విజయ్ మొదటిసారి వారిని ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక పార్కు గుండా వెళుతున్నప్పుడు కలుసుకున్నాడు. ఇద్దరు యువకులు నల్లటి ప్యాంట్లు, తెల్లని షర్టులు ధరించి, పేరు బాడ్జ్ ధరించి అతనిని కలిశారు. వారు స్నేహపూర్వకంగా ఉండి వారి మతం గురించి అతనితో మాట్లాడాలని ఆశపడ్డారు. విజయ్ చాలా ప్రశ్నలు అడగకుండా వారు చెప్పింది విన్నాడు. వారు సాధారణ ఒక సంఘం నుండి వచ్చిన వారిలా కనిపించారు, మరియు విజయ్ తన ప్రధాన సంఘంలో విన్న విషయాలే వారు కూడా చెప్పారు. వారు "సంఘం అఫ్ జీసస్ క్రిస్ట్ అఫ్ లత్తెర్-డే సెయింట్స్", నుండి వచ్చామని చెప్పారు, వీరిని మోర్మన్లు అని కూడా పిలుస్తారు.
► అందరూ కలిసి యెషయా 41ని చదవండి. ప్రతి విద్యార్థి ఒక పేరా లో ఈ గ్రంథ భాగానికి సారాంశం వ్రాయాలి. ఈ భాగం మనకు దేవుని గురించి ఏమి చెబుతుంది? ప్రతి విద్యార్థి ఒక ప్రకటన జాబితా వ్రాసి వాటిని సమూహంగా చర్చించండి.
మోర్మనిజం
ప్రారంభం మరియు చరిత్ర
మోర్మనిజం జోసెఫ్ స్మిత్ అనే వ్యక్తితో ప్రారంభమైంది. జోసెఫ్ 1820లో ఒకరోజు, ఏ సంఘం సరైనదో తనకు చూపించమని దేవునికి ప్రార్థించాడని చెప్పాడు. ప్రార్థన చేస్తూ ఉండగా, అతనికి ఒక దర్శనం వచింది, అతను రెండు తెల్లటి వస్త్రాలు ధరించిన వ్యక్తులను చూసాడు, వారు యేసు క్రీస్తు మరియు తండ్రి అయిన దేవుడు. దేవుడు అతనికి ఏ సంఘం కూడా సరైనది కాదని, వాటి విశ్వాసాలు అసహ్యకరమైనవని చెప్పాడు.
► ఈ దర్శనంలో బైబిలుకు వ్యతిరేకంగా ఉన్న అంశాలు ఏమిటి?
జోసెఫ్ తర్వాతి దర్శనంలో, అతనికి కొన్ని బంగారు ఫలకాలు ఉండే ప్రదేశం తెలియజేసారని చెప్పాడు, ఆ ఫలకాలపై రాతలు ఉండేవి. వాటిని మాయ కళ్లద్దాలు సహాయంతో అనువదించి "బుక్ ఆఫ్ మోర్మన్" అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఆ ఫలకాలను మరియు కళ్లద్దాలను ఎవరూ చూడలేదు, ఎందుకంటే దేవదూత వాటిని జాగ్రత్త ఉంచడానికి తిరిగి పరలోకనికి తీసుకెళ్లాడని చెప్పారు.
జోసెఫ్ ఒక మాసనిక్ సంఘానికి సభ్యుడు మరియు మోర్మనిజం రహస్య పద్ధతులను మాసొంరీ మాన్యుయల్స్ నుండి, రక్త ప్రమాణాలు, సంకేతపదాలు మరియు రహస్య కరచాలనం సహా కాపీ చేసాడు.
అపొస్తలులకు ఎలాంటి రహస్య మతం లేదు, వారు తమ విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించారని బైబిల్ చెబుతుంది (2 కొరింథీయులకు 4:2, 2 తిమోతికి 2:2 చూడండి).
మోర్మన్ సంఘం 1830లో న్యూయార్క్‌లో ఏర్పడింది. 1839లో వారు మొదట నావూ, ఇల్లినాయిస్, ఆ తర్వాత మిస్సోరికి వెళ్లారు. స్మిత్ మిజోరిని మోర్మన్లకు వాగ్దత్త భూమిగా పేర్కొన్నాడు, మరియు దేవాలయం అక్కడ ఇన్డిపెండెన్స్లో నిర్మించబడుతుందని చెప్పాడు[1]. ఆ దేవాలయం ఎప్పటికీ నిర్మించబడలేదు, మరియు మోర్మన్లు మళ్లీ వెళ్లిపోయారు. స్మిత్ ఎన్నో ప్రవచనాలు ప్రవచించాడు కానీ అవి నిజాంకాలేదు.
ఒక వ్యక్తి చేసిన ప్రవచనం నిజం కాకపోతే, అతనిని ప్రవక్తగా విశ్వసించవద్దని, బైబిల్ చెబుతుంది (ద్వితీయోపదేశకాండము 18:22 చూడండి).
“ఏ వ్యక్తికైనా ఉన్నదానికంటే నేను గర్వపడాల్సినవి చాలా ఉన్నాయి. ఆధము కాలం నుండి మొత్తం సంఘాన్ని కలిసి ఉంచగలిగిన ఏకైక వ్యక్తి నేను. చాలా మంది నాకు మద్దతుగా నిలబడ్డారు. పౌలు, పేతురు, యేసు ఎవరూ చెయ్యలేని పని నేను చేశాను. యేసుని అనుచరులు ఆయన నుండి పారిపోయారు, కానీ లాటర్-డే సేంట్స్ ఇంకా నా దగ్గరే ఉన్నారు, స్మిత్ చెప్పాడు.”[2]
జోసెఫ్ తన బహుపతిత్వాన్ని ఖండించిన వార్తాపత్రిక యొక్క ప్రింటింగ్ ప్రెస్ ను ధ్వంసం చేశాడు. జోసెఫ్ జైలులో ఉన్నప్పుడు, ఒక గుంపు జైలుపై దాడి చేసి, అతనిని మరియు అతని సోదరుడు హిరామ్ను చంపేశారు.
ఒక పాస్టర్ అహంకారి, కపట స్వభావం లేదా హింసాత్మకమైనవాడిగా ఉండకూడదని, బైబిల్ చెబుతుంది. తీతుకు 1:7 చూడండి.
స్మిత్ తన కుమారుడిని తన వారసునిగా నియమించాడు, కానీ స్మిత్ మరణించిన తర్వాత, విశ్వాసుల్లో పెద్ద భాగం బ్రిగామ్ యంగ్‌ను అనుసరించి, వారు వారి “వాగ్దాన భూమిని” వదిలి సాల్ట్ లేక్ సిటీకి వచ్చారు.
మోర్మన్లు నిజమైన క్రైస్తవ మతం అపొస్తలుల మరణంతో ముగిసిందని, స్మిత్ మోర్మన్ సంఘాన్ని ప్రారంభించే వరకు అది భూమి మీద చనిపోయిందని నమ్ముతారు.
► మార్మన్ సంఘంలో కొన్ని ప్రారంభ సంఘటనలు ఏమిటి, అది భూమిపై పునరుద్ధరించబడిన నిజమైన క్రైస్తవ మతం అని మనకు అనుమానం కలిగిస్తుంది?
ప్రస్తుత ప్రభావం
జోసెఫ్ స్మిత్ మొదలు పెట్టిన మొదటి మోర్మన్ ఉద్యమం నుండి వేరుపడ్డ అనేక మోర్మన్ ఉపవిభాగాలు ఉన్నాయి. వీటిలో కొన్ని చాలా చిన్నవి.
మోర్మోన్స్ యొక్క అతిపెద్ద సంఘం ఉటాలోని సాల్ట్ లేక్ సిటీలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉంది మరియు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 170 లక్షల మంది సభ్యత్వాన్ని కలిగి ఉంది.[3] వారు 188 భాషల్లో ప్రచురణలు చేస్తారు.
అందులో దాదాపు 55,000 మంది పూర్తికాలమాన మిషనరీలు ఉంటారు. ఈ మిషనరీలు సాధారణంగా యువకులు, వారు 1½ లేదా 2 సంవత్సరాలు స్వచ్ఛందంగా పనిచేస్తారు. వారిని ప్రపంచంలో ఎక్కడైనా పంపవచ్చు, కానీ వారు ఎక్కడికి వెళ్ళాలో తాము నిర్ణయించలేరు. వారు ఎటువంటి జీతం పొందరు.
కష్టమైన మోర్మన్ సిద్దాంతాలు
బహుపతిత్వం
జోసెఫ్ స్మిత్ బహుపతిత్వం దేవుని ఆజ్ఞగా ఉందని, మనుష్యులు మరణం తర్వాత అంతిమ లక్ష్యమైన దేవుళ్ళు కావాలంటే బహుపతిత్వం పాటించాల్సిందేనని చెప్పాడు.పురుషులు శాశ్వతత్వం కోసం చాలా మంది భార్యలను కలిగి ఉండాలని భావించారు, తద్వారా వారు దేవుడు భూమిపై ఉన్న మనుషులను విస్తరించిన విధంగానే కొత్త ప్రపంచాలను జనసాంద్రత చేయలి.[4]
పాస్టర్ ఒక భార్యతో మాత్రమే ఉండాలని బైబిల్ చెబుతుంది (తీతుకు 1:6 చూడండి).
స్మిత్ 27 మందిని పెళ్లి చేసుకున్నాడు. వీరిలో అతిచిన్నది 14 ఏళ్ల బాలిక. వారిలో కొందరు ఇతరులకు పెళ్లి అయిన మహిళలు, కానీ మోర్మనిజం వెలుపల చేసిన పెళ్లిళ్లు చెల్లవని స్మిత్ చెప్పాడు. స్మిత్ తరువాత నాయకుడు బ్రిగమ్ యంగ్ 57 మంది భార్యలను మరియు 165 మంది సంతానాన్ని కలిగి ఉన్నాడు.
విడాకులు పొందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వ్యభిచారం అని బైబిల్ చెబుతుంది. (మత్తయి 5:32 చూడండి).
స్మిత్ బహుపతిత్వం దేవుని శాశ్వత నిబంధన అని, అది ప్రపంచ నిర్మాణానికి ముందే స్థాపించబడిందని చెప్పాడుతరువాత మార్మన్ సంఘానికి చెందిన అపొస్తలులు దైవత్వాన్ని చేరుకోవడానికి బహుభార్యాత్వం ఒక్కటే మార్గమని చెప్పారు[5] మరియు ఇది ఎప్పటికీ మార్చబడదు.
మోర్మన్లు బహుపతిత్వం 1890 వరకు కొనసాగించారు, ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం వారు చట్టాన్ని ఉల్లంఘిస్తునందుకు వారి సంఘంలోని భూమిని స్వాధీనం చేసుకుంటామని బెదిరించింది.అప్పుడు మోర్మన్ ప్రవక్త వుడ్రఫ్ దేవుని నుంచి మరో దర్శనం పొందినట్లు ప్రకటించాడు, దానితో బహుపతిత్వం ముగిసింది.
► ఎక్కువమంది మోర్మన్లు బహుపతిత్వాన్ని ఆచరించడం లేదు. కానీ వారి చరిత్రలోని బహుపతిత్వం వారి విశ్వసనీయతకు ఇంకా సమస్యగా ఎందుకు ఉందని మీరు భావిస్తారు?
జాతివివక్షo
మోర్మన్ సిద్ధాంతం ప్రకారం, ప్రతి మనిషి భూమిపై పుట్టకముందు స్వర్గంలో ఆత్మగా ఉన్నారు. పరలోకములో యుద్ధం జరిగినప్పుడు, దేవుని పక్షాన పోరాడనివారు నలుపు చర్మంతో శపించబడ్డారు. ఈ పేరాలో పేర్కొన్న పురుషులందరూ మార్మన్ సంఘ అధ్యక్షులు మరియు ఇప్పటికీ మార్మన్లచే దేవుని ప్రవక్తలుగా పరిగణించబడ్డావారు. నలుపు చర్మం ఉన్న వారు మోర్మన్ సిద్ధాంతాలను నమ్మి, సరిగా ఉంటే, వారి చర్మం తరాల తర్వాత తెలుపుగా మారుతుందని జోసెఫ్ స్మిత్ చెప్పాడు. నల్లటి చర్మం మరియు చదునైన ముక్కులు కయీను శాపం అని బ్రిఘం యంగ్ అన్నాడు. ఆఫ్రిక రక్తం ఉన్న వ్యక్తి యాజకత్వాన్ని కలిగి ఉండలేడనేది దేవుని నుండి వచ్చిన శాశ్వతమైన సూత్రం అని ఆయన అన్నాడు. నల్ల వారిని బానిసగ ఉంచడం ఒక దైవిక సంస్థ అని కూడా ఆయన అన్నాడు. నల్లజాతీ వారు పుట్టక ముందు వారి ఆత్మలు ఏమి చేసిన పనివల్ల ఈ ప్రపంచంలో దానికి ఫలితం పొందుతున్నారని, జోసెఫ్ ఫీల్డింగ్ స్మిత్ మాట్లాడుతూ చెప్పాడు. నీగ్రోకు వ్యతిరేకంగా సంఘం యొక్క వివక్ష మనిషితో కాకుండా దేవునితో ప్రారంభమైందని డేవిడ్ మెక్కే చెప్పాడు.
క్రీస్తులో జాతీయత మరియు జాతి భేదాలు లేదని బైబిలును చెబుతుంది. (గలతీయులకు 3:28 చూడండి).
ప్రతి మోర్మన్ దేవాలయము పైభాగములో మోరోనీ అనే దేవదూత విగ్రహము ఉంటుంది.
మోర్మన్ సిద్దాంతం ప్రకారం, ప్రతి పురుషుడూ యాజకుడవ్వాలి.నల్లజాతి వారి నిజమైన విశ్వాసులు కాదని చాలా కాలం పాటు మోర్మన్ సంఘంలో వారిని యాజకులుగా నియమించలేదు. 1978లో మొత్తాన్నినల్లవారిగురించి వారు చెప్పినవన్నీ మార్చే కొత్త దర్శనం పొందినట్లు పేర్కొని, నల్లజాతి వారిని యాజకులుగా నియమించడానికి అనుమతించారు.[6]
► మోర్మన్ సంఘం నల్లజాతి వారిని ఇతర జాతులతో సమానంగా అంగీకరించినప్పటికీ, వారి జాతి వివక్ష చరిత్రను చూస్తూ ఇంకా వారి నమ్మడానికి సమస్యగా అందుకు ఉంది?
ఆంతర దుస్తు
[7]ప్రతి మోర్మన్ సభ్యులు బయటి దుస్తులు లోపల ప్రత్యేక దుస్తులు ధరించాలి. ఇవి తెల్లటి రంగులో ఉండి శరీరాన్ని ఎక్కువగా కప్పి ఉంచాలి. అవి ఆధ్యాత్మిక రక్షణను అందిస్తాయని నమ్ముతారు. ఇది సంఘం పట్ల నమ్మకంగా ఉంటామనే వారి వాగ్దానాన్ని సూచిస్తుంది. వారు దానిని పగలు మరియు రాత్రి ధరించా.
మతోన్మాద మోర్మోన్ల సిద్ధాంతాలు
ప్రతి మోర్మన్ సభ్యుడు జోసెఫ్ స్మిత్ దేవుని ప్రవక్త అని మరియు మోర్మన్ గ్రంథం క్రీస్తు గురించి మరో సాక్ష్యం అని, అది బైబిలు సమానమైన అధికారం కలిగి ఉందని విశ్వసించాలి. వారు "డాక్టరిన్ అండ్ కోవెనెంట్స్" అనే పుస్తకాన్ని కూడా కలిగి ఉన్నారు, దీనిని వారు బైబిలు వలెనే దేవుని ప్రేరేపణతో వచ్చినదిగా విశ్వసిస్తారు. వారి అత్యవసరమైన సిద్ధాంతాలను నిర్ధారించడానికి బైబిలు సరిపోదని వారు నమ్ముతారు.
మోర్మన్లు తమ మతం నిజమైన క్రైస్తవమని ప్రకటిస్తారు. వారి చాలా సిద్ధాంతాలు బైబిలు మరియు చారిత్రక గాస్పెల్ బోధనలకు విరుద్ధంగా ఉంటాయి. మోర్మన్ సభ్యులతో మాట్లాడేటప్పుడు, వారి సిద్ధాంతాలలోని దారితప్పిన అంశాలను గుర్తించడం కష్టం, ఎందుకంటే వారికి వారి ప్రవక్తలు ఏం బోధించారో తెలియదు.
మోర్మన్ సంఘం ప్రకారం, దేవుడు ఒకప్పుడు మనిషి వలె ఉండేవాడు, కానీ ఇప్పుడు ఆయన దేవుడిల మారాడు.[8] వారు తండ్రియైన దేవుడు శరీరం కలిగి ఉన్నాడని నమ్ముతారు.ఆయనకు అనేక భార్యలు ఉన్నారు.ఆయన పిల్లలు మొదట ఆత్మలుగా పుట్టి, తరువాత భూమిపై మానవులుగా పుడతారు.
మోర్మన్లు యేసు క్రీస్తు కన్యక మరియా ద్వారా పుట్టాడని విశ్వసించినప్పటికీ, వారి సంఘం ప్రకారం తండ్రియైన దేవుడు తన శరీరాన్ని ఉపయోగించి మరియాను గర్భవతిని చేశాడని చెబుతుంది.
బైబిలు ప్రకారం, పరిశుద్దాత్మ ద్వారానే మరియా గర్భం దాల్చింది అని చెప్తుంది (లూకా 1:34-35, మత్తయి 1:18 చూడండి). అదేవిధంగా, దేవుడు ఆత్మ అని బైబిలు పేర్కొంటుంది (యోహాను 4:24 చూడండి).
మోర్మన్లు యేసు భూమిపై పుట్టకముందు ఆయన దేవుడు కాదని, ఆయన విగత దూతల లాగా ఒక ఆత్మ మాత్రమే అని విశ్వసిస్తారు.
అయితే బైబిలు ప్రకారం, యేసు దేవుని వాక్యమని, ఆయన లోఖం పుట్టటక ముందు నుంచే దేవుడని చెబుతుంది (యోహాను 1:1-2, 14 చూడండి).
మోర్మన్లు తండ్రియాయైన దేవునికి వేడిగా పరిశుద్దాత్మ మరియు యేసు క్రీస్తు ఉంటారని, వారు తండ్రియైన దేవునికి సామానులు కాదని చెబుతారు. వారు త్రిత్వం అనే సిద్ధాంతాన్ని విశ్వసించరు.
► కొద్దిపాటి మాటల్లో మోర్మన్ల దేవుని సిద్దాంతంలో సమస్య ఏమిటి?
మోర్మన్లు ఒక పురుష మోర్మన్ దేవుడిలా మారవచ్చని విశ్వసిస్తారు. వారు ఇప్పటికే చాలా మంది దేవుడిలా మారారని నమ్ముతారు. "మనిషి ఇప్పుడు ఉన్నట్టు, దేవుడు ఒకప్పుడు ఉన్నాడు. దేవుడు ఇప్పుడు ఉన్నట్టు, మనిషి కూడా మారవచ్చు," అని అప్పొస్తలుడు లోరెంజో స్నో ఇలా అన్నాడు.
"ఇదే శాశ్వత జీవితం—ఎకైక సత్యమైన దేవునిని తెలుసుకోవడం; మరియు మీరు మీరే దేదేవుళ్లుగా మారి, దేవునికి రాజులు మరియు యాజకులుగా ఉంతరని నేర్చుకోవాల్సి ఉంది. గతంలో అన్ని దేవతలు కూడా ఇదే చేశారు," అని జోసెఫ్ స్మిత్ అన్నాడు.
మోర్మన్లు కొంతమంది మాత్రమే శాశ్వత నరకానికి వెళ్తారని నమ్ముతారు. మరణించాక మోర్మనిజం స్వీకరించే అవకాశం చాలామందికి లభిస్తుందని చెబుతారు. విశ్వసనీయ మోర్మన్లు పరలోకం లో ఉన్న అత్యున్నత స్వర్గానికి వెళ్తారని నమ్ముతారు.
బైబిల్, అనేక మంది శాశ్వత నరకంలో, సైతాను మరియు రాక్షసులతో పాటు ఉంటారని చెబుతుంది (మత్తయి 25:41 చూడండి).
మోర్మోన్లు దేవునికి ఇచ్చిన వారి జీవిత విశ్వాస పరిచర్యకు ప్రతిఫలము రక్షణ ఉందని. వారి దెగ్గర రక్షణకు సంబంధించిన వ్యక్తిగత హామీ ఉండదు.
బైబిలు ప్రకారం, రక్షణ అనేది దేవుని ఉచిత కానుక, అది పనుల ద్వారా పొందలేము (ఎఫెసీయులు 2:8-9 చూడండి).
మోర్మన్లు ఇతర సంఘాలన్నీ సాతానుకు సంభందించినవాని పరిగణిస్తారు మరియు మోర్మన్ సంఘాన్ని తప్ప మరెక్కడా రక్షణ లేదని నమ్ముతారు అందువల్ల మోర్మన్లకు మరియు క్రైస్తవులకు మధ్య నిజమైన ఐక్యత సాధ్యం కాదు.
► మోర్మన్లకు మరియు క్రైస్తవులకు మధ్య ఏకత్వం ఎందుకు అసాధ్యం? కొన్ని కారణాలను తెలపండి.
మోర్మోన్ల వ్యూహాలు
మోర్మన్లు అందరిని ప్రార్థించమని అడుగుతారు, దేవుడు వారికి మోర్మన్ గ్రంథం నిజమా లేదా, జోసెఫ్ స్మిత్ ప్రవక్తేనా కాదా అని చూపించమని చెప్తారు. చాలా మంది వారు ప్రార్థనలో ఉన్నప్పుడు తమ గుండెలో వేడిని అనుభూతి చెందుతున్నారని చెప్పుకుంటారు. వారు ఆ వేడి అనుభూతి ద్వారా మోర్మనిజం సత్యమని ధృవీకరిస్తారు. కానీ ఆ అనుభూతి వారు వ్యక్తిగతంగా రక్షించబడినట్లు ధృవీకరించదు.
[9]బైబిలు, ఒక దేవదూత కూడా వేరే సువార్తను చెప్పినా నమ్మకూడదని చెబుతుంది (గలతీయులు 1:8 చూడండి).
మోర్మన్లు బైబిలును విశ్వసిస్తామని చెబుతారు, కానీ బైబిలు వారి సిద్ధాంతాలను తిప్పికొడుతుంది. వారు బైబిలులోని అనువాదంలో ఉన్న తేడాలు, తప్పిదాల వల్ల వచ్చినవని. కాబట్టి కొత్త ప్రకటన అవసరమని చెబుతారు. మోర్మన్లకు జోసెఫ్ స్మిత్ యొక్క ప్రకటన అత్యున్నత అధికారం. వారు ఆయన దేవుని ప్రవక్త అని నమ్మడంతో, ఆయన చెప్పినవన్నీ బైబిలుకు విరుద్ధమైనా అంగీకరిస్తారు.
ఆకాశం మరియు భూమి కరిగిపోతాయి కానీ నా మాటలు కరిగిపోవని యేసు క్రీస్తు చెప్పారు, (మత్తయి 24:35). దేవుని వాక్యం పూర్తిగా నెరవేరేంతవరకూ దానిలో ఏమీ నశించదని యేసు క్రీస్తు చెప్పారు (మత్తయి 5:18 చూడండి). పేతురు దేవుని వాక్యం శాశ్వతంగా నిలిచిపోతుందని చెప్పాడు (1 పేతురు 1:25 చూడండి). దేవుడు కొత్త ప్రకటన కోసం చూడకూడదని, తన వాక్యంపై నమ్మకం ఉంచాలని కోరుతున్నాడు.
[10]మోర్మన్లు క్రైస్తవులు ఉపయోగించే పదాలను ఉపయోగిస్తారు, కానీ వాటికి వేరే అర్థాలు ఇస్తారు. యేసు క్రీస్తు దేవుని కుమారుడు అని చెబుతారు కానీఆయన దేవుడు అని నమ్మరు. పరిశుద్దాత్మ దేవునిలో మూడవ భాగంగా భావిస్తారు, కానీ త్రిత్వాన్ని నమ్మరు.
వారు యేసు కన్యక మరియా ద్వారా పుట్టాడని చెబుతారు, కానీ తండ్రియైన దేవుడు శారీరక శరీరాన్ని ఉపయోగించి మరియాను గర్భవతిని చేశాడని నమ్ముతారు.
వారు యేసు క్రీస్తు మన పాపాల నిమిత్తం బలిఅయ్యాడని, మరణించాడని, మన్నింపు కోసం ప్రార్థించవచ్చని చెబుతారు, కానీ వారి దృష్టిలో పరలోకం అనేది ఒక విధేయ జీవితంతో వచ్చే ప్రతిఫలం.
మోర్మన్లు తమ మతం నిజమైన క్రైస్తవమని చెబుతారు. మిగతా సంఘాలన్నీ తప్పుడు మతాలని చెప్పుకుంటారు. కానీ, ఒక వ్యక్తి మోర్మన్ సిద్ధాంతాలన్నీ అర్థం చేసుకొని అవన్నీ విశ్వసిస్తే, అతను బైబిలు సువార్తను నమ్మడు మరియు నిజమైన క్రైస్తవుడు కాదు.
► ఇప్పుడు తిరిగి వెళ్లి బోల్డ్ మరియు ఇటాలిక్ లో ఉన్న పాఠ్యాన్ని మరియు ప్రతి లేఖన భాగాన్ని చదవండి.
[1]Joseph Smith, Doctrine and Covenants, 57వ భాగంలో
“రక్షణకి అవసరమైన ప్రతిదీ పవిత్ర గ్రంథంలో ఉంది. బైబిల్లో చేర్చబడని, దాని నుండి నిరూపించలేని దేనినైనా విశ్వాసం యొక్క వ్యాసం లేదా రక్షణనికి అవసరమైనదిగా చేయకూడదు. సంఘాలలో ఎన్నడూ సందేహించబడని పాత మరియు క్రొత్త నిబంధన యొక్క ప్రామాణిక పుస్తకాలను మేము పవిత్ర గ్రంథంగా పరిగణిస్తాము.
- ఇంగ్లాండ్ సంఘం నుండి యొక్క మత వ్యాసాల నుండి స్వీకరించబడింది./ అడాప్టెడ్ ఫ్రొం ఆర్టికల్స్ అఫ్ రిలీజియన్ అఫ్ ది చర్చి అఫ్ ఇంగ్లాండ్.
► మోర్మన్లు కింద ఉన్న సిద్ధాంతాలను తీరస్కరిస్తారు . ఈ సిద్ధాంతాల ప్రాముఖ్యతను, వాటిని నిర్ధారించే ఆధారాలను "సిద్ధాంతాల చేతి పుస్తకాన్ని" లో చూడండి. ప్రతి వచనం సిద్ధాంతాలన్ని ఎలా నిర్ధారిస్తుందో తెలుసుకోండి.
(1) సిద్ధాంతాల కోసం బైబిల్ చాలుతుంది.
(2) కేవలం ఒక దేవుడు మాత్రమే ఉన్నాడు.
(3) తండ్రియైన దేవుడు మనిషి కాదు.
(4) దేవుడు ఎప్పటికి మారడు.
(5) యేసు క్రీస్తు దేవుడు.
(7) పరిశుద్ధాత్మ దేవుడు.
(8) దేవుడు త్రిత్వం.
(9) రక్షణ కేవలం క్రీస్తు ప్రాయశ్చిత్తంతోనే సాధ్యం.
(11) మన నమ్మకం ద్వారా మాకు రక్షణ లభిస్తుంది.
(12) మనకు వ్యక్తిగత రక్షణ హామీ ఉండవచ్చు.
(13) రక్షణ పొందనివారు శాశ్వత శిక్షను అనుభవిస్తారు
సువార్త ప్రచారం
మోర్మన్లను వారి సిద్ధాంతాలనుంచి పక్కదోవ పట్టించడం కష్టమని అనిపించవచ్చు, కానీ ప్రతి సంవత్సరం వేలాది మంది మోర్మన్లు తమ మతాన్ని వదిలివేస్తున్నారు.
మీరు మోర్మన్తో మాట్లాడేటప్పుడు, అతని ముఖ్యమైన విశ్వాసాలు సువార్తకు విరుద్ధమని దృవీకరించే ఆధారాలను చూపించండి. ఈ సమాచారాన్ని సిద్ధాంతాల చేతి పుస్తకంలో పొందుపరచిన ఆధారాలతో పంచుకోండి. మార్మోనిజం పట్ల ఆసక్తి ఉన్నట్లు కనిపించే ఎవరికైనా ఈ ఆధారాలను చూపించండి.
మార్మోన్లు సరైనదేనా అని దేవుడు మీకు చూపిస్తాడని ప్రార్థించూడం అంటే మీరు అంగీకరించకండి. మీకు ఇప్పటికే తెలిసే నిజంన్నీ, మరల చూపించమని దేవుణ్ణి ఎప్పుడూ అడగొద్దు. అలంటి ప్రార్ధన సాతాను మిమ్మల్ని భ్రమపెట్టడానికి అవకాశం ఉంది అలంటి అనుభవాలకు తావులేవ్వకండి.
మోర్మన్లకు రక్షణపై వ్యక్తిగత నిర్ధారణ లేదు. వారిలో చాలా మంది తమ జీవితం దేవుని దృష్టిలో అంగీకరించబడుతుందా అని భయంతో ఉంటారు. వారితో సువార్తను పంచుకోవడం, మరియు రక్షణపై ఎలా ధృడమైన నమ్మకం పొందవచ్చో వివరించడం అన్నిటికన్నా అత్యంత ముఖ్యం.
మీరు మీ పరస్పర చర్యల ఫలితాలను వెంటనే చూడకపోవచ్చు. సంభాషణ ముగింపులో ఒక మార్మన్ తన మనసు మార్చుకున్నానని మీకు తెలియజేయకపోవచ్చు. అయితే, సంభాషణ యొక్క దీర్ఘకాలిక ప్రభావాలు మీకు తెలియదు. వారి జీవితంలో పరిశుద్దాత్మ మీరు చెప్పిన నిజాన్ని వాడవచ్చు.
ఒక సాక్ష్యం
జొఆన్నా మోర్మన్ సంఘంలో పెరిగి, వారి కార్యకలాపాల్లో అన్నింటిలో కూడా పాల్గొంది.ఆమెను ఒక మంచి మోర్మన్ అమ్మాయిగా ఎలా ఉండాలి అని భావించేవారు. ఆమె ఇంటినుంచి ఇడాహో అనే విశ్వవిద్యాలయంలో చేరినప్పుడు, ఆమెను ఒక క్రైస్తవ బైబిల్ అధ్యయనంలో పాల్గొనమని ఆహ్వానించారు.ఆమె మోర్మన్ మతంలో ఒకరిని మారుస్తానన్న ఆశతో అక్కడికి వెళ్లింది. కానీ ఆ బైబిల్ అధ్యయనంలో ఆమె దేవుని గురించి బైబిల్ ద్వారా అప్పుడు తెలియని కొత్త విషయాలు తెలుసుకుంది. అక్కడి క్రైస్తవులు దేవునితో ఉన్న సంబంధాన్ని చూశాక, ఆమెకు దేవునితో ఎప్పుడూ అలాంటి అనుభవం లేదా సంబంధం లేదని గుర్తించింది. జొఆన్నా మోర్మన్ మతాన్ని విడిచి, కనుక ఆమె కుటుంబం మరియు చాలా మంది మోర్మన్ స్నేహితులు ఆమెను తిరస్కరించిన ఆమె దేవునికోసం జీవిస్తోంది.దేవుడు ఆమెకు కొత్త క్రైస్తవ కుటుంబాన్ని, మరియు మరిన్ని స్నేహితులను ఇచ్చాడు. అని జొఆన్నా చెప్పింది. "మార్మన్ సంఘాన్ని విడిచిపెట్టి, దేవుణ్ణి పూర్తిగా వదులుకోవాలని ఆలోచిస్తున్న వారికి, అలా చేయవద్దు... దేవుడు ఇంకా మీ కోసం ఒక ఉద్దేశ్యాన్ని కలిగి ఉన్నాడు".
లేఖన అధ్యయనం – భాగం 2
► ఇప్పుడు యెషయా 41ని మళ్ళీ చదవండి. ప్రతి విద్యార్థి మార్మోనిజం అనుచరుడికి ఈ భాగంలో ఉన్న సందేశాన్ని వివరిస్తూ ఒక పేరా రాయండి. విద్యార్థులు వారు రాసిన వాటిని తరగతి గదిలో పంచుకోవచ్చు.
ప్రతి పాఠానికి కేటాయించిన పని
ఈ కోర్సు అంతటా మీరు చదువుతున్న వివిధ మతాలు మరియు కల్ట్ అనుచరులతో సంభాషిస్తారు. మీరు కనీసం 10 వేర్వేరు మత సమూహాల సభ్యులతో సంభాషించాల్సి ఉంటుంది. మీరు సువార్త మరియు ఇతర క్రైస్తవ సత్యాలను ప్రదర్శించాలి.
మీరు ఒక పాఠంలో చదువుతున్న మత సమూహంలో సభ్యుడిని కనుగొనడం మీకు సాధ్యం కాకపోతే, ఆ విషయం వినడానికి ఆసక్తి ఉన్న మరొకరిని మీరు కనుగొనాలి.
మీ సంభాషణ తరువాత, మీరు రెండు నివేదికలను ఇవ్వాలి.
1. మీరు 2 పేజీల నివేదికను వ్రాసి మీ తరగతి నాయకుడికి ఇయ్యాలి. అందులో మీరు మత సమూహం యొక్క ప్రాథమిక నమ్మకాలు, నమ్మకాలకు బైబిల్ ప్రతిస్పందన, అవిశ్వాసితో మీ సంభాషణ మరియు మీరు చెప్పినదానికి వారి ప్రతిస్పందనను వివరించాలి.
2. మీరు తరగతి కోసం కలిసినప్పుడు సంభాషణ గురించి మీ సహవిద్యార్థులకు చెప్పండి.
10 సంభాషణలు మరియు రచన కేటాయింపులు ఈ కోర్సు యొక్క ప్రాథమిక కేటాయింపులు.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.