కాపరులను తర్ఫీదు చేయుట
కాపరులకు సిద్ధాంతము, బైబిలు వ్యాఖ్యానము, ప్రసంగము, మరియు శిష్యరిక పద్ధతులలో తర్ఫీదు చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్నివేల సంఘములను ఎలాంటి ముద్రించబడిన వనరులు మరియు ఏ విధమైన సరియైన తర్ఫీదులేని కాపరులు నడిపించుచున్నారు. అనేకమంది కాపరులు తర్ఫీదుపొందలేదు మరియు ఇతరులను తర్ఫీదుచేయుటకు సమర్థులుగా భావించుకోరు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యధిక శక్తి కలిగిన కాపరులు బైబిలు కళాశాలలో చదవలేరు. వారు తమ కుటుంబాలను, ఉద్యోగాలను, మరియు పరిచర్యలను విడిచి, కొన్ని సంవత్సరాల పాటు ఎక్కడైనా తరగతులలో పాల్గొనడం వారికి ప్రాయోగికంగా సాధ్యము కాదు. వారు స్థానిక తర్ఫీదును అవసరపడుతున్నారు.
సాక్ష్యమిచ్చువారిని తర్ఫీదు చేయుట
దేవుని రక్షించు కృపను అనుభవించిన ప్రతి వ్యక్తి సువార్త ప్రకటించుటకు అర్హుడే. వారి కొరకు దేవుడు ఏమి చేశాడో ప్రజలు చెప్పగలరు. వారి సాక్ష్యములు బలముగా ఉంటాయి, ముఖ్యముగా వారికి పరిచయస్తులైన ప్రజలకు మరియు వారి జీవితములలోని మార్పును చూడగల ప్రజలను ఒప్పించునవిగా ఉంటాయి.
అయితే, కొన్నిసార్లు సువార్తలోని ముఖ్యమైన బిందువులను ఒక వ్యక్తి వివరించలేడు. ఆ వ్యక్తి యొక్క సాక్ష్యమునకు మరియు వినువారి పరిస్థితులకు పొంతనలేకపోతే, అదే మార్పును వారు కూడా ఎలా అనుభవించగలరో వారు అర్థము చేసుకోలేకపోవచ్చు.
అతడు క్రైస్తవ్యమును గూర్చిన ప్రశ్నలకు జవాబు ఇవ్వలేకుండా ఉన్నాడు కాబట్టి, అనేక సంవత్సరములుగా విశ్వాసిగా ఉన్న వ్యక్తి కూడా తన సముదాయమునకు సువార్త ప్రకటించు విషయములుగా అసమర్థునిగా భావించుకుంటాడు. ఈ విశ్వాసికి అతని లేక ఆమె వ్యక్తిగత మారుమనస్సు అనుభవము, ఆరాధనా భావనలు, క్రీస్తు శరీరములోని ఇతరులతో సహవాసము చేయుటలోని ఆనందము తెలుసుగాని, వాటిని అతడు వివరించలేడు.
కొన్నిసార్లు ఆ సమాజములోని ప్రజలు క్రైస్తవ్యమును వ్యతిరేకించు మతమునకు చెందినవారు కావచ్చు. మంచి జీవితము జీవించు క్రీస్తు అనుచరులను గౌరవించుటను వారు నేర్చుకోవచ్చుగాని, క్రైస్తవ విశ్వాసము యొక్క వివరణలను కూడా వారు వినవలసియున్నది.
సువార్త నియమములను మరియు సువార్తకు మద్దతునిచ్చు మౌలిక సిద్ధాంతములను నేర్చుకొనుట ద్వారా ఆ వ్యక్తి ప్రభావంతమైన సాక్షిగా ఉండగలడు.
సంఘమును కాపాడుట
హిత బోధతో తమ సంఘములను కాపాడుకొనుట కాపరుల బాధ్యత (తీతు 1:9-14). అబద్ధ సంఘములు మరియు అబద్ధ మతములు ప్రజలకు సందిగ్ధతను కలిగించు మరియు మోసగించు ఆలోచనలను ఉపయోగిస్తాయి. ఒకసారి మారుమనస్సుపొందిన ప్రజలు మరలా అబద్ధ సంఘములలోనికి నడిపించబడుట చాలా బాధాకరం.
ప్రజలు వారి విశ్వాసములో స్థిరపరచబడునట్లు కాపరి ప్రజలకు బైబిలు సిద్ధాంతమును బోధించవలసియున్నది. బోధన అనునది ఉద్దేశ్యపూర్వకముగాను క్రమముగాను ఉండి, సంఘములోని ప్రజలందరిని చేరుట కొరకు పలు స్థాయిలలో ఇవ్వబడునదిగా ఉండాలి.
పరిచర్య బృందమును వ్యాపింపజేయుట
ఒక ఆట జట్టులో ఎల్లప్పుడూ ఆటలో పాలుపంచుకొని అదనపు ఆటగాళ్లు బెంచి మీద కూర్చొని ఉంటారు. వారు ప్రముఖ ఆటగాళ్ల కంటే చిన్నవారు మరియు తక్కువ అనుభవముగలవారు కావచ్చు, కాని వారు తర్ఫీదు పొందుతున్నారు. వారిలో కొందరికి కొన్ని సమయాలలో అవసరమైయ్యే ప్రత్యేకమైన సామర్థ్యతలు ఉంటాయి.
ఒక ఆరోగ్యకరమైన, ఎదుగుతున్న సంఘమునకు కూడా “బెంచ్” ఉండాలి. నాయకత్వ స్థానములన్నిటిలో ప్రజలు ఉన్నారు కాబట్టి, జట్టు సంపూర్ణముగా ఉన్నది అని ఆలోచించుట పొరపాటు. నూతన విధములైన పరిచర్యలను ఆరంభించుటలో సహాయము చేయుటకు నాయకులు ఉంటే తప్ప పరిచర్య ఒక ఉన్నత స్థాయిని చేరినప్పటికీ, ఎదుగుదలలో ముందుకు కొనసాగలేదు.
ఆరోగ్యకరమైన సంఘములో అభివృద్ధిచెందుతున్న మరియు అభ్యసించుచున్న “బెంచి” మీద ఉన్న ప్రజలు కావాలి. దీనికి స్థానిక తర్ఫీదు అవసరం. కాబట్టి, పరిచర్య తర్ఫీదు అనునది కేవలం పరిచర్య స్థానములను కలిగియున్నవారి కొరకు మాత్రమే కాదు.
స్థానిక తర్ఫీదు జరుగునట్లు చేయుట ఒక కాపరి యొక్క బాధ్యత అయ్యున్నది. కాపరి స్వయంగా తర్ఫీదు అంతటిని ఇవ్వలేడు, కాబట్టి అతడు దానిని నిర్వహించు, దానిని ప్రోత్సహించాలి. పలు పాత్రలను పోషించు ప్రజల బృందము అతనికి కావాలి.
మనమందరము విశ్వాసవిష యములోను దేవుని కుమారునిగూర్చిన జ్ఞానవిషయములోను ఏకత్వముపొంది సంపూర్ణపురుషులమగువరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభి వృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయో పాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడినవారమైనట్లుండక, ప్రేమ గలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము (ఎఫెసీయులకు 4:11-15).
సంఘము యొక్క పనిని పూర్తి చేయుటకు కావలసిన వరములను మరియు సామర్థ్యతలను దేవుడు స్థానిక సంఘములోని ప్రజలకు ఇస్తాడు. ప్రజలను అభివృద్ధిచేయు బాధ్యతను సంఘము ఉద్దేశ్యపూర్వకముగా తీసుకోవాలి.
స్థానిక సంఘమును బలపరచుట
స్థానిక సంఘము అంటే స్థానిక ప్రజలు నడిపించు, స్థానిక ప్రజలు మద్దతునిచ్చు, స్థానిక ప్రజల యాజమాన్యములో ఉన్న సంఘము. అది విదేశీ మద్దతు లేక మార్గదర్శకము మీద ఆధారపడదు. సంఘముల యొక్క ఆరోగ్యము మరియు ఎదుగుదలకు స్థానిక బలము ప్రాముఖ్యమైయున్నది.
స్థానిక సంఘము దాని సంస్కృతిలో నాటబడియుంటుంది. అది ఒక విదేశీ సంఘము వలె ఉండదు.
ఆరోగ్యకరమైన స్థానిక సంఘమునకు అనేక ప్రయోజనములు ఉన్నాయి:
1. అది దాని సంస్కృతిలో ప్రభావవంతముగా సువార్త ప్రకటిస్తుంది మరియు శిష్యులను చేస్తుంది.
2. విదేశీయుల మీద ఆధారపడకుండా క్రీస్తు శరీరముగా సంఘము పరిపక్వత చెందుతుంది మరియు నిర్వహించబడుతుంది.
3. నాయకులు వారి సంపూర్ణ సామర్థ్యతను బలపరచుకుంటారు.
4. స్థానిక సభ్యులు పరిచర్య కొరకు మద్దతుని మరియు జవాబుదారుతనమును అందిస్తారు.
కొన్ని స్థానిక సంఘములలో సిద్ధాంతిక స్థిరత్వము మరియు క్రైస్తవ జీవనమునకు బైబిలు ప్రమాణములు కొరతగా ఉంటాయి కాబట్టి అవి ఆరోగ్యకరముగా ఉండవు. ఒక బలమైన, స్థిరమైన సాక్ష్యముతో తమ సమాజములను ప్రభావితము చేయు విషయములో వారు విఫలమవుతారు. ప్రతిభలు ఉన్నను, ప్రవర్తన విషయములో బలహీనులుగా ఉండుట వలన వాటి నాయకులు బలహీనులుగా ఉంటారు. నాయకత్వ అభివృద్ధి కొరకు మంచి కార్యక్రమములువాటిలో ఉండవు. స్థానిక పరిచర్య తర్ఫీదు కొరకు వాటికి మంచి కార్యక్రమములు అవసరము.
ఒక సంఘము తుదకు స్థానిక సంఘము అవుతుంది అను లక్ష్యముతో కొన్నిసార్లు విదేశీ మిషనరీలు దానిని ప్రారంభించవచ్చు. స్థానిక మద్దతు పెరుగుట మరియు స్థానిక నాయకుల యొక్క ఎదుగుచున్న బాధ్యత ద్వారా ప్రగతిని కొలవవచ్చు.
స్థానిక నాయకుల యొక్క అభివృద్ధి కొరకు స్థానిక తర్ఫీదు అవసరము, వారు సిద్ధాంతమును బోధిస్తారు, ఆచరణాత్మక జీవనమునకు విశ్వాసమును అనువర్తిస్తారు, మంచి పరిచర్య శైలులను మరియు వ్యూహములను బలపరుస్తారు.
సంఘములను స్థాపించుట
అనేక సంఘమును ఇతర సమాజములకు సువార్తను పంపకుండానే కొన్ని సంవత్సరముల పాటు మనుగడలో ఉండుట బాధాకరమైన విషయం. సంఘములు లేని చోట్లకు సంఘములు సువార్తికుల బృందములను తర్ఫీదు చేసి పంపాలి. సంఘముగా మారు నూతనముగా మారుమనస్సుపొందిన సమూహమును సిద్ధపరచుట అట్టి బృందము యొక్క లక్ష్యమైయుండాలి.
మారుమనస్సుపొందిన ప్రజల సమూహము సంఘములుగా మారుటకు కొందరు సువార్తికులను తర్ఫీదు చేయాలి. క్రైస్తవ జీవితము ఎలా జీవించాలో బోధించుట ద్వారా వారు క్రొత్త విశ్వాసులను శిష్యులనుగా చేయాలి. సువార్త ప్రకటించుటకు మరియు పరిచర్య బాధ్యతలను తీసుకొనుటకు వారు మారుమనస్సుపొందినవారిని తర్ఫీదు చేయగలగాలి.
చాలా వరకు క్రొత్త సంఘములు స్థానిక వ్యక్తి ద్వారా నడిపించబడాలిగాని, సమాజములో నివసించుటకు వచ్చిన మరొక ప్రాంత కాపరి ద్వారా కాదు. అధ్యయన తర్ఫీదు ఉన్న చాలామంది కాపరులు ఒక క్రొత్త సంఘములో లేక చిన్న గ్రామములో ఉన్న సంఘములో సేవ చేయుటకు ఇష్టపడరు. సంఘమును నడిపించుటకు దేవుడు పిలచిన స్థానిక విశ్వాసికి మనము పరిచర్య తర్ఫీదును ఇవ్వాలి.
మిషనరీలను సిద్ధపరచుట
ఒక మిషనరీ అనగా, సువార్త యొక్క ప్రభావమును వ్యాపింపజేయు ఉద్దేశ్యముతో సంఘము ద్వారా మరొక స్థలమునకు పంపబడిన వ్యక్తి. మిషనరీ అను పదము ముఖ్యముగా మరొక దేశము మరియు/లేక మరొక సంస్కృతికి వెళ్లిన వ్యక్తి కొరకు ఉపయోగించబడుతుందిగాని, కొన్నిసార్లు తన దేశములో మరొక సమాజమునకు వెళ్లిన వ్యక్తి కొరకు క ూడా ఉపయోగించబడుతుంది.
లోకములోని పలు ప్రాంతములలో, ముఖ్యముగా తన దేశములోని మరొక ప్రాంతమునకు వెళ్లు మిషనరీల ద్వారా సువార్త చాలా విరివిగా వ్యాపించబడుతుంది. తర్ఫీదు వారి ప్రభావమును మరియు సిద్ధాంత స్థిరత్వమును పెంచుతుంది.
10/40 విండో అనగా భూమధ్యరేఖలో దక్షిణ చిక్కున 10 డిగ్రీల నుండి ఉత్తర దిక్కున 40 డిగ్రీల వరకు వ్యాపించిన ప్రాంతమైయున్నది, ఇది ముఖ్యముగా ఉత్తర ఆఫ్రికా నుండి దక్షిణ ఆసియా వరకు వ్యాపిస్తుంది, చైనా మరియు భారత దేశము దీనిలో భాగమైయున్నాయి. 10/40 విండోలో ప్రపంచములోని అరవై ఆరు శాతం మంది ప్రజలు నివసించుచున్నారు. 10/40 విండోలోని ప్రజలలో 80% కంటే ఎక్కువమంది ప్రజలు ఇంకా సువార్తను వినలేదు.
వాటిలోని పెద్ద పట్టణములలో అనేక సంవత్సరములుగా సంఘములు ఉన్నప్పటికీ, ప్రపంచములోని కొన్ని దేశములలో ఇంకా సువార్త వ్యాపించలేదు. ఒక వ్యక్తి ఒక సంఘములో అనేక సంవత్సరముల పాటు సేవ చేయవచ్చుగాని, ఒక క్రొత్త స్థానములో పరిచర్యను ఎలా ఆరంభించాలో తెలియకపోవచ్చు. సంఘ భవనము లోపల చిన్న విశ్వాసుల సమూహముతో ఎలా మాట్లాడాలి అను విషయము మాత్రమే అతనికి తెలుసు. సువార్త సందేశమును పంచుటకు మరియు స్థానిక విశ్వాసుల కుటుంబమును రూపించాలనే లక్ష్యమును కలిగియుండుటకు సంఘము మిషనరీలను తర్ఫీదు చేయాలి.