లేఖన అధ్యయనం - రోమా పత్రిక 5వ భాగం
రోమీయులకు రాసిన పత్రిక, ఒక వ్యక్తి రక్షణను, ఆశీర్వాదాన్ని పొందడానికి దేవునితో సంబంధంలోనికి ఎలా వస్తాడో వివరిస్తుంది. దేవునితో సంబంధం అనేది విశ్వాసం ద్వారా పొందిన కృపపై ఆధారపడి ఉంటుంది. ఈ సందేశం, ఇశ్రాయేలు ప్రజలను గురించి ప్రశ్నలు ఉత్పన్నమవ్వడానికి కారణమవుతుంది. దేవునికి, ఇశ్రాయేలుకు మధ్య ఉన్న ప్రత్యేక సంబంధానికి ఏమైంది? యూదుడైన వ్యక్తి ఎలా రక్షణ పొందుతాడు? దేవుడు ఇశ్రాయేలు పట్ల ఇంకనూ ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడా? పౌలు సువార్త సందేశాన్ని వివరించడం కొనసాగిస్తున్నప్పుడు, ఈ అధ్యాయాలు ఆ ప్రశ్నలకు సమాధానమిస్తాయి.