మొదటి పరిచయం
[1]మార్క్ ఆంథనీ రోమన్ కాథలిక్ అయి ఒకప్పుడు యాజకుడిగా పనిచేశాడు, కాని ఆ తరువాత వదిలేసి వేరే పని కోసం వెతకడం మొదలు పెట్టాడు. అప్పుడు ఒక రోజు అతను కొత్త ఉద్యోగం ప్రారంభిస్తుండగా, అతనికి పనిని చూపిస్తున్న వ్యక్తి "ఇగ్లేసియా ని క్రిస్టో" సభ్యుడు అని తెలుసుకున్నాడు. "నేను యేసు క్రీస్తుని విశ్వసిస్తాను, ఆయనే నా దేవుడు అని మార్క్ ఆంథనీ చెప్పాడు." యేసు దేవుడు కాదని, యేసు మధ్యవర్తి మాత్రమే అని తన పాస్టరు బైబిల్ నుండి నిరూపించగలడని ఆ వ్యక్తి అతనికి చెప్పాడు. వారు మార్క్ ఆంథనీకి అనేక బైబిల్ వాక్యాలు చూపించి, అతన్ని గందరగోళానికి గురిచేశారు. చివరికి, యేసు దేవుడు కాదని వారు అతనిని నమ్మింపజేశారు.
మన ప్రభువైన యేసు క్రీస్తు, దేవుని శాశ్వతమైన కుమారుడు, మన రక్షణ కోసం మనిషి అయ్యాడు అనే ప్రకటన క్రైస్తవ విశ్వాసం యొక్క గుండెల ఉంది.
- విలార్డ్ టేలర్
గాడ్, మాన్ అండ్ సాల్వేషన్
