మొదటి పరిచయం
అమిత్ హిందూ కుటుంబంలో జన్మించాడు మరియు అన్ని మతాచారాలలో పాల్గొనేవాడు. చిన్నప్పుడు ప్రతి రోజు ప్రార్థనలు చేసేవాడు, కానీ తనలో ఒక ఆధ్యాత్మిక ఖాళీని అనుభవించాడు. హిందూ మతగ్రంథాలను చదివి తన మతాన్ని బాగా అర్థం చేసుకోవాలని ప్రయత్నించాడు. అతనికి నమ్మకాలు అంత ముఖ్యమైనవి కావని, అన్ని మతాలూ దేవుడి దెగ్గరికి చేరాడానికి మార్గాలే అని బోధించబడింది.కానీ, అతను దేవుని దగ్గరకు తీసుకువెళ్లే నిజమైన సత్యాన్ని తెలుసుకోవాలనుకున్నాడు, కానీ అలాంటి సత్యం నిజంగా ఉందా అని సందేహపడ్డాడు.
