లిడియా తన వీధిలో ప్రతి శనివారం సంఘ ప్రార్థనా మందిరానికి వెళ్ళే చాలామందిని చూసి ఆశ్చర్యపోయింది. ఆమె స్నేహితులను ఈ విషయం గురించి అడగీతే, వారు శనివారం విశ్రాంతి రోజు, ఈ రోజు ప్రార్థనకు సరైన రోజని తెలుసుకుంది. వారు శనివారం రోజున వ్యాపారం, కొనుగోలు లేదా విందు-వినోద వేడుకల కార్యక్రమాలు చేయకూడదని అన్నారు. లిడియా వారి మతం ఇతర సంఘం నుండి చాలా భిన్నమైన మతాన్ని కలిగి ఉన్నారని అనుకుంది, కానీ వారు దేవుని గురించి మరియు రక్షణ గురించి అదే విషయాలను విశ్వసించినట్లు కూడా అనిపించింది.
► అందరూ కలిసి మొదటి తిమోతి1ని చదవండి. ప్రతి విద్యార్థి ఒక పేరా లో ఈ గ్రంథ భాగానికి సారాంశం వ్రాయాలి. ఈ లేఖన భాగం మనకు సిద్ధాంత బోధనా గురించి ఏమి చెబుతుంది? ప్రతి విద్యార్థి ఒక ప్రకటన జాబితా వ్రాసి వాటిని సమూహంగా చర్చించండి.
సెవెంత్-డే అడ్వెంటిజం
సెవెంత్-డే అడ్వెంటిజం యొక్క ఉత్పత్తి/ మూలం
విలియం మిల్లర్
1830లలో బాప్టిస్ట్ బోధకుడు విలియం మిల్లర్ యేసు క్రీస్తు త్వరలో తిరిగి వస్తాడని బోధించడం ప్రారంభించాడు. అతని అనుచరులను మిల్లరైట్లు అని పిలిచేవారు.[1] 1844 అక్టోబర్ 22న క్రీస్తు తెరిగి వస్తారని ఆయన 1844 లో ప్రవచించాడు. వేలాది మంది ఒప్పించారు. కానీ యేసు క్రీస్తు రాకపోవడంతో చాలామంది మిల్లరైట్లు ఆ ఉద్యమం విడిచిపెట్టారు. కానీ హిరామ్ ఎడ్సన్ ఆ తేది నుండి యేసు క్రీస్తు పరలోకంలో ఒక కొత్త సేవ ప్రారంభించాడని ప్రకటింవ్హాడు. ఈ ఉద్యమంలో ఉన్నవారు సెవెంత్-డే అడ్వెంటిస్ట్ సంఘంగా మారారు.
క్రైస్తవ ఆరాధనకు శనివారం సరైన రోజు అని నొక్కి చెప్పే ఇతర సంఘాలు కూడా ఉన్నాయి. ఈ సంస్థకు ముందు ఆ సిద్ధాంతాన్ని చాలా మంది ఈ బోధను బోధించిన వారు ఉన్నారు, కానీ వారిలో సెవెంత్-డే అడ్వెంటిస్టులు అతిపెద్ద మరియు అత్యంత ప్రభావవంతమైనదీ.
ప్రస్తుత ప్రభావం
2020 డిసెంబరులో, సెవెంత్-డే అడ్వెంటిస్టులు 92,000 సంఘాలు మరియు 21 మిలియన్లకు పైగా సభ్యులను కలిగి ఉన్నారని పేర్కొన్నారు. వారు 212 దేశాలలో పనిచేసి 535 భాషలలో సేవ చేశారు. వాటిలో 229 ఆసుపత్రులు మరియు 9,400 పాఠశాలలు ఉన్నాయి.[2]
సెవెంత్-డే అడ్వెంటిజం వారి సిద్ధాంతం
అడ్వెంటిస్ట్లు త్రిత్వం, యేసు క్రీస్తు మరియు పరిశుద్ధాత్మ దైవత్వం వంటి క్రైస్తవ బోధనలను విశ్వసిస్తారు. వారు బైబిలే అంతిమ అధికారాన్ని మరియు విశ్వాసం ద్వారా కృప ద్వారా రక్షణ అని కూడా నమ్ముతారు.
అడ్వెంటిస్టులు ఒక వ్యక్తి మంచి పనుల ద్వారా రక్షించబడడు, కానీ నిజమైన క్రైస్తవుడు దేవునికి విధేయతతో కూడిన జీవితాన్ని జీవిస్తారని వారు నమ్ముతారు.క్రైస్తవులు ఎలా జీవించాలో దేవుని ధర్మశాస్త్రం చూపిస్తుందని, ఒక క్రైస్తవుడు పాపంపై విజయంతో జీవించాలని వారు నమ్ముతారు. ఒక వ్యక్తి దేవుని కోసం జీవించడం జీవించకపోతే తన రక్షణని కోల్పోతాడని వారు నమ్ముతారు.
పాపం దేవునితో మన సంబందం విరిగిపోతుంది అని అడ్వెంటిస్టులు నమ్మడం సరైనదే. ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా మనం ఆయనతో ప్రేమ సంబంధంలో ఉన్నామని యేసు క్రీస్తు చెప్పారు, (యోహాను 15:10 చూడండి).
అడ్వెంటిస్ట్ల ప్రధాన సంస్థ పనుల ద్వారా రక్షణను పొందుతారని నమ్మరు. అయితే, కొంతమంది వ్యక్తులు మరియు అడ్వెంటిస్ట్ గుంపులు ధర్మశాస్త్రాన్ని గాఢంగా ఉద్ఘాటించి, ధర్మశాస్త్రాన్ని పాటించడం రక్షణకు మార్గమని చెప్పినట్లు కనిపిస్తోంది. ఒక వ్యక్తి తన పనుల వల్ల దేవునిచే అంగీకరించబడతానని ఆశిస్తే, అతను క్రీస్తు అందించిన కృపపై తన విశ్వాసాన్ని ఉంచడం లేదు (ఎఫెసీయులు 2:8-9).
► పనులపై సరైన విశిక్షణ ఏమిటి? దేవుని కృప ద్వారా మనం రక్షించబడినప్పటికీ, దేవునికి విధేయతతో జీవించడం అవసరమని ఎలా వివరించగలం?
అడ్వెంటిస్ట్లు మానవుడు సహజంగా అమరత్వాన్ని కలిగి ఉండడని నమ్ముతారు. మరణం తర్వాత, మానవ పునరుత్థానం వరకు జ్ఞానహీన స్థితిలోకి వెళతారు. పునరుత్థాన సమయంలో, రక్షించబడిన వారు నిత్యజీవం పొందుతారని, రక్షించబడని వారు తీర్పుకు పునరుత్థానం చేయబడి అనంతరం అగ్ని సరస్సులో నాశనం చేయబడతారని. సాతాను మరియు ఇతర రాక్షసులు కూడా పూర్తిగా నాశనం చేయబడతారని, శాశ్వత శిక్ష ఉండదని వారు నమ్ముతార.
యేసు ప్రభు శాశ్వత శిక్ష ఉంటుందని చెప్పారు, (మత్తయి 25:46, ప్రకటన గ్రంథం 20:10,15 చూడండి).
అడ్వెంటిస్ట్లు క్రైస్తవులు కొన్ని పాత నిబంధనలోని ఆహార నియమాలను పాటించాలని నమ్ముతారు. ఆరోగ్యకరంగా ఉండటానికి ఆహార నియమాలు అవసరమని వారు విశ్వసిస్తున్నారు. అడ్వెంటిస్ట్లు ఇతరుల కంటే ఎక్కువకాలం జీవిస్తారని వారు చెబుకుంటారు.
మొదటి తిమోతి 4:4 ప్రకారం, ప్రతి/ఏ మాంసమైన క్రైస్తవుడు తినవచ్చు.
[3]అడ్వెంటిస్ట్లు శనివారపు సబ్బత దిన సిద్ధాంతంతో ఎక్కువగా ప్రసిద్ధి చెందారు. వారిప్రకారం, వారంలో ఏడవ రోజు అయిన శనివారం క్రైస్తవ విశ్రాంతి మరియు ఆరాధనకు సరైన రోజని నమ్ముతారు. ఆదివారమున ఆరాధన చేసే సంఘాలు అన్యమతస్థులుగా ఆచారాలను అనుసరించాయని వారు భావిస్తున్నారు.
ఇతర సంఘల పట్ల వారి వైఖరి
అడ్వెంటిస్ట్లు రాజీపడిన క్రైస్తవ లోకంలో తమ ధర్మాన్ని కాపాడుతున్నారని, వారికి వారు విశ్వాస “శేష జనులు” అనగా దేవుని ఆజ్ఞలను పాటిస్తున్న వారమని భావిస్తురు. వారు బైబిల్లోని బాబిలోను ప్రవచన ఈ లోకంతో స్నేహం చేసిన మతభ్రష్టుల మరియు వారి అనుచరుల గురించే అని నమ్ముతారు.
క్రైస్తవ మతంలో వివిధ సంఘాలలో దేవుని ఆజ్ఞలను అనుసరిస్తున్న నిజమైన క్రైస్తవులు ఉన్నారని, కానీ వారు దేవుడు కోరుకున్న వాటిని పూర్తిగా గ్రహించలేదని అడ్వెంటిస్ట్లు భావిస్తారు. ప్రభువు రాకడ ముందు చివరి రోజుల్లో అందరికీ కరువు సమయం వస్తుందని, అందరూ వెలుగును స్వీకరించాలి లేదా దేవుని తీర్పులో నాశనమైపోవాలని, ఆదివారపు ఆరాధకులు నిజాన్ని స్వీకరించనప్పుడు “మృగం యొక్క ముద్ర”ను స్వీకరిస్తున్నారని నమ్ముతారు.”
సంఘల చరిత్రలో పునరుద్ధరణ నాయకుల వంటి నిజమైన క్రైస్తవులు ఉన్నారని, దేవుడు వారిని మార్పుకోసం వాడుకున్నడని అడ్వెంటిస్ట్లు అంగీకరిస్తారు. వారు అడ్వెంటిస్ట్ కాని ధార్మిక శాస్త్రవేత్తలు మరియు బైబిలు పండితుల గ్రంథాలు చదివి వాటిని సూచిస్తారు.
► ఇతర సంఘల పట్ల అడ్వెంటిస్ట్ వైఖరిని మీరు ఎలా వర్ణిస్తారు?
ప్రవచనలయొక్క ప్రాముఖ్యత
అడ్వెంటిస్ట్లు ప్రవచనం సంఘనికి ఒక దివ్య వరంగా, నిరంతర మార్గదర్శకత్వం కోసం అవసరమైనదిగా నమ్ముతారు. వారి ముఖ్యమైన ప్రవక్త ఎలెన్ వైట్, ఆమె 1844లో ప్రవచనం మొదలుపెట్టింది. ఆమె 2,000కి పైగా దర్శనాలను రాసింది. ఆమె రచనలు 80 పుస్తకాలుగా ఉన్నాయి, మరియు అడ్వెంటిస్ట్లు తమ సభ్యులను ఆమె రచనలు తరచూ చదవమని ప్రోత్సహిస్తారు.
అడ్వెంటిస్ట్లు బైబిలును తుది అధికారం అని, ప్రవచనాలను శాస్త్రం ద్వారా పరీక్షించాల్సిన అవసరమని నమ్ముతారు. ఎలెన్ వైట్ మనుష్యులు బైబిలు శాస్త్రాన్ని సరిగ్గా అనుసరించినట్లయితే తన ‘టెస్టిమొనీస్’ లేదా "సాక్షం" అనే పుస్తకం అవసరం ఉండేది చెప్పింది. ఆమె రచనలు బైబిలు ఇప్పటికే బోధించిన దానికంటే మించి దేనినీ బహిర్గతం చేయడానికి ఉద్దేశించినవి కావని ఆమె చెప్పింది.[4]
అడ్వెంటిస్ట్లు ఇంకా ఎలెన్ వైట్ యొక్క పుస్తకాల్ని ప్రచురిస్తూ, వాటిని తమ సిద్ధాంతానికి ఉత్తమమైన వివరణగా వ్యాప్తి చేస్తారు. వారు ప్రచురణల్లో ఆమెని తరచుగా ఉటంకిస్తారు, కానీ ఆమె రచన బైబిలుతో సమానమైనవి కాదని అధికారం కలిగి ఉందని వారు చెప్తారు.
ఎలెన్ వైట్ రచనలు బైబిలులో లేని అభిప్రాయాలను వ్యక్తీకరిస్తూ, సాధారణ వ్యాఖ్యాత్మక శైలిలో కాకుండా కొత్త ప్రకటన ఆధారంగా శాస్త్రం యొక్క వివరణను ఇస్తుంది. బైబిలుకు అంతిమ అధికారం ఇవ్వకుండా ఇతర రచనలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే ప్రమాడంలో అడ్వెంటిస్ట్స్ లు పడవచ్చు.
► పాస్టర్లు మరియు ఉపాధ్యాయుల రచనలను సరైన రీతిలో ఉపయోగిచడం ఏమిటి?
అడ్వెంటిస్ట్ల చివరి రోజుల ప్రవచనంపై దృష్టిని వారి సంఘలలోని పేరుతో వ్యక్తీకరిస్తారు, పేరు ప్రభువు రాకడను సూచిస్తుంది. వారు గ్రంథం యొక్క అనేక అస్పష్టమైన భాగాలతో సహా చివరి రోజుల-కాల బైబిల్ ప్రవచనం యొక్క వివరణను నొక్కి చెబుతారు.అడ్వెంటిస్టులు తమ ఆధునిక పరిచర్యలో దర్శనాలు మరియు అద్భుతాల పాత్రను నొక్కి చెప్తారు.
ఏడవ రోజు సమస్య
అడ్వెంటిస్ట్లు యూదుల్లాగా తమ సబ్బతను శుక్రవారం సాయంత్రం సూర్యాస్తం నుండి ప్రారంభించి శనివారం సూర్యాస్తమయాన వరకు ముగుస్టారు.
సెవెన్త్-డే అడ్వెంటిస్ట్లు, ఆదివారాన్ని శనివారం బదులుగా ఆరాధించేవారు ప్రకటన గ్రంథంలో వివరించిన “మృగం యొక్క ముద్ర” అని భావిస్తారు.
ప్రకటన గ్రంథంలోని మృగం యొక్క ముద్ర ఒక ప్రత్యేక దినానికి ఆరాదిచడం గురించి సంబంధించినది కాదు అని కనిపిస్తుంది, (ప్రకటన గ్రంధం 13:16-17 చూడండి).
[5]ప్రపంచం ఆదివారం ఆరాధనను కఠినంగా అమలు చేయించడానికి ప్రయత్నించబోతున్న సమయం వస్తుందని, శనివారం సబ్బతను పాటించే వారిని హింసించడానికి అవకాశం ఉన్నదని వారు నమ్ముతారు. వారి ప్రకారం, ప్రస్తుతం క్రైస్తవ లోకంలో ఉన్న నిజమైన క్రైస్తవులు ఆదివారపు ఆరాధనలో ఉన్నా, భవిష్యత్తులో శనివారం సబ్బతను పాటించకపోతే వారి ఆత్మను కోల్పోతారని వారు నమ్ముతారు. వారు భావిస్తున్నట్లు, కరువు సమయంలో నిజమైన క్రైస్తవులు ప్రాణాలు తీసిన శనివారం సబ్బతకు నిబద్ధతతో ఉంటారు, మరియు ఆదివారాన్ని ప్రభువైన దినంగా పాటించేవారు క్రైస్తవులు కాదని వారు నమ్ముతార.
ప్రకటన గ్రంథంలో వారంలో ఒక దినం ప్రధాన సమస్యగా ఎలాంటి సూచన లేదు. కానీ, ప్రధాన అంశం దేవుడు కానీ వాడికి ఆరాధన చెయ్యడం వ్యక్తికి సమస్యగా భావిస్తుంది.
అడ్వెంటిస్టుల నమ్మకాల యొక్క చిక్కులను పరిగణించండి.వారు నిజమే చెప్పారు అనుకుంటే, మొదటి శతాబ్దం నుంచి దాదాపు క్రైస్తవ సంఘాలన్ని తప్పు. ఎప్పుడైనా జీవించిన లక్షలాది మంది దైవభక్తిగల, ఆధ్యాత్మిక క్రైస్తవులు ఎవరూ తాము “క్రూరమృగముయొక్క ముద్ర,” ను అనుసరిస్తున్నామని గ్రహించారు, మరియు స్పష్టంగా దేవుడు వారికి దీన్ని ఎప్పుడూ చూపించలేదు. ఇది కోల్పోయిన ఒక చిన్న సిద్ధాంతం కాదు, కానీ అడ్వెంటిస్టుల ప్రకారం, చివరి రోజుల్లో ఒక వ్యక్తి తప్పు చేస్తే తన ఆత్మను కోల్పోతాడని నమ్ముతారు. .
ప్రతి దేశంలోని క్రైస్తవులకు ఆదివారం ఆరాధన దినంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది క్రైస్తవులు ఆయన వాక్యాన్ని వినడానికి సమావేశమవుతారు. వారు ఆయన ప్రేమకు, కృపకు సాక్ష్యమిచ్చి, ఆయనకు సేవ చేయడానికి కట్టుబడి ఉంటారు. వారికి దేవుని పట్ల ఆ నిబద్ధత ఉన్నందున వారు కఠినమైన హింసలను అనుభవిస్తున్నారు. శనివారం సబ్బతు పాటించనంతవరకు వారి ఆత్మలు కోల్పోతారని, వారు సాతాను యొక్క సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారని నిజంగానే నమ్మగలమా?
► మీ జీవితానికి ఒక ఆశీర్వాదంగా ఉన్న దైవిక ఉదాహరణలన్నిటి గురించి ఆలోచించండి. ఈ అంశంపై వారు మనసు మార్చుకోకపోతే వారందరూ తప్పిపోతారని నమ్మడం సాధ్యమేనా?
అడ్వెంటిస్ట్లు ఆదివారం ఆరాధన ప్రారంభం కౌన్సిల్ ఆఫ్ నైసియా లో A.D. 325లో జరిగినదని వాదిస్తారు. వాస్తవానికి, ఆ కౌన్సిల్ యొక్క నిర్ణయాలు ఎలాంటి కొత్త సిద్ధాంతాలను సృష్టించలేదు. వారు అపొస్తలులనుంచి వచ్చిన సిద్ధాంతాలను స్థాపించారు.
క్రైస్తవులు ఆదివారాన్ని ప్రభువు దినంగా చాలా ముందుగానే ఉంచడం ప్రారంభించారు, మనకు ప్రారంభ తేదీ దొరకలేదు. డిడాకె అనే గ్రంథం క్రైస్తవ చరిత్ర రెండవ శతాబ్దం ప్రారంభంలో రాయబడింది, కాని అది మొదటి శతాబ్దపు సంప్రదాయాలను మరియు బోధనలను సూచిస్తుంది. ఇది అపొస్తలుల బోధన యొక్క సంగ్రహ సారాంశం. అన్ని సంఘాలు దీనిని ఉపయోగించారు. క్రైస్తవులు ప్రభువు దినాన సమావేశమై ప్రభుభల్ల తీసుకోవాలని డిడాకె చెబుతుంది. ఇది కొత్త విషయాన్ని నేర్పే ప్రయత్నం చేయట్లేదు, అయితే ఎప్పటినుంచో ఉన్న సిద్ధాంతాలను సమీక్షిస్తుంది, అంటే ఈ ఆచారాన్ని అప్పటికి చాలా మంది క్రైస్తవులు ముందుగానే అపొస్తలుల సిద్ధాంతంగా గుర్తించారని అర్ధం.
బార్నబాస్ లేఖ మొదటి శతాబ్దం చివరలో రాయబడింది. ఇది లేఖన గ్రంథ సాహిత్యం కాదు, కానీ సంఘం లలో ఆధ్యాత్మిక పాఠ్యంగా ఉపయోగించబడింది. ఇది ఆదివారం ను “ఎనిమిదవ రోజు” అని పిలుస్తుంది, ఆ రోజున యేసు క్రీస్తు మృతుల నుండి లేచారని. క్రైస్తవులు ఎనిమిదవ రోజున ఆరాధిస్తారని అది చెబుతుంది.
బైబిల్లో సబ్బతు ఆదివారానికి మారిందని ఎక్కడా వివరించబడలేదు. కానీ, సబ్బతు పాటించడం గురించి ఎవరినీ తీర్పు చూడకూడదని చెప్పబడింది (కొలసి 2:16-17, రోమా 14:5-6).అలాగే, కొత్త నిబంధనలో క్రైస్తవులు ఆదివారంనాడు కానుకలు ఇవ్వాలని (1 కొరింథీయుల 16:1-2), ఆదివారంనాడు సమావేశమై సేవలలో పాల్గొన్నారని (అపొస్తలుల కార్యములు 20:7), మరియు ఆదివారాన్ని ప్రభువు దినంగా పిలుస్తున్నారని (ప్రకటన గ్రంథం 1:10) మనకు కనిపిస్తుంది.
ఇది యూదుల సబ్బతు, క్రైస్తవుల కర్తవ్యంగా ఉండదు. కానీ విశ్రాంతి దినం అనే సూత్రం అన్ని కాలాలకు సృష్టి సిద్ధాంతం. కాబట్టి, ఒక క్రైస్తవుడు ఆదివారంనాడు పనుల నుండి విరామం తీసుకుని విశ్రాంతి తీసుకోవడం మరియు దేవుని ఆరాధించడంలో లీనమవడం మంచిది.
ఏడవ రోజు సమస్యల సారాంశం
1. ప్రకటన గ్రంథం లోని "మృగం యొక్క ముద్ర" ఒక ప్రత్యేక దినానికి ఆరాదిచడం గురించి సంబంధించినది కాదు.
2. అన్ని కాలాల్లో మరియు ప్రదేశాల్లో ఉన్న క్రైస్తవులందరూ ఒక సిద్ధాంతాన్ని తప్పుగా ఉన్నారని దానివల్ల వారి ఆత్మను కొలిపోతారని నమ్మడం అవాస్తవ నమ్మకం.
3. సబ్బతు పాటించడం గురించి ఇతరులపై న్యాయ నిర్ణయించొద్దని బైబిల్ మనకు చెబుతుంది.
4. మొదటి శతాబ్దంలోనే ఆదివారం ఆరాధన అపొస్తలుల సిద్ధాంతంగా స్థాపించబడింది.
5. కొత్త నిబంధనలో క్రైస్తవులు ఆదివారంనాడు సమావేశమయ్యారు మరియు దానిని ప్రభువు దినంగా పిలిచారు.
► ఇప్పుడు తిరిగి వెళ్లి బోల్డ్ మరియు ఇటాలిక్ లో ఉన్న పాఠ్యాన్ని మరియు ప్రతి లేఖన భాగాన్ని చదవండి.
[1]చిత్రం ““William Miller”, by J. H. Bufford Lithography Company, retrieved from the National Portrait Gallery, Smithsonian Institution https://npg.si.edu/object/npg_NPG.80.107 నుండి తీసుకోబడింది.
[2]సెవెంత్-డే అడ్వెంటిస్ట్ ప్రపంచ సంఘ గణాంకాలు 2021.” సెవెంత్-డే అడ్వెంటిస్ట్ చర్చి, ఫిబ్రవరి 14, 2022. https://www.adventist.org/statistics/ , ఏప్రిల్ 11, 2023న తీసుకోబడింది.
"[మతభ్రష్టత] ని సాధారణంగా ఈ విధంగా నిర్వచించవచ్చుః దేవుని నుండి ఆశించకూడని ఏదో ఒకదానిని ఆశించడం ద్వారా లేదా దేవుని నుండి తప్పుడు ఊహించిన ప్రభావం లేదా ప్రేరణ నుండి ఉత్పన్నమయ్యే మతపరమైన పిచ్చి".
- జాన్ వెస్లీ "ది నేచర్ అఫ్ ఎంతుశివమ్" నుండి స్వీకరించబడింది.
"ప్రభువు రోజున, మీరు సమావేశమై, రొట్టెలు విచ్ఛిన్నం చేయండి, కృతజ్ఞతలు చెప్పండి, కానీ మీ త్యాగం స్వచ్ఛంగా ఉండటానికి మొదట మీ పాపాలను అంగీకరించండి".
- డిడ్చే
(రెండో శతాబ్ద సంఘం నుండి)
సువార్త ప్రచారం/సిద్ధాంతాల చేతి పుస్తకాన్ని ఉపయోగిస్తూ
ఒక వ్యక్తి ఏడవ దిన అడ్వెంటిస్ట్ అయినందున, క్రైస్తవుడు కాదు అని చెప్పలేము. అన్ని అడ్వెంటిస్ట్ సిద్ధాంతాలను విశ్వసించిన వ్యక్తి కూడా రక్షింపబడే అవకాశం ఉంది. కొన్ని అడ్వెంటిస్ట్లతో సహవాసం చేయడంలో సమస్య మనం వారిని తిరస్కరించడం లేదు, కానీ వారు మనల్ని తిరస్కరిస్తారు.
అడ్వెంటిస్ట్లతో మేము ఏకీభవించేది క్రైస్తవుడు దేవునికి విధేయతతో జీవించాలన్న విషయములోనే. కృపచే రక్షింపబడ్డాము కాబట్టి పాపంపై విజయాన్ని పొంది దాన్ని జయించి జీవించడం ముఖ్యం కాదని చెప్పే సంఘలను మనము అంగీకరించము.
కొన్ని అడ్వెంటిస్ట్లు ఒక వ్యక్తి కృపకంటే పనులవల్ల రక్షింపబడతారని విశ్వసిస్తారు. కొందరు పాత నిబంధన అవసరాలు పాటించకపోతే, వారు బైబిలు పాటిస్తూ ఎంత భక్తిగా ఉన్నప్పటికీ రక్షింపబడరు అని భావించవచ్చు. అలాంటి అడ్వెంటిస్ట్లు శాస్త్రంలో ఉన్న సత్యసువార్తను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. అలాంటి అడ్వెంటిస్ట్లకు, క్రింది సిద్ధాంతాల చేతి పుస్తకాన్ని ఉపయోగించండి:
(9) రక్షణ కేవలం క్రీస్తు ప్రాయశ్చిత్తంతోనే సాధ్యం.
(11) మన నమ్మకం ద్వారా మాకు రక్షణ లభిస్తుంది.
(12) మనకు వ్యక్తిగత రక్షణ హామీ ఉండవచ్చు.
సబ్బతు సమస్యకు మీరు ఈ పాఠంలోని "ఏడవ రోజు సమస్య" విభాగాలతో స్పందించవచ్చు.
అడ్వెంటిస్ట్ నిజంగా వీరే ప్రకటన లేకుండ బైబిలు బోధనలు రక్షణకు సరిపోతాయని విశ్వసిస్తే, అది మంచి విషయమే. అడ్వెంటిస్ట్ ఇతర మరి మార్గదర్శకాలు, ఎల్లెన్ వైట్ వంటి బోధనలు అవసరమని ఒక అడ్వెంటిస్ట్ భావిస్తే, మీరు సిద్ధాంతాల చేతి పుస్తకంలో సూచించిన లేఖనాలను అతనికి చూపించండి
దర్శన్12 సంవత్సరాలు ఏడవ దిన అడ్వెంటిస్ట్ సభ్యుడిగా ఉన్నాడు. అతను వారి సిద్ధాంతాలను చదివి ఎల్లెన్ వైట్ రచనలను పరిశీలించాడు. అతని ముఖ్యమైన ఆందోళన రక్షణ మరియు పవిత్రత ఎలా కలుగుతాయి అన్నదే. అడ్వెంటిస్ట్ సిద్ధాంతం మనం ఆజ్ఞలను పాటించడం వల్ల రక్షింపబడతామని బోధించిందని అతను అంటున్నాడు. ఆయన గలతీయులకు 5:4 చదివాడు, మనం ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులమవ్వాలని ప్రయత్నిస్తే క్రీస్తును పొందలేమని చెప్పబడింది. గతంలో సబ్బాత్ను పాటించకుండా నిజాయితీగల ప్రజలు రక్షించబడినప్పటికీ, చివరి రోజుల్లో సువార్త మారుతుందని, సరైన సబ్బాత్ను పాటించని వారిని రక్షించలేమని అడ్వెంటిస్టులు కూడా విశ్వసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సబ్బతును పాటించని వారు రక్షింపబడరని, కానీ ముందుగా పాటించని వారు రక్షింపబడారని భావిస్తారు. దర్శన్ దేవునికి విధేయత అవసరమని నమ్ముతున్నప్పటికీ, అడ్వెంటిస్ట్లను వదిలిపెట్టాడు ఎందుకంటే వారి సువార్త కృషి/పనులపై ఆధారపడి ఉన్నారని అతనికి అనిపించింది.
లేఖన అధ్యయనం – భాగం 2
► ఇప్పుడు 1 తిమోతి 1ని మళ్ళీ చదవండి. ప్రతి విద్యార్థి ఒక ఏడవ దిన అడ్వెంటిస్ట్ కోసం ఈ భాగంలో ఉన్న సందేశాన్ని వివరిస్తూ ఒక పేరా రాయాలి. విద్యార్థులు వారు రాసిన వాటిని తరగతి గదిలో పంచుకోవచ్చు.
ప్రతి పాఠానికి కేటాయించిన పని
ఈ మత సమూహంలోని ఎవరికైనా సువార్తను అందించే అవకాశాన్ని కనుగొనడం గుర్తుంచుకోండి. మీరు జరిపిన సంభాషణ గురించి మీ సహవిద్యార్థులతో పంచుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీ రెండు పేజీల లిఖిత నివేదికను వ్రాసి, మీ తరగతి నాయకుడికి ఇవ్వండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.