ఇథన్ రోమన్ క్యాథలిక్‌గా పెరిగాడు, కానీ పెద్దయ్యాక ఆ సంఘన్నీ వదిలాడు. చాలా ఏళ్ళు సుఖభోగాల కోసం జీవించాడు, కాని జీవిత లక్ష్యాన్ని కనుగొనటం అత్యవసరం అని అతనికి అనిపించసాగింది. ఒక స్నేహితుడు అతనికి డ్రగ్స్‌ను ఉపయోగించడం ప్రారంభించడంతో, అతనికి సరికొత్త విశ్వాన్ని, తనను గురించి కొత్త దృష్టికోణాన్ని పొందినట్లనిపించింది. అతనికి కొత్తగా మార్గదర్శకమైన స్వరాలు వినబడసాగాయి.
► అందరూ కలిసి కీర్తనలు 19ని చదవండి. ప్రతి విద్యార్థి ఒక పేరా లో ఈ గ్రంథ భాగానికి సారాంశం వ్రాయాలి. ఈ లేఖన భాగం మనకు దేవుని సత్యం ప్రభావాలు గురించి ఏమి చెబుతుంది? ప్రతి విద్యార్థి ఒక ప్రకటన జాబితా వ్రాసి వాటిని సమూహంగా చర్చించండి.
న్యూ ఏజ్ మతం
న్యూ ఏజ్ మతం పరిచయం
న్యూ ఏజ్ మతంలో అనేక సమూహాలు, సంస్థలు, మరియు వ్యక్తులు ఉంటారు. న్యూ ఏజ్ అనుచరులు ఒక నిర్దిష్ట పేరు లేదా విశ్వాసాల ప్రకటన క్రింద ఏకంగా ఉండరు. కొందరు చాలా మతపరమైనవారిగా కనిపిస్తారు, మరికొందరు మతపరమైనదిగా కాకుండా, శాస్త్రీయంగా ఉంటారు. వాళ్ళు అందరూ తాము న్యూ ఏజ్ మతంలో భాగమని చెప్పరు, కానీ వారికి సాధారణంగా కొన్ని లక్షణాలు ఉంటాయి.[1]
స్టోన్‌హెంజ్, ఇంగ్లాండ్‌లోని ఒక పురాతన రాతి స్మారక చిహ్నం, వివిధ మతపరమైన కార్యకలాపాలకు నిలయం.
న్యూ ఏజ్ అనుచరులు అన్ని సమస్యలను పరిష్కరించడానికి మానవ సామర్థ్యానిపై విశ్వసిస్తారు. ఒక వ్యక్తి ఇప్పుడు సాధారణంగా పరిగణించినదానికంటే మరింత అధిక శక్తులతో అభివృద్ధి చెందవచ్చని వారు నమ్ముతారు. అన్ని సమాధానాలు మనలోనే ఉన్నాయని వారు విశ్వసిస్తారు. విద్య యొక్క ఉద్దేశం మనకు ఏమి సత్యం అని చెప్పడం కాకుండా మన సామర్థ్యాన్ని ఎలా విప్పి వేయాలో చూపించడం అని వారు నమ్ముతారు.
దేవుని ద్వారా మార్చబడే వరకు, గుండె నిజంగా మోసపూరితమైనది మరియు చెడ్డదిగా ఉంటుంది అని బిల్ బైబిల్ చెబుతుంది. జీవితం యొక్క సమాధానాలను మనలోనే కనుగొనడం సాధ్యంకాదు. సమస్యలు మనలోనే ఉన్నాయి, (యిర్మీయా 17:9 చూడండి).
► న్యూ ఏజ్ మతం క్రైస్తవ సిద్ధాంతంలో మనిషి గురించి ఏ అంశాన్ని పట్టించుకోకుండ ఉంటుంది?
[2]మానవ సామర్థ్యాన్ని అన్‌లాక్ విప్పాడానికి, న్యూ ఏజర్స్ అన్యమత మతాలు మరియు క్షుద్ర పద్ధతులలో పురాతన జ్ఞానం కోసం చూస్తారు. వారు జ్యోతిషశాస్త్రం, ఆధ్యాత్మికత మరియు అన్ని రకాల భవిష్యవాణులను అభ్యసిస్తారు. కొత్త యుగం అనుచరులు అన్ని రకాల మాయాజాలాలను ఉపయోగించి అతీంద్రియాలతో సంకర్షణ చెందుతారు. వారు ఆత్మలతో మరియు గతంలో నివసించిన వ్యక్తులతో సంభాషించడానికి ప్రయత్నిస్తారు. గతంలో నివసించిన వ్యక్తి యొక్క ఆత్మ తాత్కాలికంగా జీవించి ఉన్న వ్యక్తి యొక్క శరీరం మరియు స్వరాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు వారు ఛానలింగ్ని అనే పద్దతిని అభ్యసిస్తారు.
దేవుణ్ణి తిరస్కరించి, పాపానికి పశ్చాత్తాపం కోరుకోకుండా, ఇతర ఆధారం అన్వేషించేందుకు కొంతమంది ఆధారపడతారు. మార్గదర్శనం మరియు శక్తి కోసం దేవుణ్ణి కోరుకోవాలి, (యెషయా 8:19 చూడండి).
వారికి ఏ మతంలోనూ మొత్తం సత్యం ఉందని నమ్మరు. అన్ని మతాలు తాత్వికంగా సారూప్యమైనవని, కానీ వేరు విశ్వాసాలు మరియు ఆచారాలు ఉన్నాయని వారు నమ్ముతారు. ఒకటి పైకి మరొకదానితో విరుద్ధంగా ఉన్నప్పటికీ, అవి రెండూ సహజంగానే సత్యమని వారు భావిస్తారు. ఒక సిద్ధాంతం పూర్తిగా నిజమని చేసే ఏ వాదననైనా వారు తిరస్కరిస్తారు. విరుద్ధమైన సిద్ధాంతాలు తప్పుడు అనే అర్థంలో ఏ సిద్ధాంతం నిజం కాగలదని వారు నమ్మరు. ప్రతి ఒక్కరూ విశ్వసించవలసిన సత్యం ఉందని చెప్పుకునేవారు మినహా ఏ మత సమూహాన్నైనా న్యూ ఏజర్లు సహిస్తారు. వారు క్రైస్తవత్వన్నీ తిరస్కరిస్తారు. ఎందుకంటే అది మాత్రమే సరైన మతమని చెప్పి, ఇతర మతాలు తప్పని చెప్పుతుంది.
మంచి నుండి చెడును వేరు చేయని, మంచి మరియు చెడు యొక్క ప్రమాణాన్ని తిరస్కరించే వారిపై బైబిల్ తీర్పును ప్రకటిస్తుందని బైబిల్ చెబుతుంది, (యెషయా 5:20 చూడండి).
► న్యూ ఏజ్‌కు ఏ ఇతర మతాలు ఇష్టముండవు?
న్యూ ఏజ్ అనుచరులు ఏ శక్తుల పట్లనైనా మంచిదిగా భావిస్తారు, కానీ ఏదైనా శక్తి మంచిదా చెడ్డదా అనే విభజన లేకుండా అన్ని ఆత్మలు మంచివని భావిస్తారు.
ప్రపంచంలో చెడు ఆత్మలు ఉన్నాయి మరియు వారు శాశ్వత శిక్షకు నిందించబడ్డారు. వారిని అనుసరించినవారు వారి శిక్షను పంచుకుంటారు, (మత్తయి 25:41 చూడండి).
న్యూ ఏజ్ అనుచరులు ఇతర మతాల నుండి తమను ప్రత్యేకంగా చూడరు. తాత్వికంగా బౌద్ధం, హిందూమతం, తావోయిజం వంటి తూర్పు దేశపు మతాలు వారి అనేక నమ్మకాలతో కలిసి ఉన్నాయని భావిస్తారు. ప్రకృతి ఆత్మలతో మాట్లాదోచు కాబట్టి ప్రకృతి మతలంటే కూడా వారికి ఇష్టం.(14వ పాఠాన్ని చుడండి).
న్యూ ఏజ్ అనుచరులు మరణాన్ని సత్యంగా నమ్మరు. వారు మరణం అనేది వ్యక్తి మరో స్థాయికి మారుతుందనుకుంటారు.మరణించాక ఉండే జీవితం సాధారణంగా జీవితం ఉండే లాగానే ఉంటాడని కొందరు నమ్ముతారు. వారిలో చాలామంది పునర్జన్మను మరియు కర్మ సిద్ధాంతాన్ని విశ్వసిస్తారు. ఇది హిందూమతం మరియు బౌద్ధమతంలో లాగానే ఉంటుంది. బుద్దులు మరియు హిందువులు పునర్జన్మను చెడాడీ అని అనుకోకుండా, న్యూ ఏజ్ వాదులు చాలా సార్లు జీవించడమే మంచిదని భావిస్తారు. కొంతమంది ముందు జెన్మలో తమరు ఎవరో వారికి తెల్సనికూడా వాదిస్తారు.
దేవుని సర్వదేవతావాద అని న్యూ ఏజర్స్ నమ్ముతారు. దీని అర్థం న్యూ ఏజర్స్ అన్ని వాస్తవికత ఒక సారాంశం అని, మరియు ప్రతిదీ కలిసి దేవుడు అని నమ్ముతారు. ప్రతి వస్తువు మరియు ప్రతి వ్యక్తి దేవునిలో భాగం. దేవుడు ఆలోచించే లేదా మాట్లాడే వ్యక్తి అని వారు నమ్మరు, మరియు దేవుడు సృష్టికర్త కాదు అని వారు అంటారు.
► న్యూ ఏజ్ అనుచరులు ప్రార్థన చేస్తారా?
న్యూ ఏజ్ అనుసరించేవారు యేసు క్రీస్తు ఒక వ్యక్తి, ప్రత్యేక శక్తులను ఉపయోగించడం తెలిసినవాడు, మరియు ఇతరులను అదే నేర్పించడానికి ప్రయత్నించాడని నమ్ముతారు. యేసుప్రభు నైతిక ప్రమాణాల గురించి పట్టించుకోలేదని, ఎవరి తప్పును తీర్పు చెప్పడని వారు నమ్ముతారు.
[3]న్యూ ఏజర్లు పాపం యొక్క వాస్తవికతను నమ్మరు, ఎందుకంటే వారు ఒక ప్రమాణాన్ని మరియు న్యాయమూర్తులను నిర్దేశించే దేవుడిని నమ్మరు. ప్రపంచంలోని చెడు కేవలం జ్ఞానం మరియు సర్దుబాటు అవసరం అని వారు నమ్ముతారు, తద్వారా ప్రతిదీ సామరస్యంగా ఉంటుంది. న్యూ ఏజర్లు అన్ని రకాల పాపపూరిత వక్రతలను సమర్థిస్తుంది.
దేవుడు నిజమైన పరిష్కారం - క్షమాభిక్ష మరియు శుద్ధి కోసం అందరిని ఆహ్వానిస్తున్నాడు, (యెషయా 1:18 చూడండి).
న్యూ ఏజ్ అనుసరించేవారు బైబిలు తెలిపిన రక్షణ సిద్ధాంతాన్ని తిరస్కరిస్తారు. వారు పాపం నిజమని నమ్మరు, కానీ మానవ సమస్యల పరిష్కారం ఆత్మీయా అవగాహన మరియు ఆత్మీయా శక్తుల అభివృద్ధిలో ఉందని నమ్ముతారు.
న్యూ ఏజ్ అనుచరులు, సూత్రాలను అర్థం చేసుకునే కొత్త యుగంలోకి మానవత్వం ప్రవేశిస్తోందని, వాయి సూత్రాలు సమాజం మొత్తాన్ని మార్చే ప్రత్యేక రీతిగా ఉంటుందని విశ్వసిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ శాంతి, ఆర్థిక భద్రత ఉంటుందని వారు నమ్ముతారు.
బైబిలు మనకు దేవునికి సమర్పన పొందని సమాజంలో శాంతి, భద్రత ఉండదని హెచ్చరిస్తుంది, (1 థెస్సలొనీకయులకు 5:3 చూడండి).
► బైబిలు చెప్పిన రక్షణ సిద్ధాంతం బదులుగా న్యూ ఏజ్ ఏం నమ్ముతారు?
న్యూ ఏజ్ ప్రతినిధులను గుర్తించడం
కొన్ని ప్రత్యేక లక్షణాలు ఒక సమూహం, సంస్థ లేదా రచయితను న్యూ ఏజ్‌కు చెందినవిగా గుర్తించడంలో సహాయపడతాయి. కొన్ని ఉదాహరణలు:
మతపరంగా లేదా తాత్విక కారణాలకోసం శాకాహారమే పాటించడం.
శాస్త్రీయంగా వివరణ ఇవ్వలేని వింత ఆరోగ్య పద్ధతులు
కర్మ గురించి సూచనలు.
ప్రకృతి లేదా సకల సృష్టితో ఏకత్వం జీవించే అంశాలు
తార్కికం కాని అవగాహన కోసం ధ్యానం చేయడం
అపరిమిత మానవ సామర్థ్యం గురించి పదాల వాడకం
వింతైన మానసిక లేదా వింతైన శక్తి, శక్తుల గురించి చర్చలు
మరణించిన వ్యక్తుల లేదా ఆత్మలతో మాట్లాడటాలు
జ్యోతిషం, భవిష్యవాణి కోసం వివిధ వస్తువుల వాడకం
మంత్రవిద్య మరియు విక్కా
ప్రకృతితో మతపరమైన సంబంధం
పిరమిడ్స్, స్ఫటికాలు వంటి వాటిపట్ల ఆసక్తి
ఉఫాఓల మరియు భూమికి సంబంధం లేని జీవులపై ఆస
ఆత్మ మార్గదర్శకులు మరియు ఉన్నతమైన జీవులపై విశ్వాసం
తూర్పు దేశపు మతాల నుండి పుట్టుకొచ్చిన భావనలు మరియు ఆచరణలు
► మీరు ఎవరైనా న్యూ ఏజ్ వారి పద్ధతులను చూసారా లేదా విన్నారా?
క్రైస్తవుల స్పందన
[4]న్యూ ఏజ్ మతంలో కొత్తతనం ఏమీలేదు. యెషయా 47:10-14 లో ఇశ్రాయేలు ఒక ప్రత్యేక దేశానికి చెప్పిన విషయాలు న్యూ ఏజ్ మతానికి చాలా దగ్గరగా ఉన్నాయి. ఆ జాతి ప్రజలు తమ దుర్మార్గాలలో ప్రత్యేకమైన జ్ఞానాన్ని వెతికారు. వారు దేవతలుగా మారాలని ప్రయత్నించారు. ఆత్మీయ్య శక్తిని సృష్టించే పద్ధతులు ఎంతో ఆవిష్కరించారు.
బైబిలు ప్రతి రకమైన మంత్రం, మాయను నిషేధిస్తుంది; అది నిజమని బైబిలు నిరాకరించదు, కానీ దానిని చెడుగా, దేవుని శక్తికి వ్యతిరేకంగా ఉండే శక్తిగా పరిగణిస్తుంది (లేవీయకాండం 19:26, 31; లేవీయకాండం 20:6; ద్వితీయోపదేశకాండమ 18:9-12). ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మంత్రగత్తెలను చంపమని ఆజ్ఞాపించాడు (నిర్గమకాండం 22:18, లేవీయకాండం 20:27). క్రైస్తవులు నేడు ఆ విధంగా స్పందించనక్కర్లేదు, కానీ ఆ కఠిన నిర్ణయం పాపంపై దేవుని కఠినమైన తీర్పును చూపిస్తుంది. నూతన నిబంధనలో ప్రజలు క్రీస్తును స్వీకరించినప్పుడు తమ మాంత్రిక పుస్తకాలను నాశనం చేసారు (అపొస్తలుల కార్యములు 19:19).
మనుష్యులు దేవునిని తిరస్కరించినప్పటికీ ఆత్మీయ్య శక్తిని కోరుకుంటారు. దేవుని శక్తి గొప్పది, మరియు తన మీద విశ్వాసం ఉంచిన వారికి ఆయన తన శక్తిని ఉపయోగిస్తాడు, కానీ ఆయన ఆ శక్తిని మనుషుల నియంత్రణలో ఉంచడు. మాంత్రిక పద్ధతుల ద్వారా శక్తిని, జ్ఞానాన్ని వెతికే వ్యక్తి దేవునిని తిరస్కరించి దానిని పొందాలనుకుంటాడు. ఆత్మలతో మాట్లాడటం మరియు శక్తిని వెతకడం వ్యక్తిని మరింత చెడులోకి నడిపిస్తుంది.
► ఇప్పుడు తిరిగి వెళ్లి బోల్డ్ మరియు ఇటాలిక్ లో ఉన్న పాఠ్యాన్ని మరియు ప్రతి లేఖన భాగాన్ని చదవండి.
"కొన్నిసార్లు మనం వేరే సంస్కృతిలో జీవిస్తున్నామని, మారుతున్న కాలాల కారణంగా ఇప్పుడు ఏది సరైనది లేదా తప్పు అనేది మారిందని వాదిస్తారు.మానవ మార్పు యొక్క గందరగోళం మధ్య శాశ్వతమైన సత్యం యొక్క రాతిబండ ఉంది, ఇది దేవుని వాక్యం మరియు దాని ప్రమాణం మారదు.”
- లెస్లీ విల్కాక్స్ ప్రొఫైల్స్ ఇన్ వెస్లియన్ థియాలజీ, వాల్యూమ్ 3
సాతానుయొక్క లక్ష్యం మిమ్మల్ని మీరు ఆరాధించేలా చేయడమే; దేవుని కంటే మరియు దేవుని అన్ని దైవ ప్రవచనాల కంటే మీ స్వంత దృష్టిలో మిమ్మల్ని తెలివైనవారిగా చేయడమే. ఇలా చేయడానికి, తన సొంత ఆకారంలో కనిపించకూడదు. అది దాని లక్ష్యన్నీ నిరుత్సాహపరుస్తుంది. అందుకు, అది దాని సొంత స్థానంలో మిమ్మల్ని సురక్షితంగా ఉంచే వరకు తన ఉనికిని మీరు తిరస్కరించేలా చేయడానికి తన నైపుణ్యం మొత్తాన్ని ఉపయోగిస్తాడు.
"పాప క్షమాపణ కోసం ఒక బాప్తిస్మాన్ని నేను అంగీకరిస్తున్నాను; మృతుల పునరుత్థానం కోసం, రాబోయే లోక జీవితం కోసం నేను ఎదురుచూస్తున్నాను.
- ది నిసీన్ క్రీడ్
సువార్త ప్రచారం
సువార్తను న్యూ ఏజ్ అనుచరులతో పంచుకోవడం చాలా ముఖ్యమైంది. సువార్తను పంచుకోవడంలో మిమ్మల్ని నిలిపేసే వాదనలలో చిక్కుకోకుండా ఉండండి. అతను సంఘం గురించి తెలుసుకున్నట్లు భావించవచ్చు, సంఘం పట్ల నిరాకారం వ్యక్తం చేయవచ్చు, కాని అతను నిజంగా సువార్త ఏమిటో అర్థం చేసుకోనట్లుగా ఉండవచ్చు .
యేసు స్వస్థపరచటానికి, ప్రవచించటానికి, మరియు సత్యాన్ని వివేకించటానికి గొప్ప శక్తిని ప్రదర్శించాడు. ఆయన ఏ న్యూ ఏజ్ నాయకుడి కన్నా గొప్పవాడు. ఆయన స్వీయ అభివృద్ధిని సాధించి, ప్రకృతి నుండి ఆత్మీయ్య శక్తులను పొందిన వ్యక్తి కాదు. యేసు క్రీస్తు తండ్రికి విధేయుడై ఉండి, సంపూర్ణ సత్యాన్ని విశ్వసించాడు. ఆయన దేవుని అధికారాన్ని, పాపాన్ని, తీర్పును నిరాకరించేవారితో విరోధంలో ఉండేవాడు.
క్రైస్తవులు దేవుని రాజ్యంతో కొత్త యుగం రాబోతోందని నమ్ముతారు. ఇది అన్ని కష్టాలను ముగించడంతో పాటు శాంతిని మరియు సకలాభివృద్ధిని తీసుకువస్తుంది.దేవుని సంబంధంలో సరిగా ఉన్నవారే ఆ కొత్త యుగంలో ప్రవేశించగలరు.
ఒక సాక్ష్యం
మహిత్ తాను వింటున్న స్వరాలను అనుసరించడానికి ప్రయత్నించాడు. అతను దేవుని కుమారుడైన క్రీస్తు అని వారు అతనికి చెప్పారు, కానీ అతను భ్రమను ప్రతిఘటించాడు. కొన్నిసార్లు అతనికి అత్యర్థిక శక్తి, జ్ఞానం కలిగినట్లు అనిపించేది. అతని కొంతమంది స్నేహితులు, యేసుప్రభును విశ్వసించడం, బుద్ధుడిని లేదా మరేదైనా నమ్మడంలో ఎటువంటి తప్పు లేదని అన్నారు. అతనికి శక్తిని ఇచ్చే వాస్తవికం తనను ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపించడం మొదలైంది. అతనికి కొందరు క్రైస్తవ స్నేహితులు పరిచయమయ్యారు. అతను వినిపిస్తున్న ప్రతీ శబ్దాన్ని నమ్మలేమని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. కొన్నిసార్లు దేవుడు అతనితో మాట్లాడేవాడు, కానీ కొన్నిసార్లు చెడు ఆత్మలు అతన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసేవి. ధృఢమైన సత్యంతో ఆలోచనలను పరీక్షించడం నేర్చుకున్నాడు. యేసుప్రభుతో ఉన్న నిజమైన సంబంధం తన గత అనుభవాలన్నింటి కంటే తృప్తి కలిగించేదిగా ఉన్నట్లు అతనికి అనిపించింది.
లేఖన అధ్యయనం – భాగం 2
► ఇప్పుడు 19వ కీర్తనను మళ్ళీ చదవండి. ప్రతి విద్యార్థి న్యూ ఏజ్ అనుచరుడు కోసం ఈ భాగంలో ఉన్న సందేశాన్ని వివరిస్తూ ఒక పేరా రాయాలి. విద్యార్థులు వారు రాసిన వాటిని తరగతి గదిలో పంచుకోవచ్చు.
ప్రతి పాఠానికి కేటాయించిన పని
ఈ మత సమూహంలోని ఎవరికైనా సువార్తను అందించే అవకాశాన్ని కనుగొనడం గుర్తుంచుకోండి. మీరు జరిపిన సంభాషణ గురించి మీ సహవిద్యార్థులతో పంచుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీ రెండు పేజీల లిఖిత నివేదికను వ్రాసి, మీ తరగతి నాయకుడికి ఇవ్వండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.