యియో ఫిలిప్పీన్స్‌లోని బౌద్ధ కుటుంబంలో పెరిగాడు. ముస్లింలు బౌద్ధులను వారి మతం కోసం చంపుతున్నప్పుడు మార్కెట్‌కి వెళ్లడం సురక్షితం కాని రోజులను అతను గుర్తు చేసుకున్నాడు. యియో కొన్ని సార్లు తన తల్లితో కలిసి కొన్ని సార్లు బౌద్ధ దేవాలయానికి వెళ్లి ధూపం వెలిగించేవాడు. ఒక రోజు అతని అక్క అనారోగ్యంతో ఉన్నపుడు డాక్టర్ అక్కడ ఉన్నా ఏమీ చేయలేకపోయాడు, అప్పుడు యియో వాళ్ళ తల్లి బుద్ధుని సహాయం కోసం నిర్విరామంగా వేడుకుంది/ నిర్విరామంగా ప్రార్థించింది.
ప్రతి విద్యార్థి ఒక పేరా లో ఈ గ్రంథ భాగానికి సారాంశం వ్రాయాలి. ఈ లేఖన భాగం మనకు దేవుడు, మనిషి, పాపం, మరియు లోకం గురించి ఏమి చెబుతుంది? ప్రతి విద్యార్థి ఒక ప్రకటన జాబితా వ్రాసి వాటిని సమూహంగా చర్చించండి.
బౌద్ధమతం
బౌద్ధమతం యొక్కఆరంభం
బౌద్ధమతం సిద్ధార్థ గౌతముడు ద్వారా ప్రారంభించబడింది. ఆయన మరణించిన 400 సంవత్సరాల తర్వాతే ఆయన జీవితం గురించి వ్రాయబడ్డాయి, కాబట్టి ఆయన జీవితం గురించి వివరాలు స్పష్టంగా లేవు.
గౌతముడు సుమారు క్రీ.పూ 563లో జన్మించాడు. అతను భారతదేశంలోని ఒక చిన్న రాజ్యానికి చెందిన రాజు కొడుకు. యవ్వనంలో, అతను తన రక్షకభటులను తప్పించుకొని ప్రపంచాన్ని చూడటానికి వెళ్ళాడు. అతను పేదరికం మరియు రోగాలతో ఉన్న ప్రజలను చూసి, జీవితం ప్రధానంగా దుఃఖం మరియు బాధలతో నిండివుంటుందని తెలుసుకున్నాడు.
గౌతముడు వాస్తవం యొక్క స్వరూపం గురించి తనకు స్పష్టత వచ్చిందని దాని అనుభవాన్ని పొందాడని చెప్పాడు. 'బుద్ధ' అనే పదం " జ్ఞానోదయం " అనే అర్థాన్ని కలిగి ఉంది. అందువల్ల గౌతముడిని ఎక్కువగా "బుద్ధుడు" అని పిలుస్తారు.
బైబిల్, యేసు క్రీస్తును అంగీకరించని ఆత్మల సందేశాలను విశ్వసించవద్దని చెబుతుంది, (1 యోహాను 4:3 చూడండి). గౌతముడు పొందిన జ్ఞానోదయం అసత్యం.
ప్రస్తుత ప్రభావం
నేడు బౌద్ధమతంలో అనేక వేరువేరు వర్గాలు ఉన్నాయి. వారు ప్రపంచవ్యాప్తంగా ఐక్యంగా లేరు.
బౌద్ధులు పవిత్ర గ్రంథాలుగా భావించే రచనలు వేలాది సంపుటాలను నింపుతాయి. అందువల్ల, ప్రతి శాఖ వాటన్నింటినీ అధ్యయనం చేయడానికి ప్రయత్నించకుండా, కొన్నింటిపై దృష్టి పెడుతుంది.
► ఒక క్రైస్తవుడు బైబిల్‌ను చూడడం బౌద్ధుడు తన గ్రంథాలను చూడడంలో ఎలా వేరుగా ఉంటుంది?
ఉద్దేశపూర్వకంగా బౌద్ధ బోధనలను అనుసరించే ప్రపంచంలోని బౌద్ధులుగా ప్రకటించుకునే వారి సంఖ్య కనీసం 350 మిలియన్లు/ 35 కోట్లు. వేరే మతానికి విధేయత చూపకుండా 1 బిలియన్/100 కోట్లమంది, వారికి బౌద్ధమతం బోధించబడినందున, వారు తమను తాము బౌద్ధులుగా చెప్పుకుంటారు.
వారు బౌద్ధమతం యొక్క పునాది/ ముక్యమైన పురాణాల సిద్ధాంతాలను అర్థం చేసుకోకపోయినా, గుంపుగా కలిసి కూడి పోయినాపాల్గొనకపోయినా. బౌద్ధ రచనల యొక్క కొన్ని సలహాలను అనుసరిస్తున్నందున తమను తాము బౌద్ధులు అని పిలుచుకుంటారు.
బౌద్ధులు ఒక వ్యక్తిగా ఉన్న సర్వోన్నతుడైన దేవుడిని నమ్మరు. బదులుగా, ఉన్న ప్రతిదీ కలిపి ఒకటిగా భావించే పరమసత్యాన్ని నమ్ముతారు. అందుకే బౌద్ధులు ధ్యానం చేస్తారు, కానీ వారు ప్రార్ధించరు/ ప్రార్థన చేయరు. ఎందుకంటే తమ ప్రార్ధనలు విని దానికి జవాబు/ సమాధానం ఇచ్చే దేవుడిని వారు నమ్మరు. బౌద్ధ గ్రంథాలలో ప్రార్థనలు ఉన్నప్పటికీ, అవి ఎవరికీ ఉద్దేశించి రాయబడలేదు. బౌద్ధంలో ఏ రకమైన దేవుళ్లకు/దేవతలకీ ప్రాధాన్యం లేదు.
దేవుడు మన ప్రార్ధనలు వింటాడని విశ్వాసంతో ప్రార్థించడం క్రైస్తవులకు గొప్ప విశేషమైన కృప, (మత్తయి 6:6-8 మరియు 1 యోహాను 5:14-15 చూడండి).
బౌద్ధులు ప్రారంభం లేని, ముగింపు లేని, శాశ్వతంగా మార్పు చెందని అనంత కాల జీవిత చక్రం విశ్వసిస్తారు.
బైబిల్లో ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయని, సమయం ఇప్పుడున్నట్లు ఎప్పటికీ కొనసాగదని చెప్తుంది (2 పేతురు 3:10 చూడండి).
పునర్జన్మ మరియు నిర్వాణ
గౌతముడు తన కొత్త మతాన్ని స్థాపించే ముందే, అతని సంస్కృతిలోని చాలా మంది ఇప్పటికే పునర్జన్మను నమ్మేవారు. పునర్జన్మ అంటేమనిషి చనిపోయిన తరువాత, మరొక వ్యక్తిగా లేదా జంతువు, పురుగు వంటి ప్రాణిగా పునర్జన్మ పొందడం. పునర్జన్మ ద్వారా మనిషి అనేక జీవితాలను అనుభవిస్తాడు.
బౌద్ధులు, ఒక మనిషి చేసిన మంచి పనులు (మంచి కర్మ) అతను చేసిన చెడు పనులకంటే (చెడు కర్మ) ఎక్కువగా ఉంటే, ఆ వ్యక్తి తరువాత జన్మలో మంచి జీవితానికి పుడతాడని విశ్వసిస్తారు.
[2]బైబిలు చెప్తుంది మన క్రియలు దేవునితో అంగీకారాన్ని సంపాదించవు లేదా మన పాపాలకు మూల్యం చెల్లించవు, (రోమా 3:20 చూడండి).
గౌతమ అభిప్రాయం ప్రకారం, ఒక వ్యక్తి యొక్క సంవేదన/స్వభావం పునర్జన్మ కాదుఆత్మానికి చేరుకునే కొన్ని పదార్థాలు మాత్రమే కొత్త ప్రాణికి వినియోగిస్తారు. అంటే ఒక జీవితంలో మరణం వాస్తవంగా వ్యక్తిత్వం ముగిసేలా ఉంటుంది
యేసు తనను నమ్మిన వారికి నిత్యజీవము ఇస్తాడు, (యోహాను 10:27-28 చూడండి).
కొన్నిసార్లు మనుషులు పునర్జన్మ భావనను ఇష్టపడతారు, ఎందుకంటే జీవితం చాలా దయనీయంగా ఉంది. గౌతమ అనితిగా భావించాడు. పునర్జన్మ అనేది మంచి విషయం కాదని విశ్వసించాడు. ఆతను ఒక వ్యక్తికి పునర్జన్మ చక్రం నుండి పారాయణానికి లక్ష్యం ఉండాలని నమ్ముకుంటాడు.
నిజమైన బౌద్ధుడు అన్ని కోరికల నుండి విముక్తి పొందడానికి బౌద్ధ జీవన విధానాన్ని అనుసరిస్తాడు. అతను విజయవంతమైతే, అతను దేనినీ లేదా ఏ మానవ సంబంధాన్ని కోరుకోడు లేదా ఆస్వాదించడు.
[3]క్రైస్తవులకు, మానవ సంబంధాలు చాలా ముఖ్యమైనవి మరియు అవి ఆనందం కలిగిస్తాయి, (1 థెస్సలొనీకయులు 3:12 చూడండి).
ఒక బౌద్ధుడు తాను మరణించినప్పుడు, మరొక జీవిగా జన్మించే బదులు నిర్వాణంలో ప్రవేశిస్తాడని నమ్ముతాడు. బౌద్ధమతానికి చెందిన బౌద్ధుడి అంతిమ లక్ష్యం ఇదే. కొన్నిసార్లు మనుష్యులు నిర్వాణ అనేది క్రైస్తవులు నమ్మే స్వర్గంగా భావిస్తారు. కానీ నిర్వాణం అనగా శూన్యత్వం, ఆత్మ యొక్క ముగింపు, ఆరిపోయిన దీపం లాంటిది. ఒక వ్యక్తి నిర్వాణాన్ని చేరుకుంటే, అతను ఆలోచించే జీవిగా ఇకముందు ఉండడు.
అసలు బౌద్ధమతంలో, ఒక వ్యక్తి బౌద్ధ సన్యాసి అయితే తప్ప తన ప్రస్తుత జీవిత చివరిలో నిర్వాణకు చేరుకునే అవకాశం లేదు. ఒక మహిళకు నిర్వాణం పొందే అవకాశం లేదు, పురుషునిగా పునర్జన్మ తీసుకుని సన్యాసిగా అయితే తప్ప తనకు నిర్వాణానికి వెళ్లే అవకాశం లేదు
బౌద్ధమతం యొక్క నాలుగు మహాసత్యాలు
గౌతముడు తన జ్ఞానోదయానంతరం బోధించిన విశ్వాసాలు బౌద్ధం యొక్క నాలుగు సత్యాలలో సంక్షిప్తం చేయబడ్డాయి.
1. జీవితం దుఃఖం మరియు బాధతో నిండియున్నది నిజమైన ఆనందం లేదు
2. బాధ అనేది కోరికల ఫలితం, ఎందుకంటే మనం కోరుకునేది ఏదీ శాశ్వతం కాదు.
3. అన్ని కోరికల నుండి విడిపోవడం అనేది బాధ నుండి తప్పించుకోవడానికి మార్గం.
4. బౌద్ధ నీతుల ప్రకారం ఎనిమిది సూత్రాలు వ్యక్తిని అన్ని కోరికల నుండి వేరుపరచి నిర్వాణం వైపు తీసుకెళ్తాయి
► నాలుగు సత్యాలలో క్రైస్తవుడు ఏదైనా అంగీకరించగల విషయములు ఉన్నాయా?
గౌతమునిఅభిప్రాయం ప్రకారం, బాధలన్నీ కోరికల వల్లనే వస్తాయి. ఒక వ్యక్తి ఏమీ కోరుకోలేకపోతే, అతను బాధపడడు. నిజంగా బుద్ధమతాన్ని నమ్మే బౌద్ధుడిగా ఉండాలంటే దేనిలోనూ ఆనందం పొందకుండా ఉండటం నేర్చుకోవాలి.
ఒక బౌద్ధ సన్యాసి సంగా మాజి గురించి ఒక కథ ఉంది. అతను సన్యాసిగా మారి తన కుటుంబాన్ని వదిలి, తన సమయాన్ని తిరుగుతు మరియు ధ్యానం చేయడంలో గడిపాడు. ఒకసారి తన భార్య అతన్ని కనుగొని, వారి బిడ్డని అతని ముందు ఉంచి, వాళ్ళకు సహాయం చేయమని వేడుకుంది. సంగా మాజి ఆమె వెళ్ళిపోయే వరకు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా కూర్చున్నాడు. అతనికి భార్య వచ్చి ఆనందం లేకుండా మరియు ఆమె వెళ్ళిపోయినప్పుడు బాధ లేకుండా ఉన్నందుకు గౌతముడు ఈ మనిషి బౌద్ధమత గమ్యం చేరుకున్నాడని చెప్పాడు.
క్రైస్తవులు పెళ్లిని ఆనందాన్ని కలిగించే సంబంధంగా భావించి దానికి (ఆ సంబంధానికి) కట్టుబడి ఉంటారు, (ఎఫెసియులకు 5:28 చూడండి).
బౌద్ధం సద్గుణాల జీవితాన్ని ముఖ్యమని ఉద్ఘాటిస్తుంది. మీకు మరియు ఇతరులకు లాభం చేకూర్చి, ఎవరికి హాని చేయని కార్యం సద్గుణంగా భావిస్తారు. ఒక వ్యక్తి యొక్క ఉద్దేశాలు అతని కార్యం యొక్క ఫలితాల కంటే ముఖ్యమైనవి.
బౌద్దులు ఆచరించే మానసిక లేదా ఆత్మీయ ఆచరణలు మనిషిని స్వార్ధం నుండి బయటపడేలా సహాయం చేయడానికి తయారు చేయబడ్డాయి. అన్ని ఆందోళనల మూలం స్వీయంపై అధిక శ్రద్ధతోనేనని బౌద్ధులు విశ్వసిస్తారు. వారు స్వీయాన్ని మరిచి అన్నిస్పృహ జీవులను (మనస్సులు ఉన్న జీవులు) ప్రేమిచడం మర్చిపోవాలనుకుంటారు . కానీ, దేవునితో సంబంధం లేకుండా, నిస్వార్థత మరియు ప్రేమకు పునాదిలేదు.[4]
► దేవునితో సంబంధం లేకుండా ఒక వ్యక్తి నిజంగా నిస్వార్థంగా, ప్రేమగా ఎందుకు ఉండలేడు?
తమను బౌద్ధులు అనుకునే చాలా మంది బౌద్ధ సంప్రదాయంలోనే పెరిగారు, ఇతర మతాలను నిజంగా మరియుతీవ్రంగాపరిగణించలేదు. తమ మతం యొక్క భావనలు మాత్రమే వారికి నిజమైనవిగా కనిపిస్తాయి. వారి ఆచారాలు వారి రోజువారీ జీవితంలో భాగమై ఉంటాయి.
సాధారణంగా, మరొక మతం నుండి బౌద్ధమతంలోకి మారేవారు ఈ మతం యొక్క జీవన తత్వశాస్త్రం ద్వారా ఆకర్షించబడతారు. వారు నిర్వాణాన్ని కోరుకున్నందుకో లేదా దాన్ని చేరాలనుకున్నందుకో కాదు. కానీ, బౌద్ధమతం వారికి ఆందోళన మరియు సంఘర్షణలేని జీవితాన్ని అందిస్తుందని అనుకుంటారు. అనేకులు భౌద్ధమతం తమ జీవితంలో ముందు కలిగిన ఒత్తిడి నుండి విముక్తి పొందారని తమ జీవితం మునుపటికన్నా క్రమబద్ధంగా మారిందని భావిస్తున్నారు.
► ఇప్పుడు వెనక్కి వెళ్లి బోల్డ్ మరియు ఇటాలిక్ లో ఉన్న వచనాలను మరియు ప్రతి శాస్త్రమును చదవండి
దేవుడు నిజంగా ఉన్నాడు. ఆయన ఇక్కడ ఉన్నాడు అక్కడా ఉన్నాడు, అన్నిచోట్లా ఉన్నాడు. ఆయన చెట్టులో లేదా రాతిలో ఉండే వాడు కాదు, ఆయన సర్వవ్యాపి. ఆయన విశ్వంలో స్వేచ్ఛగా ఉండి, ప్రతిదానికీ దగ్గరగా, ప్రతివానికి దగ్గరగా ఉంటారు. యేసు క్రీస్తు ద్వారా ఆయన ప్రతీ ప్రేమగల హృదయానికి అందుబాటులో ఉన్నాడు.
బైబిల్ తన మొదటి పేజీలులో తాత్వికమైనది పాంతీజిజం (దేవుడు మరియు మొత్తం విశ్వం ఒకేవారు అని ఉపదేశిస్తుంది) మరియు డీయిజం/ దైవవాదం (దేవుడు ఈ లోకాన్ని సృజించి దాని నియమాలకు దాన్ని వదిలేసాడు) ను ఖండిస్తుంది. దేవుడు తన చేసిన విశ్వంతో గుర్తింపు పొందలేదు. అది తన హస్తక్రియ. ఇతర విధంగా, ప్రపంచం దేవుడి సృజనాత్మక మరియు సంరక్షణాత్మక శక్తి లేకుండా ఉండలేదు
"నేను విశ్వసిస్తున్నాను... ఒక్క ప్రభువైన యేసు క్రీస్తు... ఆయన ద్వారానే అన్నీ సృష్టించబడ్డాయి, ఆయన మన కోసం, మన రక్షణ కోసం స్వర్గం నుండి దిగి వచ్చాడు... మరియు మనిషిగా చేయబడ్డాడు మరియు మన కోసం సిలువ వేయబడ్డాడు".
సువార్త ప్రచారం/సిద్ధాంతాల చేతి పుస్తకాన్ని ఉపయోగిస్తూ
బౌద్దులు తమ్ము తాము క్రిస్తవులని చెప్పుకోరు అలాగే బైబిల్ కీ అధికారం ఉన్నట్టుగా భావించరు కాబట్టి, వారి నమ్మకాలూబైబిల్ నమ్మకాలతో స్థిరంగా లేదా అనుకూలంగా లేదని చూపటం సరిపోదు. బైబిలు తమ మతానికి కాకుండా వేరే మతానికి మద్దతుఇస్తుందని వారికి అప్పటికే తెలుసు.
సువార్తను ప్రభావితంగా ప్రకటించడం చాల ప్రాముఖ్యము. మీరు ఒక బౌద్ధుడితో సంభాషిస్తున్నప్పుడు, మీ నమ్మకాల పునాదిని వివరించాలనుకుంటున్నారని చెప్పండి. కేవలం సువార్తను ప్రకటించండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ పని కారణంగా దేవుని సత్యానికి శక్తి ఉంది.
మీరు మీ సాక్ష్యాన్ని కూడా పంచుకోండి. సువార్త ఎలా మిమ్మల్ని దేవునితో ఒక సంబంధాన్నిఏర్పాటు చేసిందో, మీకు క్షమాపణను, పాపం నుండి విముక్తిని ఎలా ఇచ్చిందో,మీ జీవితానికి అర్థాన్నిఎలా ఇచ్చిందో చెప్పండి.
సువార్త ప్రదర్శన మరియు వ్యక్తిగత సాక్ష్యం యొక్క ప్రాథమిక అంశాలకు మించి, మీరు బౌద్ధుల ప్రత్యేక అవసరాలతో సువార్త సత్యంతో మాట్లాడండి. బౌద్ధమతం జీవితంలోని బాధలను, దుఃఖాలను వివరించడానికి కష్టపడుతోంది.అది జీవితంలో ఉత్తమమైన వస్తువుల నిజాలను, ఉన్న ఆనందాన్ని వివరించడంలో విఫలమవుతుంది. బౌద్ధమత బోధనలు మానవ సంబంధాలతో సహా జీవితంలో ముఖ్యమైనవిగా అనిపించే ప్రతిదాని ప్రాముఖ్యతను తిరస్కరిస్తాయి. ఈ మతం తన ఆరాధకులతో సంబంధం కలిగి ఉన్న వ్యక్తిగత దేవుడు లేని మతం.ఇది శాశ్వతమైన జీవితాన్ని లేదా ముఖ్యమైన వ్యక్తిగత విధిని అందించదు.
బాధ
బౌద్ధులు బాధ అనేది అర్థం లేనిదాని మరియు వాస్తవం కాదని నమ్ముతారు. ఇది అసంతృప్తికరమైన వివరణ.
క్రైస్తవత్వం ఈ లోకంలో ఉన్న బాధను వివరిస్తుంది. ఈ లోకంలో దేవునిచే లోపం లేనిదానిలా సృష్టించబడింది. కానీ మానవుడు పాపం చేసి ప్రపంచాన్ని శపించబడేలా చేసాడు. వృద్ధాప్యం, అనారోగ్యం మరియు మరణం ఎందుకు ఉన్నాయో క్రైస్తవత్వం వివరిస్తుంది. మనుషుల నిరంతర దుష్ట చర్యలలో/ చేడు కార్యాలు కూడా వారిలో ఉన్న పాపాన్ని ఎత్తి చూపిస్తుంది.
ఆనందము
బౌద్ధులు జీవితంలో నిజమైన సంతోషం లేదని నమ్ముతారు, అందుకే మనం ఏమీ ఆశించకూడదు. ఇది మనుషులు, ముఖ్యంగా వ్యక్తిగత సంబంధాలలో అనుభవించే ఆనందం, సంతోషానికి విరుద్ధంగా ఉంది.
దేవుడు ప్రపంచాన్ని సృష్టించిన కారణంగా, ప్రపంచం దేవుని ప్రాథమిక రూపకల్పనకు పరిపూర్ణంగా లేకపోయినప్పటికీ, జీవితంలో ఇంకా చాలా సంతోషం మరియు ఆనందం ఉందని గ్రహించాలి.
బౌద్ధుల మాదిరిగానే, క్రైస్తవులు కూడా భూసంబంధమైన విషయాలు శాశ్వతమైనవి కావని గ్రహిస్తారు. ఇక్కడ ఉన్నదాన్ని శాశ్వతంగా ఉంచుకుంటామని భావించి మనం జీవించకూడదు. అయితే, ఒక క్రైస్తవుడు తాను దేవునితో శాశ్వతంగా జీవిస్తానని తెలుసు కాబట్టి జీవితాన్ని ఆస్వాదించవచ్చు. విషయాలు శాశ్వతమైనవి కానప్పటికీ, అవి వాస్తవమైనవి, మన ఎంపికలు శాశ్వతమైన ఫలితాలను కలిగి ఉంటాయి. ఇది మానవ జీవితానికి లక్షాన్ని, జీవిత ప్రాముఖ్యతను ఇస్తుంది.
ఇతరులతో సంబంధల గురించి
బౌద్ధ ఉపదేశాలు పూర్తిగా అనుసరించబడితే, సంబంధాలు విలువలేనివి కావున వాటి నుంచి దూరంగా ఉండాలని సూచిస్తాయి. కానీ, మానవ స్వభావం నిబద్ధమైన సంబంధాల కోసం ఆరాటపడుతుంది.
దేవుడు మనలను ఇతరులతో సంబంధాలు కలిగించేలా సృష్టించాడు. ఇతరులు మనను విలువచేయాలని మనం కోరుకుంటాం. ఇతరులతో నిబద్ధతతో సంబంధాలు కట్టాలని మనం కోరుకుంటాం. మనం అందరం శాశ్వత జీవులుగా, శాశ్వత గమ్యాలతో ప్రత్యేకంగా సృష్టించబడ్డామని తెలుసు కాబట్టి సంబంధాలు ఎంతో ముఖ్యమైనవి.
దేవునితో అనుబంధం గురించి
బౌద్ధం దేవుడిని లేని మతం. కానీ మనందరికీ దేవుని గురించి తెలుసుకోవాలని, ఆయనను పూజించాలని లోతైన అవసరం ఉంటున్నట్టు గ్రహిస్తున్నాము.
దేవుడు మనల్ని తనతో సంబంధంలో జీవించడానికి రూపకల్పన చేశాడు. ఒక వ్యక్తి దేవునితో వ్యక్తిగత సంబంధంలో ఉండేవరకు పూర్తిగా తృప్తి చెందడు. మన సృష్టికర్తతో ఉన్న సంబంధం శాశ్వతం, స్వర్గం అనేది దేవునితో కలిసి ఉండే స్థలం.
పాపాక్షమాపణ
బౌద్ధం పాపాల క్షమాపణకు ఆలోచన లేనిది. తప్పు చేసినందుకు ఎవరూ మనిషిని బాధ్యత వహించాలేదు. చేసిన తప్పుల కోసం ఏదీ పరిహారం చేయలేదు. ఈ కారణాల వల్ల, బౌద్ధులకు పాపాక్షమాపణ గురించి నమ్మకం/ హామీ లేదు.
ప్రతి వ్యక్తి దోషి అని, పాపం నుండి క్షమించబడాలని బైబిలు మనకు చూపిస్తుంది. యేసు క్రీస్తు మనకోసం ప్రాయశ్చిత్తం చేసాడు కాబట్టి, మనం క్షమించబడగలమని మనకు హామీ ఉంది.
ఒక బౌద్ధునితో పంచుకోవడానికి సిద్ధాంతాల చేతి పుస్తకాన్ని నుండి ఈ క్రింది విభాగాలను ఉపయోగించండి:
(9) రక్షణ కేవలం క్రీస్తు ప్రాయశ్చిత్తంతోనే సాధ్యం.
యియో తల్లి తన మరణిస్తున్న కుమార్తెను నయం చేయమని బుద్ధుడిని తీవ్రంగా ప్రార్థించింది, కానీ సహాయం లేదని అనిపించింది. అప్పుడు ఆమెకు సమీపంలో బోధిస్తున్న వాంగ్ అనే క్రైస్తవ మిషనరీ గుర్తుకు వచ్చింది. ఆయనను తీసుకురావడానికి ఆమె యియో పంపింది. వాంగ్ వచ్చినప్పుడు, "బుద్ధుడిని ప్రార్థించవద్దు, యేసును ప్రార్థించండి" అని అన్నాడు. వాంగ్ ప్రార్థన చేయడం ప్రారంభించాడు, ఆ అమ్మాయి నయం చేయబడింది. యియో తల్లి ఆ రోజు క్రైస్తవునిగా మారింది, తరువాత యియో క్రైస్తవునిగా మారాడు.
లేఖన అధ్యయనం – భాగం 2
ఇప్పుడు ఆదికాండము 3ను మళ్లీ చదవండి. ప్రతి విద్యార్థిని ఈ ప్రకరణం కోసం ఒక ప్యారా రచించాలి. బుద్ధుధర్మికుడికి ఈ పాఠం పండించడానికి ఏమి సందేశాన్ని ఉందో వివరించండి. విద్యార్థులు వారు రాసిన వాటిని తరగతి గదిలో పంచుకోవచ్చు.
ప్రతి పాఠానికి కేటాయించిన పని
ఈ మత సమూహంలోని ఎవరికైనా సువార్తను అందించే అవకాశాన్ని కనుగొనడం గుర్తుంచుకోండి. మీరు జరిపిన సంభాషణ గురించి మీ సహవిద్యార్థులతో పంచుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీ రెండు పేజీల లిఖిత నివేదికను వ్రాసి, మీ తరగతి నాయకుడికి ఇవ్వండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.