తరగతిగది
వీలైతే బోధకుడు తరగతి గదిని ముందుగానే సిద్ధపరచాలి. విద్యార్థులు ఒకరినొకరు చూచుకొను విధముగా వారిని కూర్చోబెట్టాలి. ఆ స్థలములో తరగతి సమయములో ఆటంకములు కలిగించు క్రియాకలాపాలు మరియు శబ్దములు లేకుండా బోధకుడు చూచుకోవాలి. సౌకర్యవంతమైన కుర్చీలు, సౌకర్యవంతమైన వాతావరణం, మరియు మంచి వెలుగు ఉండునట్లు బోధకుడు చూడాలి. ఎక్కువ అంతరాయములు లేని యెడల ఆరుబయట అధ్యయనమును చేయుట కూడా మంచిదే.
వ్రాయుటకు మరియు గీయుటకు తరగతిగదిలో పెద్ద బోర్డు ఉండాలి.
