క్రీస్తు శరీరమును సేవించుట ABC యొక్క ఉద్దేశ్యమైయున్నది. SGC కోర్సులను ఉపయోగించి పరిచర్య తర్ఫీదు కార్యక్రమమును నడిపించుటకు స్థానిక సంఘము లేక పరిచర్య సంస్థకు అమోదమును ఇవ్వవచ్చు.
స్థానిక పరిచర్య దాని యొక్క సమర్పణలను నెరవేర్చని పక్షమున ఒప్పందమును విరమించుకొను అధికారం ABCకి ఉంది.
ABC ఈ క్రిందివాటిని ఇస్తుంది:
20 పరిచర్య తర్ఫీదు కోర్సుల సెట్
బోధకులకు తర్ఫీదు సెమినార్
స్థానిక బోధకులను ప్రోత్సహించుటకు మరియు నైపుణ్యతను బలపరచుటకు పరిపాలక బృందం తర్ఫీదు ఇచ్చు స్థలమును దర్శిస్తుంది
ప్రతి కోర్సు ముగించబడిన తరువాత విద్యార్థులకు సర్టిఫికేట్లు (సర్టిఫికేట్ ను పొందుటకు కోర్సు యొక్క వ్యక్తిగత కాపీ ప్రతి విద్యార్థికి ఇవ్వవలసియున్నది)
కార్యక్రమము అంతటిని పూర్తిచేసినందుకు సర్టిఫికేట్
పరిచర్య స్థలములో ABC పోస్టర్
స్థానిక పరిచర్య వీటికి కట్టుబడియున్నది:
నమ్మకమైన, అర్హతగల స్థానిక బోధకులను ABC పరిపాలక బృందము యొక్క ఆమోదముతో నియమించుట
ABC పరిపాలక బృందం యొక్క తర్ఫీదు మరియు నిర్దేశనములకు అనుగుణంగా బోధకులను తర్ఫీదు చేయుట
మంచి అధ్యయనమునకు అనుగుణంగా ఉండు తరగతిగదిని ఇచ్చుట
అవసరత కొలది స్థానిక బోధకులకు ఆర్థికంగా మద్దతునిచ్చుట
ప్రతి కోర్సు కాపీ కొరకు ఫీజును సేకరించి ABC కి పంపుట
విద్యార్థుల హాజరు మరియు పూర్తిచేయబడిన అభ్యాసముల నివేదికలను ABC పరిపాలక బృందమునకు అందించుట
ABC ఇచ్చిన పోస్టర్ ను అతికించుట. ఆ పోస్టర్ ABC యొక్క ఆస్తి అయ్యున్నది మరియు ఒప్పందము ఒకవేళ తెగిపోతే దానిని తొలగించవలసియుంటుంది.
స్థానిక పరిచర్య యొక్క పేరు _______________________________
స్థానిక పరిచర్య ప్రతినిధి యొక్క సంతకం ___________________________
ABC అధికారిక ప్రతినిధి యొక్క సంతకం ________________________
6. అధ్యయనము చేయుచున్న కోర్సు కొరకు ప్రతి విద్యార్థి దగ్గర ఒక వ్యక్తిగత కాపీ ఉందా?
7. అభ్యాసములను పూర్తి చేయు విధముగా విధ్యార్థులందరి దగ్గర చదువుటకు మరియు వ్రాయుటకు కావలసినంత సామర్థ్యత ఉందా? (సర్టిఫికేట్ కొరకు అవసరమైన)
8. అభ్యాసములను పూర్తి చేయుటకు వెచ్చించు సమయముగాక ప్రతి కోర్సు కొరకు ముప్పై గంటల తరగతి సమయమును తరగతి అందిస్తుందా?
9. విద్యార్థులు జవాబులను ఇతరుల నుండి లేక పుస్తకముల నుండి చూచి వ్రాయకుండా ఉండునట్లు పరీక్షలు నిర్వహించబడుతున్నాయా?
10. విద్యార్థుల హాజరు యొక్క ఖచ్చితమైన నివేదికను బోధకులు కలిగియున్నారా? (25 శాతం కంటే ఎక్కువ తరగతి సమయమును తప్పిపోవు విద్యార్థి ఆ కోర్సులో ఉత్తీర్ణుడు కాకూడదు.)
11. పూర్తి చేయబడిన విద్యార్థి అభ్యాసముల నివేదికను బోధకులు కలిగియున్నారా? (సర్టిఫికేట్ కొరకు అభ్యాసములన్నిటిని పూర్తి చేయాలి. ప్రస్తుత తరగతులలోని అభ్యాసములను కోర్సు యొక్క చివరిలో విద్యార్థులకు తిరిగి ఇచ్చువరకు విశ్లేషణ కొరకు అందుబాటులో ఉండాలి.)
12. స్థానిక ఇన్స్టిట్యూట్ స్థానిక ఆర్ధిక మద్దతు కొరకు ఒక వ్యవస్థను అభివృద్ధి చేస్తుందా?
13. పారదర్శకత మరియు జవాబుదారుతనము కొరకు స్థానిక ఇన్స్టిట్యూట్ ఆర్థిక విషయములను స్థానిక కమిటీ నిర్వహిస్తుందా?
Print Course
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.