వెయ్ జియన్ మలేషియాలోని తావోయిస్ట్ కుటుంబంలో పెరిగాడు. ఆయన కుటుంబంలో పూర్వీకులను పూజించడానికి విగ్రహాలు, బలిపీఠం ఉండేవి. వెయ్ జియన్ ఆ విగ్రహాలకు భయపడ్డాడు, కానీ తాను చేయకపోతే వారు తనను శిక్షిస్తారని భయపడి వారికి నైవేద్యాలు అర్పించాడు. అతను యేసు గురించి విన్నాడు, కానీ యేసు పశ్చిమదేశస్తులకి మాత్రమే దేవుడు అని భావించాడు.
► అందరూ కలిసి కీర్తనలు 16ని చదవండి. ప్రతి విద్యార్థి ఒక పేరా లో ఈ గ్రంథ భాగానికి సారాంశం వ్రాయాలి. ఈ లేఖన భాగం మనకు దేవుడు తన ప్రజల కోసం ఏమి చేస్తాడో గురించి ఏమి చెబుతుంది? ప్రతి విద్యార్థి ఒక ప్రకటన జాబితా వ్రాసి వాటిని సమూహంగా చర్చించండి.
తావోయిజం
తావోయిజం పరిచయం
తావోయిజం 350 B.C.కి ముందు చైనా వ్యక్తి లావోజి రాసిన తావ్ టే చింగ్ అనే పుస్తకంతో ప్రారంభమై ఉండవచ్చు. లావోజి వ్యక్తిగతంగా ఉండేవాడో లేక ఇతనికివే ఇతర రచయితల రచనల సమాహారమో తెలియదు. జుఆంగ్జీ అనే వ్యక్తి రచనలూ ఈ మతానికి ప్రభావితం చేశాయి.
తావోయిజం కోసం పుస్తకాల సుమారు 1000కి పైగా పుస్తకాలను కలిగి ఉంటుంది. ఈ సమాహారం తావ్ జాంగ్ అని పిలుస్తారు.
[2]తావోయిజం ఆచారాలు మరియు సిద్ధాంతాలు కన్ఫ్యూషియన్ మతం మరియు స్థానిక చైనీస్ మతాలు, సాంస్కృతిక అంశాల ప్రభావంలో ఉన్నాయి. తావోయిజం ఆచారాలు ప్రాంతాన్ని బట్టి విభిన్నంగా ఉంటాయి.
[3]తావోయిజం అనేక మతాల మిశ్రమంగా ఉండటం వల్ల మరియు వ్యక్తిగతంగా పాటించటం వల్ల తావోయిజం అనుసరించే వారి సంఖ్యను అంచనా వేయడం కష్టం. చైనాలో 40 కోట్ల మంది తావిస్టులు ఉన్నట్లు అంచనా వేయబడింది. తావోయిజం సింగపూర్, తైవాన్ వంటి చైనీస్ జనాభా కలిగిన ఇతర ప్రాంతాలలో కూడా ఉంది. వియత్నాం మరియు కొరియాలో కూడా అనేక మంది ఉన్నారు.
తావోయిజం కోసం పాఠశాలలు, మఠాలు ఉన్నాయి, కానీ ఒకే సంస్థలో ఐక్యతగా లేదు. తావిస్టులు దేవతలు మరియు ఆత్మలను ప్రభావితం చేయడానికి ఉద్దేశించిన ఆచారాలను ఆచరిస్తారు.అనేక తావిస్టు మఠాలు వారి సన్యాసులు శాకాహారులుగా ఉండాలని ఆదేశిస్తాయి. ఆచారాల్లో పందులు, బాతులు లేదా పండ్ల బలులు ఉండవచ్చు.కొన్ని సందర్భాల్లో చిత్రాలతో కూడిన కాగితాలను కాలుస్తారు, చిత్రంలో ఉన్న విషయం ఆత్మ ప్రపంచంలో నిజమైన విషయం అవుతుందాని, ఆత్మలు ఉపయోగించడానికి ఏదో సృష్టిస్టారు.
ఇతర మతాలలోని మనుష్యులు ఆత్మ ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి చేసే పనులను చేయవద్దని బైబిలు చెబుతుంది, (ద్వితీయోపదేశకాండము 18:10-12 చూడండి). దేవుడు ఒక వ్యక్తి, ఆ వ్యక్తి మన తండ్రి, మరియు మనము మనతండ్రితో మాట్లాడవచ్చు, (మత్తయి 6:7-9 చూడండి).
► క్రైస్తవులు ఆత్మల లోకంలో ఎలా పాల్గొనాలి?
వివిధ తావిస్టు సమూహాలు వివిధ దేవతల సమూహాలను నమ్ముతాయి. వారు దేవతలు, ఆత్మలు మరియు పూర్వీకులతో ప్రార్థనలు చేయడం మరియు సంభాషణలు చేయడం చేస్తారు.
ఇతర దేవతలను అనుసరించే వారు తమకు కావలసిన వాటి బదులు దుఃఖాన్ని పొందుతారు, (కీర్తనలు 16:4 చూడండి) అని బైబిల్ చెబుతుంది.
వారు జ్యోతిష్య శాస్త్రం మరియు వివిధ రూపాల్లో దైవీయ జ్ఞానం సాధించేందుకు ఆచారాలు పాటిస్తారు. కొందరు ఆత్మలతో మాట్లాడే మధ్యస్తుల మీద నమ్మకం ఉంచుతారు. చైనా మరియు ఇతర తావోయిజం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ప్రతి సంవత్సరం అనేక ఊరేగింపులు జరుగుతాయి. వాటిలో పాల్గొనే వారు దేవతల, ఆత్మల వేషధారణలో ఉంటారు. ఆ వేషం వేసిన వ్యక్తి ఆ దేవత లేదా ఆత్మ ఆధీనంలో ఉన్నట్లు భావిస్తారు.
కొన్ని మతాలు ఆత్మల అధికారం ఉన్న వ్యక్తిని మంచిదిగా భావిస్తాయి, కానీ బైబిల్ ఆత్మకు బానిసగా మారిన వ్యక్తి విముక్తి పొందాల్సిన అవసరం ఉంది అని చెబుతుంది, (అపొస్తలుల కార్యములు 16:16-18 చూడండి).
ప్రపంచాన్ని పాలించే దేవుడిని యు-హువాంగ్, జేడ్ ఎంపెరర్ అని పిలుస్తారు. ఆయన ఒక చక్రవర్తికి జన్మించిన వ్యక్తి, ఇప్పుడు దేవతగా మారాడని వారి పురాణం చెబుతునాయి. ఆయన అన్ని దేవతలు మరియు ఆత్మలపై అధికారముందాని నమ్ముతారు. యు-హువాంగ్ పాలించే దేవుడు అయినప్పటికీ, ఆయన పైన మరో దేవుడు ఉన్నాడు, ఇతడు ప్రపంచంతో సంబంధం లేకుండా సర్వోన్నత లక్షణాలను కలిగివున్నాడని నమ్ముతారు. యుయాన్-షిహ్ టియెన్-ట్సన్ అనేక మొదటి ప్రధానాధికారిగ భావిస్తారు. ఆయనకు ప్రారంభం లేదా ముగింపు లేదు, అన్ని దానికన్నా ముందు ఉన్నాడు. . ఆయన స్వయం ఉనికిలో ఉన్న, అపరిమితమైన, మార్పులేని, అదృశ్యమైన, అన్ని ధర్మాలతో సంపన్నమైన మరియు ప్రతిచోటా ఉన్న అన్ని సత్యాలకు మూలమని భావిస్తారు.
► తావోయిస్ట్ యొక్క దేవుని భావనలో ఏమి లేదు?
తావ్ అనేది తావిజంలో ఉన్న ప్రతి విషయాన్ని ఆధారపడే మరియు పోషించే వాస్తవం అని భావిస్తారు. విషయాలు ఎలా నిర్వహించబడుతుందో, రూపాంతరం పొందుతున్నాయో సూచిస్తుంది కాబట్టి తావ్ అనే పదం "మార్గం" అని కూడా అనువదించబడుతుంది.
యేసు క్రీస్తు అన్నీ సృష్టించాడు మరియు అన్నింటిని నిలిపాడని బైబిల్ చెబుతుంది, (కొలస్సి 1:16-17 చూడండి).
తావిస్టులు తావ్ని వివరణ చేయడం లేదా అర్థం చేసుకోవడం సాధ్యం కాకపోతుందని నమ్ముతారు.తావ్ గురించి ఏమన్నా చెప్పడానికి సాధ్యం కాదని అంటారు.
దేవుడు అనంతం అయినప్పటికీ, ఆయన తన గురించి కొన్ని సత్యాలను వెల్లడించాడు. యేసు క్రీస్తు మనకు దేవుడు ఎలా ఉంటాడో చూపించడానికి వచ్చాడు, (యోహాను 1:18 మరియు యోహాను 14:6-9 చూడండి).
మంచి మరియు చెడు వంటి అన్ని వ్యతిరేకతలు నిజంగా వాస్తవికతకు వేర్వేరు వైపులా ఉన్నాయనే తావోయిస్ట్ భావనను "యిన్ మరియు యాంగ్" రేఖాచిత్రం వివరిస్తుంది.
► క్రైస్తవ సిద్ధాంతం తావ్ పట్ల తావోయిజం నుండి ఎలా భిన్నంగా ఉంది? మనము దేవుణ్ణి అర్థం చేయసుకోగలమా?
తావోయిస్టులు అన్ని వ్యతిరేకతలు భ్రమలు లేదా వాస్తవికతను పరస్పరం పరిపూర్ణంగా చేసే అంశాలుగా నమ్ముతారు.[4] తావోయిస్ట్ యొక్క లక్ష్యం విశ్వంలోని శక్తులతో తనను తాను సామరస్యంగా తీసుకురావడం. అతని ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మరియు అతని జీవితాన్ని పొడిగించడం అతని లక్ష్యం.ఒక తావోయిస్టు వ్యక్తి ఈ శక్తుల సృష్టిలో మేళవిస్తే, అతడు అమరుడిగా మారుతాడు అని తావిస్టులు నమ్ముతారు.కొంతమంది దీనిని సాధించారని, వారిని దేవతలుగా పూజించాలని తావోయిస్టులు భావిస్తున్నారు. తావోయిస్టులు యేసు క్రీస్తు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన వ్యక్తి అని, మనుషులకు దేవూళ్ళుగా మారడానికి మార్గం చూపించాడని నమ్ముతారు.
మనం దేవుణ్ణి తప్ప ఎవ్వరినీ పూజించకూడదు బైబిల్ చెబుతుంది, (మత్తయి 4:10 మరియు ప్రకటన గ్రంథం 22:8-9 చూడండి).
బౌద్ధులు మరియు హిందువుల వలె తావిస్టులు కూడా సమయం యొక్క అంతులేని చక్రాలను నమ్ముతారు, ప్రారంభం లేకుండా, ముగింపు లేకుండా మరియు శాశ్వతంగా మారని సంఘటనలు లేకుండా ఉంటుందని నమ్ముతారు. కానీ హిందూ మరియు బౌద్ధ మతాలకన్నా తావోయిజం పునర్జన్మ, కర్మ మరియు నిర్వాణాన్ని నమ్మదు.
► ఇప్పుడు తిరిగి వెళ్లి బోల్డ్ మరియు ఇటాలిక్ లో ఉన్న పాఠ్యాన్ని మరియు ప్రతి లేఖన భాగాన్ని చదవండి.
“ఈ స్వతంత్రుడు సృష్టితో సన్నిహితంగా వ్యవహరిస్తాడు, ఈ అనంతమైనవాడు ప్రతి స్థాయిలో పరిమితికి పోషకుడు చేస్తాడు మరియు పెంచి పోషిస్తాడు, ఈ అపారమైనవాడు మొత్తం విశ్వం మరియు అతిచిన్న పిచ్చుక గురించి శ్రద్ధ వహిస్తాడు, ఈ శాశ్వతమైనవాడు సమయం మరియు లౌకిక ప్రవాహాన్ని ఇస్తాడు మరియు కొనసాగిస్తాడు.
తావిస్టులు బైబిల్ ని విశ్వాసించరు కాబట్టి, వారి నమ్మకాలను ఎదిరించడానికి లేఖన వచనాలను ఉపయోగించడం వారి మనసుని మార్చదు. దీని బదులు, వారి అవసరాన్ని పరిశీలించే విధంగా బైబిలు సువార్తను పరిచేయం చేయండి. క్రైస్తవుల వ్యక్తిగత సాక్ష్యం దేవునితో ఉన్న సంబంధాన్ని వివరించడం ద్వారా, తావిస్టులకు దేవుని గురించి తెలుసుకోవాలనే ఆషాను తాకుతుంది.
మనం తావోయిజం యొక్క కొన్ని నీతిశాస్త్రాలను అంగీకరించవచ్చు. వారు ఇతర మనుషులను ప్రేమించాలని, సున్నితంగా ఉండాలని, స్వార్ధాన్ని వదులుకోవాలని, ఇతరులను విమర్శించకూడదని, సంపద కోసం వెంట పడకూడదని బోధిస్తారు.
వారు తావ్ అన్నది అన్ని వస్తువులకు మూలం అని మరియు అన్ని వస్తువులలో ఉంది అని నమ్ముతారు. మనం దేవుడు సర్వం సృష్టించాడని మరియు అన్ని చోట్ల ఉన్నాడని విశ్వసిస్తాము. తేడా ఏమిటంటే, మనం దేవుడు మనస్సు మరియు ప్రయోజనాలతో ఉన్న వారని విశ్వసిస్తాము, మరియు మనం ఆయనతో సంబంధం పెట్టుకోవచ్చు అని నమ్ముతాము.
వారు తావ్ అన్నది అన్ని జీవులను చూసుకుంటుందని నమ్ముతారు. మనం దేవుడు తన సృష్టిలో భాగమై, జాగ్రత్తగా చూసుకుంటాడని విశ్వసిస్తాము, కానీ ఆయన దీన్ని మనకంటే ప్రేమతో ఉన్న తండ్రిలా ప్రేమిస్తాడని నమ్ముతాము.
తావోయిస్టులు అన్ని విషయాలు తెలిసిన, ప్రతిచోటా ఉన్న మరియు అన్ని ధర్మాలను కలిగి ఉన్న సంపూర్ణ లక్షణాలతో కూడిన దేవుడు ఉండాలి అని నమ్ముతారు (వారికి ఆ దేవుడు ఎవరో స్పష్టంగా తెలియకపోయిన) . ఇది దేవునిపై క్రైస్తవ నమ్మకానికి అనుగుణంగా ఉంటుంది, మరియు సంబంధం కోసం మనిషిని తన స్వరూపంలో సృష్టించిన దేవుడు ఆయనే అని మనం వారితో పంచుకోవచ్చు. మనం దేవుడు దెగ్గరకు వెళ్లలేము కానీ దేవుడు యేసు క్రీస్తు అవతారంలో మనకోసం వచ్చారని అని వివరించండి. పాపం మనలను ఆయన నుండి వేరుగా చేసింది, కానీ యేసు క్రీస్తు ద్వారా మనం ఆయనతో సంబంధం పెట్టుకోవచ్చు.
క్రైస్తవులు శాశ్వతమైన, సర్వోన్నతమైన దేవుడు మాట్లాడాడని మరియు తన సందేశాన్ని మనిషికి బైబిల్ రూపంలో అందించినట్లు విశ్వసిస్తారు. తావిస్టులకు సువార్తను వినిపించడం వల్ల వారు దాన్ని దేవుని సందేశంగా అంగీకరిస్టారా లేదా అన్నది వారు నిర్ణయించుకుంటారు.
ఒక గందరగోళంగా వైవిద్యం
► ఒక విద్యార్థి ఈ విభాగాన్ని చదివి వివరించాలి. ఒక సమూహంగా, మీరు విన్న ఈ మతాల శాఖలను జాబితా చేయండి.
ఇక్కడ వివిధ పేర్లతో హిందూ మతం, బౌద్ధమతం మరియు తావోయిజం యొక్క అనేక ఉప సమూహాలు ఉన్నాయి. ఉదాహరణకు, ఫాలున్ గాంగ్ మూడు మతాల ఆధారంగా ఉన్న ఒక మతం, కానీ ఎక్కువ బౌద్ధ మతం మీద ఆధారపడి ఉంటుంది. ఫాలున్ గాంగ్ వంటి మత ఉద్యమాలు వ్యక్తిగత గురువు ద్వారా ప్రారంభమవుతాయి, వారు కొన్ని విషయాలను మార్చి తన సొంత విధానాలుగా బోధిస్తాడు. ఈ మతాలకు వారి మూలధారమైన విశ్వాసాల మీద స్పష్టత ఉండదు కాబట్టి ఇవి సులభంగా జరుగుతాయి.
తూర్పు దిక్కున ఉన్న దేశాల మతాల అనుచరులు చాలా విషయాలలో సమానంగా ఉంటారు మరియు తమ స్వంత శాఖను మాత్రమే నిజమైన మతం అని భావించరు. వారు ఇతర మతాల సమూహాల నుండి వివరాలను తీసుకుంటారు.
కొన్ని శాఖలు శారీరక ఆరోగ్యం లేదా జీవితంలోని ఒత్తిడికి ప్రతిస్పందించడానికి మార్గాల మీద ఎక్కువ దృష్టి పెట్టవచ్చు. అనేక మంది ఆధ్యాత్మిక మరియు శారీరక వ్యాయామాలను ఆచరిస్తారు మరియు మత విశ్వాసాల మీద ఎక్కువ ఆలోచించరు. వారు తమ ఆచారాలను మతం అని కూడా భావించకపోవచ్చు. అయితే, ఆచారాలు బైబిలు సత్యానికి వ్యతిరేకంగా ఉన్న తత్త్వశాస్త్రం మరియు విశ్వజనానికి ఆధారంగా ఉంటాయి.
లేఖన అధ్యయనం – భాగం 2
► ఇప్పుడు కీర్తనలు 16ని మళ్ళీ చదవండి. ప్రతి విద్యార్థి ఒక తావోయిస్ట్ కోసం ఈ భాగంలో ఉన్న సందేశాన్ని వివరిస్తూ ఒక పేరా రాయాలి. విద్యార్థులు వారు రాసిన వాటిని తరగతి గదిలో పంచుకోవచ్చు.
ప్రతి పాఠానికి కేటాయించిన పని
ఈ మత సమూహంలోని ఎవరికైనా సువార్తను అందించే అవకాశాన్ని కనుగొనడం గుర్తుంచుకోండి. మీరు జరిపిన సంభాషణ గురించి మీ సహవిద్యార్థులతో పంచుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీ రెండు పేజీల లిఖిత నివేదికను వ్రాసి, మీ తరగతి నాయకుడికి ఇవ్వండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.