SGC కార్యక్రమము యొక్క ఉద్దేశ్యము పరిచర్య తర్ఫీదు కాబట్టి, విద్యార్థి మంచి సాక్ష్యము మరియు దేవుని-గౌరవించు జీవనశైలిగల క్రైస్తవ విశ్వాసిగా ఉండాలి. ఒక అవిశ్వాసి కోర్సులోని విషయములను సరిగా అర్థము చేసుకోలేడు లేక మెచ్చుకోలేడు.
విద్యార్థి ఇవాంజెలికల్ సిద్ధాంతముతో సహా క్రైస్తవ విశ్వాసము యొక్క చారిత్రిక ప్రాముఖ్యతలను నమ్మాలి. ప్రతిచోట క్రీస్తు శరీరమును సేవించుటకు ఈ కార్యక్రమము రూపొందించబడింది, కాబట్టి విశేషమైన డినామినేషన్ నమ్మకముల యొక్క అవసరతలేదు.
విద్యార్థి ఆరాధనలో మరియు అతని లేక ఆమె సంఘ సహవాసములో పాలుపంచుకొను సంఘ సభ్యునిగా ఉండాలి. సంఘములలో చేరుటకు ఇష్టపడని విద్యార్థులు పరిచర్య తర్ఫీదుకు సరిపోరు. ఆదర్శవంతముగా, వారు నేర్చుకొనుచున్న విషయములను ఆచరణలో పెట్టుటకు అనుమతినిచ్చు సంఘములో సభ్యులుగా ఉండాలి.
ఒక స్థానిక ఇన్స్టిట్యూట్ చదవగల మరియు వ్రాయగల విద్యార్థులను సేవించుటకు రూపొందించబడాలి. వారు స్కూల్ గ్రాడ్యుయేట్లు అయ్యుండనవసరంలేదు, కాని కోర్సులను అర్థం చేసుకోవడానికి మరియు అభ్యాసములను పూర్తిచేయడానికి చదవడం మరియు వ్రాయడం వచ్చి ఉండాలి. ఈ స్థాయిలో అభ్యాస సామర్థ్యం కలిగిన విద్యార్థులకు ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ అందించాలి.
అభ్యాసములను చేయలేని, కాని నేర్చుకోవాలనే ఆసక్తి కలిగిన విద్యార్థులకు ఇతర స్థాయిలో బోధనను అందించవచ్చు. ఉదాహరణకు, బోధకులు సాధారణ సంఘ కూడికలలో లేదా గృహ బైబిలు అధ్యయన సమూహములలో చదవడం బాగా రాని మరియు అభ్యాసములను చేయలేని వారిని బోధించవచ్చు.
మన విద్యార్థులను అర్థము చేసుకొనుట
స్థానిక SGC ఇన్స్టిట్యూట్లలో చేరు విద్యార్థులు ఇతర రకముల ఇన్స్టిట్యూట్లలోని విద్యార్థుల కంటే భిన్నమైనవారు. వారు విద్యాలయంలో పిల్లల వంటివారు కారు. వారు విశ్వవిద్యాలయ విద్యార్థుల కంటే మరియు బైబిలు కళాశాలలో ఉన్న అనేకమంది విద్యార్థుల కంటే భిన్నమైనవారు. ఇట్టి తరగతి కొరకు బోధకులు తన శైలులను అలవరచుకోవాలి. కొందరు విద్యార్థుల యొక్క అధ్యయన సామర్థ్యతలు ఒక కాలేజీ విద్యార్థి యొక్క సామర్థ్యత కంటే తక్కువగా ఉండవచ్చు. బోధకులు వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలి. అభ్యాసములను ఎలా చేయాలో వారు విద్యార్థులకు వివరించాలి. వారు సోమరితనమును మరియు నిర్లక్ష్యమును మందలించాలిగాని, వారు విద్యార్థుల యొక్క అభ్యాసములను విమర్శించుట అమర్యాదగా ఉండక, సహాయకరముగా మరియు ప్రోత్సాహకరముగా ఉండాలి.
గుర్తుంచుకోండి, దేవుడు వ్యక్తులను పరిచర్య కొరకు పిలచియుంటే, వారికి కావలసిన సామర్థ్యతలను కూడా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. విద్యార్థులు ఇప్పటికే తమ పరిచర్యలలో అభిషేకమును మరియు దేవుని ఆశీర్వాదమును కనుపరచుచుండవచ్చు. వారు అభివృద్ధి చెందుటలో సహాయము చేయుట మన బాధ్యత అయ్యున్నది. వారిని నిరుత్సాహపరచుట సరికాదు.
SGC విద్యార్థుల సమూహములలో పలు వయస్సులవారు ఉండవచ్చు. కొందరు అప్పుడే చదువును ముగించుకున్నవారు కావచ్చు. కొందరు అనేక సంవత్సరముల పాటు కాపరులుగా ఉన్నవారు కావచ్చు. కొన్నిసార్లు విద్యార్థి బోధకుని కంటే వయస్సులో పెద్దవాడు కావచ్చు.
ఇరవై సంవత్సరముల వయస్సు కలిగి ఇప్పుడే తన చదువును పూర్తి చేసుకున్న విద్యార్థికి అరవై సంవత్సరముల కాపరి కంటే ఎక్కువ అధ్యయన సామర్థ్యత ఉండవచ్చు. అయితే, ప్రతి ఒక్కరికి గౌరవమును చూపాలి. పరిపక్వత మరియు అనుభవమునకు అమర్యాద చూపు అధ్యయన సామర్థ్యతను మనము గౌరవించకూడదు. అధ్యయన అవసరతలను మనము ఉద్ఘాటించుచున్నప్పటికీ, అట్టి పనిలో అనుభవములేని విద్యార్థులకు అవమానము కలిగించకుండా మనము జాగ్రత్తపడాలి.
వయోజన విద్యార్థుల యొక్క లక్షణములు
వయోజన విద్యార్థి అను పదము వయోజన జీవితమును ఆరంభించిన విద్యార్థిని వర్ణించుటకు ఉపయోగించబడుతుంది. వయోజన విద్యార్థులు వివాహితులై, పిల్లలను కలిగియుండవచ్చు. వారు ఏదైనా వృత్తి లేక పరిచర్యను చేయువారు కావచ్చు. వారికి పలు విధముల జీవిత అనుభవాలు ఉండవచ్చు. వయోజనులు మరొకసారి విద్యార్థులగుటకు నిర్ణయించుకున్నప్పుడు, వారు కొన్ని వ్యక్తిగత లక్ష్యములకు సమర్పించుకొనుచున్నారు.
బోధకుడు మరియు తరగతి యొక్క శైలి వయోజన విద్యార్థుల యొక్క అవసరతలను తీర్చు విధముగా రూపొందించబడాలి.
1. వయోజన విద్యార్థులకు వెంటనే సహాయము చేయగల తర్ఫీదు అవసరమైయున్నది. వారు నేర్చుకొనుచున్నదానిని ఎలా ఆచరణలో పెడతారో వారు చర్చించవలసియున్నది. వారు జ్ఞానమును ఏ విధముగా అనువర్తించాలని ఆశించుచున్నారో విద్యార్థులు వర్ణించుటకు తరగతి సమయమివ్వాలి. విద్యార్థులతో సంభాషించకుండా కేవలం మెటీరియల్ ను అందించుట కొరకు మాత్రమే బోధకుడు తరగతి సమయమంతటిని వెచ్చించకూడదు.
2. వయోజన విద్యార్థులకు గౌరవము అవసరమైయున్నది. వారికి ఇప్పటికే వయోజన బాధ్యతలు ఉన్నాయి మరియు వారు పిల్లల వలె వ్యవహరించబడుటను ఇష్టపడరు. బోధకులు నేర్చుకొనువారి వైఖరిని కలిగియుండి, వారిచ్చు ఆలోచనలను స్వీకరించాలి. వారి విద్యార్థుల యొక్క అనుభవము మరియు మెళకువలకు వారు గౌరవమును చూపాలి.
3. వయోజన విద్యార్థులు నేర్చుకొనుచుండగా కొన్ని ఎంపికలు చేయగోరతారు. వారి అనుభవాలు మరియు లక్ష్యములు కొన్ని రకముల అధ్యయనమును వారికి ఆకర్షణీయముగాను, ఔచిత్యముగాను చేస్తాయి. వారి ఆసక్తులను అనుసరించుటకు మరియు వారి సొంత అధ్యయన శైలులను అభివృద్ధిచేసుకొనుటకు వారికి స్వాతంత్ర్యము అవసరము.
4. వయోజన విద్యార్థులు తరగతిలో అభ్యసించగోరతారు. విద్యార్థులు ప్రెసెంటేషన్లు చేయుటకు, మెటీరియల్ లోని కొన్ని భాగములను వివరించుటకు, మరియు ప్రశ్నలకు జవాబులిచ్చుటలో సహాయము చేయుటకు బోధకులు అనుమతించాలి. బోధకులు కాలయాపన చేయుటను నివారించవలసియున్నప్పటికీ, ఒక కథ అతడు లేక ఆమె నేర్చుకున్న విషయములను అనువర్తించుకొనుటకు విద్యార్థి ఉపయోగించు ఒక మార్గమైయున్నదని వారు గుర్తించాలి.
5. వయోజన విద్యార్థులు ఇతర విద్యార్థులతో సంబంధములను అభివృద్ధిచేసుకుంటారు. వారు ఒకరికొకరు ఇచ్చుకొను ఫీడ్ బ్యాక్ నుండి నేర్చుకుంటారు. వారు మర్యాదను ఇస్తారు మరియు తీసుకుంటారు. వయోజన విద్యార్థులు కొన్ని సంభాషణలను వారి మిగిలిన జీవితములన్నిటిలో జ్ఞాపకము చేసుకుంటారు మరియు విలువనిస్తారు. తరగతిని కొన్ని సమయాలలో సంభాషణ కొరకు చిన్న చిన్న సమూహములుగా విభజించుట అవసరము.
6. వయోజన విద్యార్థులు తమ స్వంత తర్కసమ్మత నిర్ణయాలను చేసుకోవాలని కోరుకుంటారు. కొన్ని భిన్నమైన అభిప్రాయాలను సహించవలసిన అవసరముందని వారు ఆశిస్తారు.
7. వయోజన విద్యార్థులు బోధకుని ఇష్టపడాలని మరియు గౌరవించాలని కోరతారు. వారికి మరియు బోధకునికి మధ్య ఉన్న స్థాయి దూరము విశ్వవిద్యాలయములో ఒక విద్యార్థి మరియు బోధకుని మధ్య ఉన్న దూరము అంత గొప్పదిగా ఉండాలని వారు ఆశపడరు. బోధకుని నుండి వ్యక్తిగత ఆసక్తిని వారు కోరతారు. వారు బోధకుని జ్ఞానమును మాత్రమేగాక, అతని సమర్పణగల జీవితమును మరియు ప్రవర్తనను కూడా మెచ్చుకోవాలని కోరతారు.
విద్యార్థుల కొరకు ఫీడ్ బ్యాక్
మంచి అధ్యయన అలవాట్లను గూర్చి మాట్లాడుట కొరకు తరగతిలో మరియు వ్యక్తిగత విద్యార్థులతో బోధకుడు సమయమును కేటాయించాలి. తమను తాము క్రమశిక్షణలో పెట్టుకొను విధానమును మరియు అనుదిన అధ్యయన సమయమును షెడ్యూల్ చేసుకొను విధానమును విద్యార్థులు నేర్చుకోవాలి.
బోధకుడు అభ్యాసములు మరియు హాజరును జాగ్రత్తగా రికార్డు చేయాలి. కోర్సు ముగింపులో, ఆ రికార్డు గ్రేడ్ కు ఆధారంగా ఉంటుంది. కోర్సు సమయంలో, వ్యక్తిగత విద్యార్థులు సరిగా చేయకపోతే, బోధకుడు వారితో మాట్లాడి వారు ఎలా మెరుగుపడాలో చెప్పాలి.
అభ్యాసమును ఎలా చేయాలో అర్థము చేసుకొనుటలో విద్యార్థికి సహాయము చేయుట బోధకుని యొక్క ప్రాముఖ్యమైన పని అయ్యున్నది. సరిగా చేయని అభ్యాసములను సరిచేయుటకు విద్యార్థులకు తిరిగిఇవ్వాలి, కాని ఆ అభ్యాసమును ఎలా మెరుగుపరచాలో విద్యార్థి అర్థము చేసుకొనునట్లు బోధకుడు చూచుకోవాలి.
విద్యార్థి యొక్క హాజరు లేక అభ్యాసములు వారి గ్రేడులను తగ్గించుచున్నట్లయితే, అభివృద్ధి చెందవలసిన అవసరతను గూర్చి బోధకుడు వారితో మాట్లాడాలి. కోర్సు యొక్క ముగింపులో వారు పొందు గ్రేడుల ద్వారా విద్యార్థులు ఆశ్చర్యపడకూడదు.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.