అనిల్ ఒక సంఘాని సందర్శించడానికి వెళుతుండగా, " తీర్పు దినం, మే 21, 2011" అనే భారీ గుర్తును చూశాడు. బైబిలు కి హామీ ఇస్తుంది! " ఆ సందేశం నిజమైతే తాను ఏమి చేయాలో అని అతను ఆలోచించాడు. తన పిల్లలను పాఠశాలకు పంపడానికి, లేదా తన ఇంటిని నిర్మించడం పూర్తి చేయడానికి లేదా అతను అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించడానికి ఎటువంటి కారణం ఉండదని అనిపించింది. సందేశాన్ని వ్యాప్తి చేయడంలో సహాయపడటానికి తన మొత్తం డబ్బును విరాళంగా ఇవ్వాలా అని అతను ఆశ్చర్యపోయాడు.
► అందరూ కలిసి మార్కు 13ని చదవండి. ప్రతి విద్యార్థి ఒక పేరా లో ఈ గ్రంథ భాగానికి సారాంశం వ్రాయాలి. ఈ లేఖన భాగంలో యేసు ఇచ్చిన హెచ్చరికలు ఏమి ఉన్నాయి? ప్రతి విద్యార్థి ఒక ప్రకటన జాబితా వ్రాసి వాటిని సమూహంగా చర్చించండి.
అపోకలిప్టిక్ కల్ట్లు వందల కొద్దీ ఉన్నాయి. వీటి పేర్లు, విధానాలు, నమ్మకాలు విభిన్నంగా ఉంటాయి. చాలా సందర్భాలలో ఇవి భవిష్యత్తు గురించి కొత్త ప్రకటన చేసినట్లు చెప్పుకునే వ్యక్తులచే ప్రారంభించబడతాయి. కొన్ని కల్ట్లు కొద్దిమంది సభ్యులతో తక్కువ కాలం పాటు ఉండి పోతాయి, మరికొన్ని పెద్దగా మారతాయి.ఈ కోర్సులోని ఇతర విభాగాలలో పేర్కొన్న కొన్ని సంస్థలు అపోకలిప్టిక్ కల్ట్ల లక్షణాలను కలిగి ఉంటాయి. ఉదాహరణకు, యెహోవా సాక్షులు వారి అనుచరులను ప్రేరేపించడానికి అనేక సార్లు ప్రవచనాలు చేసారు, కానీ అవి నిజం కాలేదు.
అపోకలిప్టిక్ కల్ట్లు ఎప్పటికి ఎందుకు ఉన్నాయి
చాలా మంది ప్రపంచం ఒక విపత్తు సమయానికి చేరుకుంటుందని, మనం ఇప్పటివరకు సాధారణంగా చూసిన ప్రతిదీ మారుతుందని భావిస్తున్నారు. ఆ సంక్షోభం ఆర్థిక, పర్యావరణ, యుద్ధ, రాజకీయ లేదా సాంస్కృతిక మార్పుల రూపంలో ఉంటుందనే విశ్వాసం ఉంది.
కొత్త నవలాలలో అలాగే సినిమాలలో ప్రపంచవ్యాప్తంగా వ్యాధులు, అణు యుద్ధం లేదా భూమిని తాకే భారీ గ్రహశకలం వంటి అలౌకికమైన విపత్తులను వర్ణిస్తాయి.ఈ కథలలో, భూమిపై ఎక్కువ మంది వ్యక్తులు చనిపోతారు, మరియు మిగిలిన వారు తమకు తెలిసిన జీవనం కన్నా పూర్తిగా కొత్త జీవనశైలిలోకి అడుగు పెడతారు.
ఈ భయం మరియు ఎదురు చూపుతో మనుష్యులు భవిష్యత్తును ఎదుర్కొనే మార్గాల గురించి సమాధానాలను వెతుకుతున్నారు. కొంతమంది మత సంబంధ వివరణలను కోరుకుంటున్నారు. వారు అపోకలిప్టిక్ కల్ట్ సందేశానికి ఆకర్షితులు అవుతారు.ఈ కల్ట్ ఒక కొత్త ప్రకటనతో ప్రవక్తగా తానే తాను ప్రకటించుకునే వ్యక్తి చేత ప్రారంభించబడుతుంది. అపోకలిప్టిక్ కల్ట్లు మనకు ప్రపంచ స్థితిని వివరించి, భవిష్యత్తు కోసం ఎలా సిద్ధం కావాలో తెలియజేయడం ద్వారా ఆధ్యాత్మిక మరియు భావోద్వేగ అవసరాలను తీర్చడానికి ప్రయత్నిస్తాయి అలాగే, భవిష్యత్తును మనం ఎలా ఎదుర్కొవాలో కూడా చెబుతాయి.
అపోకలిప్టిక్ కల్ట్లు అన్ని యుగాల్లో/సమయాలలో ఉన్నాయి. మాంటానస్ అనే ప్రవక్తగా చెప్పబడిన వ్యక్తి రెండవ శతాబ్దంలో దేవుని రాజ్యం త్వరలో రానుందని మరియు ప్రపంచ వ్యవస్థ ముగియబోతుందని ప్రవచనం చేసాడు. సంఘ చరిత్రలో యేసు క్రీస్తు తిరిగి వచ్చి తన రాజ్యాన్ని స్థాపించి దుష్టులను తీర్పు చేయబోతున్న సమయాన్ని తెలుసుకున్నట్లు చెప్పుకున్న వ్యక్తులు ఎప్పటికప్పుడు ఉన్నారు. లక్షలాది మంది వంచించబడి, నిరాశ చెందారు.
► మీరు ఏ అపోకలిప్టిక్ కల్ట్ల గురించి విన్నారా లేదా చూశారా?
అపోకలిప్టిక్ కల్ట్ నాయకులు తమ కాలంలోని సంక్షోభాలకు బైబిల్ పద్ధతిలో స్పందించరు, అయినప్పటికీ రు క్రైస్తవులని ప్రకటించుకుంటారు మరియు బైబిల్‌ను ఉపయోగిస్తారు. చాలా అపోకలిప్టిక్ కల్ట్లలోని లక్షణాలు క్రింది విధంగా ఉంటాయి.
అపోకలిప్టిక్ కల్ట్ల లక్షణాలు.
(1) వారు నిర్దిష్ట ప్రవచనాలకు తేదీలను నిర్ణయిస్తారు.
వారు యేసు క్రీస్తు రెండో రాకడ కోసం తేదీ నిర్ణయించవచ్చు.
యేసు క్రీస్తు తాను తిరిగి వచ్చే సమయం ఎవరూ తెలియదని చెప్పాడు (మత్తయి 24:36 చూడండి).
వారు ప్రపంచ ప్రభుత్వాల ముగింపు తేదీని ప్రకటించవచ్చు. వారు ప్రపంచంలోని దుష్టులను నిర్మూలించే విపత్తు తేదీని కూడా ప్రకటించవచ్చు. అది జరగకపోతే, వారు తమ ప్రవచనం వేరే అర్థంలో చెప్పారని అంటారు. కొత్త తేదీని ప్రకటిస్తారు. వారు చిన్న చిన్న ప్రవచనాలను చేస్తారు, అవి కూడా నిజం కాదని తేలుతుంది.
ఒక వ్యక్తి ప్రవచనం నిజం కాకపోతే, అతనిని ప్రవక్తగా విశ్వసించకూడదని (ద్వితీయోపదేశకాండం 18:22 చూడండి) అని బైబిల్ చెప్పేది.
(2) వారు బైబిల్‌కు కొత్త వచనాలు ఇస్తారు.
బైబిల్ లేఖననంలో కొన్ని పదాలకు ఎప్పటి వరకు అవ్వరు ఆలోచించని కొత్త అర్థాలు ఇస్తారు. ఆ అర్థం అనేది బైబిల్లో సాక్ష్యంగా పొందలేని విధంగా ఉంటుంది. ఆ ప్రవక్త అతనికి ఆ అర్థం దర్శనం ద్వారా తెల్సింది అని చెబుతాడు, దీని ప్రకారం అది కొత్త వివరణ కాకుండా కొత్త ప్రకటన అవుతుంది. వారు బైబిల్ ను దుర్వినియోగం చేస్తారు, బైబిల్ వారి ఆలోచననే బోధిస్తుంది అని చెబుతారు, కానీ వాస్తవానికి వారు అనుకునేది లేని బైబిలుకు అర్థాన్ని జోడించడానికి కొత్త జ్ఞానోదయంపై ఆధారపడుతున్నారు. ఈ సందేశాన్ని నమ్మే వ్యక్తులు ఇప్పటికే ఆ ప్రవక్తను విశ్వసించాలని నిర్ణయించుకున్నవారే. వారు బైబిల్ అధికారాన్ని అనుసరించరు, కానీ ఆ కల్ట్ నాయకుడి అధికారాన్ని అనుసరిస్తారు.
బైబిల్ లేఖనాలు వ్యక్తిగతంగా ఒక వ్యక్తి తనకు నచ్చిన అర్థాన్ని పెట్టుకునే విధంగా కాదని. దేవుని ప్రేరేపణ మరియు రచనాశైలి దేవుని నియంత్రణ ద్వారా రచించమని చెప్పిన విధంగానే అర్థం చెబుతుంది (2 పేతురు 1:20-21 చూడండి).
(3) వారికి క్రైస్తవేతర చర్యలు అవసరం.
వారు తమ అనుచరులను క్రైస్తవ జీవితంలో సాధారణంగా లేని ప్రవర్తన విధానానికి పాటించమని ప్రోత్సహిస్తారు. వారు సమాజం నుండి, సాధారణ జీవితం నుండి వేరుపడమని ఆదేశిచవచ్చు.శత్రువులపై ద్వేషభావం ప్రదర్శించి, కొన్ని సందర్భాల్లో హింసను ప్రోత్సహించవచ్చు. వారు తమ అనుచరులు మరియు వారి కుటుంబ సభ్యులపై బలప్రయోగం చెయ్యవచ్చు. వారి చర్యల కారణంగా వారు సమస్యల్లో పడితే, దాన్ని శ్రమగా భావిస్తారు. వారు తమ తీవ్ర విశ్వాసానికి దేవుడు అద్భుతంగా జోక్యం చేసుకుంటాడని నమ్ముతారు. కొన్ని అపోకలిప్టిక్ కల్ట్లు ఆత్మహత్యలో ముగిసిన సందర్భాలు ఉన్నాయి.
తీతుకు 3:1-5 లో క్రైస్తవుల ప్రవర్తన మరియు పాపుల ప్రవర్తన మధ్య తేడా చూపుతుంది.
(4) వారు తమ అనుచరులను ఇతర సంబంధాల నుండి వేరుచేస్తారు.
కొన్ని అపోకలిప్టిక్ కల్ట్లు తమ అనుచరులను తమ వద్ద ఉన్న ప్రతిదానిని సంస్థకు ఇవ్వమని అడుగుతాయి. సభ్యులందరు ఒక ప్రాంగణంలో కలిసి నివసిస్తారు, తమ స్నేహితులు, బంధువులు కల్ట్‌లో లేని వారితో సంబంధాలు తెంచుకుంటారు. వారు బయటి వ్యక్తుల్ని శత్రువులుగా భావించమని బోధిస్తారు. చివరికి ఈ అనుచరులు నిరాశ చెందుతారు, ఎందుకంటే ఈ సహవాసం సత్యంపై ఆధారపడిన నిజమైన క్రైస్తవ సహవాసం కాదు.
యేసు ప్రభువు మనం ప్రపంచంలో ఉండాలని, కానీ ఆయనలాగా ప్రపంచానికి వ్యత్యాసాంగా ఉండాలని ప్రార్థించారు (యోహాను 17:14-16 చూడండి).
► ఈ ప్రశ్న తదుపరి విభాగానికి పరిచయం చేస్తుంది: అపోకలిప్టిక్ కల్ట్లు కలిగించే నష్టం ఏమిటి?
అపోకలిప్టిక్ కల్ట్ల ప్రభావాలు
అపోకలిప్టిక్ కల్ట్లు అనేక విధాలుగా విధ్వంసకరమైనవిగా ఉంటాయి.
1. క్రైస్తవ సంఘం నుండి వ్యక్తులను తప్పుదోవ పట్టించి తప్పుడు సిద్ధాంతాలను నమ్మించేలా చేస్తాయి.
2. వారి అనుచరులను నిరాశపరిచి, వారి విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయేలా చేస్తాయి.
3. వారు క్రైస్తవులమని చెప్పుకుంటారు, కానీ వారి క్రైస్తవేతర ప్రవర్తన క్రీస్తు ప్రతిష్టను మరుగునపడేస్తుంది.
4. దేవుని రాజ్యం మరియు క్రీస్తు తిరిగి రాబోవడాన్ని గురించి బైబిల్ చెప్పే విషయాలపై సందేహం కలిగించేలా చేస్తాయి.
ప్రపంచ సంక్షోభానికి క్రైస్తవుల స్పందన
బైబిల్ ఇలాంటి కాలాలను గురించి ముందే చెప్పింది. దానియేలు గ్రంథం మరియు ప్రకటన గ్రంథం వంటి గ్రంధాలు భవిష్యత్తు అశాంతి, సామాజిక అల్లకల్లోల, అంతర్జాతీయ యుద్ధం మరియు పీడన వంటి కాలాల్లో రాయబడినవి. అవి దేవుని విశ్వసించే ప్రజల విశ్వాసాన్ని పరీక్షించిన కాలాలు. అప్పుడు ప్రతిదీ నియంత్రణలో లేకుండా, మంచిదైన ప్రతిదీ నాశనమైపోతుందని అనిపించింది.
బైబిల్ లో ప్రవచనాల గొప్ప అంశం దేవుడు ప్రతి విషయాన్ని నియంత్రిస్తాడని, చివరికి తన రాజ్యాన్ని స్థాపించి నీతిమంతులను బహుమతులిస్తారని.[2] బైబిల్ సమయాలు కఠినంగా ఉంటాయని, దుష్టులు కొంత కాలం పరిపాలించే అవకాశం ఉందని రూఢీగా చెప్పింది. విశ్వాసులు దేవుని మీద నమ్మకం ఉంచుకోని, ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నా, నిబద్ధంగా జీవించాలని పిలవబడ్డారు. బైబిల్ లేఖనాలు అప్పటి కాలాలకు ఎలా వర్తించాయో, ఇప్పటి విశ్వాస పరీక్షా కాలాల్లో కూడా అవే వర్తిస్తాయి.
[3]2 థెస్సలొనీకయులకు పత్రికను యేసు తిరిగి రాబోవడం మరియు దేవుని తీర్పు సమీపం అనే ఆశిలో ఉన్న క్రైస్తవులకు రాయబడింది. సంఘటనలు అప్పటికే జరిగాయని తమకు తెలుసని చెప్పుకున్న వ్యక్తుల నుండి వారు విన్నారు (2 థెస్సలొనీకయులకు 2:2) వాళ్లు ఏమి చేయాలో తెలియక గందరగోళంలో పడ్డారు.
అపొస్తలుడు పౌలు క్రీస్తు తిరిగి రాబోవడానికి ముందు జరుగబోయే కొన్ని సంఘటనలను వివరించాడు, అందులో ఒకడు "పాపపురుషుడు" మరియు "నాశన కుమారుడు" అని పిలవబడిన వ్యక్తి పరిపాలన కూడా ఉంది (2 థెస్సలొనీకయులకు 2:3).
2 థెస్సలొనీకయులకు 2:15-17 లో విశ్వాసులకు పౌలు ఇచ్చిన ముగింపు ఆదేశాలను చూడటం మనకు చాలా ముఖ్యమైనది.వారు నేర్చుకున్న క్రైస్తవ జీవితాన్ని తృణీకరించకూడదని, ఎలాంటి సంఘటనలు వచ్చినా వారికి బోధింపబడినది వదలకూడదని చెప్పాడు.రాబోయే ఏదైనా సంఘటనల కారణంగా వారు క్రైస్తవ జీవితంలోని ప్రాథమిక సూత్రాలను విడిచిపెట్టకూడదు అని చెప్పాడు. 17 వచనంలో ఆయన దేవుడు ప్రతి మంచిపనిలో వారికి ఏర్పరచునది ఇస్తాడని ప్రార్థించాడు.
ప్రపంచం అంతం సమీపిస్తున్నప్పటికీ, క్రైస్తవ జీవన సూత్రాలను విడిచిపెట్టాల్సిన సమయం ఇది కాదు. ఎల్లప్పుడూ అత్యంత ముఖ్యమైనవిగా ఉన్నవి చివరి వరకు అత్యంత ముఖ్యమైనవిగా ఉంటాయి. మనం కోల్పోయినవారికి సువార్త ప్రకటించాలి, నిజమైన సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి, పవిత్ర జీవితాలను గడపాలి, విశ్వాసులతో సహవాసం చేయాలి, ఇతరులకు మంచి చేయాలి మరియు మనుషులందరికి ప్రేమను చూపించాలి.
► మనం అంతిమకాలంలో జీవిస్తున్నట్లయితే గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఏమిటి?
► ఇప్పుడు తిరిగి వెళ్లి బోల్డ్ మరియు ఇటాలిక్ లో ఉన్న పాఠ్యాన్ని మరియు ప్రతి లేఖన భాగాన్ని చదవండి.
"అవును, ఈ ప్రపంచం, మనకు తెలిసినట్లుగా, అంతం అవుతుందని నేను నమ్ముతున్నాను.
ఎప్పుడో, నాకు తెలియదు, కానీ చరిత్ర అంతా ఇప్పుడు కనిపించే ప్రతిదీ అగ్నితో శుద్ధి చేయబడే ఒక శీతోష్ణస్థితి సంఘటన వైపు చూపుతోంది. ఇది కల్పిత కల్పన కాదు, కానీ బైబిల్ యొక్క స్పష్టమైన మరియు పునరావృతమైన సాక్ష్యం ".
- బిల్లీ గ్రాహం
[2]దానియేలు 2:44, దానియేలు 4:34, దానియేలు 6:26, దానియేలు 7:27, ప్రకటన గ్రంధం 1:7, ప్రకటన గ్రంధం 6:15-17, ప్రకటన గ్రంధం 11:15, ప్రకటన గ్రంధం 17:14 ప్రకటన గ్రంధం 19:11-21.
అపోకలిప్టిక్ కల్ట్ సభ్యుడితో మాట్లాడేటప్పుడు, అతను నిజంగా సువార్తను అర్థం చేసుకుంటున్నాడని నిర్ధారించుకోవడం అతి ముఖ్యమైనది. మీరు కల్ట్ సభ్యుడు క్రైస్తవ సిద్ధాంతాలను విశ్వసిస్తున్నాడని, కానీ కొన్ని ప్రత్యేక ప్రవచనాలను మాత్రమే చేర్చాడని అనుకుంటే తప్పుదారి పడవచ్చు, ఎందుకంటే కల్ట్ ముఖ్యమైన సిద్ధాంతాలను వ్యతిరేకించవచ్చు.
తరువాత ఈ సంప్రదాయం చారిత్రక క్రైస్తవత్వం నుండి ఎలా విడిపోయిందో ఎత్తి చూపడం ముఖ్యం. శతాబ్దాలుగా సంఘం యొక్క దైవభక్తిగల ప్రజలు ఎన్నడూ అంగీకరించని చర్యలు మరియు బోధనలను ఎత్తి చూపండి.
మత్తయి 24:36 ప్రకారం క్రీస్తు తిరిగి రాబోవు సమయం ప్రకటన కాలేదని అది ఎవరికీ తెలియదని గుర్తు చేయండి.
ప్రవచన శాస్త్రాలపై వారి వ్యాఖ్యానం పూర్తిగా తమ నాయకుని మీద ఉన్న నమ్మకం ఆధారంగా ఉన్నదని, సాధారణ వ్యాఖ్యాన నియమాలపై ఆధారపడలేదని చూపించండి.
ద్వితీయోపదేశకాండం 18:22 ప్రకారం, ఒక ప్రవక్త యొక్క ఒక్క ప్రవచనమే తప్పయినా, అతను విశ్వసించడానికి పాత్రుడు కాదని వివరించండి.
ఒక సాక్ష్యం
అనిత అనే అమ్మాయి యెహోవా సాక్షుల కుటుంబంలో పెరిగింది. చిన్ననాటి నుండే ఆమె రాజ్యం మందిరంలో నుండి ఒకే బోధలు నేరుగా దేవుని నుంచి వచ్చినవని విశ్వసించింది. ఒక రాత్రి నాయకులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, అర్మగెడన్ 1975లో సంభవిస్తుందని ప్రకటించారు. ఇది ఏడు సంవత్సరాల దూరంగా ఉంది. ఆ రాత్రి అనిత తన కుటుంబనికి అర్మగెడన్ వస్తే ఏమవుతుందోనన్న భయంతో కన్నీరు పెట్టింది. తర్వాత కొన్ని సంవత్సరాలు ఆమె కుటుంబం మరియు మరికొంత మంది కల్ట్ కోసం కష్టపడ్డారు. వారంతా సమయం తక్కువగా ఉందని నమ్మారు. కల్ట్ మాసపత్రికలు పిల్లలు, పెద్దలు, వృద్ధులు అర్మగెడన్లో నాశనం అవుతున్న చిత్రాలను ముద్రించాయి. 1975 చివరి రోజున, చాలా మంది రాత్రి నిద్రపోతూ దాని ముగింపు రాత్రే వస్తుందని అనుకున్నారు. కానీ అనిత ఉదయాన్నే లేవగానే ప్రతిదీ యథావిధిగా ఉందని ఆశ్చర్యపోయిందిఆమె తల్లిదండ్రులు ఇక ఆ ప్రవచనాన్ని ప్రస్తావించలేదు. అనిత చివరికి కల్ట్ సమావేశాలకు వెళ్లడం మానేసింది, కానీ సత్యం ఎక్కడ దొరుకుతుందో తెలియదు. కొన్ని సంవత్సరాల తర్వాత అనిత రక్షణ గురించి వివరించిన ఒక మహిళను కలిసింది, మరియు ఆమె రక్షించబడింది.
లేఖన అధ్యయనం – భాగం 2
► ఇప్పుడు మార్కు 13 మళ్లీ చదవండి. ప్రతి విద్యార్థి అపోకలిప్టిక్ కల్ట్ అనుచరునికి ఈ పాఠం ఏం సందేశం ఇస్తుందో వివరిస్తూ ఒక పేరా రాయండి.విద్యార్థులు వారు రాసిన వాటిని తరగతి గదిలో పంచుకోవచ్చు.
ప్రతి పాఠానికి కేటాయించిన పని
ఈ మత సమూహంలోని ఎవరికైనా సువార్తను అందించే అవకాశాన్ని కనుగొనడం గుర్తుంచుకోండి. మీరు జరిపిన సంభాషణ గురించి మీ సహవిద్యార్థులతో పంచుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీ రెండు పేజీల లిఖిత నివేదికను వ్రాసి, మీ తరగతి నాయకుడికి ఇవ్వండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.