మైకల్ భారీ బరువు భాగములో హెవీవెయిట్ బాక్సర్ ఛాంపియన్. టర్కీని ప్రయాణంమైనప్పుడు, అతను ఇస్లామిక్ ప్రార్థన పిలుపును వినడంతో ఆసక్తి కలిగింది. అతను ఇస్లాం గురించి అధ్యయనం చేయడం ప్రారంభించి, అది తనకు సరైన మతమని భావించాడు. అతను తనను క్రైస్తవుడిగా చెప్పుకునే వాడు, కానీ బైబిల్లో పొరపాట్లు ఉన్నాయని విశ్వసించాడు.
► అందరూ కలిసి మొదటి యోహాను 1ని చదవండి. ప్రతి విద్యార్థి ఒక పేరా లో ఈ గ్రంథ భాగానికి సారాంశం వ్రాయాలి. ఈ లేఖన భాగం మనకు విశ్వాసి యొక్క దేవునితో సంబంధం గురించి ఏమి చెబుతుంది? ప్రతి విద్యార్థి ఒక ప్రకటన జాబితా వ్రాసి వాటిని సమూహంగా చర్చించండి.
ఇస్లాం
ఇస్లాం యొక్క ప్రారంభం
ఇస్లాం ప్రపంచంలో రెండవ అతిపెద్ద మతం, దాదాపు 190 కోట్లమంది అనుచరులతో ఉంది.[1] కొన్ని దేశాలు ఇస్లాం సిద్ధాంతాల ఆధారంగా పరిపాలించబడుతున్నాయి. ఇస్లాం అంటే "సమర్పణ", దీనిని అల్లాహ్కు సమర్పిచుకోవాలని అర్థం. ఇస్లాంను అనుసరించేవారిని ముస్లింలు అంటారు, మరియు వారు తమను "విశ్వాసులు" అంటారు, మరియు ముస్లిం కానివారికి "అవిశ్వాసులు" అంటారు.
ముహమ్మద్ ఇస్లాం మతాన్నీ స్థాపించాడు. ఆయన ఏ.డి 570-632 కాలంలో జీవించాడు.
ముహమ్మద్ తనకు పౌరాణిక సందేశాలు వచ్చాయని చెప్పాడు. ఈ సందేశాలను చాలామంది రాశారు, వాటిని ఆయన మరణానంతరం కురాన్గా సంకలనం చేయడం జరిగింది. కురాన్ విభాగాలను సూరా అంటారు.
► ఖురాన్ యొక్క మూలం బైబిల్ యొక్క మూలం నుండి ఎలా వేరుగా ఉంటుంది?
ముహమ్మద్ యొక్క మతం మోనోతెయిజం (ఒక దేవుడిని మాత్రమే నమ్మడం) మరియు విగ్రహారాధనకు వ్యతిరేకంగా ఉండటం ద్వారా అతని చుట్టూ ఉన్న మతాల నుండి వేరుగా ఉంది. ఆతనికి యూద మతం మరియు క్రైస్తవ మతం గురించి తెలుసు, కానీ అతను వాటిని తిరస్కరించాడ.
[2]ముహమ్మద్ తక్కువ స్థాయి కుటుంబం నుండి వచ్చినప్పటికీ, ఒక ధనవంతురాలు వితంతువు పట్ల వివాహం చేసుకున్నాడు. ఆమె మరణం తరువాత, ఆయన 12 మంది భార్యల్ని వివాహం చేసుకున్నాడు. కురాన్ ప్రకారం, పురుషులు నాలుగు భార్యలకు పరిమితం చేయబడతారు.
ముహమ్మద్ తన అనుచరులతో కలిసి ఎప్పుడు సౌదీ అరేబియా దేశంలో ఉన్నా మదీనా నగరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. చాలా సార్లు యుద్ధం చేసి, మక్కాను ఆక్రమించాడు, మరియు అక్కడికి అతని నివాసం మార్చదు. ఆయన అనుచరులు పరిసర ప్రాంతాలను దాడి చేసి, కొన్ని దేశాలను గెలిచారు, అక్కడ ప్రజలను ముస్లింలుగా మారుస్తూ వారి నియమాలను అమలు చేయించార.
ఇప్పుడు, ముస్లింలందరు హింసాత్మకులు కాదు. అవిశ్వాసులు పట్ల శాంతిగా ఉండాలని ప్రయత్నిస్తారు. అయితే, కురాన్లో కొన్ని హింసాజ్ఞలు ఉన్నాయి. విగ్రహారాధకులపై దాడి చేయమని.[3] మరియు ఇస్లాంకు వ్యతిరేకంగా పోరాడే వారిని చంపమని, లేదా వారి చేతులు, కాళ్లను తీసెయ్యమన్న ఆదేశాలు ఉన్నాయి.[4] తీవ్రవాదులు ఈ ఆదేశాలను నిబద్ధంగా పాటిస్తారు. ముహమ్మద్ యూద గ్రామాలను నాశనం చేసి, పురుషులను చంపి, వారి కుటుంబాలను బానిసగా చేసి అమ్మాడు.
► ఇస్లాం వ్యాప్తి, క్రైస్తవత్వం వ్యాప్తికి ఎలా వేరుగా ఉంది?
ఇస్లాం విశ్వాసాలు:
ఇస్లాం మతంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన నమ్మకం షహదా, దీని ప్రకారం "అల్లాహ్ తప్ప మరే దేవుడు లేడు, ముహమ్మద్ అతని ప్రవక్త.”
ముస్లింలు అల్లాహ్ మాత్రమే దేవుడు అని, ఆయన ప్రపంచ సృష్టికర్త అని నమ్ముతారు. ఆయన నోవహు, అబ్రహాము, మరియు మోషే వంటి వ్యక్తులకు ప్రత్యక్షం అయ్యాడని నమ్ముతారు.
వారు త్రిత్వం లేదా దేవుని అవతారం అనే ఆలోచనలను నమ్మరు.
► ముహమ్మద్ పట్ల ముస్లింల అభిప్రాయం, క్రైస్తవులు క్రీస్తు పట్ల గల అభిప్రాయం నుండి ఎలా వేరుగా ఉంటుంద?
ముస్లింలు యేసు ప్రవక్తగా, ఆశ్చర్యకార్యాలు చేసినవాడిగా, మరియు పాపం లేనివాడిగా భావిస్తారు. ఆతను క్రైస్తవులు చెప్పినట్లుగా సిలువపై మరణించలేదని, యూదులు ఆయనను చంపడానికి ప్రయత్నించేప్పుడు అల్లాహ్ ఆయనను తీసుకెళ్లాడని నమ్ముతారు. [5] ఆయన దేవుని కుమారుడని లేదా దేవుని అవతారమని నమ్మరు.[6] యేసేయ్య ప్రపంచ రక్షకుడని వారు నమ్మరు.
బైబిల్ దేవుని నుండి అని ముస్లింలు నమ్ముతారు, కానీ బైబిల్ మరియు కురాన్లో వ్యతిరేకాలు ఉంటే, ఆఖరు ప్రేరేపణ కాబ్బటి కురాన్ చివరి అధికారం కలిగినదని నమ్ముతారు, తరువాతి ద్యోతకం మునుపటిదానికి విరుద్ధంగా ఉంటుందని (అనగా మొదట ఆమోదించబడిన దానికంటే తరువాతి ద్యోతకం మరింత అధికారికమైనది) వారు నమ్ముతారు.[7]
బైబిలు ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును గతించదని చెబుతుంది, (యెషయా 40:8 మరియు 1 పేతురు 1:25 చూడండి).
[8]ముస్లింలు రక్షణ కొరకు ఇస్లాం యొక్క ఐదు విధులు/ స్తంభాలను జరపాలని నమ్ముతారు. ఇస్లాం యొక్క ఐదు స్తంభాలు:
1. షహదా: ముస్లిం విశ్వాస వృత్తిని హృదయపూర్వకంగా పఠించడం
2. సలాత్: రోజుకి ఐదు మార్లు ప్రార్థనలు చేయడం
3. జకాత్: పేదలకు దానం చేయడం
4. సవం: రమదాన్ నెలలో ఉపవాసం ఉండడం
5. హజ్జ్: జీవితంలో ఒకసారి మక్కా కు ప్రయాణం చెయ్యడం
ఇస్లాం యొక్క క్లిష్టమైన సిద్ధాంతాలు
ఇస్లాం విశ్వాసించే జీవనశైలిని తెలుసుకోవడానికి, ఇస్లామిక్ చట్టం ద్వారా నియంత్రించబడే దేశాలను పరిశీలించవచ్చు.[9] ఇస్లామిక్ చట్టం, అంటే షరియా చట్టం, చాలా అరబ్ దేశాలలో కొంతవరకు పాటించబడుతోంది. పాశ్చాత్య దేశాల్లో ఉంటే స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, సమావేశ స్వేచ్ఛ లేదా మీడియా స్వేచ్ఛ వంటి స్వేచ్ఛలకు షరియా చట్టం అనుమతిని ఇవ్వదు.28
కొన్ని ఇస్లామిక్ సమాజాలలో క్రైస్తవ మతంలోకి మారడం లేదా ఇతరులకు సువార్త ప్రకటింస్తే ఆయనని చంపవచ్చు కూడా. అయితే, ఇది సాధారణంగా ప్రభుత్వం నుంచి కాకుండా జనసమూహం ద్వారా జరుగుతుంది.
షరియా చట్టం ప్రకారం, ఒక పురుషుడు ఏ కారణం లేకుండానే తన భార్యకు విడాకులు ఇవ్వవచ్చు. కానీ ఒక భార్య, భర్త అనుమతించకపోతే విడాకులు తీసుకోలేరు. కురాన్ ప్రకారం పురుషులు తమ భార్యలను కొట్టవచ్చు.[10] ఒక పురుషుడికి నాలుగురు భార్యలతో ఉండవచు. [11]మహిళలు ఇస్లాం యొక్క నియమాలు పాటించకపోతే, వారి బంధువులు వారిని చంపవచ్చు. కొన్ని దేశాలలో మహిళలు కార్లు నడపడం, పాఠశాలకు వెళ్ళడం, ముఖం బయటపెట్టకుండా బయటకు రావడం వంటి పనులు చేయడానికి అనుమతించబడరు. క్రమాలను అతిక్రమిస్తే మహిళలను అందరి ముందే కొట్టడం జరుగుతుంది.
క్రైస్తవులకు వారి భార్యల పట్ల సున్నితంగా ఉండమని చెప్పబడింది, (1 పేతురు 3:7 చూడండి). భర్త తనను తాను ఎంత ప్రేమిస్తాడో భార్యను అంత ప్రేమించాలనేది, (ఎఫెసీయులు 5:28-29 చూడండి).
[12]ముస్లింలు నమ్మేది మంచి చెడులు అన్నీ అల్లాహ్ చిత్తం నుండే వస్తాయి. అల్లాహ్ కోరితే మంచి చెడును మార్చవచ్చు, ఎందుకంటే ఆయన చిత్తమే ముఖ్యమని, స్థిరమైన స్వభావం కాదని భావిస్తారు.
బైబిల్ ప్రకారం దేవుడు మంచి మరియు మంచి ప్రతి దానికి మూలం. దేవుడు ఎప్పటికీ మారడు, చూడండి యాకోబు 1:17.
కురాన్ ప్రకారం ప్రజలు అల్లాహ్ యొక్క రూపంలో సృష్టించబడలేదు. అల్లాహ్ శక్తివంతుడు, తెలియని మరియు పూర్తిగా భిన్నుడని పేర్కొనబడింది.
మనిషి దేవుని రూపంలో సృష్టించబడింది. అందువల్ల, దేవుని స్వభావం గురించి కొన్ని విషయాలను అర్థం చేసుకోవచ్చు మరియు ఆయనతో సంబంధం కలిగి ఉండవచ్చు, (ఆదికాండము 1:27 చూడండి).
ముస్లింలు అల్లాహ్తో వ్యక్తిగత సంబంధాన్ని ఆశించరు. అల్లాహ్ "అన్నివిధాలా ప్రేమించే వాడు" అని పిలువబడతాడు, కానీ ఆయన ప్రజలను ప్రేమిస్తాడని కురాన్ లో ఎక్కడా రాయబడలేదు. కురాన్లో అల్లాహ్ విశ్వాసుల పట్ల క్షమాపణ, కరుణ చూపుతాడని ఎప్పటికప్పుడు చెప్పబడింది. మనుష్యులు పశ్చాత్తాపపడాలి, తీర్పు నుంచి విడిపించమని ప్రార్థించాలి, అల్లాహ్ కరుణవంతుడని ఆశించాలని కోరారు. కాని క్షమాపణ పొందడంలో భరోసా లేదా రక్షణ అనుభవాలు లేవు.
ఎవరు పచ్యతాపంతో, విశ్వసంతో వేడుకున్న వారిని దేవుడు క్షమిస్తాడని,బైబిల్ మనకు తెలియజేస్తుంది (1 యోహాను 1:9 చూడండి).
► క్రైస్తవుడి దేవునితో సంబంధం ముస్లిం యొక్క అల్లాహ్తో సంబంధానికి ఎలా వీరుగా ఉంది?
ఇస్లాం ప్రయోజనాలు ఎక్కువగా పురుషులకు అందిస్తుంది, మరియు కురాన్ ప్రతి అంశాన్ని పురుషుల దృష్టికోణంలోంచి చూస్తుంది. మహిళలు కేవలం పురుషుల సొమ్ము మాత్రమే. మరణం తర్వాత ఇస్లామిక్ పరలోక రాజ్యం పురుషుల కోసమే, అక్కడ మహిళలను వారి ఆనందం కోసం వాడుకుంటారు.[13]
► ఇప్పుడు తిరిగి వెళ్లి బోల్డ్ మరియు ఇటాలిక్ లో ఉన్న పాఠ్యాన్ని మరియు ప్రతి లేఖన భాగాన్ని చదవండి.
"నేను సర్వశక్తిమంతుడైన తండ్రి, స్వర్గం మరియు భూమి యొక్క సృష్టికర్త అయిన దేవుణ్ణి నమ్ముతున్నాను; మరియు ఆయన ఏకైక కుమారుడైన మన ప్రభువైన యేసు క్రీస్తును నమ్ముతున్నాను; పతిశుద్ధత్మ ద్వారా గర్భం దాల్చిన, కన్యక మేరియా నుండి జన్మించిన".
"సూర్యుడు ప్రకాశిస్తున్నట్లే గ్రంథాలు దేవునివి అని ఈ రోజు నాకు పూర్తిగా నమ్మకం ఉంది. మరియు ఈ నమ్మకం (ప్రతి మంచి బహుమతిగా) వెలుగులకు తండ్రి నుండి వస్తుంది.
శుభవార్త ఏమిటంటే, దేవుడు క్రీస్తు ద్వారా ధర్మశాస్త్రం చేయలేనిది చేసాడు: తన కుమారుడిని పాపానికి బలిగా పంపాడు. క్రీస్తు తన సొంత త్యాగం ద్వారా పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసాడు.
క్రైస్తవ సిద్దాంతాలను కేవలం బైబిలు ద్వారా మాత్రమే నిరూపించడం సరిపోదు, ఎందుకంటే ముస్లింలు కురాన్ బైబిలు కంటే ఉన్నతమైన అధికారం అని నమ్ముతారు.
ముఖ్యమైన ఇస్లామిక్ విశ్వాసాలలో కొన్ని విషయాలలో మనం ఒప్పుకోవచ్చు. ఒక దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు ప్రపంచాన్ని సృష్టించాడని క్రైస్తవులు అంగీకరిస్తారు. అంతిమ తీర్పు ఉందని, ప్రతి వ్యక్తి పరలోకానికి లేదా నరకానికి పంపబడతారని క్రైస్తవులు అంగీకరిస్తారు.
ఇతర ముఖ్యమైన సత్యాలు బైబిలులో చూపబడాలి. ముస్లింలు బైబిలు దేవునిచే ప్రేరాపాన పొందినదని నమ్మినా, కురాన్ దానిని మించిపోయిందని నమ్ముతారు. అయితే, కొన్ని సత్యాలు అంత ప్రాథమికమైనవి కావడంతో అవి ఎప్పటికీ మారలేవు. అలాగే చారిత్రక నిజాలు మారవు.
దేవుడు మనుషులను తన స్వరూపంలో సృష్టించాడు (ఆదికాండము 1:27). ఆయన వారిని ప్రేమిస్తాడు మరియు వారితో సంబంధం కలిగి ఉండాలనుకుంటున్నాడు.
క్రైస్తవులు మరియు ఇస్లాం ఇద్దరూ యేసుప్రభు మెస్సేయ్య మరియు పాపరహితుడు అని అంగీకరిస్తారు. ఆయన తనను నమ్మిన వారికి నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేసాడు (యోహాను 10:28), తన స్వరంతో మృతులను లేపుతానని వాగ్దానం చేసాడు (యోహాను 5:28-29), మరియు తండ్రి దగ్గరకు ఆయన ద్వారా మాత్రమే రావచ్చునని చెప్పాడు (యోహాను 14:6).
ఆయన కేవలం పాపరహితుడే కాకుండా మరింత ఉన్నాడని బైబిలు ద్వారా చూపించండి; సిద్ధాంతాల చేతి పుస్తకాన్ని చూడండి.
(5) యేసు క్రీస్తు దేవుడు.
తన గురించి చేసిన వాగ్దానాలు నిజమైతేనే ఆయన మంచివాడని, దేవుని ప్రవక్తగా భావించవచ్చు. యేసు దేవుని ప్రవక్త అని ఇస్లాం బోధిస్తుంది, కానీ అయన శాశ్వతమైన జీవితాన్ని(నిత్యా జీవం) ఇవ్వగలడని, లేదా ప్రజలు అతనిపై విశ్వాసం ఉంచేలా చేసిన దుష్ట లేదా స్వీయ-మోసపూరిత వ్యక్తి అని చెప్పుకునే వ్యక్తి అయి ఉండాలి. .
యేసు దేవుని ప్రేమను చూపించడానికి వచ్చాడు. మహిళలు, దిగువ తరగతి ప్రజలతో సహా ప్రతి వ్యక్తిని దేవుడు ప్రేమిస్తున్నాడని ఆయన చూపించాడు. ప్రజలు వారి లింగ లేదా సామాజిక వర్గం కారణంగా దేవుని నుండి వేరు చేయబడరు. ప్రజలు వారి పాపం వల్ల మాత్రమే దేవుని నుండి వేరు చేయబడతారు, మరియు దేవుడు క్షమాపణను ఇస్తాడు. పాపిని క్షమించమని మరియు ఆయనతో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచమని దేవుడు ఆహ్వానిస్తాడు.
ఒక సాక్ష్యం
జలాల్ సౌదీ అరేబియాలో జీవించాడు. బాల్యంలో అతను ఇస్లామిక్ మతాన్ని విశ్వాసపూర్వకంగా పాటించేవాడు. అతను కురాన్ యొక్క విస్తారమైన భాగాలను కంఠపాఠం చేసేవాడు మరియు మసీదులో సహాయం చేసేవాడు. అతను 16 ఏళ్ళ వయసులో ఇస్లాం కోసం పవిత్ర యుద్ధంలో పాల్గొనాలని కోరుకున్నాడు, కానీ అతని తల్లిదండ్రులు అతడు చిన్నవాడని చెప్పారు. తర్వాత అతను ఒక ఉద్యోగం పొందాడు మరియు మరింత బిజీ అయి మతం పై శ్రద్ధ తగ్గింది. అతను ఒక సమస్యలో చిక్కుకుని సహాయం కోసం ప్రార్థించాలనుకున్నాడు, కానీ ధర్మపాలనలో నిర్లక్ష్యం చేసినందుకు అల్లాహ్ కోపగించాడేమో అని భయపడ్డాడు. అతను యేసేయ్యను ప్రార్థించాడు, మరియు రెండు రోజుల తర్వాత సమస్య పరిష్కారమైంది. అతనికి ఒక కలలో యేసు జనాలకు పరలోకనికి దారి చూపిస్తున్న దృశ్యం కనబడింది. అతను రక్షణ కోసం క్రీస్తుపై విశ్వాసం ఉంచాడు. జలాల్ ఇలా అంటాడు, “నా హృదయంలో ప్రేమను అనుభవిస్తున్నాను, మరియు యేసును తెలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. నేను ముస్లింగా ఉన్నప్పుడు క్రైస్తవులు సరిగ్గా ఉన్నారని నేను ఊహించలేదు. ఆ తర్వాత దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తాడో తెలుసుకుని క్రైస్తవుడిగా మారాను. అవును, ఆయన నన్ను ప్రేమిస్తాడు, ఆయన నిన్ను ప్రేమిస్తాడు, మరియు ఆయన ప్రపంచాన్నంతా ప్రేమిస్తాడు. యేసు క్రీస్తు మనలను ప్రేమించాడు, ఇంకా చేస్తూనే ఉన్నాడు. చివరి రోజున మనలను కాపాడగలవాడు యేసు క్రీస్తు మాత్రమే అని మరచిపోవద్ద.”
లేఖన అధ్యయనం – భాగం 2
► ఇప్పుడు మళ్ళీ 1 యోహాను 1 ని చదవండి. ప్రతి విద్యార్థి ఒక ముస్లింకి కోసం ఈ భాగంలో ఉన్న సందేశాన్ని వివరిస్తూ ఒక పేరా రాయాలి. విద్యార్థులు వారు రాసిన వాటిని తరగతి గదిలో పంచుకోవచ్చు.
ప్రతి పాఠానికి కేటాయించిన పని
ఈ మత సమూహంలోని ఎవరికైనా సువార్తను అందించే అవకాశాన్ని కనుగొనడం గుర్తుంచుకోండి. మీరు జరిపిన సంభాషణ గురించి మీ సహవిద్యార్థులతో పంచుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీ రెండు పేజీల లిఖిత నివేదికను వ్రాసి, మీ తరగతి నాయకుడికి ఇవ్వండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.