షాంగ్ హుయ్ చైనాలో "ఒక పాస్టర్‌గా ఉన్నాడు. అతను "దేవుని మహిమ సంఘం"లో చేరేందుకు వారు తమ సంఘాలను విడిచిపోతున్నారని వినసాగాడు.అతని తల్లిదండ్రులు కూడా చేరారు. ఆయన ఆ కల్ట్ సభ్యులను కలిసినప్పుడు, వారు ఇలా చెప్పారు- "దేవుని పేరు మొదట యెహోవా, తర్వాత ఆయన భూమిపై యేసుగా వచ్చాడు. దేవుడు మళ్ళీ ఒక క్రొత్త పని చేయగలడు, మరియు భూమిపై మరొక క్రీస్తుగా ఉండవచ్చు అని వారు నమ్ముతున్నారు" ఈ ఉపదేశాలు షాంగ్‌ను అయోమయానికి గురి చేశాయి.ఈ కల్ట్ ఎంతో వేగంగా విస్తరించడం చూసి ఆయన తన పరిచర్యలో నిరుత్సాహపడ్డాడు.
► అందరూ కలిసి రెండో తిమోతి 3ని చదవండి. ప్రతి విద్యార్థి ఒక పేరా లో ఈ గ్రంథ భాగానికి సారాంశం వ్రాయాలి. ఈ లేఖన భాగం మనకు తప్పుడు క్రైస్తవ మతాల గురించి ఏమి చెబుతుంది? ప్రతి విద్యార్థి ఒక ప్రకటన జాబితా వ్రాసి వాటిని సమూహంగా చర్చించండి.
ఈస్టర్న్ లైట్నింగ్
మూలం మరియు ప్రభావం
[1]ఈస్టర్న్ లైట్నింగ్ యొక్క ప్రసిద్ధి చెందిన కల్ట్ అధికారిక పేరు దేవుని మహిమ సంఘం/సంఘం అఫ్ ఆల్మైటీ గాడ్. ఈ మతం 1989లో చైనాలో స్థాపించబడింది. ఈస్టర్న్ లైట్నింగ్ కి 1,00,000 నుండి 10,00,000 వరకు సభ్యులున్నారని అంచనా.
ఈస్టర్న్ లైట్నింగ్ దేవుడు పాత నిబంధన కాలంలో యెహోవా రూపంలో కనిపించాడు, తరువాత యేసుగా భూమిపై వచ్చాడని వారు నమ్ముతున్నారు . ఇప్పుడు ఆయన లైట్నింగ్ డేంగ్ అనే మహిళ రూపంలో వచ్చాదాని ఈస్టర్న్ లైట్నింగ్ నమ్ముతారు. ఆమె అసలు పేరు యాంగ్ షియాంగ్బిన్. డేంగ్ బహిరంగంగా కనిపించదు,ఆమె ఎలా ఉంటుందో లేదా ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. ఈ కల్ట్కు నాయకునిగా వ్యవహరించే ఝావో వీషాన్, అతను యాంగ్‌కు భర్త కావచ్చు.
క్రీస్తు భూమిపై దాగి ఉన్నాడని ఎవరు చెప్పినా నమ్మవద్దు (లూకా 17:23 చూడండి), అని బైబిల్ చెబుతోంది.
ఈస్టర్న్ లైట్నింగ్ బైబిల్ ఇప్పటి కాలానికి వర్తించదని, కొత్త ప్రకటనలు అవసరమని నమ్ముతుంది. ఈ కల్ట్ లైట్నింగ్ ఫ్రమ్ ది ఓరియెంట్ లాంటి అనేక పుస్తకలను ప్రచురించింది.ఈ పుస్తకాలు మహిళా క్రీస్తుకు దేవుని నుండి వచ్చిన ప్రకటనగా భావిస్తారు. ఈ పుస్తకాలు క్రైస్తవులను హెచ్చరిస్తూ, శిక్షల వివరాలతో వారిని భయపెట్టాలని ప్రయత్నిస్తాయి.
నా మాటలు ఎప్పటికీ తొలగిపోవు (మార్కు 13:31 చూడండి), అని యేసు క్రీస్తు చెప్పారు.
యేసు క్రీస్తు పేరులో ఇకపై ప్రభావం ఉండదని, ఆ పేరు శక్తిలేనిదని, ఇప్పుడు డేంగ్ క్రీస్తు అని ఈస్టర్న్ లైట్నింగ్ కల్ట్ వారు బోధిస్తారు.
యేసు అన్ని ప్రవచనాలను పూర్తిగా నెరవేర్చాడు, కొత్త క్రీస్తు అవసరం లేదు (లూకా 24:44, మత్తయి 16:16; 24:4-5 చూడండి), అని బైబిల్ చెబుతోంది.
ఈ లోకము డిసెంబరు 21, 2012న నాశనమైపోతుందని వీరు ప్రవచించారు.
► ఈ సంస్థ క్రైస్తవ సంస్థ కాదని ఇప్పటికే చూపించే కొన్ని విషయాలు ఏమిటి?
కార్యకలాపాలు మరియు వ్యూహం
ఈస్టర్న్ లైట్నింగ్ ప్రత్యేకంగా క్రైస్తవ సంఘలను లక్ష్యంగా చేసుకుంటుంది, బలమైన క్రైస్తవులను కూడా ఎంపిక చేసుకుంటారు. క్రైస్తవ పరిచర్యలో ఉన్న వ్యక్తులు తమతో చేరడానికి సంఘాన్ని విడిచిపెట్టిన కథలు చెప్పబడ్డాయి. కల్ట్ సభ్యులు సంఘలలో చేరుతున్నట్లు నటించి, తరువాత క్రైస్తవ పాస్టర్లు మతమార్పిడి చేసుకుంటే చాల డబ్బును అందిస్తారు. ఈ కల్ట్ ఇతర మతాలు లేదా వర్గాల విశ్వాసులపై తక్కువ ఆసక్తి చూపుతుంది.
మంచిని ద్వేషించే వారి గురించి బైబిలు మాట్లాడుతుంది, (2 తిమోతికి 3:3 చూడండి).
ఈ కల్ట్ వ్యభిచారాన్ని ఉపయోగించి కొత్త సభ్యులను ఆకర్షిస్తుంది. కల్ట్‌లో చేరినవారు తమ జీవిత భాగస్వాముల నుండి నుండి వేరు చేయబడి, లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనవలసి ఉంటుంది.
క్రైస్తవులు స్వచ్ఛతను కాపాడి, వివాహ బంధాలకు కట్టుబడతారు (ఎఫెసియన్లు 5:3, హెబ్రీయులకు 13:4 చూడండి).
ఈస్టర్న్ లైట్నింగ్ సభ్యులు చిత్రహింసలు, బలవంతపు అపహరణలు హత్యలతో తమ ప్రణాళికలను సాధించడానికి ప్రసిద్ధి చెందారు.వారు క్రైస్తవ సంస్థల నాయకులను భౌతిక దాడులు చేస్తారు. కల్ట్‌లో చేరినవారు తిరిగి బయటకు రావడానికి అనుమతించరు.
బైబిల్ ప్రకారం క్రైస్తవులు సున్నితమైన, చట్టాన్ని గౌరవించే, అహింసాత్మక జీవనం గడపాలి తీతుకు 3:1-2 చూడండి).
కల్ట్‌లో చేరేందుకు ఎవరు ఆసక్తి చూపితే, వారికి బహుమతులు ఇస్తారు. కానీ వారు మారడానికి నిరాకరిస్తే, హింసిస్తారు కల్ట్ సభ్యులు తమ విశ్వాసాన్ని వ్యతిరేకించినప్పుడు దేవుని నుండి ప్రాణాంతక రోగాలు రావడం వంటి కథలను చెబుతారు. వీరు క్రైస్తవులను లైంగిక పాపంలో పాపంలోకి దింపి, ఆ కారణంతో వారిని బెదిరిస్తారు.
దేవుని జ్ఞానం శాంతి, కరుణ, స్వచ్ఛతను కలిగి ఉంటుంది. (యాకోబు 3:17 చూడండి).
ఈ కల్ట్‌ను అనుసరించేవారు తమపై తప్పుడు హింస ఆరోపణలు చేస్తున్నారని అంటారు. కానీ చైనాలో అనేక మంది క్రైస్తవులు మరియు మిషనరీలు వారి చర్యలకు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు.
[2]సభ్యులు తమ వద్ద ఉన్నవన్నీ ఈ కల్ట్కు ఇవ్వాల్సి ఉంటుంది. వారిని తమ కుటుంబాలను విడిచిపెట్టమని, కల్ట్‌లో చేరి ఆ సందేశాన్ని వ్యాప్తి చేయమని ప్రోత్సహిస్తారు.
ఈస్టర్న్ లైట్నింగ్ ఇతర దేశాల్లో కూడా తమ సంస్థను విస్తరిస్తూ ఉంది. మొదట చైనా సంఘల్లో ఉన్న ప్రజలకు ముద్రిత పత్రాలను అందజేసి వారి ప్రచారం మొదలుపెడుతారు.
► నిజమైన సంఘ చర్యలకు ఈస్టర్న్ లైట్నింగ్ చర్యలతో ఎలా భిన్నంగా/విరుద్ధంగా ఉన్నాయి?
ఈస్టర్న్ లైట్నింగ్ అనుచరులు క్రీస్తు మన పాపాల కోసం మరణించాడని అంగీకరిస్తారు, కానీ వారి సంస్థ లేకుండా ఒక వ్యక్తి క్రీస్తు ద్వారా రక్షణ పొందలేడని నమ్ముతారు.రక్షించబడటానికి, తన విశ్వాసాన్ని యేసు క్రీస్తులో నుంచి వదిలి డెంగ్ అనే మహిళా క్రీస్తును అనుసరించాలి. వారు క్రీస్తు పునరుత్థానాన్ని మరియు రెండవ రాకను నమ్మరు.
డెంగ్ (మహిళా క్రీస్తు) యొక్క సందేశాన్ని అంగీకరించనివారిని దేవుని శాపం వస్తుంది వారు నమ్ముతారు.
బైబిల్ సత్యాన్ని వ్యతిరేకించే మరియు సంఘాన్ని విభజించే వ్యక్తుల గురించి ముందుగానే హెచ్చరించిందని (యూదా 1:17-19 చూడండి).
ఇప్పుడు మనిషి యొక్క బాధ్యత మహిళా క్రీస్తును అనుసరించడం. కానీ ఆయన యేసు క్రీస్తుపై తన విశ్వాసాన్ని పూర్తిగా విడిచిపెట్టి, బైబిల్‌ను బహిరంగంగా చింపి, తనను తాను “దెయ్యపు పుత్రుడు” అని పిలిచి, మహిళా క్రీస్తు పలికిన మాటలకు పూర్తిగా లొంగిపోయి “విజయవంతుడు” అయ్యే వరకు—ఆయన “జేయించబడినవాడిగా” మారి—భూమిపై ఆమె స్థాపించబోయే రాజ్యంలో ప్రవేశించలేడు.[4]
► క్రైస్తు మరియు దేవుని వాక్యం ఇంకా క్రైస్తవులకు అవసరమని మనం ఎలా తెలుసుకోగలం?
సర్వశక్తిమంతుడైన దేవుని సంఘం(ఈస్టర్న్ లైట్నింగ్) నిజమైన క్రైస్తవులని చెబుతారు. ఇతర సంఘలన్ని తప్పు అని చెబుతారు. కానీ ఒక వ్యక్తి ఈస్టర్న్ లైట్నింగ్ సిద్ధాంతాలను అర్థం చేసుకొని నమ్మితే, అతను బైబిల్ లేఖన సువార్తను నమ్మడు, కాబట్టి, అతను క్రైస్తవుడు కాదు.
► ఇప్పుడు తిరిగి వెళ్లి బోల్డ్ మరియు ఇటాలిక్ లో ఉన్న పాఠ్యాన్ని మరియు ప్రతి లేఖన భాగాన్ని చదవండి.
"ఈ [బైబిలు] ప్రకటన ఇప్పుడు పూర్తయింది. దేవుడు దానికి ఇంకేమీ జోడించడు, ఎందుకంటే ఇందులో మానవులకు అవసరమైనవన్నీ ఉన్నాయి, ఈ లోకానికి మరియు రాబోయే వాటికి సంబంధించి, మరియు దానికి జోడించే లేదా దాని నుండి ఏదైనా తగ్గించే వారిపై కఠినమైన తీర్పులను ఆయన ఖండించారు.
"యేసు క్రీస్తు మూడవ దినమున పాతాళమునకు దిగి మృతులలోనుండి లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తిమంతుడైన దేవుని తండ్రియైన దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు; అక్కడనుండి జీవము గలవారికిని మృతులకుని తీర్పు తీర్చుటకు వస్తాడు.
► దిగువ జాబితాలోని సిద్ధాంతాలన్నీ ఈస్టర్న్ లైట్నింగ్ ద్వారా ఖండించబడ్డాయి. ఈ సిద్ధాంతాల ప్రాముఖ్యతను, వాటిని నిర్ధారించే ఆధారాలను "సిద్ధాంతాల చేతి పుస్తకాన్ని" లో చూడండి. ప్రతి వచనం సిద్ధాంతాలన్ని ఎలా నిర్ధారిస్తుందో తెలుసుకోండి.
(5) యేసు క్రీస్తు దేవుడు.
(7) పరిశుద్ధాత్మ దేవుడు.
(8) దేవుడు త్రిత్వం.
(9) రక్షణ కేవలం క్రీస్తు ప్రాయశ్చిత్తంతోనే సాధ్యం.
(11) మన నమ్మకం ద్వారా మాకు రక్షణ లభిస్తుంది.
(12) మనకు వ్యక్తిగత రక్షణ హామీ ఉండవచ్చు.
సువార్త ప్రచారం
ఈ కల్ట్లోని హింసాత్మక, అశ్లీల/అనైతికమైన, మోసపూరిత విధానాలు వారిని ఉగ్రవాద సంస్థలా కనిపించినా అనేక మంది అనుచరులు నాయకుల కార్యకలాపాల గురించి తెలియదు.ముఖ్యంగా చైనా వెలుపల ఉన్న దేశాలలో, ఈ కల్ట్ ద్వారా ఆకర్షితులైన వ్యక్తులు తమపై ఉన్న ఆరోపణలను నమ్మకపోవచ్చు. అందువల్ల, క్రైస్తవులకు వారి సిద్ధాంతాలకు సమర్థవంతంగా ప్రతిస్పందించగలగడం ఎంతో ముఖ్యం.
ఈ కల్ట్‌లో పూర్తిగా పాల్గొని వారి సిద్ధాంతాలను నమ్మిన వ్యక్తి క్రైస్తవునిగా ఉండలేడు. అందువల్ల, వారి ఆత్మీయ ఆకలి కూడా తీరదు.క్రైస్తవులుగా మన బాధ్యత వారికి సువార్తను అందించడం.
చాలా మంది ఈస్టర్న్ లైట్నింగ్లో భయంతో చేరతారు. ఏ భూసంబంధమైన పరిస్థితి కంటే సత్యం పట్ల విశ్వాస్యత చాలా ముఖ్యమైనదని మనం బోధించాలి. ఎందుకంటే, దేవుని రాజ్యం విజయం సాధిస్తుందని మనకు తెలుసు.
ప్రత్యేక హెచ్చరిక: చారిత్రాత్మక క్రైస్తవత్మను వదలకండి
ప్రాచీన కాలం నుండి ఇప్పటివరకు క్రైస్తవ విశ్వాసంలో విభిన్న నమ్మకాలున్నాయి. అయితే, దేవుని స్వభావం మరియు క్రీస్తు స్వభావంపై పునాది సిద్ధాంతాలు అన్ని కాలాల్లో సంఘలచే స్థాపించబడి, సమర్థించబడ్డాయి. అన్ని సంఘాలను ప్రాతినిధ్యం వహిస్తూ, ప్రాథమిక సంఘ కౌన్సిళ్లు బైబిలు సిద్ధాంతాల రూపొందించాయి/ప్రకటనలు చేసింది, సువార్తను బోధించే అన్ని సంఘలు ఈ సిద్ధాంతాలను ముఖ్యమైనవిగా భావించాయి. బైబిల్ సంఘలు పరస్పరం చాలా భిన్నంగా ఉన్నప్పటికీ, అనేక విషయాల్లో విభేదిస్తాయి, కానీ ముఖ్యాంశాలపై ఏకీభవిస్తారు.
కొన్ని కల్ట్లు అన్ని సంఘాలు తప్ప, అవసరమైన సిద్ధాంతాలపై మరియు నిజంగా క్రైస్తవులు కాదని చెబుతున్నారు. వారు చిన్న చిన్న సిద్ధాంతాలపై కాకుండా, సువార్తకు అవసరమైన సిద్ధాంతాలపై విభేదిస్తారు. వారు క్రైస్తవులను ఇతర మతాల నుండి వేరు చేసిన విషయాలను నిరాకరిస్తారు. అవసరమైన క్రైస్తవ సిద్ధాంతాలను నిరాకరించే కల్ట్ మరొక మతం అది క్రైస్తవ మతం అనుకోవడం తప్పు/తగదు.
కల్ట్ అన్ని సంఘలు తప్ప తమది ఒక్కటే సత్యమని ప్రకటించినప్పుడు, వారు సూచించేది ఏమిటో గుర్తించాలి. అన్ని సంఘలను ప్రతినిధీ చేసిన ప్రాచీన కౌన్సిల్స్ తప్పని వారు చెబుతున్నారు. ప్రతి యుగంలో కోట్ల మంది క్రైస్తవులు తప్పని చెబుతున్నారు. మీరు తెలుసుకునే భక్తులైన, క్రీస్తును పోలి నడిచిన వ్యక్తులు తప్పని వారు చెబుతున్నారు. దేవుని ప్రేమతో జీవించే, ప్రార్థించే, ఆరాధించే, దేవుని కృపను సాక్ష్యపెట్టే, హింసను భరిస్తున్న, బైబిల్‌ను అనుసరించే, సువార్తను పంచే భక్తులు అన్ని దేశాలలో తప్పని వారు చెబుతున్నారు. ఈ వ్యక్తులను క్రైస్తవులుగా నిలబెట్టే ప్రాథమిక సత్యం తప్పనిదని కల్ట్ చెబుతోంది. ఒక వ్యక్తిని క్రైస్తవునిగా చేసే ప్రాథమిక సత్యంపై కూడా ఈ వ్యక్తులందరూ తప్పు చేశారని కల్ట్ చెబుతుంది.
కల్ట్ సరైనదైతే, దేవుడు నిండు శతాబ్దాల పాటు తన సంఘం కోసం సువార్త సత్యంలో మార్గనిర్దేశం చేయకపోయాడు.కల్ట్ సరైనదైతే, ఏ కారణానికి గానీ ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో ఉన్న భక్తులు, దేవుని పట్ల శ్రద్ధ కలిగిన వ్యక్తులు, వారి సిద్ధాంతాలను తిరస్కరించడం విచిత్రం. కొన్ని ధార్మిక సంస్థలు లోకసంబంధమైనవి, శక్తివంతమైనవి, ధనవంతమైనవిగా మారవచ్చు మరియు సత్యం పట్ల ఆసక్తి చూపకపోవచ్చు, కానీ దేవుని భక్తి గల, ఆత్మతో నింపబడిన వ్యక్తులు ముఖ్యమైన బైబిల్ సత్యాలను గౌరవించి పట్టుకుంటారు.
ఒక సాక్ష్యం
లియా ఈస్టర్న్ లైట్నింగ్ కల్ట్‌లో చేరింది, ఎందుకంటే వారు క్రైస్తవులు అని ఆమె భావించింది. కానీ వారు బైబిల్ మరియు యేసు క్రీస్తుపై విశ్వాసం లేని వారని తొందరగానే గుర్తించింది.ఆమె బయటకు రావాలనుకుంది, కానీ వారు ఆమె కాళ్లను ఇనుప రాడ్లతో కొట్టి, ఆమెను నడవలేకుండా చేసారు. ఆమె వెళ్లిపోతే చంపేస్తామని బెదిరించారు. తర్వాత ఆమె క్రైస్తవుల సహాయంతో అక్కడినుండి తప్పించుకుంది. ప్రస్తుతం ఆమె సంఘంలో ఉండి, దేవుని సహాయం కోరుతుంది. ఆమె ఇంకా ఆ కల్ట్‌లో జరిగిన దాడి కారణంగా కుంటిదైయింది.
లేఖన అధ్యయనం – భాగం 2
► ఇప్పుడు 2 తిమోతి 3ను మళ్లీ చదవండి. ప్రతి విద్యార్థి ఈస్టర్న్ లైట్నింగ్ కోసం ఈ భాగంలో ఉన్న సందేశాన్ని వివరిస్తూ ఒక పేరా రాయాలి. విద్యార్థులు వారు రాసిన వాటిని తరగతి గదిలో పంచుకోవచ్చు.
ప్రతి పాఠానికి కేటాయించిన పని
ఈ మత గుంపులోని ఎవరితోనైనా సువార్తను పంచేందుకు అవకాశం కనిపెట్టేందుకు ప్రయత్నించండి. ఈ కల్ట్ మీరు చదివే దేశంలో ఉండకపోవచ్చు. అలా అయితే, ఈ విషయాన్ని మరొకరికి పంచి వారి స్పందనను పొందండి. మీరు జరిపిన సంభాషణ గురించి మీ సహవిద్యార్థులతో పంచుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీ రెండు పేజీల లిఖిత నివేదికను వ్రాసి, మీ తరగతి నాయకుడికి ఇవ్వండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.