XYZ సంఘము ఆరాధన కొరకు ప్రఖ్యాతిగాంచినది. వారి కూడికలు ఈ క్రమమును అనుసరిస్తాయి:
XYZ సంఘములోని ఆరాధన సేవా షెడ్యూల్
పరిచయం మరియు ప్రకటనలు
ఆరాధన సమయం (స్తుతి పాటలు)
30 నిమిషాలు
కానుకలు/ప్రత్యేకమైన పాట/ప్రార్థన
15 నిమిషాలు
ప్రసంగము
30 నిమిషాలు
ఆరాధన సమయం (స్తుతి పాటలు)
15 నిమిషాలు
XYZ సంఘములోని సంగీతమును ప్రజలు ఇష్టపడతారు. గొప్ప ఉత్సాహముతో కూడిన కూడికను సందర్శకులు మెచ్చుకుంటారు. అయితే, తన పరిచర్య యొక్క దీర్ఘకాల ఫలితముల విషయములో పాస్టర్ హరీష్ ఆందోళన చెందాడు. క్రొత్తగా మారుమనస్సుపొందినవారు కొంతకాలములోనే ఇతర సంఘములకు వెళ్లిపోతున్నారు. ఇంకా ఘోరముగా, సుదీర్ఘకాలముగా హాజరవుతున్న సభ్యుల మధ్య సర్వే చేసినప్పుడు, సంఘము “బలమైన యేసు క్రీస్తు శిష్యులను ఉత్పత్తి చేయుటలేదు. సంఖ్య, పెరుగుతుంది; శిష్యులు, పెరుగుటలేదు” అని అర్థమైయ్యింది.[1]
ఆరాధనను గూర్చి సంఘము కలిగియున్న అభిప్రాయము ఈ సమస్యలో ఒక భాగమని హరీష్ నమ్ముతున్నాడు. XYZ సంఘములో, ఆరాధన అంటే సంగీతం. పాస్టర్ హరీష్ ఇలా ప్రశ్నించుట ఆరంభించాడు, “నిజమైన ఆరాధనలో సంగీతముగాక ఇంకా ఏమైనా ఉందా? మనము ఆరాధన నుండి దేవుని వాక్యమును మరియు ప్రార్థనను వేరుచేస్తున్నామా? ఇది ప్రసంగము యొక్క ప్రభావమును తగ్గిస్తుందా?”
► పాస్టర్ హరీష్ యొక్క ఆందోళనలకు స్పందించండి. ఆరాధన మరియు ప్రసంగము మధ్య ఏమైనా తేడా ఉందా? XYZ సంఘము ఆరాధకుల మనస్సులలో ఆరాధనలోని అన్ని భాగములను ఎలా జతపరచగలదు?
[1]అమెరికాలోని అతి పెద్ద సంఘములలో ఒకదానిలో జరిగిన సర్వే నుండి ఇది ఉల్లేఖించబడింది. వారి యొద్ద మారుమనస్సుపొందినవారిలో ఎక్కువమంది నిజమైన శిష్యరిక స్థాయికి ఎన్నడును చేరలేదు.
ఆరాధనలో లేఖనము యొక్క ప్రాముఖ్యత
మన సిద్ధాంతములు మరియు ఆరాధన లేఖనము ద్వారా నడిపించబడతాయి అని సువార్తికులుగా మేము బోధిస్తాము. మన ఆరాధనలో బైబిలు కేంద్ర స్థానము కలిగియుండాలని మేము నమ్ముతాము. ఆయన వాక్య అధ్యయనములో దేవుడు తన ప్రజలతో మాట్లాడతాడు. పాత నిబంధన కాలముల నుండి, లేఖనము ఆరాధనలో కేంద్ర స్థానము కలిగియుండినది.
విచారకరముగా, బైబిలు మన ఆరాధనకు ఆధారముగా ఉన్నదని మనము చెబుతున్నప్పటికీ, అనేక సంఘములు తమ కూడికలలో చాలా తక్కువ లేఖనమును ఉపయోగిస్తారు. కొన్ని సంఘములలో కూడికలో హాజరై లేఖనములోని కొన్ని వచనములను మాత్రమే వినుట కూడా సాధ్యమే. ఇది ఆరాధనకు బైబిలు మాదిరికి భిన్నముగా ఉన్నది.
నిర్గమకాండము 24:7లో, మోషే నిబంధన గ్రంథమును తీసుకొని, ప్రజల సమక్షములో దానిని చదివాడు. ప్రజలు దేవుని ఆజ్ఞలను పాటిస్తాము అని వాగ్దానము చేశారు: “యెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుమనిరి..” దీని తరువాత, దేవుడు నిబంధన యొక్క సారాంశమును (పది ఆజ్ఞలు) రాతి పలకల మీద వ్రాశాడు. ఇశ్రాయేలువారు గ్రంథమును అనుసరించు ప్రజలైయున్నారు. వ్రాయబడియున్న నిబంధన ఇశ్రాయేలు ఆరాధనకు కేంద్రముగా ఉండినది.
మందిరము మరియు దేవాలయములో దేవుని వాక్యము కేంద్రముగా ఉండినది. వార్షిక పండుగలు యూదుల సంవత్సరములో అత్యంత ప్రాముఖ్యమైన సన్నివేశములుగా ఉండేవి. పస్కా, ప్రధమ ఫలముల పండుగ, మరియు పర్ణశాలల పండుగ సమయములో దేవుని వాక్యము బహిరంగముగా చదవబడేది. ఏడు సంవత్సరములకు ఒకసారి, ధర్మశాస్త్రము చదవబడగా వినుటకు, మరియు నిబంధనను నూతనపరచుకొనుటకు దేశము సమకూడేది.[1]
క్రొత్త నిబంధనలో, లేఖనమును బహిరంగముగా చదవమని పౌలు క్రైస్తవులకు ఆజ్ఞాపించాడు. దీనిలో పాత నిబంధన, పౌలు వ్రాసిన పత్రికలు, మరియు లేఖనముగ పరిగణించబడు ఇతర రచనలు భాగమైయున్నవి.[2] లేఖనమును చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము అని అతడు ఒక యౌవ్వన సేవకునికి ఉపదేశించాడు (1 తిమోతికి 4:13). దేవుని వాక్యము క్రొత్త నిబంధన ఆరాధనలో కేంద్రముగా ఉండినది.
చెరలో నుండి తిరిగివచ్చిన తరువాత, ఎజ్రా ప్రజల కొరకు ధర్మశాస్త్రమును చదివాడు. స్త్రీ పురుషుల మధ్య, మరియు అర్థము చేసుకోగలవారి మధ్య ఎజ్రా ధర్మశాస్త్రమును చదివినప్పుడు వినుటకు ప్రజలు సమకూడారు; మరియు ప్రజలందరి చెవులు ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధగా ఆలకించినవి (నెహెమ్యా 8:3). ప్రతిస్పందనగా, ప్రజలు “ఆమెన్” అని పలికి, సాష్టాంగపడి ఆరాధించారు. ఎజ్రా మరియు అతని సహచరులు చదువుచుండగా, వారు లేఖనములను వివరించారు మరియు చదివిన విషయములు శ్రోతలు అర్థము చేసుకొనునట్లు చేశారు. ఇది ప్రసంగము, వివరణ, మరియు ప్రజల అవసరతకు దేవుని వాక్యమును అనువర్తించుటకు బైబిలు ఉదాహరణ అయ్యున్నది. నిజమైన బైబిలానుసారమైన ప్రసంగము వాక్యమునకు ప్రతిస్పందనగా ఆరాధనను ప్రేరేపిస్తుంది.
యేసు విశ్రాంతి దినమున సమాజమందిరమునకు ఆచారపరముగా వచ్చి, యెషయా గ్రంథము నుండి చదివాడు. ఆయన చదువుట పూర్తి చేసిన తరువాత, ఆయన యెషయా చేసిన వాగ్దానమునకు నెరవేర్పుగా వచ్చియున్నాను అని చూపుతు యేసు ప్రసంగించాడు (లూకా 4:16-29).
[3]పెంతెకొస్తు దినమున తాను చేసిన ప్రసంగములో, పాత నిబంధన వాగ్దానములు యేసు యొక్క పరిచర్యలో మరియు పరిశుద్ధాత్మ యొక్క రాకడలో నెరవేర్చబడినవి అని పేతురు చూపాడు. మారుమనస్సు పొంది బాప్తిస్మముపొందుటకు ఆహ్వానమిచ్చుట ద్వారా అతడు తన లేఖన వివరణను ముగించాడు (అపొస్తలుల కార్యములు 2:14-41). బైబిలానుసారమైన ప్రసంగము శ్రోతల నుండి ప్రతిస్పందనను కోరింది. ప్రసంగము మనస్సుతో మాట్లాడుతుంది, కాని అది హృదయముతో కూడా మాట్లాడాలి. ప్రసంగము చిత్తము యొక్క స్పందనకు పిలుపునివ్వాలి. ఎమ్మాయు మార్గమున యేసు లేఖనములను తెరచినప్పుడు, వినువారి హృదయములు అ మాటలతో మండాయి (లూకా 24:32).
ఆదిమ సంఘము యొక్క వ్యాప్తిలో ప్రసంగము ప్రాముఖ్యమైన పాత్రను పోషించింది. అపొస్తలుల కార్యములులో, దేవుని వాక్యము ఇరవై కంటే ఎక్కువసార్లు ప్రస్తావించబడింది. అపొస్తలులు దేవుని వాక్యమును ప్రకటించారు; వారు దేవుని వాక్యమును ధైర్యముగా ప్రకటించారు; దేవుని వాక్యము ఎదిగి అభివృద్ధి చెందినది; దేవుని వాక్యము వ్యాపించింది; మరియు అన్యులు దేవుని వాక్యమును మహిమపరచారు.దేవుని వాక్యము అపొస్తలుల సందేశమునకు ఆధారముగా ఉన్నది.
లేఖనము మాట్లాడుటకు ప్రసంగము ఏకైక మార్గము కానప్పటికీ, దేవుని వాక్యమును దేవుని ప్రజల యొద్దకు తెచ్చుటకు ఇది ప్రాధమిక మాధ్యమం అయ్యున్నది. ఈ ఉద్దేశ్యమును సాధించుటకు, దేవుని వాక్యము కేంద్రమైయున్నది అను విషయమును ఒక సంఘ కాపరి ఎన్నడును మరచిపోకూడదు. బైబిలానుసారమైన ప్రసంగము దేవుని వాక్యములో ఆరంభమవ్వాలి, దేవుని వాక్యమును వివరించాలి, మరియు దేవుని వాక్యమునకు వ్యక్తిగత స్పందన కొరకు పిలుపునివ్వాలి.
వాక్యమును ప్రకటించుట సంఘ చరిత్రలో ప్రాముఖ్యముగా ఉండెను
సంఘము యొక్క ఆరంభ శతాబ్దములలో ప్రసంగము ఆరాధనకు కేంద్రముగా ఉండెను. రెండవ శతాబ్దములో, క్రైస్తవులు ఆదివారమున పత్రికలను మరియు ప్రవక్తలను చదువుటకు మరియు వాటి వివరణను వినుటకు కూడుకునేవారు అని జస్టిన్ మార్టిర్ వ్రాశాడు. మూడవ శతాబ్దము నాటికి, బైబిలులోని ప్రధానమైన భాగములలో ప్రతి ఒక్కటి ఆరాధన సమయములో చదవబడేది.
మధ్య యుగములలో, కాథలిక్ సంఘము ప్రసంగము యొక్క భూమికను తగ్గించింది, కానీ సంస్కర్తలు ఆరాధనలో ప్రసంగము యొక్క కేంద్ర స్థానమును పునరుద్ధరించారు. సంస్కరణ ప్రసంగము యొక్క లక్ష్యము వినోదము, ప్రసంగీకుని యొక్క వ్యక్తిగత అజెండా, లేక సమాజము యొక్క సాంస్కృతిక కోరికలు కాదు. ప్రసంగము యొక్క లక్ష్యము దేవుని వాక్యమును జాగ్రత్తగా విశదీకరించుట అయ్యుండెను; శ్రోతల మీద ప్రభావము చూపు విధముగా లేఖనమును వివరించుట మరియు జీవితమును-మార్చు ప్రతిస్పందన కొరకు ఆహ్వానించుట.
[1]Timothy J. Ralston, “Scripture in Worship” in Authentic Worship. Herbert Bateman సంపాదితము. (Grand Rapids: Kregel, 2002), 201.
“నిజమైన బైబిలు వ్యాఖ్యానము యొక్క ఆశీర్వాదము వెలిగింపబడిన హృదయమేగాని, జ్ఞానముపొందిన తల కాదు.”
- వారెన్ వియర్స్బి
ఆరాధానలో లేఖనమును కేంద్రముగా చేయుట
దేవుని వాక్యము మన ఆరాధనలో కేంద్రముగా ఉండవలసి యుంటే, ఈ నియమమును మనము ఏ విధముగా ఆచరణలో పెట్టగలము? మన ఆరాధనలో లేఖనమును కేంద్రముగా చేయుటకు కొన్ని ఆచరణాత్మక అడుగులు ఏవనగా:
ఆరాధనలోని అన్ని భాగములలో లేఖనమును చేర్చాలి
ఆరాధనలో లేఖనమును వినుటకు ప్రసంగము వరకు మనము వేచియుండకూడదు. దేవుని వాక్యము కంటే ఆరాధనను ఆరంభించుటకు ఉత్తమమైన విధానము మరొకటి లేదు.
ఆరాధనను ఆరంభించు ఈ రెండు విధానములను పరిగణించండి. దేవుని సన్నిధిలోనికి వీటిలో ఏది ఎక్కువ ప్రభావవంతమైన ఆహ్వానముగా ఉన్నది?
1. “నేడు సంఘమునకు వచ్చినందుకు కృతజ్ఞతలు. మీలో కొందరికి వర్షం ఆటంకం కలిగించింది, కానీ మీరు వచ్చినందుకు నేను సంతోషించుచున్నాను. దేవుని మీద మరియు ఆరాధన మీద మన దృష్టిని ఉంచుదాము. “పరిశుద్ధుడు పరిశుద్ధుడు” అని పాడుచుండగా మనమంతా లేచి నిలబడదామా?”
2. “‘యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని!’ దేవుని గృహములోనికి స్వాగతం!’ దేవాలయములో, యెషయా సింహాసనమందు ఆసీనుడైయున్న దేవుని చూశాడు. దేవదూతలు ‘సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది’ అని పాడుట అతడు విన్నాడు. ‘పరిశుద్ధుడు పరిశుద్ధుడు’ అని పాడుచుండగా మాతో కలిసి స్తుతించండి.’”
మొదటి నాయకుడు ప్రయాణములో మనకు ఎదురైన కష్టములను జ్ఞాపకము చేశాడు; రెండవ నాయకుడు, ఆరాధనలోని ఆనందమును గూర్చి జ్ఞాపకము చేశాడు. మొదటి నాయకుడు సాధారణ మాటలతో ఆరంభించాడు; రెండవ నాయకుడు దేవుని వాక్యముతో ఆరంభించాడు. మొదటి నాయకుడు ఒక సాధారణ సంగీతమును ప్రకటించాడు; రెండవ నాయకుడు దేవుని స్తుతించుచు ఈ సంగీతమును దేవదూతలు పాడుతారని మనకు జ్ఞాపకము చేశాడు. ఏ సంఘము ఎక్కువ ఉత్సాహముగా పాడుతుంది?
సెప్టెంబర్ 11, 2001న అమెరికా మీద ఉగ్రవాదులు చేసిన దాడి తరువాత, సంఘములు వారి భవనములలో ఆదివారమున ఎధావిదిగా ఆరాధన కొరకు సమకూడారు. ఈ రెండు సంఘములు తమ ఆరాధన కూడికలను ఆరాధించిన విధానమును పోల్చిచూడండి:
1. “నేడు మాతో కలిసినందుకు కృతజ్ఞతలు. ఈ వారము మన దేశములో ఒక విషాదకరమైన వారము. మనలో చాలామందిమి రోధించుచున్నాము. ఈ చీకటి సమయములో కూడా ఆరాధించుటకు వచ్చినందుకు కృతజ్ఞతలు. ‘పాత సిలువ కొయ్య అను పాట పడుతూ ఆరంభిద్దాము.’”
2. “దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ కఠిన సమయములలో కూడా, ఆయన మన నిరీక్షణ అయ్యున్నాడు అను విషయమును మనము మరచిపోకూడదు. ‘శక్తిమంతమైన కోట మన దేవుడు, ఎప్పటికీ తిరుగులేని రక్షణ’ అను పాటను మాతో కలిసి పాడండి.”
మొదటి నాయకుడు సంఘమునకు వారి దుఖమును జ్ఞాపకము చేశాడు; రెండవ నాయకుడు దేవుడు మన నిరీక్షణ అయ్యున్నాడు అని జ్ఞాపకము చేశాడు. లేఖనము మరియు ఆ లేఖనము మీద ఆధారితమైన సంగీతమును, ప్రజల నిశ్చయత పరీక్షించబడిన వారములో బలమైన ఆధారమును అనుగ్రహించాయి.
లేఖనమును ఆరాధన కూడికలోని పలు భాగములలో ఉపయోగించవచ్చు:
కూడిక యొక్క ఆరంభ మాటలు
కానుకల కొరకు ఆహ్వానము
సంగీతములోని మాటలు
ప్రార్థన
మన ఆరాధన దేవుని వాక్యముతో మిళితమైయుండాలి. ఆరాధన తన వాక్యములో దేవుడు తనను తాను బయలుపరచుకొనుటకు స్పందనగ ఉండాలి. లేఖనము ఆరాధన కూడికలోని ప్రతి భాగములో ఉండాలి.
లేఖన అధ్యయనము ఆరాధనలో కేంద్ర స్థానమును కలిగియుండాలి
ఒక సంఘ కాపరి ఇలా చెప్పుటను మీరు ఎప్పుడైనా విన్నారా, “ఈ రోజు మన యొద్ద చాలా తక్కువ సమయం ఉంది, కాబట్టి నేను లేఖన భాగము అంతటిని చదవను?” ఏది ప్రాముఖ్యమైయున్నది, దేవుని మాటలా లేక మన మాటలా? ఆరాధనలో మనము లేఖనమునకు సమయమును ఇవ్వాలి.
లేఖనమును చదువుట ఆరాధన అయ్యున్నది కాబట్టి, మనము దానిని చదువు విధానము మీద మనము దృష్టిపెట్టాలి. దానిని స్పష్టముగా మరియు ప్రత్యేకముగా చదవాలి. చదువువాడు (సంఘ కాపరి కావచ్చు లేక విశ్వాసి కావచ్చు), కూడికకు ముందే దానిని అభ్యసించాలి. సంఘము యొక్క మొదటి మూడు శతాబ్దములలో, లేఖనమును చదువువాని యొక్క స్థానము ఒక పవిత్రమైన నమ్మకముగా ఉండేది. చాడువువారు వారికి పురమాయించబడిన గ్రంథములను ఇంటి యొద్ద ఉంచుకొని, చదువుటను అభ్యసించేవారు. వారు ఆరాధనలో చదివినప్పుడు, వారు స్పష్టముగా మరియు వ్యక్తపరచు విధముగా చదువుటకు సిద్ధపడేవారు.[1]
గుర్తుంచుకోండి, ఇది దేవుని గృహములో దేవుని ప్రజల కొరకు ఒక ఆరాధన కార్యముగా చదవబడుతున్న దేవుని వాక్యమైయున్నది. ఆరాధన సంగీతమునకు అభ్యాసము అవసరమైయుంటే, దేవుని వాక్యమును కూడా అభ్యసించవలసియున్నది. ఇది మన సామర్థ్యతలను బట్టి గర్వించుట కాదు; దేవుని వాక్యము శ్రోతలందరికి తెలియజేయబడునట్లు చూచుట అయ్యున్నది. ఇది దేవుని వాక్యమైయున్నది; ఇది ప్రాముఖ్యమైయున్నది!
మనము చదువుటను అర్థవంతము చేయాలి. విభిన్నమైన విధానములలో చదువుట వినువారికి లేఖనమును తాజాగ ఉంచుతుంది.
(1) కొన్నిసార్లు సంఘములోని ప్రజలు దేవుని మాటలను వినుచుండగా నాయకుడు లేఖనమును చదవుట మంచిది. పంచగ్రంథములో చాలా వరకు మరియు ప్రవచన గ్రంథములను ఈ విధముగా చదువుట మంచిది.
(2) కొన్నిసార్లు నాయకుడు మరియు విశ్వాసులు ఉత్తరప్రత్యుత్తరముగా చదవవచ్చు. కీర్తనలను చాలా వరకు ఈ విధముగా చదవవచ్చు.
► కీర్తనలు 136 ను చదవండి. తరగతి నాయకుడు ప్రతి వచనమును ఆరంభించుటకు అవకాశం ఇవ్వండి; తరగతి వచనములోని రెండవ భాగమైన “ఆయన కృప నిరంతరముండును” చదవాలి.
ధన్యతలను కూడా ఉత్తర ప్రత్యుత్తరముగ చదవవచ్చు (మత్తయి 5:1-10):
నాయకుడు: ఆత్మ విషయమై దీనులైనవారు ధన్యులు,
సంఘము: పరలోక రాజ్యము వారిది.
నాయకుడు : దుఃఖపడువారు ధన్యులు,
సంఘము : వారు ఓదార్చబడుదురు.
(3) కొన్ని లేఖన భాగములను సంఘము కలిసి చదవవచ్చు. సంఘముగా పాడు పాటల వలెనె, శరీరముగా కలిసి లేఖనమును చదువుట సంఘము యొక్క ఐక్యతను కనుపరుస్తుంది. సంఘమంతా దేవుని వాక్యమును చదువుటకు ఏకమవుతుంది. 124వ కీర్తన వంటి కీర్తనలు కలిసి చదువుటకు బాగుంటాయి.
ఎజ్రా ధర్మశాస్త్రమును చదువుటను గూర్చి నెహెమ్యా ఇచ్చిన నివేదిక, లేఖనము మన ఆరాధనకు కేంద్రముగా ఉండుట వలన కలుగు ప్రభావమును చూపుతుంది.
► ఈ కథనమును మీరు సమీక్షించగోరితే, నెహెమ్యా 8 వ అధ్యాయమును మరొకసారి చదవండి.
చదువుట యొక్క వివరములను గమనించండి.
ఎజ్రా ప్రజలందరి సమక్షములో గ్రంథమును తెరచాడు. వాక్యముతో దృశ్య సంబంధము ఉన్నది.
అతడు ప్రజలందరికీ పైగా నిలబడ్డాడు. చదువువానిని స్పష్టముగా చూడవచ్చు మరియు వినవచ్చు.
అతడు చదువుట ఆరంభించినప్పుడు, ప్రజలందరు లేచి నిలువబడ్డారు. వాక్యమునకు శారీరిక స్పందన ఉండినది.
అతడు చదువుచుండగా, ప్రజలందరు ఇలా జవాబిచ్చారు, “ఆమెన్, ఆమెన్,” వారు తమ చేతులను పైకెత్తి, తలలను వంచి, సాష్టాంగపడి యెహోవాను ఆరాధించారు. దేవుని వాక్యమునకు సమర్పించుకొనుటను వారు వ్యక్తపరచారు.
లేవీయులు దేవుని ధర్మశాస్త్రమును స్పష్టముగా చదివారు, మరియు దాని అర్థమును తెలిపారు, తద్వారా ప్రజలకు చదివిన విషయములు అర్థమైయ్యాయి. దేవుని వాక్యమును అర్థము చేసుకొనుట మీద వారు దృష్టిపెట్టారు. నేడు ప్రసంగమునకు ఇదే లక్ష్యమైయున్నది.
ధర్మశాస్త్రములోని మాటలను వినినప్పుడు ప్రజలు విలపించారు. “యెహోవాయందు ఆనందించుటవలన మీరు బల మొందుదురు” అని చెప్పి, వారు ఆనందించాలని నెహెమ్యా ఆజ్ఞాపించాడు. దేవుని వాక్యము మారుమనస్సు మరియు ఆనందమును ప్రోత్సహించాయి.
ఈ ప్రత్యేకమైన సందర్భములోని ప్రతి వివరమును మన కూడికలలో పునరావృతము చేయుట సాధ్యము కానప్పటికీ, ఈ కథనము లేఖనము యొక్క శక్తిని తెలియజేస్తుంది. మనము మన ఆరాధనలో లేఖనమును కేంద్రముగా కలిగియుండాలి.
చెకప్
మీ సంఘము ఆరాధనలో బైబిలు చదువుట యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తుందా? లేఖనమును చదువునప్పుడు మీ సంఘములో మీరు గమనించిన కొన్ని ప్రవర్తనలు మరియు ప్రతిస్పందనలను వర్ణించండి.
ఒక సగటు ఆదివారమున, మీ సంఘము ఎన్ని భిన్నమైన లేఖన భాగములను వింటుంది? ప్రతి వాక్య భాగము ఎందుకు చేర్చబడినదో ఆరాధకులకు తెలుసా?
వాక్యమును ప్రకటించుట మన ఆరాధనలో కేంద్రముగా ఉండాలి
ప్రతి తరములో సంగీత శైలులు మారునట్లే, ప్రతి తరము యొక్క అవసరతలను తీర్చుటకు ప్రసంగ శైలులు కూడా మార్పుచెందుతాయి. లేఖనము ఒక సంగీత శైలిని ఆరాధన సంగీతము కొరకు బైబిలానుసారమైన శైలి అని తెలుపదు; లేఖనము ఒక ప్రసంగ శైలిని బైబిలానుసారమైన ప్రసంగ శైలి అని చెప్పదు.
ఒక తరము నుండి మరొక తరమునకు, ఒక సంస్కృతి నుండి మరొక సంస్కృతికి శైలిలో మార్పు కలుగవచ్చుగని, విషయములు మాత్రం మారకూడదు. లేఖనము సంగీత శైలిని నిర్వచించదుగని, విషయములను మాత్రం నిర్వచిస్తుంది. అదే విధముగా, ఒక తరము నుండి మరొక తరమునకు ప్రసంగ శైలి మారవచ్చుగాని, విషయములలో మాత్రం మార్పు ఉండకూడదు.
దేవుని వాక్యమును ప్రకటించుట అనునది సంఘము ఎదుట నిలబడు ప్రసంగీకుని యొక్క ప్రాధమిక బాధ్యత అని లేఖనములోని ప్రసంగములు చూపుతాయి. సమకాలీన ప్రసంగములో దేవుని వాక్యము మీద దృష్టి కేంద్రముగా ఉండాలి. మారుతున్న టెక్నాలజీ మరియు అధ్యయన శైలులు ప్రసంగ శైలిని ప్రభావితము చేయవచ్చు; విషయములు మాత్రము లేఖనములో నాటబడియుండాలి.
ప్రసంగమును ఆరాధనగ చూచుట వెనుక ఉన్న ఆచరణాత్మక అంతర్భావములు ఏమిటి? ప్రసంగమును మనము చూచు విధానమును ఇది ఏ విధముగా ప్రభావితము చేస్తుంది?
ప్రసంగము కొరకు జాగ్రత్తగా సిద్ధపడాలి.
[3]ప్రసంగము ఆరాధన అయితే, జాగ్రత్తగా సిద్ధపడుట మన బాధ్యత అయ్యున్నది. మనము దేవుని బలిపీఠము యొద్దకు మన ఉత్తమమైన బహుమానములను తీసుకొనిరావాలి. దావీదు తనకు ఎంతమాత్రము వెలకానిదానిని అర్పించేవాడు కాదు; దేవునికి బహుమతిగా సిద్ధపాడులేని ప్రసంగములను మనము తీసుకొనిరాకూడదు. కూడికకు ముందే మనము మన ప్రసంగమును జాగ్రత్తగా సిద్ధపరచాలి (2 సమూయేలు 24:24).
ప్రసంగము సంఘ ప్రజల నుండి ప్రతిస్పందనను కోరుతుంది.
ప్రసంగము ఆరాధన అయితే, దానికి సంఘములోని ప్రజలు స్పందించాలి. ఆరాధనలో మనము దేవుని చూస్తాము, మనలను మనము చూస్తాము, మరియు మన చుట్టూ ఉన్న లోకము యొక్క అవసరతలను చూస్తాము (యెషయా 6:1-8; పాఠము 1 చూడండి). మన ప్రసంగములు వినువానికి దేవుని బయలుపరచాలి, మన ప్రసంగములు ఒక అవసరతను గూర్చి వినువానిని ఒప్పింపజేయాలి, మరియు మన ప్రసంగములు నశించిపోతున్న లోకమునకు సువార్త ప్రకటించుటకు సంఘమును ప్రేరేపించాలి. ఆరాధనగా ప్రసంగము పాపులను ఒప్పింపజేస్తుంది మరియు విశ్వాసులను సువార్త ప్రకటించుటకు ప్రేరేపిస్తుంది.
ప్రసంగము ప్రసంగీకుని నుండి ప్రత్యుత్తరమును కోరుతుంది.
ప్రసంగము ఆరాధన అయితే, ప్రసంగము మన నుండి ప్రతిస్పందనను కోరుతుంది అని మనము గుర్తిస్తాము. బల్యార్పణ ఆరాధనగ మనము ప్రసంగమును సిద్ధపరచుట ఆరంభిస్తే, మనము దేవుని చూస్తాము; మన జీవితములలో అవసరత ఉన్న విషయములను గూర్చి మనము ఒప్పించబడతాము; మరియు మన చుట్టూ ఉన్న లోకము యొక్క అవసరతలను మనము చూస్తాము. ఫలితముగా, మనము యెషయాతో కలిసి ఇలా కేక వేస్తాము, “నేనున్నాను; నన్ను పంపుము.” నిజమైన ప్రసంగము ప్రసంగీకుని మార్చివేస్తుంది. దేవుడు మనతో వ్యక్తిగతముగా మాట్లాడు వరకు మరియు మనము స్పందించు వరకు మనము దేవుని సందేశమును సంఘ ప్రజల ఎదుటకు తీసుకొనిరాకూడదు.
వారు చెడ్డ ప్రసంగములను చేసినందుకు తన దినములలోని శాస్త్రులను (ప్రసంగీకులు) యేసు గద్దించలేదు; వారు బోధించిన విషయములకు అనుగుణంగా జీవించుటకు విఫలమైనందుకు యేసు వారిని గద్దించాడు. వారికీ లేఖనమును గూర్చి, మరియు లేఖనమును వివరించుటను గూర్చి తెలుసు, కానీ వారు లేఖనానుసారముగా మార్పుచెందలేదు. యేసు ఇలా సెలవిచ్చాడు, “వారు చెప్పుదురే గాని చేయరు” (మత్తయి 23:3). ప్రసంగము ఆరాధన అయితే, మనము బోధించు సత్యముల ద్వారా సంఘ కాపరులమైన మనము మార్పు చెందుతాము. ఫలితంగా, మనము బోధించు ప్రజల హృదయములు మరియు జీవితములను మార్చుటకు దేవుడు మన ద్వారా మాట్లాడతాడు.
ప్రసంగీకుడు పరిశుద్ధాత్మతో నింపబడియుండాలి.
ప్రసంగము ఆరాధన అయితే, ప్రసంగీకుడు పరిశుద్దాత్మతో నింపబడాలి. నిజమైన శక్తి కొరకు ఆరాధనలోని ఇతర విషయములన్నీ పరిశుద్ధాత్మ మీద ఆధారపడు విధముగానే, ఒక ప్రసంగీకుడు కూడా ప్రభావవంతముగా ఉండుటకు దేవుని ఆత్మ చేత అభిషేకించబడాలి.
► 2 కొరింథీయులకు 3:3-18ని చదవండి.
సిద్ధపాటు అను మన ఉత్తమమైన బలిని మనము ప్రసంగములోనికి తీసుకొని వస్తాము; అయితే, మన సిద్ధపాటు పూర్తైన తరువాత, ప్రసంగములో శక్తి పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా, మనము మనస్సుతో మాట్లాడవచ్చు, మనము సంఘమును మెప్పించవచ్చు, మరియు మనము మంచి విషయములను బోధించవచ్చు, కాని మనము జీవితములను మార్చలేము.
చెకప్
మీ ప్రసంగము బైబిలానుసారమైన ఆరాధన కార్యముగా ఉన్నదా? ఒక వ్యక్తి మీ ప్రసంగమును తరచుగా వినుచున్నట్లయితే, వారు సమతుల్యమైన బైబిలానుసారమైన సత్యమును వినగలరా?
[1]Keith Drury, The Wonder of Worship, (Fishers, IN: Wesleyan Publishing House, 2002), 35
“ఆరాధనలేని ప్రసంగము అపవిత్రమైనది... నిజమైన ప్రసంగము దేవుని కార్యమైయున్నది, కేవలం నరుని ప్రదర్శన మాత్రమే కాదు.”
జే. ఐ పేకర్ నుండి సేకరించబడినది.
ఆరాధన అపాయములు: వాక్యము దాని స్థానమును కోల్పోవుట
అనేకమంది విశ్వాసుల అనుదిన జీవితములో బైబిలు దాని స్థానమును కోల్పోయింది. విచారకరముగా, అనేక సంఘముల యొక్క వారపు ఆరాధనలో కూడా అది దాని స్థానమును కోల్పోయింది. ఆదిమ సంఘము కీర్తనలను పాడగా, నేడు కొన్ని సంఘములు ఎలాంటి బైబిలు విషయములేని పాటలను పాడుతున్నాయి. ఆదిమ సంఘము దీర్ఘ లేఖన భాగాలను చదివినచోట, నేడు కొన్ని సంఘములు ప్రసంగముకు ముందు కొన్ని వచనములను మాత్రమే చదువుతున్నాయి. అనేక ఆరాధనల్లో, లేఖనము గానములతో మరియు దేవుని వాక్యమును తక్కువ ప్రాముఖ్యతనిచ్చే ప్రసంగముతో మార్పిడి చేయబడింది.
లేఖనమును బహిరంగముగా చదువుట ఆధునిక అవసరతలను గూర్చి మాట్లాడదు అని సమకాలీన ఆరాధన ఉద్యమములోని కొందరు నాయకులు భావిస్తారు. ఒక సుపరిచితమైన సంఘ కాపరి ఈ మధ్య కాలములో తన ప్రసంగమును విశ్లేషించమని సంఘములోని స్టాఫ్ ను కోరాడు. అతడు చాల ఎక్కువ బైబిలును ఉపయోగించుచున్నాడని వారు అతనికి చెప్పారు! “మీరు మీ ప్రసంగమును బైబిలు మీద ఆధారితము చేయుట మంచిదే, కాని మీరు ఔచిత్యమైన విషయములను గూర్చి త్వరగా మాట్లాడుట ఆరంభించకపోతే, మేము వినుట మానివేస్తాము.” బైబిలు నేటి ప్రజలకు ఔచిత్యమైనది అని సంఘములోని స్టాఫ్ వారు భావించలేదు!
ఆరాధన నాయకులముగా, ఆరాధనలో లేఖనము యొక్క కేంద్ర స్థానమును మనము కొనసాగించాలి. ఆరాధనలో, ప్రార్థన మరియు స్తుతి పాటల ద్వారా మనము దేవునితో మాట్లాడతాము. ఆరాధనలో, లేఖనము చదివుట మరియు ప్రకటించుట ద్వారా దేవుడు మనతో మాటలాడుతాడు. మన ఆరాధన శైలితో నిమిత్తము లేకుండా, ఆరాధనలో దేవుని వాక్యము యొక్క కేంద్ర స్థానమును మనము ఎన్నడును కోల్పోకూడదు.
► నెహెమ్యా 8 వ అధ్యాయమును సమీక్షించండి. ధర్మశాస్త్రమును చదువుటకు ప్రజలు విలువనిచ్చారు అని చూపు ప్రతి మాటను ఉపయోగించి ఒక జాబితాను సిద్ధపరచండి. దానిని నేడు మీ ఆరాధనలో లేఖన అధ్యయనముతో పోల్చండి. మీ ఆరాధనలో లేఖనము యొక్క ప్రభావమును పెంచు ఒక ఆచరణాత్మక అడుగును గూర్చి చర్చించండి.
ఆరాధనలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత
మేఘన[1] ఒక సమర్పణగల క్రైస్తవురాలు. ఆమె స్కూల్ లో ఉన్నప్పుడు కూడా, ప్రతి ఉదయమున దేవునితో ఏకాంతముగా సమయమును గడిపేది. ఉదయానే టిఫిన్ చేయుటకు ముందు, ఆమె బైబిలు మరియు ప్రార్థనలో సమయమును గడిపేది.
అయితే ఇప్పుడు ఆమె నలుగురు పిల్లలకు తల్లి కాబట్టి, ప్రార్థన మరియు బైబిలు అధ్యయనము కష్టమవుతున్నాయి. ఒక బిడ్డ ఇంకా శిశువే, మరియు మేఘనను రాత్రి పూట లేపుతుంటుంది. పిల్లలు లేచుటకు ముందు ప్రతి ఉదయమున పడక మీద నుండి లేచుటను మేఘన కష్టముగా భావిస్తుంది. రాత్రివేళ, ప్రార్థన మరియు బైబిలు మీద దృష్టిపెట్టుటకు ఆమె బాగా అలసిపోతుంది.
ఆదివారము వచ్చినప్పుడు మేఘన సంతోషిస్తుంది. ప్రతి ఆదివారమున, ఆరాధన సమయములో ఆమె ఆత్మీయ శక్తిని పొందుతుంది, కాని వారములోని మిగిలిన రోజులలో ఆమె నిరుత్సాహమును ఎదుర్కొంటుంది. ఆమె ఆత్మీయ జీవితము పూర్తిగా విఫలమైపోయింది అని ఆమె భావిస్తుంది.
► ఆమె ఆత్మీయ జీవితమును గూర్చి మేఘనకు ఒక ఆచరణాత్మక సలహాను ఇవ్వండి.
ఆరాధనలో లేఖనము యొక్క అధ్యయనముతో ఈ పాఠమును మనము ఆరంభించాము. ఆరాధనలో ప్రార్థనను గూర్చి అధ్యయనము చేస్తూ మనము కొనసాగిద్దాము. లేఖనములో, దేవుడు మనతో మాట్లాడతాడు; ప్రార్థనలో, మనము దేవునికి స్పందిస్తాము. లేఖనము మరియు ప్రార్థన మన ఆరాధనలో మిళితమైపోవాలి.
బైబిలానుసారమైన ఆరాధనలో బహిరంగ మరియు వ్యక్తిగత ప్రార్థన
కీర్తనల గ్రంథము యూదుల ఆరాధనకు పాటల పుస్తకముగా ఉన్న విషయమును మనము చూశాము. అది యూదుల ఆరాధనకు “ప్రార్థనా పుస్తకముగా” కూడా ఉండినది. కీర్తనలలో బహిరంగ ఆరాధన కొరకు ప్రార్థనలు మరియు వ్యక్తిగత ప్రార్థనలు ఉండినవి. యూదుల ఆరాధనకు బహిరంగ మరియు వ్యక్తిగత ప్రార్థనలు రెండు ప్రాముఖ్యమైనవిగా ఉండెను.
ఇంటి యొద్ద, నమ్మకమైన యూదులు రోజుకు మూడుసార్లు ప్రార్థన చేశారు (దానియేలు 6:10).[2] అనేక కీర్తనలు వ్యక్తిగత ప్రార్థనలుగా ఉన్నవి. వీటిని ప్రార్థనలో మేముకు బదులుగా నేను అను మాట యోక్క్ ఉపయోగము ద్వారా గుర్తించవచ్చు. వ్యక్తిగత ప్రార్థన కొరకు కీర్తనలకు కొన్ని ఉదాహరణలు ఏవనగా:
116వ కీర్తన – దేవుడు చూపిన శ్రద్ధను బట్టి కృతజ్ఞత పాట
దేవాలయములో, యూదా అరాధకులు బహిరంగ ప్రార్థనలో కూడుకునేవారు. దేవాలయ ప్రతిష్ట దినమున, ప్రజల మీద దేవుని కటాక్షము కలుగునట్లు సొలొమోను జాతీయ ప్రార్థనను నడిపించాడు (2 దినవృత్తాంతములు 6). యెషయా దేవుని సందేశమును యూదా దేశమునకు తెలిపాడు: “నా మందిరము సమస్తజనులకు ప్రార్థనమందిరమన బడును” (యెషయా 56:7). చెర కాలము తరువాత, సమాజమందిర ఆరాధన ధర్మశాస్త్ర అధ్యయనము మరియు ప్రార్థన మీద దృష్టిపెట్టింది. సమాజమందిరములో కూడికలు కొన్ని ప్రార్థనలతో ఆరంభమైనవి.
హెబ్రీయుల ప్రార్థనా విధానము ఆదిమ సంఘములో కూడా కొనసాగింది. మొదటి శతాబ్దపు క్రైస్తవులు తమ ఇండ్ల యొద్ద రోజుకు మూడుసార్లు ప్రార్థించేవారు. ఆరాధన కొరకు క్రైస్తవులు కూడుకొనినప్పుడు, వారు ఒకే శరీరముగా ప్రార్థించేవారు. ప్రతి ఆరాధన కూడికలో పరలోక ప్రార్థన భాగముగా ఉండేది. ప్రతి ఆరాధన కూడికలో ఇతర ప్రార్థనలు కూడా అర్పించబడేవి.
నేటి ఆరాధనలో ప్రార్థన
బైబిలు ఆరాధనలో ప్రార్థన ప్రాముఖ్యమైయుంటే, నేడు మన ఆరాధనలో కూడా ప్రార్థన ప్రాముఖ్యమైయుండాలి. బహిరంగ మరియు వ్యక్తిగత ప్రార్థనలు రెండు ప్రాముఖ్యమైయున్నవి.
[4]వ్యక్తిగత ప్రార్థన మనలను ద్రాక్షవల్లితో జతపరచి, మన ఆత్మీయ జీవితములకు పోషణను ఇస్తాయి. వ్యక్తిగత ప్రార్థన లేకపోవుట అనేక సంఘములలో ఆత్మీయ శక్తి యొక్క లేమిని వివరిస్తుంది. తన భూలోక పరిచర్య కాలములో యేసుకు వ్యక్తిగత ప్రార్థనా సమయము అవసరమైయుంటే, ఆత్మీయ పోషణ మరియు పరిచర్యలో శక్తి కొరకు ప్రార్థన మీద మనము ఇంకా ఎంత ఎక్కువగా ఆధారపడవలసియున్నది.
బహిరంగ ప్రార్థన ఆరాధనలో ఒక ప్రాముఖ్యమైన మూలకమైయున్నది. కొన్ని సంఘములు ప్రార్థనకు చాలా తక్కువ ప్రాధాన్యతనిస్తాయి. ఒక సంఘ్ కాపరి ఇలా చెబుతూ తమ సంఘములో బహిరంగ ప్రార్థనల యొక్క కొరతను సమర్థించాడు, “వారి కన్నులు మూయబడియున్నప్పుడు మీరు ప్రజల ఆసక్తిని ఆకర్షించలేరు.”[5] దేవుని సంతోషపరచుట కంటే మనుష్యులను సంతోషపరచుట ప్రాముఖ్యమైయున్నదని అతడు నమ్మాడు.
సామూహిక ప్రార్థన, క్రైస్తవ్యము కేవలం నన్ను గూర్చి మరియు దేవునితో నా సంబంధమును గూర్చినది అను అబద్ధ ఆలోచనను సరిచేస్తుంది; మనము ఒక శరీరములో భాగమైయున్నాము. మనము ప్రార్థనా విన్నపములను వినుచు, సామూహిక ఆరాధనలో పాలుపంచుకొనుచుండగా, తోటి క్రైస్తవుల బలహీనతలు, మానసిక గాయములు, మరియు జీవిత పరిస్థితులను గూర్చి మనకు అవగాహన కలుగుతుంది. సంఘములోని సభ్యులు ఏక శరీరమైయున్నారు అని సామూహిక ప్రార్థన మనకు జ్ఞాపకము చేస్తుంది. దేవుడు శరీరముగా సంఘమును గూర్చి పట్టించుకుంటాడు అని సామూహిక ప్రార్థన మనకు జ్ఞాపకము చేస్తుంది.
ఆరాధన కూడిక అంతటిలో లేఖనమును ఉపయోగించవలసియున్న విధముగానే, ఆరాధన కూడిక అంతటిలో ప్రార్థనను కూడా మనము చేయవలసియున్నది. మన కూడికలో దేవుని సన్నిధిని ఆహ్వానించు ఆరంభ ప్రార్థన నుండి, ప్రజల యొక్క అవసరతల కొరకు గురిగల ప్రార్థనా సమయము, లోకములో పరిచర్య చేయుటకు సభ్యులు వెళ్లుచుండగా చేయు చివరి ఆశీర్వాద ప్రార్థన వరకు, ప్రార్థన మన ఆరాధనలో భాగమైయుండాలి.
[1]Kathy యొక్క కథ Keith Drury, The Wonder of Worship, (Fishers, IN: Wesleyan Publishing House, 2002), 17 నుండి పొందబడింది.
[2]నమ్మకమైన యూదుల మధ్య దానియేలు ఆచరణ సాధారణంగా కనిపించేది.
[3]ఈ కీర్తన బహుశా 51 వ కీర్తనలో దావీదు పశ్చాత్తపపడిన వెంటనే వ్రాయబడియుండవచ్చు.
అతడు లేక ఆమె మొదట ఆరాధించకుండా ఇతరులను ఆరాధనలోనికి నడిపించుటకు ఏ ఒక్కరు సిద్ధపడలేరు. అతడు లేక ఆమె వ్యక్తిగతముగా ప్రార్థించకుండా ఇతరులను బహిరంగ ప్రార్థనలో నడిపించుటకు ఏ ఒక్కరు కూడా సిద్ధపడలేరు. వ్యక్తిగత ప్రార్థనా జీవితమును అభివృద్ధి చేసుకున్నప్పుడే మనము బహిరంగ ప్రార్థనను చేయుటకు సిద్ధపడతాము. ఒక ఆరాధన నాయకునిగా, అనుదిన వ్యక్తిగత ప్రార్థన క్రమశిక్షణకు మిమ్మును మీరు సమర్పించుకోండి.
ఎలా ప్రార్థించాలో నేర్చుకోండి
యేసు శిష్యులు “మాకు ప్రార్థనను నేర్పుము” (లూకా 11:1) అని ఆయనను అడిగారు. జవాబుగా, పరలోక ప్రార్థన అను ఒక మాదిరికరమైన ప్రార్థనను యేసు బోధించాడు. ప్రార్థనను నేర్చుకోవచ్చు.
కొంత వరకు, ప్రతి దేవుని బిడ్డకు ప్రార్థన స్వభావికముగా వస్తుంది; అయితే, ప్రార్థనను నేర్చుకోవచ్చు కూడా. ఒక యౌవ్వన బిడ్డ మాట్లాడు పాఠములను తీసుకోకుండానే మాట్లాడుట నేర్చుకుంటాడు. అయితే, ఒక బిడ్డ ఎదుగుచుండగా, వారు భాషను, మాటలను, మరియు సరియైన వాక్యములను నేర్చుకుంటుంది. ఇదే విధముగా, ఒక యౌవ్వన క్రైస్తవుడు స్వభావికముగా దేవునితో మాట్లాడగోరతాడు, కాని మనము విశ్వాసములో ఎదుగుచుండగా, ప్రార్థనను గూర్చి మనకున్న అవగాహన మరియు మర్యాద బలపడుతుంది.
ప్రార్థనను గూర్చి వ్రాయబడిన పుస్తకములు ప్రార్థనను గూర్చి మీకున్న అవగాహనను బలపరచగలవు. ప్రతి క్రైస్తవునికి ఉపయోగపడు కొన్ని ప్రార్థనను గూర్చిన ప్రఖ్యాతిగాంచిన పుస్తకములు ఏవనగా:
ప్రార్థన ద్వారా శక్తి by E.M. Bounds
ప్రార్థన పాఠశాలలో క్రీస్తుతో by Andrew Murray
Mighty Prevailing Prayer by Wesley Duewel
లేఖనములోని మాటలను ప్రార్థించండి
లేఖనము తప్ప ప్రార్థనను నేర్చుకొనుటకు మరొక ఉత్తమమైన స్థలము లేదు. ప్రార్థనకు మొట్టమొదటి పాటశాల బైబిల్. కీర్తనలు మరియు ఇతర బైబిలు ప్రార్థనలు ప్రభావవంతముగా ప్రార్థించుటను మనకు నేర్పుతాయి. సంఘ చరిత్ర అంతట, గొప్ప క్రైస్తవులు తమ ప్రార్థనలను లేఖనముతో నింపియున్నారు. బైబిలులోని కొన్ని గొప్ప ప్రార్థనలు ఏవనగా:
చాలాసార్లు, మన ప్రార్థన దేవునికి కేవలం విన్నపములను చేస్తుంది. కొందరు దేవునికి కొన్ని విన్నపముల పట్టికను ఇస్తారు, నిన్నటి విన్నపములకు జవాబు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతారు, తరువాత “ఆమెన్” చెబుతారు. నిజమైన ప్రార్థన కేవలం కొన్ని విన్నపముల జాబితాగా మాత్రమే ఉండకూడదు; ప్రార్థన దేవునితో సహవాసమైయున్నది.
పరలోక ప్రార్థన ప్రార్థన కొరకు ఒక మాదిరిని ఇస్తుంది (మత్తయి 6:9-13). పరలోక ప్రార్థనలో ఈ విషయములు ఉన్నాయి:
స్తుతి: “పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక.”
సమర్పణ: “నీ రాజ్యమొచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు, భూమియందును నెరవేరుగాక.”
విన్నపము: “మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము.”
ఒప్పుకోలు: “మా ఋణస్తులను మేము క్షమించియున్న ప్రకారము, మా ఋణములను క్షమించుము.”
నడిపింపు కొరకు ప్రార్థన: “మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము:”
చాలామంది క్రైస్తవులు యేసు ఇచ్చిన మాదిరికరమైన ప్రార్థనలోని ప్రతి భాగమును కలిగియున్న నాలుగు-భాగముల పద్ధతిని అనుసరిస్తారు: స్తుతి, ఒప్పుకోలు, కృతజ్ఞత, మరియు విన్నపము.
స్తుతి
ప్రార్థనలో ఎన్నడును స్తుతులను మరియు స్తోత్రములను విసర్జించకూడదు. స్తుతించుటతో ఆరంభించుట ద్వారా, మన ప్రార్థనలు కేవలం సహాయము కొరకు విన్నపములు మాత్రమే కాకుండా ఉండునట్లు చూస్తాము. కీర్తనలు స్తుతుల మీద ఆధారపడియున్న ప్రార్థనకు మాదిరిని ఇస్తాయి. విలాప కీర్తనలలో కూడా స్తుతి ఉంటుంది. ప్రార్థన నిజమైన ఆరాధన అయితే, దానిలో దేవుని స్తుతించుట భాగమైయుంటుంది.
ఒప్పుకోలు
మనము దేవుని చూసినప్పుడు (స్తుతి), మనలను మనము చూసుకుంటాము అని యెషయా 6 వ అధ్యాయము తెలియజేస్తుంది. దేవుని యొక్క పరిపూర్ణ శుద్ధత యొక్క వెలుగులో మనలను మనము చూచుకున్నప్పుడు, ఒప్పుకొనుట కొరకు మనకున్న అవసరతను మనము గ్రహిస్తాము. ఎంత పరిపక్వత కలిగిన క్రైస్తవుడైనా, దేవునితో అతని నడక ఎంత లోతుగా ఉన్నను ఏ క్రైస్తవుడు ఇలా చెప్పు స్థాయికి చేరకూడదు, “నేను ఒప్పుకోవలసిన పని లేదు. న పూర్ణత సంపూర్ణమైనది.” యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు, “మేము మాకచ్చియున్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము; మమ్మును శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను” (లూకా 11:4). నిజమైన ఆరాధనలో ఒప్పుకోలు భాగమైయుంటుంది.
కృతజ్ఞత
స్తుతి దేవుని వ్యక్తిత్వమును బట్టి ఆయనను స్తుతిస్తుంది; కృతజ్ఞత మన లోకములో దేవుడు చేయుచున్న కార్యమును బట్టి ఆయనను స్తుతిస్తుంది. శ్రేష్టమైన ప్రతి యీవి, సంపూర్ణమైన ప్రతి వరము పైనుండి వస్తుంది అని కృతజ్ఞత గుర్తిస్తుంది (యాకోబు 1:17). కృతజ్ఞతలో, మన జీవితములో ఆయన చేసిన కార్యమును బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు తెలుపుతాము. పదిమంది కుష్టువ్యాధిగలవారి యొక్క కథ కృతజ్ఞత యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియజేస్తుంది (లూకా 17:12-19).
విన్నపము
పరలోక ప్రార్థనలో, దేవుడు తన పిల్లల యొక్క విన్నపములను గౌరవిస్తాడు అని యేసు చూపాడు. దేవుడు ఒక సాధారణ పౌరుని యొక్క అవసరతలను పట్టించుకొని ఒక భూసంబంధమైన నాయకుని వంటివాడు కాడు. బదులుగా, దేవుడు తన పిల్లలకు మంది వరములను ఇచ్చుటయందు సంతోషించు ఒక పరిపూర్ణమైన తండ్రి. పరలోక ప్రార్థనలో, సాధారణ అవసరతల కొరకు (“మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము”) మరియు ఆత్మీయ నడిపింపు కొరకు (“మమ్మును శోధనలోకి తేక”) ప్రార్థించాలని మనము ప్రోత్సహించబడితిమి.
పరలోక ప్రార్థనలో, మనము విన్నపములను చేసినప్పుడు మన చిత్తమును దేవుని చిత్తముకు సమర్పించుకొనుటను మనము నేర్చుకుంటాము. నమ్ము పిల్లలముగా, ఆయన చిత్తము పరిపూర్ణమైనది అని మనము నేర్చుకుంటాము; ఆయన “కాదు” అని చెప్పుట మన మేలు కొరకే. ప్రార్థన అనునది మన చిత్తమును చేయునట్లు దేవుని బలవంతము చేయు ఒక మాయా పరికరము కాదు. ప్రార్థన అనునది మనలను దేవుని చిత్తమునకు సంతోషముగా లోబడునట్లు చేయు ఒక ఆత్మీయ క్రమశిక్షణ.
మీ ప్రాధాన్యతలను దేవుని ప్రాధాన్యతలతో అనుసంధానము చేయండి
ప్రార్థన చాలాసార్లు మన కొరకు ప్రాముఖ్యమైయున్న విషయమును తెలియజేస్తుంది. మన నిజాయితీగల ప్రార్థనలను పురికొల్పునది ఏమిటి, శారీరిక అవసరతలా లేక ఆత్మీయ అవసరతలా?
థెస్సలొనీకయలో ఉన్న క్రైస్తవుల కొరకు తాను చేసిన ప్రార్థనలో, పౌలు ఇలా వ్రాశాడు, “అందువలన మన దేవునియొక్కయు ప్రభువైన యేసు క్రీస్తుయొక్కయు కృపచొప్పున మీయందు మన ప్రభువైన యేసు నామమును, ఆయనయందు మీరును మహిమనొందునట్లు, మేలుచేయవలెనని మీలో కలుగు ప్రతి యాలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణముచేయుచు, మనదేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీకొరకు ఎల్లప్పుడును ప్రార్థించుచున్నాము.” (2 థెస్సలొనీకయులకు 1:11-12) వారి జీవితములలో దేవుడు తన చిత్తమును నెరవేర్చాలని పౌలు ఆశించాడు. ఈ క్రైస్తవులు హింసింపబడుతున్నారు, అయితే దేవుడు వారిని శ్రమలలో నుండి విడిపించాలని పౌలు ప్రార్థించలేదు. బదులుగా, వారి ద్వారా ప్రభువైన యేసు నామము మహిమపరచబడాలని అతడు ప్రార్థించాడు.
మన విన్నపములు మన ప్రాధాన్యతలను చూపు విధముగానే, మన కృతజ్ఞత కూడా మన ప్రాధాన్యతలను చూపుతుంది. మన కృతజ్ఞతలు చాలా వరకు భౌతిక ఆశీర్వాదముల కొరకు అయితే, మనము భౌతిక ఆశీర్వాదములకు ఎక్కువ విలువనిచ్చువారము కావచ్చు. మన కృతజ్ఞతలు చాలా వరకు మన ఆత్మీయ జీవితములో దేవుడు చేయు సహాయము కొరకు అయితే, మనము ఆత్మీయ ఎదుగుదలకు ఎక్కువ విలువనిస్తాము.
థెస్సలొనీకయుల కొరకు తాను చేసిన ప్రార్థనలో, పౌలు దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు ఎందుకంటే వారి విశ్వాసము బహుగా వృద్ధిచెందుతుంది, మరియు వారు ఒకరిపట్ల ఒకరు కలిగియున్న ప్రేమ ఎదుగుచుండినది (2 థెస్సలొనీకయులకు 1:3). అతని కృతజ్ఞతలకు ముఖ్య కారణము తాత్కాలిక ఆశీర్వాదముల కొరకు కాదు; వారి ఆత్మీయ ఎదుగుదలను బట్టి అతడు బహుగా కృతజ్ఞతలు తెలిపాడు. మీరు కృతజ్ఞతలు తెలుపుటకు అతి పెద్ద కారణము ఏమిటి, ఆర్ధిక ఆశీర్వాదమా లేక మీ జీవితములో ఆత్మీయ ఎదుగుదలా?
దేవునితో మాట్లాడండి, సంఘ ప్రజలతో కాదు
లేఖనము ద్వారా, దేవుడు సంఘముతో మాట్లాడతాడు. ప్రార్థనలో, సంఘము దేవునితో మాట్లాడుతుంది. బహిరంగ ప్రార్థనా సమయము నాయకుడు తాను చెప్పాలని కోరు మాటలను ప్రజలకు చెప్పు (ప్రార్థన ద్వారా) సమయము కాదు! ప్రార్థన దేవునితో మాట్లాడుతుంది.
నిజమైన ఆరాధన ఆత్మతో ఎలా ప్రార్థించాలో యేసు తన శిష్యులకు తెలిపాడు:
మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజమందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము; వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు; విస్తరించి మాటలాడుటవలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు; మీరు వారివలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగకమునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును (మత్తయి 6:5-8).
నిజమైన ప్రార్థన దేవుని లేక సంఘమును మెప్పించుటకు ప్రయత్నించదు; అది సులువుగా మరియు స్పష్టముగ మన పరలోకపు తండ్రితో మాట్లాడుతుంది.
► మీ వ్యక్తిగత ప్రార్థనా జీవితములో ఎదుగుటకు మీరేమి చేయగలరు? మీ సంఘములోని బహిరంగ ఆరాధనలో మీరు ప్రార్థనను ఒక అర్థవంతమైన భాగముగా ఎలా చేయగలరు?
“క్రైస్తవ జీవితములో ఒక ముఖ్యమైన విషయము అనుదినము ఆరాధనను అనుభవించుట మరియు మన వ్యక్తిగత ఉనికికి కేంద్రముగా దేవుని ఘనపరచుట.”
- డెన్నిస్ కిన్ల
దేవుని వాక్యమునకు ప్రతిస్పందనగా కానుక
ప్రార్థన అనునది దేవుని వాక్యమునకు స్వాభావిక స్పందన అయ్యున్నది. ఇందుచేతన, లేఖన అధ్యయనము మరియు ప్రసంగము తరువాత మనము ప్రార్థన చేయాలి. ప్రార్థనలో, దేవుని వాక్యము నుండి మనము స్వీకరించిన సత్యమునకు మనము స్పందిస్తాము; మనలను మనము విధేయతకు సమర్పించుకుంటాము.
కానుక కూడా దేవుని వాక్యమునకు ప్రతిస్పందన అయ్యున్నది. పాత నిబంధనలో, బలి (అర్పణ లేక కానుక) అనునది ధర్మశాస్త్రమునకు (దేవుని వాక్యమునకు) ఆరాధకుడు ఇచ్చిన స్పందన అయ్యుండెను. క్రొత్త నిబంధనలో, మన సర్వమును దేవునికి సమర్పించుకొనుటకు కానుక గురుతుగా ఉన్నది.
కానుక అనునది ఆరాధనలో భాగమైయున్నది. అర్పణలతో ఆయన సన్నిధికి రమ్మని కీర్తనకారుడు ఆరాధకులను పిలచాడు (కీర్తనలు 96:8). హెబ్రీయులకు పత్రిక రచయిత ఆరాధనను ఇచ్చుటతో జతపరచాడు; “ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవుని కిష్టమైనవి” (హెబ్రీయులకు 13:16). వారు పౌలుకు ఇచ్చిన బహుమానము పరిమళ సువాసనగల అర్పణ అని, దేవునికి అంగీకారయోగ్యమైన బలి అని అతడు ఫిలిప్పీయులకు చెప్పాడు (ఫిలిప్పీయులకు 4:18).
ఆరాధనలో ఇచ్చుట అను వేదాంతశాస్త్రము
చాలామంది సంఘస్తులు కానుకలను సంఘ నిర్వహణ కొరకు ఇచ్చు ధనముగా ప్రధానముగ పరిగణిస్తారు. ఇది కానుకను ఒక ఆత్మీయ ఆరాధన కర్యముగాగాక ఓకే ఆర్ధిక లావాదేవీగా చేస్తుంది. క్రైస్తవ ఉగ్రాణాధిపత్యమును ఆరాధనలో భాగముగా అర్థము చేసుకోవాలి. మన ఇచ్చు వేదాంతశాస్త్రములో ఈ క్రింది నియమములలో ప్రతిది భాగమైయుండాలి.
ఆరాధనలో ఇచ్చుట కృప ద్వారా పురికొల్పబడుతుందిగాని, భయము ద్వారా కాదు.
ఆరాధన కార్యముగా ఇచ్చుట దేవుని కృపకు చూపు కృతజ్ఞత ద్వారా పురికొల్పబడుతుంది. యెరూషలేములో అవసరతలో ఉన్న క్రైస్తవులకు సహాయము చేయుటకు ఇవ్వమని పౌలు కొరింథీయులను కోరాడు. అతడు వారిని ఇలా భయపెట్టలేదు, “మీరు ఏదో ఒక రోజున సహాయం అవసరమవుతుంది కాబట్టి మీరు ఇవ్వాలి.” బదులుగా, అతడు తన విన్నపమును స్తోత్రముతో ముగించాడు, “చెప్ప శక్యము కాని ఆయన వరమునుగూర్చి దేవునికి స్తోత్రము” (2 కొరింథీయులకు 9:15). దేవుడిచ్చిన కృపావరమునకు కృతజ్ఞతగా వారి ఇచ్చుట పురికొల్పబడుతుంది. ఒక అర్పణ నిజమైన ఆరాధన అయితే, అది సుముఖతగల హృదయములో నుండి పుడుతుంది.
ఆరాధనలో ఇచ్చుట ప్రతిఫలము ద్వారా పురికొల్పబడదుగాని, ప్రేమ ద్వారా పురికొల్పబడుతుంది.
నిజమైన ఆరాధన దేవుని యెడల ప్రేమ ద్వారా పురికొల్పబడుతుందిగాని, ప్రతిఫలము కొరకు ఆశ ద్వారా కాదు. ధన కానుకలు మనలను మనము దేవునికి అర్పించుకొనుటకు చిహ్నముగ ఉన్నవి. పౌలు మాసిదోనియాలో ఉన్న క్రైస్తవులను మెచ్చుకున్నాడు ఎందుకంటే వారు “మొదట ప్రభువునకును, దేవుని చిత్తమువలన మాకును, తమ్మును తామే అప్పగించుకొనిరి” (2 కొరింథీయులకు 8:5). వారి బహుమతులు దేవుని యెడల మరియు వారి ప్రాంతమునకు సువార్తకు తెచ్చిన అపొస్తలుల యెడల వారు కలిగియున్న ప్రేమకు చిహ్నముగా ఉన్నవి.
సరికాని కారణముల కొరకు సంగీతము లేక ఇతర ఆరాధన కార్యములు చేయుట సాధ్యమైన విధముగానే, ఇచ్చుట కూడా దేవుని యెడల ప్రేమ ద్వారాగాక ప్రతిఫలము కొరకు ఆశించుట ద్వారా పురికొల్పబడగలదు. వారిచ్చు ధన కానుకలకు దేవుడు ఆర్ధిక ఆశీర్వాదములను ఇస్తాడు అని కొందరు సువార్తికులు వాగ్దానము చేస్తారు. లేఖన భాగములను బైబిలు నేపథ్యములో నుండి తీసుకొని మరల్చుట ద్వారా, దేవునికి ఇచ్చు కానుకలకు నూరంతల ఫలితము ఉంటుంది అని వారు వాగ్దానము చేస్తారు. ఆ విధముగా ఇచ్చుట ప్రేమగల ఆరాధన కార్యము కాదుగాని, అది లాటరీలో జాక్పోట్ కొట్టుటకు ఆశించు సార్వత్రిక లాటరీ టికట్ ను పోలియున్నది! బైబిలు ఎక్కడ కూడా ఈ విధముగా ఇచ్చుటను మెచ్చుకోదు.
బదులుగా, మరియ ఇచ్చినదానిని బైబిలు మెచ్చుకుంటుంది. ఆమె యేసును అభిషేకించినప్పుడు, ఆమె కనుచూపుమేరలో ఎలాంటి ప్రతిఫలము కనిపించలేదు. ఆమె తాను పొదుపు చేసుకొనినదానిని ఫలితము ఆశించకుండా ధారపోసింది. ఆమె చేస్తున్న ఆ వృధాను చూసి శిష్యులకు కూడా కోపం వచ్చింది. కేవలం యేసు మాత్రమే ఆమె వరమును చూసి, ఆమెను మెచ్చుకున్నాడు, ఆ బహుమానము ప్రేమ ద్వారా మాత్రమే పురికొల్పబడినది (మత్తయి 26:6-13).
ఆరాధనలో ఇచ్చుట కేవలం దేవుని ప్రేమ ద్వారా మాత్రమే పురికొల్పబడదుగని, ఇతరుల యెడల ప్రేమ ద్వారా కూడా పురికొల్పబడుతుంది. నిజమైన ప్రేమ మాటల కంటే గొప్పది అని యోహాను తన పాఠకులకు జ్ఞాపకము చేశాడు; అది క్రియలు. పౌలు యెడల ఫిలిప్పీయులు కలిగియుండిన ప్రేమ వారి ఇచ్చుటలో కనిపిస్తుంది. ఇతరుల యెడల విశ్వాసి కలిగియుండు ప్రేమ ఇచ్చుటలో కనబడుతుంది.
ఈ లోకపు జీవనోపాధిగలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము (1 యోహాను 3:17-18).
ఆరాధనలో ఇచ్చుట ఔదార్యముగా ఉంటుందిగాని, పిసినారితనముగా ఉండదు.
ఇలా చెబుతూ పౌలు కొరింథీ సంఘమును ఔదార్యముగా ఇవ్వమని సవాలు చేశాడు, “అట్టి ఔదార్యమువలన మాద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును.” వారి ఔదార్యము వారు దేవునికి తెలుపు కృతజ్ఞతల వ్యక్తీకరణ అయ్యున్నది. “ఏలయనగా ఈ సేవనుగూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రము కాకుండ, అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది” (2 కొరింథీయులకు 9:11-12). ఇచ్చుట నిజమైన ఆరాధనగ ఉండుటకు, అది ఔదార్యము కలిగి ఉండాలి.
ఆరాధనలో ఇచ్చుట తగ్గింపు స్వభావము ద్వారా పురికొల్పబడుతుందిగాని, గర్వము ద్వారా కాదు.
► మత్తయి 6:1-4ను చదవండి.
కొండ మీద ప్రసంగములో, ఇచ్చుటకు సరికాని హేతువులను గూర్చి యేసు హెచ్చరించాడు. కొందరు ఇతరుల నుండి మెప్పును పొందుటకు ఇస్తారు; వారి ప్రతిఫలము మెప్పు. “తాము తమ ఫలము పొందియున్నారని.” కొందరు మౌనముగా ఇస్తారు, మరియు వారి తగ్గింపును బట్టి తమను తాము ఘనపరచుకుంటారు; వారి ప్రతిఫలము స్వయం-సంతృప్తి. యేసు ఇలా సెలవిచ్చాడు, “నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమచేతికి తెలియకయుండవలెను.” మీ ఔదార్యమును బట్టి మిమ్మును మీరే మెచ్చుకోవద్దు. బదులుగా, మీ పరలోకపు తండ్రి మిమ్మును చూచి ఆయనకు నచ్చిన విధముగా మీకు ప్రతిఫలమిచ్చుటకు ఆయనకు అవకాశం ఇవ్వండి.
ఆనందముగా ఇచ్చుటను గూర్చిన కథ
జాన్ వెస్లీ తన గది కొరకు మంచి చిత్రములను కొనుట పూర్తిచేసిన వెంటనే పని మనిషి అతని ద్వారము యొద్దకు వచ్చింది. ఆ రోజు చాలా చలిగా ఉంది మరియు ఆమె కేవలం ఒక పలచటి గౌను మాత్రమే ధరించియున్నది. ఒక కోటు కొనుక్కొనుట కొరకు ఆమెకు డబ్బు ఇచ్చుట కొరకు అతడు తన జేబులో చేతులు పెట్టాడు, మరియు అతని యొద్ద ఎక్కువ డబ్బు లేదని గ్రహించాడు. “ఈ పేదరాలిని చలి నుని కాపడగల వస్త్రములను కొనుటకు ఉపయోగపడు డబ్బుతో నేను నా గోడలను అలంకరించాను.”
పేదలకు ఇచ్చుటకు ధనమును పోగుచేయుటకు వెస్లీ తన ఖర్చులను తగ్గించుకొనుట ఆరంభించాడు. తన దినచర్యలో, ఒక సంవత్సరము తన ఆదాయం £30 కాగా, అతడు £28 ఖర్చుపెట్టాడు, కాబట్టి £2 అతని యొద్ద ఇతరులకు ఇచ్చుటకు మిగిలినది. తరువాత సంవత్సరము, ఆదాయము రెండింతలు అయ్యింది, అయినప్పటికీ అతడు £28 ఉపయోగించి జీవించాడు మరియు £32 ఇతరులకిచ్చాడు. మూడవ సంవత్సరములో, అతని ఆదాయం £90 అయ్యింది; మరలా అతడు £28 ఖర్చుపెట్టుకొని, £62 ఇతరులకు ఇచ్చాడు. నాలుగవ సంవత్సరములో, అతడు £120 సంపాదించాడు, మరలా £28తో జీవించి, £92ను పేదలకు ఇచ్చాడు.
క్రైస్తవులు కేవలం దశమభాగమును ఇచ్చుట మాత్రమేగాక, ఇంకా ఎక్కువ ఇవ్వాలని వెస్లీ ప్రకటించాడు. ఆదాయము ఎదుగుచున్న కొలది, మనము ఇతరులకు ఇచ్చుట కూడా పెరగాలని అతడు నమ్మాడు. అతడు దీనిని తన జీవితకాలమంతా ఆచరించాడు. అతని ఆదాయము కొన్ని వేల పౌండ్లు అయినప్పుడు కూడా, అతడు సామాన్యముగా జీవించి, మిగిలిన ధనమును ఇతరులకు ఇచ్చివేశాడు. ఒక సంవత్సరము అతని ఆదాయం £1,400 దాటింది. £30 తన యొద్ద ఉంచుకొని, మిగిలిన ధనమంతటిని అతడు ఇచ్చివేశాడు.[1] అతడు £100 కంటే ఎక్కువ ఏనాడూ ఉంచుకోలేదు అని అతడు చెప్పాడు. అతడు తన జీవిత కాలములో సంపాదించిన £30,000లో చాలా వరకు ఇతరులకు ఇచ్చివేశాడు.[2]
ఈ కథ యొక్క ఉదేశ్యము పేదలకు ఇచ్చుటను గూర్చి హేతుబద్ధముగా ఆజ్ఞాపించుట కాదు! దేవునికి సంతోషముగా మరియు హృదయపూర్వకముగా విధేయత చూపుట ఇక్కడ ముఖ్య విషయమైయున్నది. దేవుడు ప్రతి ఒక్కరికి జాన్ వెస్లీ సంపాదించినంత ఆదాయమును ఇవ్వడు; జాన్ వెస్లీ ఇచ్చిన విధముగా ఇచ్చుటకు కూడా దేవుడు ప్రతి ఒక్కరిని పిలువడు. “నేను ఇతరులు ఇచ్చుచున్నంత ఇస్తున్నానా?” అనునది ఇక్కడ పరీక్ష కాదు. “నేను సంతోషముగా దేవునికి విధేయత చూపుతూ ఇస్తున్నానా?” అనునది ఇక్కడ పరీక్షించవలసిన విషయమైయున్నది. త్యాగపూరితముగా ఇచ్చుట ద్వారా ఆరాధించుటకు దేవుడు మనలను పిలచుచున్నాడు.
ఇచ్చు అభ్యాసము
ఇచ్చుట ఆరాధన కార్యము కాబట్టి, ఆరాధన ఆత్మకు సహాయపడు విధానములలో కానుకలను సేకరించాలి. క్రింద ఇవ్వబడిన ఆచరణాత్మక ఆలోచనలను పరిగణించండి.
కానుకలలో ఉద్ఘాటన అవసరతల మీదగాక, ఆరాధన మీద ఉండాలి.
అనేకమంది క్రైస్తవులు కానుకలను సంఘ అవసరతలు తీర్చుటకు మార్గముగా భావించుటకు కారణము, కానుకలు పట్టునప్పుడు సంఘ అవసరతల మీద ఉద్ఘాటన ఉంచబడుతుంది! ఒక ఆర్థిక సంక్షోభం మనము ఇలా చెప్పునట్లు మనలను పురికోల్పితే ఇది ఇంకా తీవ్రమవుతుంది, “సంఘమునకు మూతవేయబడుతుంది” లేక దాతృత్వముతో ఇవ్వని యెడల “మనము మిషనరీని పంపలేము.” కొన్నిసార్లు సంఘ కాపరి కానుకలను అడిగినందుకు క్షమాపణ కోరతాడు; “మేము మిమ్మును డబ్బు కొరకు అడగకుండా ఉంటే బాగుండు.” బదులుగా, కానుక అనునది సంతోషముగా కృతజ్ఞతలు తెలుపుటకు వ్యక్తీకరణగా ఉండాలి.
కానుక పట్టునప్పుడు, ఉద్ఘాటన ఆరాధన మీద ఉండాలి. కానుక యొక్క ఉద్దేశ్యమును ఆరాధకునికి జ్ఞాపకము చేస్తూ ఒక లేఖన భాగమును ఉపయోగించి కానుకను పరిచయం చేయవచ్చు. 2 కొరింథీయులకు 8:9, 9:7, నిర్గమకాండము 25:2, అపొస్తలుల కార్యములు 20:35, మరియు యోహాను 3:16 వంటి వాక్యభాగములు ఇచ్చుటకు నిజమైన పురికొల్పు వైపుకు చూపుతాయి.
కానుక అనునది స్వయంగా ఆరాధన కూడికలో భాగమైయుండాలి.
కొన్ని సంస్కృతులలో, కూడికలో కాకుండా ఇతర సమయములలో ప్రజలను కానుకలను ఇవ్వమని ప్రోత్సహించుట కూడా చాలా సాధారణమైన విషయం. ఇది అందరికి చూపుటను నివారించుటకు లేక కూడికలో సమయమును ఆదా చేయుటకు చేయబడుచున్నప్పటికీ, ఇది ఇచ్చుటను ఆరాధన నుండి వేరు చేసే ప్రమాదం ఉంది. కానుకలను ఆరాధనలో భాగముగా పరిగణించుట, ఆరాధకులు ఇచ్చుటను ఒక ఆరాధన కార్యముగా అర్థము చేసుకొనుటలో సహాయము చేస్తుంది.
కానుక మనము దేవునికి ఇచ్చు ప్రతిస్పందన అయ్యున్నది కాబట్టి, ప్రసంగమునకు ముందుగాక ప్రసంగమునకు తరువాత మీరు కానుక పట్టుటను పరిగణించవచ్చు. “ఆయన వాక్యమునకు స్పందిస్తూ మేము దీనిని దేవునికి ఇచ్చుచున్నాము” అని ఇది సూచిస్తుంది.
తల్లిదండ్రులు ఆరాధనలో ఇచ్చు కార్యమును పిల్లలకు పరిచయం చేయాలి.
మన పిల్లలకు మనము పాడుటను, ప్రార్థించుటను మరియు లేఖనము చదువుటను మరియు ప్రసంగమును వినుటను నేర్పు విధముగానే, మన పిల్లలకు మనము ఆనందముగా ఇచ్చుటను నేర్పించాలి. ఇచ్చుట అనునది ఆనందముగా చేయు స్తుతి కార్యము అని మన పిల్లలు నేర్చుకొనుచుండగా, వారు కూడా ఆరాధకులు అవుతారు.
కానుకల సమయములోని సంగీతము ఆరాధన అయ్యుండాలి.
కానుక ఆరాధన అయ్యుంటే, కానుకల సమయములో సంగీతము కూడా ఆరాధన అయ్యుండాలి. ఈ సంగీతము కేవలం సంగీతము కావచ్చు లేక పాట కావచ్చు; అది సొలో పాట కావచ్చు లేక సంఘముగా కలిసి పాడుట కావచ్చు; అది మౌనముగా, ధ్యానపూర్వకమైనది కావచ్చు లేక సంతోషముగా, ఉత్సాహముగా పాడునది కావచ్చు; శైలితో నిమిత్తము లేకుండా, అది ఆరాధనలో భాగమైయుండాలి. కానుకల సమయములో సంగీతము అందించువారు, ఒక ఆరాధన నాయకుడు ఆత్మీయ నడిపింపు కొరకు ప్రార్థించు విధముగానే ఆత్మీయ నడిపింపు కొరకు ప్రార్థించాలి. ఆరాధనలో ఏ భాగమును కూడా తేలికగా తీసుకోకూడదు.
కానుక తరువాత సమర్పణ ప్రార్థన ఉండాలి.
కానుక దేవునికి ఇచ్చు బహుమానము కాబట్టి, కానుక తరువాత సమర్పణ ప్రార్థనను చేయాలి. ఇది ఆరాధకునికి ఇచ్చుట వెనుక ఉద్దేశ్యమును అందించి, ఇచ్చుట ఆరాధనగా ఉన్నది అనుటకు ఒక దృశ్య ఆదారమును ఇస్తుంది.
సంఘ నాయకులు ప్రజలు ఇచ్చు బహుమానములకు మంచి ఉగ్రాణాధిపతులుగా ఉండాలి.
కానుకల ద్వారా, ఆరాధకులు తమబహుమతులను సంఘ నాయకుల పర్యవేక్షణకు అప్పగించుచున్నారు. సంఘ నాయకులు బహుమతులను జాగ్రత్తగా కాపాడాలి. డబ్బు ఉపయోగించబడిన విధానమును గూర్చి సంఘమునకు లెక్క అప్పగించుట, కానులకు దేవుని పని కొరకు ఉపయోగించబడుచున్నవి అని చూపుతుంది. ఇది ఇచ్చుటను ప్రోత్సహించి, సంఘ నాయకత్వములో నిజాయితీలేకుండా ఉండు శోధనను తగ్గిస్తుంది. క్రైస్తవ నాయకుల మీద అంతగా నమ్మకముంచని ఈ లోకములో, మనలను మనము నిర్దోషులముగా చూపుకొనుటకు మనము చేయగలిగినదంతా చేయాలి.
కానుక అనునది కేవలం సంఘ అవసరతలను తీర్చుట కొరకు మాత్రమే కాదు; అది ఒక ఆరాధన కార్యము. ఆయన వాక్యము ద్వారా, దేవుడు తనను తాను ఆరాధకులకు బయలుపరచుకున్నాడు. మనము సంతోషకరమైన హృదయములతో ఇవ్వబడు త్యాగపూరిత బహుమతులతో స్పందిస్తాము. ఇది నిజమైన ఆరాధన.
చెకప్
మీ సంఘములోని ప్రజలు ఇచ్చుచున్నప్పుడు ఆరాధించుచున్నట్లు భావిస్తారా, లేక వారు కేవలం సంఘ అవసరతల కొరకు డబ్బు ఇచ్చుచున్నారా? కానుకను ఒక ఆరాధన కార్యముగా చేయుటకు ఎలాంటి ఆచరణాత్మక అడుగులను మీరు వేయగలరు?
[1]నేటితో పోల్చిచూస్తే, ఇది ₹2 కోట్లు సంపాదించి, ₹5 లక్షలు తన వద్ద ఉంచుకొని మిగిలినదంతా ఇచ్చివేయుటను పోలియున్నది. తన జీవితకాలములో, నేటి ధనముతో పోల్చితే వెస్లీ సంపాదించిన ధనములో ₹30 కోట్లు ఇతరులకు ఇచ్చివేశాడు.
► మీ సంఘము సంస్కారమును ఆచరించుటను చర్చించండి. మీరు ఎంత తరచుగా ప్రభువు బల్లను జరుపుకుంటారు? మీరు సంస్కారమును ఆచరించినప్పుడు, అది ఆరాధనలో ముఖ్య భాగముగా ఉంటుందా?
దేవుడు వ్రాయబడిన వాక్యములో (లేఖనమును చదువుటలో) మరియు పలుకబడిన వాక్యములో (ప్రకటించు వాక్యములో) బయలుపరచబడిన విధముగానే, ఆయన కనుపరచబడిన వాక్యమైన ప్రభువు బల్లలో కూడా తనను తాను బయలుపరచుకున్నాడు.[1] ప్రభువు బల్ల యేసు యొక్క ప్రాయశ్చిత్త మరణమునకు జ్ఞాపకము మరియు ఆయన పునరుత్థానమును వేడుకగ జరుపుకొనుట అయ్యున్నది. ప్రభురాత్రి భోజనము పస్కా పండుగతో సంబంధము కలిగియున్నది, కానీ అది క్రొత్త నిబంధనలో ఆరంభించబడినది.
► మత్తయి 26:17-30 మరియు 1 కొరింథీయులకు 11:17-34ను చదవండి.
ప్రభువు బల్లను గూర్చి క్రొత్త నిబంధనలో సువార్తలలోను, కొరింథులోని సంఘమునకు పౌలు ఇచ్చిన హెచ్చరికలలోను మనము చూస్తాము.
ప్రభువు బల్లను ఆచరించుటను గూర్చి తరచుగా మూడు ప్రశ్నలు తలెత్తుతాయి.
సంస్కారమును ఆచరించుట ఆరాధనలో ఒక అర్థవంతమైన భాగమైయున్నది. కొరింథులో ఉన్న సంఘమునకు వ్రాస్తూ, ప్రభువు బల్లలో మనము ఇలా చేస్తాము అని పౌలు చూపాడు:
1. మనము క్రీస్తు మరణమును వెనుదిరిగి చూస్తాము (“మీరు ప్రభువు మరణమును ప్రకటించుచున్నారు”).
2. మనము క్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురుచూస్తాము (“ఆయన తిరిగివచ్చువరకు”).
మనము సంస్కారమును జరుపుకొనుచుండగా, మనము అయన బలిని జ్ఞాపకము చేసుకొని, ఆయన వాగ్దానము చేసిన రాకడ కొరకు ఎదురుచూస్తాము. సంస్కారములోని వస్తువులు క్రీస్తు శరీరము మరియు రక్తమును సూచిస్తాయి మరియు మనము ప్రభువు మరణములో పాలుపంచుకొనుటను అవి మనకు జ్ఞాపకము చేస్తాయి. “మనము దీవించు ఆశీర్వచనపు పాత్ర లోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొను టయేగదా? –మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకొనుటయేగదా?” (1 కొరింథీయులకు 10:16). ప్రభువు బల్ల అనునది సిలువవేయబడిన తిరిగిలేచిన ప్రభువు యొక్క కొనసాగు సన్నిధికి బలమైన చిహ్నముగా ఉన్నది. [3]
ఎంత తరచుగా ప్రభువు బల్లను ఆచరించాలి?
లేఖనము లేక సంఘ చరిత్ర ఏదియు ఈ ప్రశ్నకు ఖచ్చితమైన జవాబును ఇవ్వదు. ఆదిమ సంఘములో ప్రభువు బల్లను ప్రతి ఆదివారము తీసుకున్నట్లు కనిపిస్తుంది. నేడు, కొన్ని సంఘములు సంస్కారమును ప్రతి వారము, మరికొన్ని సంఘములు సంవత్సరమునకు ఒకటి లేక రెండు సార్లు ఆచరిస్తాయి.
ప్రభువు బల్ల ఆరాధనలో గౌరవనీయమైన కార్యముగా మిగిలియున్నంత వరకు, ప్రతి వారము ఆరాధనలో బైబిలును చదువుట లేఖనము యొక్క ప్రాముఖ్యతను తగ్గించని విధముగానే, ప్రభువు బల్లను తరచుగా ఆచరించుట దాని యొక్క అర్థమును తగ్గించదు.
ప్రభువు బల్లను ఎలా ఆచరించాలి?
“అయోగ్యముగా” తినుట మరియు త్రాగుటను గూర్చి పౌలు కొరింథీయులను హెచ్చరించాడు (1 కొరింథీయులకు 11:27). క్రైస్తవులకు దాని యొక్క ప్రాముఖ్యతకు యోగ్యమైన విధముగా ప్రభువు బల్లను ఆచరించుటకు కొన్ని ఆచరణాత్మక అడుగులు మనకు సహాయము చేయగలవు.
సంస్కారము అనునది ఆరాధన కూడికలో ఒక కేంద్ర భాగముగా ఉండాలిగాని, ఒక అదనపు కార్యముగా ఉండకూడదు.
ప్రభువు బల్లను ఆచరించుటకు స్వాభావిక సమయము ప్రసంగము తరువాత అయ్యున్నది. ఈ సందర్భములో, ప్రసంగము మనలను ప్రభువు బల్లను గూర్చిన లోతైన అవగాహనలోనికి నడిపించాలి. ఇది సూటిగా ప్రభువు బల్లను గూర్చి మాట్లాడు ప్రసంగమును బోధించుట ద్వారా కావచ్చు, లేక దానికి సంబంధించిన ఒక అంశము మీద మాట్లాడుట ద్వారా కావచ్చు (విమోచన, ప్రాయశ్చిత్తము, కృప, శిష్యరికము). ప్రభువు బల్లను తరచుగా జరుపుకొను సంఘములు, ప్రతి కూడిక యొక్క అంశము సంస్కారమును గూర్చినదిగా ఉండుట యుక్తము కాదు. అయితే, సంస్కారమును ఆచరించుట మరియు దానికి ముందు జరిగిన కార్యక్రమము మధ్య స్పష్టమైన సంబంధము ఉండాలి.
సంస్కారము ఒక పవిత్రమైన మరియు ఆనందకరమైన సన్నివేశము అయ్యున్నది.
సంస్కారము పవిత్రమైన రీతిలో స్వపరీక్ష చేసుకొని, దేవుని కృపను గూర్చి సంతోషముగా వేడుక చేసుకొను సమయమైయున్నది. ఈ భోజనము ప్రభువు మరణము జ్ఞాపకము చేసుకొనుటకు చేయబడుతుంది అను విషయములో దీని యొక్క పవిత్రత ప్రతిబింబించబడుతుంది. ఆచరించుటలోని ఆనందము ప్రభువు రాకడను గూర్చిన వాగ్దానములో ప్రతిబింబించబడుతుంది.
అప్పుడప్పుడు, సంస్కారములో పునరుత్థానమును బట్టి ఆనందించుట మరియు క్రీస్తు రాకడ కొరకు ఎదురుచూచుట ప్రధానమైన దృష్టిగా ఉండవచ్చు. ఇతర సమయములలో, యేసు మరణము యొక్క పవిత్రత మరియు స్వపరీక్ష యొక్క ప్రాముఖ్యత మీద దృష్టిపెట్టవచ్చు. ఈ రెండు విషయములో దీనిని ఆచరించుటలో భాగమైయున్నవి.
ప్రభువు బల్ల దేవుని కృప ద్వారా సాధ్యపరచబడినది కాబట్టి మనము సంస్కారములో ఆనందిస్తాము. ప్రభువు బల్లలో, కృప మాత్రమే మనకు రక్షణను అనుగ్రహిస్తుంది అని మనము జ్ఞాపకము చేసుకుంటాము. మనము సంస్కారము యొక్క పవిత్రతను గుర్తిస్తాము, ఎందుకంటే ప్రభువు బల్లలో మన పాలుపంపులు పాపము నుండి పారిపోవుట పట్ల సమర్పణను సూచిస్తాయి. ప్రభువు బల్లలో, ప్రతి ఆరాధకుడు తనను తాను పరీక్షించుకోవాలి.
సంస్కారము సంఘము యొక్క ఐక్యతను ప్రతిబింబించాలి.
సంఘము యొక్క ఐక్యత కొరకు ఉద్దేశించబడిన ఆజ్ఞ అయిన సంస్కారము, కొన్నిసార్లు విభజనకు కారణమవుతుంది అను విషయం చాలా విచారకరం. ప్రభువు బల్ల ఆచరించబడు విధానమును గూర్చి భిన్నత్వములు (వ్యక్తిగత గిన్నెలు, అందరికి ఒకే గిన్నె, గిన్నెలో రొట్టెను ముంచుట) మరియు ఎవరు పాలుపంచుకోగలరు అను విషయమును గూర్చి భిన్నత్వములు (నమ్ము విశ్వాసులందరు, కేవలం బాప్తిస్మము పొందిన విశ్వాసులు, స్థానిక సంఘములోని సభ్యులు మాత్రమే) సంఘముల మధ్య విభజనలకు దారితీసాయి.
వారు ఒకే రొట్టెలో పాలుపంచుకొనుచున్న విధముగా, వారు ఏక శరీరముగా ఉండాలని పౌలు కొరింథీ సంఘమునకు జ్ఞాపకము చేశాడు. “మన మందరము ఆ యొకటే రొట్టెలో పాలుపుచ్చుకొనుచున్నాము; రొట్టెయొక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై యున్నాము” (1 కొరింథీయులకు 10:17).
సంస్కారములో, ఆరాధన ప్రాధమికమైనది, మిగిలినవన్నీ తరువాత విషయములని మనము గుర్తుంచుకోవాలి. సంఘము సువార్తలు మరియు 1 కొరింథీ పత్రికకు అనుగుణంగా ఉన్న ఆచారములను పాటించాలి. అయితే, ప్రభువు బల్లను ఏ విధముగా ఇచ్చినప్పటికీ, అది విభజనలను కలిగించునదిగా ఉండకూడదు. ప్రభువు బల్లలో, మనము దేవుని కుటుంబము యొక్క ఐక్యతను జరుపుకుంటాము.
[1]Franklin M. Segler మరియు Randall Bradley, Christian Worship: Its Theology and Practice (Nashville: B&H Publishing, 2006), 178
“ప్రభువు బల్ల అనునది తన ప్రజలతో దేవుడు నియమించిన సమయము. క్రీస్తుతో ఈ నియామక సమయమును పాటించువారు, నిశ్చయముగా ఆయన వారిని కలుసుకొనుటకు వస్తాడని నమ్మవచ్చు.”
ఆరాధన ప్రాముఖ్యమేనా? ఒక సామాన్యమైన వ్యక్తి ప్రార్థనలో ఆరాధించినప్పుడు ఏమి జరుగుతుందో చూపు 1945లో జరిగిన ఈ సాక్ష్యమును వినండి.
రెండవ ప్రపంచ యుద్ధము సమయములో, జపాను దేశము నుండి అమెరికాలో స్థిరపడి బౌద్ధ మతము నుండి మారుమనస్సుపొందిన ఒక విద్యార్థి బయ్లోర్ విశ్వవిద్యాలయములో ఉజ్జీవమునకు కారకుడయ్యాడు. రెయిజి హోషికాజి తన విద్యాలయ ఫీజును కట్టుటకు పాచిపని చేసేవాడు. అతడు తరగతి గదులను శుభ్రం చేయుచుండగా, ప్రతి బల్ల దగ్గర అతడు ప్రార్థించుట ఆరంభించాడు.
కొన్ని వారముల పాటు ప్రార్థన చేసిన తరువాత ఒక రోజున, రెయిజి తరగతిలో కూర్చొనియున్నప్పుడు, తన తోటి విద్యార్థులను గూర్చి గొప్ప భారము కలిగి మొకాళ్ళూని యేడ్చుచు ప్రార్థించుట ఆరంభించాడు. “రెయిజికి ఏమైయ్యింది?” అని విద్యార్థులు అడిగారు. రెయిజికి ఏమి కాలేదు; అతని కుర్చీ అతనికి బలిపీఠం అయ్యింది.
రెయిజి చేసిన ప్రార్థనల ద్వారా, బయ్లోర్ విశ్వవిద్యాలయములో మరియు అక్కడ నుండి టెక్సాస్ రాష్టమంతా ఉజ్జీవము వ్యాపించింది. అక్కడ నుండి నైరుతి అమెరికా ప్రదేశమంతా ఉజ్జీవమును తీసుకొనివెళ్లుటకు కొన్ని డజన్ల విధ్యార్థులైన సువార్తికులు బయ్లోర్ క్యాంపస్ విడచి వెళ్లారు. ప్రార్థన ఆరాధనలో ప్రాముఖ్యమైన భాగమైయున్నది. మనము ఆరాధించినప్పుడు, దేవుని శక్తి ద్వారా మన లోకము మార్చబడుతుంది.
పాఠం 7 సమీక్ష
(1) మన ఆరాధనలోని ప్రతి భాగములో లేఖనమును చేర్చుట ద్వారా మనము ఆరాధనలో లేఖనమును కేంద్రముగా చేయవచ్చు.
(2) లేఖనము ఆరాధనలో కేంద్రముగా ఉన్నది కాబట్టి, దానిని స్పష్టముగా, వ్యక్తపరచు విధముగా, మరియు అధ్యయనమును తాజాగ ఉంచునట్లు విభిన్నమైన రీతిలో మనము చదవాలి.
(3) ప్రసంగము ఆరాధనలో భాగమైయున్నది కాబట్టి:
ప్రసంగము కొరకు జాగ్రత్తగా సిద్ధపడుట అవసరమైయున్నది.
ప్రసంగము సంఘ ప్రజల నుండి ప్రతిస్పందనను కోరుతుంది.
ప్రసంగము ప్రసంగీకుని నుండి ప్రత్యుత్తరమును కోరుతుంది.
ప్రసంగీకుడు పరిశుద్ధాత్మతో నింపబడాలి.
(4) బహిరంగ ఆరాధనలో ప్రార్థనను అర్థవంతమైన భాగముగా చేయుటకు ఆచరణాత్మక మార్గములు:
మీ వ్యక్తిగత ప్రార్థనా జీవితమును బలపరచుకోండి.
ఎలా ప్రార్థించాలో నేర్చుకోండి.
లేఖనములోని మాటలను ప్రార్థించండి.
దేవునితో సహవాసము చేయుట మీద దృష్టిపెట్టండి.
మీ ప్రాధాన్యతలను దేవుని ప్రాధాన్యతలతో అనుసంధానము చేయండి.
దేవునితో మాట్లాడండి, సంఘ ప్రజలతో కాదు.
(5) కానుక ఆరాధనలో భాగమైయున్నది కాబట్టి:
ఇచ్చుట అనునది భయము ద్వారాగాక, కృప ద్వారా పురికొల్పబడాలి.
ఇచ్చుట అనునది ప్రతిఫలము కొరకుగాక, ప్రేమ ద్వారా పురికొల్పబడాలి.
ఇచ్చుట అనునది పిసినారితనముతో గాక, ఔదార్యముతో నిండియుండాలి.
ఇచ్చుట అనునది గర్వముతో గాక, తగ్గింపు ద్వారా పురికొల్పబడాలి.
మనము కానుకలను సేకరించు విధానం ఆరాధన ఆత్మకు తోడ్పడాలి.
(6) ప్రభువు బల్ల
వెనుదిరిగి క్రీస్తు మరణమును చూస్తుంది.
క్రీస్తు రాకడ కొరకు ఎదురుచూస్తుంది.
యోగ్యమైన రీతిలో దీనిని ఆచరించాలి.
పవిత్రమైన మరియు సంతోషకరమైన రీతిలో దీనిని ఆచరించాలి.
సంఘము యొక్క ఐక్యతను ప్రతిబింబించు విధముగా దీనిని ఆచరించాలి.
(1) ఆరవ పాఠములో, మీరు ఐదు విభిన్నమైన అంశములను గూర్చి పాటలను ఎంపికచేసుకున్నారు. ఈ ఐదు అంశముల కొరకు, ఆ అంశమును గూర్చి మాట్లాడు 3-4 లేఖన భాగములను కనుగొనండి. తరువాత పాఠములో మీరు ఒక ఆరాధన కూడికను రూపొందించుచుండగా మీ జాబితాలు ఉపయోగించబడతాయి.
దేవుని స్వభావమును గూర్చి 3-4 వచనములు
యేసు మరియు ఆయన మరణ పునరుత్థానములను గూర్చి గూర్చి 3-4 వచనములు
పరిశుద్ధాత్మ మరియు సంఘమును గూర్చి గూర్చి 3-4 వచనములు
దేవుని ప్రజలను సమర్పణగల, పరిశుద్ధమైన జీవితము కొరకు పిలచు 3-4 వచనములు
సువార్త ప్రకటన మరియు పరిచర్యను గూర్చి 3-4 వచనములు
(2) తదుపరి పాఠము యొక్క ఆరంభములో, ఈ పాఠం ఆధారముగా మీరు ఒక పరీక్ష వ్రాస్తారు. సిద్ధపడుటకు పరీక్ష ప్రశ్నలను జాగ్రత్తగా అధ్యయనం చేయండి.
పాఠం 7 పరీక్ష
(1) ఆరాధనలో లేఖనము యొక్క ప్రాముఖ్యతను చూపు మూడు ఉదాహరణలను ఇవ్వండి.
(2) లేఖనము ఉపయోగించబడగల ఆరాధన కూడికలోని మూడు భాగముల పేర్లను ఇవ్వండి.
(3) ప్రసంగము ఆరాధన అను నియమమునకు నాలుగు ఆచరణాత్మక అంతర్భావములను తెలుపండి.
(4) బహిరంగ ఆరాధనలో ప్రార్థనను ఒక అర్థవంతమైన భాగముగా చేయుటకు మూడు ఆచరణాత్మక సూచనలను ఇవ్వండి.
(5) ఆరాధనలో ఇచ్చుట గూర్చి నాలుగు వేదాంతశాస్త్ర నియమాలను వ్రాయండి.
(6) ఇచ్చుటను ఒక ఆరాధన కార్యముగా చేయుటకు నాలుగు ఆచరణాత్మక ఆలోచనలను వ్రాయండి.
(7) 1 కొరింథీ పత్రికలో గుర్తించబడిన ప్రభువు బల్లలోని రెండు విషయములను వ్రాయండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.