తరగతి యొక్క శైలిని నియమించుట
తర్ఫీదు కార్యక్రమము యొక్క ఆరంభములో, ఉత్సాహం మరియు ఆకాంక్ష ఉంటాయి. ఏమి ఆశించాలో విద్యార్థులకు ఖచ్చితముగా తెలియదుగాని, సమూహము నుండి సహాయమును పొందాలని వారు నిరీక్షిస్తారు.
తరగతి యొక్క మొదటి కూడిక తదుపరి కూడికల కంటే భిన్నముగా ఉండవచ్చు ఎందుకంటే తరగతిని గూర్చి పరిచయములు మరియు వివరణలు అవసరమైయున్నవి. అయితే, మొదటి కూడిక భవిష్యత్ కూడికల కొరకు శైలిని నియమిస్తుంది. ఉదాహరణకు, ఎవరైనా మొదటి కూడికలో మాట్లాడాలని ఇష్టపడకపోతే, భవిష్యత్తులో కూడా ఆ వ్యక్తి మౌనముగా ఉండాలని ఆశించుట జరుగుతుంది. ఒక వ్యక్తి సంభాషణలో ఎక్కువ మాట్లాడిన యెడల, భవిష్యత్ సంభాషణలలో కూడా అదే వ్యక్తి ఎక్కువ మాట్లాడాలని సమూహము ఆశించవచ్చు. కూడిక క్రమము లేకుండా ఉంటే, భవిష్యత్తులో కూడా వారు ఇదే ఆశిస్తారు. తరగతిలో విద్యార్థులు చాలా తక్కువగా పాలుపంచుకొనుచుంటే, వారు భవిష్యత్తులో కూడా ఇదే పద్ధతిని ఆశిస్తారు.
తరగతి వారు ఆశించిన విధముగా లేకపోవుట వలన కొందరు విద్యార్థులు కొన్ని కూడికల తరువాత మానివేసే అవకాశం ఉంది. ప్రతిఒక్కరిని సంతోషపరచు విధముగా తరగతిని రూపొందించుట సాధ్యము కాదు, కాని నేర్చుకోవాలని కోరు విద్యార్థులను సంతృప్తిపరచుటకు దానిని రూపొందించవలసియున్నది. సరియైన విషయములను ఆశించు విద్యార్థులు నిరుత్సాహపడకుండా తరగతిని సరియైన రీతిలో నడిపించుట ప్రాముఖ్యమైయున్నది.
