ఈస్టర్న్ ఆర్థడాక్సీ గురించి జోనాథన్‌కు తెలుసుకోగానే, ఎన్నో దేశాల్లో ముస్లింల మరియు కమ్యూనిస్టుల నుండి వచ్చిన తట్టుకునే పీడనను, హింసలను వారు ఎలా ఎదుర్కొన్నారో అతనికి బాగా అద్భుతంగా అనిపించింది.అక్కడ పెద్ద సంఘల యాజకులను లేదా సంగీత నాయకులను కాదు, హతసాక్షులను వీరుడుగా గౌరవిస్తారు. ప్రపంచంలో పీడన మరియు హింస మరింత తీవ్రమైనదిగ పెరిగితే, ఈస్టర్న్ ఆర్థడాక్సీ విశ్వాసులు దాన్ని తట్టుకొని నిలబడగలరని జోనాథన్ భావించాడు.
► అందరూ కలిసి మొదటి థెస్సలొనీక 1ని చదవండి. ప్రతి విద్యార్థి ఒక పేరా లో ఈ గ్రంథ భాగానికి సారాంశం వ్రాయాలి. ఆ సమయంలో వారు క్రైస్తవులుగా మారినప్పుడు ఏమి జరిగింది? ప్రతి విద్యార్థి ఒక ప్రకటన జాబితా వ్రాసి వాటిని సమూహంగా చర్చించండి.
ఈస్టర్న్ ఆర్థడాక్సీ
ఈస్టర్న్ ఆర్థడాక్సీకి పరిచయం
ఆర్థడాక్స్" అనే పదనికి గ్రీకులో "సరైన ఆరాధన" అని అర్ధం. ఈస్టర్న్ ఆర్థడాక్స్ సంఘం తామే సరైన సిద్ధాంతం మరియు దేవునికి ఆరాధన అందించే నిజమైన సంఘంగా నమ్ముతుంది.
ఈస్టర్న్ ఆర్థడాక్సీ మరియు రోమన్ కాథలిక్కు A.D. 1054లో అధికారికంగా విడిపోయాయి. వీటిలో ప్రతి ఒక్కదీ యేసు క్రీస్తు మరియు అపొస్తలులచే స్థాపించబడిన అసలైన సంఘంగా తమకే ధర్మం కలిగినదిగా నమ్ముతాయి. ప్రారంభ క్రైస్తవుల సంప్రదాయం ప్రకారం, ప్రతి ఒక్కరూ ఇది భూమిపై దేవుని సంఘం అని మరియు ప్రామాణికమైన సిద్ధాంతం ఉన్న ఏకైక సంఘం అని అంటారు. వీటిలో ప్రధానమైన నమ్మకాల, సిద్ధాంతాలు చాలా వరకు ఒకటే. వీరితో గురించి అవగాహన లేని వారికి వీరి ఆరాధనలోపెద్దగా తేడా కనిపియ్యడు.
ఈస్టర్న్ ఆర్థడాక్సీకి 15 స్వీయ పాలన సంఘలు ఉన్నాయి, వీటిని భౌగోళికంగా విభజించారు. కొన్ని దేశాలలో ఈ సంఘం ఆ దేశానికి చెందిన పేరుతో రష్యన్ ఆర్థడాక్సు సంఘం లేదా సెర్బియన్ ఆర్థడాక్సు సంఘం వంటి పేర్లను పెట్టుకుంటారు. మొత్తం 15 సంఘాలలో, మిగిలిన వాటిలో గ్రీకు ఆర్థడాక్సు సంఘం ఆఫ్ ఆంటియాక్, రొమానియన్ ఆర్థడాక్సు సంఘం, కుప్ర సంఘం ఉన్నాయి.
[1]ప్రతి సంఘం సంస్థను ఒక పేట్రియార్క్ లేదా ఆర్చ్‌బిషప్ ద్వారా పాలిస్తారు. కాన్స్టాంటినోపుల్ లోని పేట్రియార్క్ ఈ 15 నాయకుల్లో అత్యున్నత పైస్థానం కలిగి ఉన్నారు. ప్రాచీన నగరం కాన్స్టాంటినోపుల్ ప్రస్తుతం ఇస్తాంబుల్, టర్కీగా ఉంది. కాన్స్టాంటినోపుల్ పేట్రియార్క్కు ఇతర సంఘలపై అధికారం లేదు, కానీ వారందరు అతనికి అత్యున్నత స్థానంగా గౌరవం ఇస్తారు.
ఈస్టర్న్ ఆర్థడాక్సీవిశ్వాసుల సంఖ్య 22.5 కోట్ల నుండి 30 కోట్ల వరకు ఉంటుంది. ఇది ప్రపంచంలో రోమన్ కాథలిక్కు తర్వాత రెండవ అతిపెద్ద క్రైస్తవ సంస్థ. చాలా తూర్పు దిక్కు ఐరోపా ఖండ దేశాలలో జనాభాలో ఎక్కువశాతం తాము ఈస్టర్న్ ఆర్థడాక్సుగా భావిస్తారు మరియు మధ్య ప్రాచ్యంలో కూడా ఈస్టర్న్ ఆర్థడాక్సీవిశ్వాసులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
► మీకు తెలిసిన ఈస్టర్న్ ఆర్థడాక్సీ సంఘలు ఏమిటి?
ఈస్టర్న్ ఆర్థడాక్సీ నమ్మకాలు
ఈస్టర్న్ ఆర్థడాక్సీ సంఘం త్రిత్వం, క్రీస్తు మరియు పరిశుద్ధ ఆత్మ యొక్క దేవత్వం వంటి క్రైస్తవ ప్రాథమిక సిద్ధాంతాలను నమ్ముతుంది.
ఈస్టర్న్ ఆర్థడాక్సీ సంఘం సంప్రదాయంపై ఎక్కువగా ఆధారపడుతుంది. ఒక సిద్ధాంతాన్ని నిరూపించడానికి, వారి నాయకులు బైబిల్ నుండి ఉదహరించినట్లుగా, ప్రారంభ సంఘం నాయకుల నుండి కూడా ఉదాహరణ ఇస్తారు. ఈస్టర్న్ ఆర్థడాక్సీ సంఘం వారి సిద్ధాంతానికి బైబిల్ అధికారం అని బోధిస్తుంది; కానీ బైబిల్లో ఉన్న వాటికి అర్థం సంఘమే చెబుతుంది.
ఆర్థడాక్సీ సంప్రదాయాల ఆధారంగా సంక్లిష్టమైన సిద్ధాంతాలు మరియు ఆచారాలను విధానాన్ని అభివృద్ధి చేసింది. ఈ సంఘం బైబిల్లో పేర్కొనని విషయాల గురించి కూడా రక్షణకు అవసరమైన ఉపదేశాలను అందించే అధికారం తమకు ఉందని నమ్ముతుంది. ఈస్టర్న్ ఆర్థడాక్సీవారి ఆచారాలు బైబిల్‌కు విరుద్ధంగా ఉండవని నమ్ముతారు.
ఆర్థడాక్సు సంఘల ఆరాధన శైలీ చాలా ప్రామాణికమైనది మరియు విధి విధానాల ప్రకారం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా చరిత్ర ప్రసిద్ధులైన పెద్ద కాథెడ్రల్స్ ఉన్నాయి. కాథెడ్రల్స్ చరిత్రాత్మక పరిశుద్ధుల (సెయింట్స్) చిత్రాలు మరియు విగ్రహాలతో అలంకరించబడి ఉంటాయి. యాజకులు ప్రత్యేక గౌన్లు ధరిస్తారు. ఆరాధనా కార్యక్రమాలు ప్రధానంగా యాజకులచే నిర్వహించబడతాయి, సాధారణ విశ్వాసులు పాల్గొనడం చాలా తక్కువగా ఉంటుంది.[2]
చాలా సంస్కృతులకు చెందిన ప్రజలు వారి పూర్వమతంలో ఉండే ఆచారాలు కొనసాగిస్తూ ఆర్థడాక్సీకి మారారు. మునుపటి ఇతర దేవతలా విగ్రహాలకు క్రైస్తవ యాజకుల పేర్లు ఇచ్చారు. సంఘంలోని ఆచారాలు, వేడుకలును విగ్రహారాధికులతో, ప్రకృతి మతం లేదా మంత్రవిద్యతో కూడా మిళితమయ్యాయి .
ఈస్టర్న్ ఆర్థోడాక్సీ యొక్క చాలా మంది అనుచరులు దేవుడిని, యేసు క్రీస్తు కూడా వారి నుంచి దూరంగా మరియు వారి గురించి పట్టించుకోకుండా ఉంటాడని భావిస్తారు, కాబట్టి వారు బదులుగా ప్రధాన యాజకులకు పరిశుద్ధులు (సెయింట్స్) ప్రార్థిస్తారు.
పరిశుద్ధాత్మ మన ప్రార్థనలు దేవునికి స్వీకారయోగ్యంగా ఉండేలా సహాయపడుతాడు (రోమీయులకు 8:26-27 చూడండి). దేవుడు మన ప్రార్థనలను విని ప్రతిస్పందిస్తాడని మనకు ధైర్యం ఉండాలి. ప్రార్థిచే వ్యక్తి దేవుడు ప్రార్థనలకు స్పందిస్తాడని విశ్వసించాలి; లేదంటే ఆ వ్యక్తికి దేవుణ్ణి సంతోషపరిచే విశ్వాసం ఉండదు (హెబ్రీయులకు11:6 చూడండి).
సంఘాలలో ప్రధాన యాజకుల విగ్రహాలు మరియు చిత్రాలు ఉంచబడి ఉంటాయి, వాటికి విశ్వాసులు ప్రార్థన చేయవచ్చు. ప్రధాన యాదకులు ఉపయోగించిన వస్తువులను గౌరవంతో సంఘంలో ఉంచుతారు. కొన్ని సార్లు శరీరానికి సంబందించిన, వారి దంతాలు లేదా ఎముకలను సంఘల్లో ఉంచుతారు, విస్వాసులు ఆ ఎముకలను గౌరవించి ఆ యాజకులకు మోకరించి ప్రార్థన చేయడానికి వస్తార.
► విగ్రహారాధన అంటే ఏమిటి? ఈస్టర్న్ ఆర్థడాక్సీ మతాచారాలలో కొన్ని విగ్రహారదనా?
మరియమ్మని ఈస్టర్న్ ఆర్థడాక్సీలో ముఖ్యంగా గౌరవిస్తారు. చాలామంది ఆర్థడాక్సు అనుచరులు దేవునికంటే మరియమ్మకే ఎక్కువగా ప్రార్థిస్తారు. వారు యేసు క్రీస్తు మరియమ్మని మాట వింటారని మరియు ఆమె ప్రభావం చూపుతుందని భావిస్తారు. మరియమ్మ ఇప్పుడు ఆరాధకుడికి, క్రీస్తుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. కాథలిక్కులకంటే భిన్నంగా, ఈస్టర్న్ ఆర్థడాక్సీ మరియమ్మని పాపరహితంగా అబదరికంటే వేరుగా పాపం లేకుండా పుట్టిన దివ్య స్వభావం కలిగిన వ్యక్తిగా నమ్మదు.
యేసు క్రీస్తుకు ప్రార్థించడం అనేది క్రైస్తవులందరికీ గుర్తు, (1 కోరింథీయులకు 1:2 చూడండి). క్రైస్తవులు తండ్రిఐన దేవునికి కూడా ప్రార్థిస్తారు, (1 పేతురు 1:17 చూడండి). పరిశుద్ధాత్మతో సంబంధం గురించి కూడా బైబిల్ చెబుతుంది, (2 కోరింథీయులకు 13:14 చూడండి). దేవునికి తప్ప మరియమ్మ లేదా మరే వ్యక్తికి కూడా ప్రార్థన చేయాలని బైబిల్ ఎక్కడా చెప్పలేదు.
కాథలిక్కులు మరియు ఈస్టర్న్ ఆర్థడాక్సీఇద్దరూ సంప్రదాయాన్ని విశ్వసిస్తూ, రొట్టె మరియు ద్రాక్షరసం యేసేయ్య శరీరం మరియు రక్తంగా మారుతాయని విశ్వసిస్తారు, తద్వారా ఆరాధకులు వాటిని స్వీకరించి రక్షణ పొందగలరని నమ్ముతారు.
యేసు శిష్యులకు ఇది ఎలా చేయాలో చెప్పినప్పుడు, ఆయన వారితో ఉంది జీవించేటప్పుడు, (1 కోరింథీయులు 11:23-25 చుడండి).అందువల్ల, "ఇది నా శరీరం" అని ఆయన చెప్పినప్పుడు, ఆ రొట్టె తన శరీరానికి సదుష్యం/గుర్తుగా ఉందని అర్థం. నేడు, బల్లరాధనను యేసు క్రీస్తు స్థాపించినప్పుడు మాదిరిగానే పరిగణించాలి.
పురగెటరీని కాథలిక్కుల మాదిరిగా ఈస్టర్న్ ఆర్థడాక్సులు నమ్మరు. వీరు ప్రపంచ సంఘంపై క్రీస్తు యొక్క అధికారాన్ని కలిగి ఉండే పోప్ ఆవశ్యకతను కూడా నమ్మరు. రోమన్ కాథలిక్ పోప్‌ను వారు తిరస్కరిస్తారు, మరియు తమకు అటువంటి అధికారం ఉన్న నాయకుడు లేరు.
ఆర్థడాక్సు యాజకులు వివాహం చేసుకోవచ్చు, కానీ కేవలం అవివాహితమైన యాజకుడు మాత్రమే బిషప్ కావచ్చు.
ఆర్థడాక్సీ తియోసిస్ అను సిద్ధాంతాన్నిరక్షణ విధానముగ బోధిస్తారు. థియోసిస్లో ఒక విశ్వాసి క్రమంగా దేవుని వలె రూపాంతరం చెందుతాడు, పవిత్ర పరిపూర్ణత యొక్క స్వభావాన్ని కలిగి ఉంటాడు. ఇది కృప ద్వారా మరియు పరిశుద్ధాత్మ యొక్క పని ద్వారా సాధించబడుతుంది. మరణం తరువాత వరకు ఈ ప్రక్రియ పూర్తి కాదు. ఈస్ట్రన్ ఆర్థోడాక్స్ సంఘాలలో ఉన్నవారు ఈ పవిత్ర పరిపూర్ణతను పొందడంలో, తాము దేవునిలా అవుతామని చెబుతారు, కానీ వారు తాము దేవుని వలె అనంతంగా ఉంటారన్న అర్థం కాదు.
ప్రతీ విశ్వాసి దేవుని స్వభావానికి భాగస్వామీ అని బైబిల్ చెబుతుంది, (2 పేతురు 1:3-4 చూడండి). మనం దేవుని స్వభావాన్ని పొందడానికి మరణానంతరం వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు.
వారు క్రీస్తు వారి కోసం పాపాన్ని ఓడించాడని వారు నమ్ముతారు, కానీ ప్రతి క్రైస్తవుడు తన వ్యక్తి పాపం మరియు అపరిశుభ్రతపై తన వ్యక్తిగత విజయంలో పాపంపై విజయం సాధించడానికి పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందాలని అంటారు.
ఈస్టర్న్ ఆర్థడాక్సీసంఘం క్రైస్తవుడు క్రీస్తులో న్యాయవంతంగా నిలబడతాడని బోధిస్తుంది, అంటే విశ్వాసి తాను ఇప్పటివరకు చేసిన పాపాల నుండి క్షమించబడ్డాడు మరియు తన జీవితంలో నిజంగా నీతిమంతుడిగా అయ్యాడు. కానీ ఆ వ్యక్తి పాపం చేస్తూనే నీతిమంతుడిగా కొనసాగుతాడని దీని అర్థం కాదు, మరియు ఒక వ్యక్తి మునుపటి జీవితానికి తిరిగి వెళ్తే అతను ఇప్పటికీ సమర్థించబడ్డాడని దీని అర్థం కాదు. విశ్వాసి ప్రతిరోజూ నీతిగా జీవించడానికి పరిశుద్ధాత్మ శక్తిపై ఆధారపడి ఉంటాడు. ఇది కూడా మంచి సిద్ధాంతమే ఎందుకండీ దేవుడు తనను యేసు క్రీస్తు కారణంగా అంగీకరించాడని, తన మంచి పనులవల్ల కాదని గుర్తు చేస్తుంది.
చాలా మంది ఈస్టర్న్ ఆర్థడాక్సీఅనుచరులు సువార్తను నమ్మి దేవుని కృపను అనుభవిస్తారు. అయితే, ఈ సంఘం స్పష్టంగా పాపి తన పాపాల నుండి మారి క్రీస్తులో విశ్వాసాన్ని ఉంచాలి మరియు రక్షణకు తక్షణ నిర్ధారాన్ని పొందుతాడనే సువార్త సందేశాన్ని బోధించరు. అందువల్ల, కోట్లాది ఆర్థడాక్సు సభ్యుల్లో ఎక్కువ మంది మతాచారాలను మాత్రమే ఆచరిస్తూ, బహిరంగ పాపంలోనే జీవిస్తున్నారు. వారిలో ఎక్కువమందికి రక్షణ పొందడం ఎలా అని తెలియదు.
► ఈస్టర్న్ ఆర్థడాక్సీసిద్ధాంతంలో కొన్ని మంచివిషయాలు ఏమిటి?
► ఇప్పుడు తిరిగి వెళ్లి బోల్డ్ మరియు ఇటాలిక్ లో ఉన్న పాఠ్యాన్ని మరియు ప్రతి లేఖన భాగాన్ని చదవండి.
“ఇప్పుడు యేసు క్రీస్తు సంఘం అపొస్తలులు మరియు ప్రవక్తల పునాదిపై ఏర్పడినందున, యేసు క్రీస్తు ప్రధాన మూలస్తంభం కావడంతో, ఈ క్రైస్తవ సంఘం యొక్క సిద్ధాంతాలను పవిత్ర గ్రంథాలలో వెతకాలి.”
సువార్త ప్రచారం/సిద్ధాంతాల చేతి పుస్తకాన్ని ఉపయోగిస్తూ
ఈస్టర్న్ ఆర్థడాక్సీసంఘంలో త్రిత్వం, క్రీస్తు దేవత్వం, మరియు పరిశుద్ధాత్మ దేవత్వం వంటి క్రైస్తవ ప్రాథమిక సిద్ధాంతాలను బోధిస్తుంది.
[1]కొంతమంది ఆర్థడాక్సు విశ్వాసులకు రక్షణ కొరకు క్రీస్తులో తమ విశ్వాసాన్ని ఉంచారు, కానీ ఈ సంఘ బోధనలో సువార్త సందేశం స్పష్టంగా లేదు. ఎక్కువమంది పశ్చాత్తాపం, క్షమాపాన మరియు రక్షణ యొక్క నిశ్చయాన్ని అనుభవించలేదు మరియు దేవునితో సంబంధం కలిగి జీవించటం లేదు. కాబట్టి, ఒక క్రైస్తవుడు సువార్తను పంచుకోవడం ముఖ్యమైనది. ఆర్థడాక్సీలో నిర్లక్ష్యం చేయబడిన సువార్త యొక్క ప్రధానాంశాలు, సిద్ధాంతాల చేతి పుస్తకంతో క్రింది విభాగాల ద్వారా నిరూపించబడవచ్చు:
(9) రక్షణ కేవలం క్రీస్తు ప్రాయశ్చిత్తంతోనే సాధ్యం.
(10) దేవుడొక్కడే ఆరాధింప బడలి.
(11) మన నమ్మకం ద్వారా మాకు రక్షణ లభిస్తుంది.
(12) మనకు వ్యక్తిగత రక్షణ హామీ ఉండవచ్చు.
ఈస్టర్న్ ఆర్థోడాక్సీ క్రైస్తవ మతానికి అవసరమైనదిగా భావించే సంప్రదాయాలను జోడించినందున, ఒక క్రైస్తవుడు సిద్ధాంతాల చేతి పుస్తకాన్ని విభాగంలో పేర్కొన్న గ్రంథ వచనాలను వారికి చూపించాలి
"ప్రాయశ్చిత్తం అనేది అన్ని పాపాలను కలిగి ఉంటుంది, అవి అసలు మరియు వాస్తవమైనవి, గతం మరియు భవిష్యత్తు, గొప్పవి లేదా చిన్నవి, సమయం లేదా శాశ్వతత్వం.”
- థామస్ ఓడెన్
ది వర్డ్ అఫ్ లైఫ్
ఒక సాక్ష్యం
జాన్ రుమేనియాలో ఒక ఆర్థడాక్సు కుటుంబంలో పెరిగాడు. అతని తాతముత్తాతలు సంఘ నాయకులు. అతను సంఘంలో బాప్టిజం మరియు వివాహం చేసుకున్నాడు కానీ తరచుగా సేవలకు హాజరుకాలేదు. యాజకుడు అతనితో ఎప్పుడూ పాపాల గురించి మాట్లాడలేదు. జాన్ వద్ద బైబిల్ లేదు మరియు యాజకుడు అతనికి బైబిల్ చదవాలని చెప్పలేదు. యువకుడిగా కమ్యూనిస్ట్ పార్టీలో చేరాడు. అతను బాప్టిస్ట్ ఆరాధన సేవలను పర్యవేక్షించడానికి కమ్యూనిస్టులచే పంపబడ్డాడు. ఆ సేవల్లో అతనికి తాను తన పాపాల నుండి పశ్చాత్తాపం పొందలేదు అనే విషయం తెలిసింది. పశ్చాత్తాపం చేసుకుని యేసును అనుసరించాలనే నిర్ణయం తీసుకున్నాడు. కుటుంబం మరియు కమ్యూనిస్ట్ పార్టీ నుండి కొత్త విశ్వాసాన్ని వదిలేయమని ఒత్తిడి వచ్చి, అతను బైబిల్ చదవడం ద్వారా చాల వరకు ప్రోత్సాహం పొందాడు. అతని కుటుంబం అతని జీవితంలో మార్పు చూసిన తర్వాత వారిలో అనేక మంది విశ్వాసులు అయ్యారు. ఈస్టర్న్ ఆర్థడాక్సీమరియు ఎవాంజిలికల్ క్రైస్తవత్వం మధ్య పెద్ద తేడా, ఎవాంజిలికల్స్ పునర్జన్మను ప్రధానంగా ఉంచడమే అని జాన్ చెబుతున్నాడు.
లేఖన అధ్యయనం – భాగం 2
► ఇప్పుడు 1 థెస్సలొనీక 1ని మళ్లీ చదవండి. ప్రతి విద్యార్థి ఈస్టర్న్ ఆర్థడాక్సీ అనుచరుడు కోసం ఈ భాగంలో ఉన్న సందేశాన్ని వివరిస్తూ ఒక పేరా రాయాలి. విద్యార్థులు వారు రాసిన వాటిని తరగతి గదిలో పంచుకోవచ్చు.
స్వచ్ఛదమిక చదువు: ఒరియెంటల్ ఆర్థడాక్సు సంఘం
ఒరియెంటల్ ఆర్థడాక్సు సంఘలు, ఈస్టర్న్ ఆర్థడాక్సీసంఘలకు వేరుగా ఉంటాయి.
ఒరియెంటల్ ఆర్థడాక్సీలో ఆరు సంఘాల సంస్థలు ఉన్నాయి: కాప్టిక్, ఈథియోపియన్, ఎరిట్రియన్, మలంకర సిరియన్, సిరియాక్, మరియు ఆర్మేనియన్ అపోస్టోలిక్. ప్రతి సంస్థను ఒక పేట్రియార్క్ నాయకత్వం వహిస్తుంది. ఈ సంస్థలు పరస్పరం స్వతంత్రంగా ఉంటాయి. కాప్టిక్ సంఘానికి చెందిన పేట్రియార్క్, ఒరియెంటల్ ఆర్థడాక్సు మొత్తనికి పాప్ అయిన, ఇతరులకు అధికారాన్ని కలిగి ఉండడు, కానీ ఆరు సంస్థల ప్రతినిధుల సమావేశాలకు నాయకత్వం వహిస్తాడు.
అర్మేనియా, ఈథియోపియా, మరియు ఎరిట్రియాలో, ఒరియెంటల్ ఆర్థడాక్సు క్రైస్తవులు అతిపెద్ద మతం. ఈజిప్ట్, సూడాన్, సిరియా మరియు లెబనాన్ వంటి కొన్ని ముస్లిం దేశాలలో క్రైస్తవులు జనాభా తక్కువ శాతం ఉంటుంది వారిలో కాప్టిక్ క్రైస్తవులు అధికశాతం క్రైస్తవులలో ఉన్నారు, మరియు ఈ ముస్లిము ప్రాంతాల్లో వారిని శతాబ్దాలుగా తీవ్రంగా హింసిస్తున్నారు.
ఒరియెంటల్ ఆర్థడాక్సు ఇతర క్రైస్తవ సంఘల నుండి AD 451లో ఒక సిద్ధాంత వివాదం కారణంగా వేరుపడ్డాయి.
వారు క్రీస్తు యొక్క స్వభావం మీద వేదాంతపరమైన వేత్యాసం వల్లా వారు సంఘంతో విడిపోయారు. ఆ సమయంలో క్రిస్తవత్వాన్ని అంతా ఒక సంఘంలా ఉండేది.ఆ కాలంలో సంఘాలు తూర్పు ఆర్థడాక్సు సంఘం లేదా రోమన్ క్యాథలిక్ సంఘంలాగ విడిపోలేదు. ఈ సమయానికి కొద్దిపాటి సంఘాలే ప్రధాన సంఘాన్ని విడిచి వెళ్లిపోయాయి.
చల్సెడన్ మండలి క్రైస్తవత్వానికి ప్రాతినిధ్యం వహించాలని ఉద్దేశించి, యేసు క్రీస్తు యొక్క రెండు స్వభావాలు ఉన్నాయని నమ్మటం సరైనదని నిర్ణయం తీసుకుంది, అవి మానవ మరియు దివ్యమైనవి పేరుకొండి. ఈ నిర్ణయాన్ని కొన్నీ సంఘాలు తిరస్కరించాయి, ఎందుకంటే క్రీస్తు ఒక స్వరూపం నుండి రెండు వ్యక్తులుగా ఉన్నాడని కనిపిస్తోంది. అవి మానవ మరియు దివ్య స్వభావాల కలయికతో ఏర్పడిన ఒకే స్వభావం అని క్రీస్తు స్వరూపం ఒకటే అని నమ్మారు.వారు క్రైస్తవ మతం యొక్క అసలు నమ్మకాలను వారే కలిగి ఉన్నారని విశ్వసించారు. రాజకీయ సమస్యలతో సహా ఇతర సమస్యలు ఉన్నాయి, కానీ వేదాంతపరమైన సమస్య అత్యంత ముఖ్యమైనది.
మండలి తర్వాత కొన్ని సంవత్సరాల్లో, మండలి నిర్ణయానికి విరుద్ధంగా ఉన్న బిషప్స్ సంఘల నుండి బహిష్కరించబడ్డారు. ఈ సమయంలో ఒరియెంటల్ ఆర్థడాక్సు సంఘాలు ఏర్పడ్డాయి.
ప్రతి పాఠానికి కేటాయించిన పని
ఈ మత సమూహంలోని ఎవరికైనా సువార్తను అందించే అవకాశాన్ని కనుగొనడం గుర్తుంచుకోండి. మీరు జరిపిన సంభాషణ గురించి మీ సహవిద్యార్థులతో పంచుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీ రెండు పేజీల లిఖిత నివేదికను వ్రాసి, మీ తరగతి నాయకుడికి ఇవ్వండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.