మొదటి శతాబ్దంలో సువార్తను విన్న లోకంలో, మూడు సంస్కృతులు లోకానికి ఒక ఆకృతిని / రూపాన్ని ఇచ్చాయి. సువార్త అత్యంత ప్రభావవంతంగా ఉండే స్థితిలోనికి దేవుడు లోకాన్ని సిద్ధపరిచాడు.
గ్రీకు సంస్కృతి
అలెగ్జాండర్ ది గ్రేట్ నాగరిక ప్రపంచాన్ని జయించి తన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అతను ఉద్దేశ్యపూర్వకంగా గ్రీకు సంస్కృతిని వ్యాప్తి చేసాడు, ఎందుకంటే అది అన్ని సంస్కృతులకంటే గొప్పదని, అది తన సామ్రాజ్యాన్ని ఏకం చేయడానికి సహాయపడుతుందని అతను నమ్మాడు. ప్రతి ఒక్కరూ గ్రీకు మాట్లాడాలని, గ్రీకు ఆచారాలను పాటించాలని అతను కోరుకున్నాడు. ఇది సువార్త కోసం మార్గాన్ని సిద్ధం చేసింది ఎందుకంటే మిషనరీలు సామ్రాజ్యమంతటా గ్రీకులో సువార్తను బోధించగలిగారు.
గ్రీకు ఆలోచన విధానం, ప్రజలు తమని తాము ఒక తెగగానో లేదా కుటుంబంగానో చూడడానికి బదులు, ప్రధానంగా వ్యక్తులుగా చూసేలా చేసింది. కాబట్టి, వాళ్ళు వ్యక్తిగతంగా మతాన్ని ఎంపిక చేసుకోవడానికి ఇప్పుడు ఇష్టపడ్డారు. ప్రజలు, తమ మతాన్ని మార్చుకోవడం సాధ్యమని భావించారు.
గ్రీకులు, తమని తాము ఒక స్వంత చిన్న రాష్ట్రానికి పౌరులుగా కాక, మొత్తం ప్రపంచానికి పౌరులుగా చూసుకున్నారు. ప్రతి ప్రజా గుంపు వారి స్వంత సత్యాన్ని కలిగి ఉండటానికి బదులుగా, ప్రజలందరికీ వర్తించే సత్యం ఒకటి ఉందని వారు గ్రహించారు. వారి సాంప్రదాయం నుండి మాత్రమే కాకుండా మరెక్కడి నుండైనా సత్యం తమ యొద్దకు రావచ్చని వారు గ్రహించారు.
గ్రీకు తత్వవేత్తలు, జీవిత అర్థం మరియు విశ్వానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశారు. ప్రతి ఒక్కరికీ జీవితాన్ని గురించి వివరించే సమాధానాలు ఉన్నాయని వారు విశ్వసించారు.
గ్రీకు తత్వవేత్తలు ప్రాచీన/పురాతన మతాలు తప్పని చూపించడానికి తర్కాన్ని/హేతువును ఉపయోగించారు. దేవతల పురాణాల పట్ల ప్రజలు అసంతృప్తి చెందడానికి కూడా వారు కారణమయ్యారు. దేవతలు మానవ తప్పిదాలు, అనైతిక మరియు చెడు చర్యలకు పాల్పడడంతోనున్న మానవత్వపు అతివాదాలు.
గ్రీకు తత్వవేత్తలు, జీవితానికి మరియు వాస్తవానికి నూతన వివరణలను ప్రతిపాదించారు. ప్రతి నూతన తత్వాన్ని గురించి చర్చించారు, వాదించారు. అయితే ఏ తత్వం కూడా ప్రశ్నలకు సంపూర్ణంగా సమాధానం చెప్పడంలో విజయం సాధించలేదు. వాళ్ళు ప్రాముఖ్యమైన ప్రశ్నలను కనుగొని, చర్చించారే గాని వాటికి సమాధానాలు చెప్పలేకపోయారు.
తత్వం అడిగిన ప్రశ్నలకు క్రైస్తవ్యం సమాధానమిచ్చింది మరియు ఆత్మీయ అవసరాన్ని సంతృప్తిపరిచింది.
► గ్రీకు సంస్కృతి ప్రపంచాన్ని ఎలా మార్చింది మరియు సువార్త వ్యాప్తి కొరకు ఎలా సిద్ధపరిచింది?
రోమా సంస్కృతి
గ్రీకు సామ్రాజ్యం వివిధ భాగాలుగా విడిపోయిన తర్వాత రోమా సామ్రాజ్యం అభివృద్ధి చెందింది. రోమీయులు అనేక దేశాలను జయించి, ఏకం చేసారు, అయితే ఎక్కువ శాతం గ్రీకు సంస్కృతి వాడుకలో ఉండేది.
రోమా ఆక్రమణల వల్ల ప్రజలు తమకు సహాయం చేయలేని వారి స్థానిక దేవుళ్లపై విశ్వాసం కోల్పోయారు. ప్రజలు, సర్వశక్తిమంతుడైన, విశ్వవ్యాపియైన దేవుని గురించి వినడానికి మరింత ఇష్టపడ్డారు.
రోమీయులు అనేక దేవుళ్ళను విశ్వసించేవారు మరియు గ్రీకు పురాణాల వంటి ఇతిహాసాలను కలిగి ఉండేవారు. అక్షరాస్యులైన చాలామంది రోమీయులు వాస్తవానికి దేవుళ్లను విశ్వసించేవారు కాదు కానీ వారి సంస్కృతిలో భాగంగా మతాన్ని ఆచరించేవారు.
రోమా చట్టం, న్యాయాన్ని గూర్చిన స్పష్టమైన భావనలను తీసుకువచ్చింది. రోమా కోర్టులు సాక్ష్యాలను సహేతుకమైన విధానంలో పరిగణలోనికి తీసుకొనేవి. ఇది మనిషి అపరాధం మరియు నిర్దోషికరణ సిద్ధాంతాలకు పునాది వేయడానికి సహాయపడింది.
రోమా ఆధిపత్యం దేశాల మధ్య చిన్న చిన్న యుద్ధాలను సమాప్తం చేసి, “పాక్స్ రోమానా” అని పిలిచే రోమా శాంతిని తీసుకొనివచ్చింది. ఇది ప్రయాణాన్ని సురక్షితం చేసింది మరియు మిషనరీలు ఎలాంటి ఇబ్బంది లేకుండా దేశ సరిహద్దులను దాటగలిగే అవకాశం కల్పించింది.
► రోమా సంస్కృతి ప్రపంచాన్ని ఎలా మార్చింది మరియు సువార్త వ్యాప్తికి ఎలా సిద్ధం చేసింది?
యూదుల సంస్కృతి
యూదులు నాగరిక ప్రపంచమంతటా చెదిరిపోయారు మరియు ప్రతిచోటా వారు తమ సమాజ మందిరాలను స్థాపించి, తమ విశ్వాసాన్ని బోధించారు. ప్రతి నగరంలో మోషేను గురించి బోధించారని అపొస్తలులు గమనించారు (అపొస్తలుల కార్యములు 15:21). ఇశ్రాయేలు మతం పట్ల నమ్మకంగా ఉన్న యూదులు రోమాలో ప్రభావం చూపారు.
యూదా మతం యొక్క సార్వభౌముడైన, పరిశుద్ధ దేవుని గూర్చిన భావన, మోసపూరితమైన, అనైతిక దేవుళ్ళకంటే ఎంతో గౌరవించబడింది. నైతికంగా గందరగోళ పరిస్థితులున్న ప్రపంచంలో యూదామతం యొక్క ఉన్నతమైన నైతికత ఆకర్షణీయంగా ఉంది. క్రైస్తవ మతం ఈ నైతిక విలువలను పంచుకుని, వాటిని ఉన్నతస్థాయికి తీసుకెళ్లింది మరియు పాపిని మార్చి, పవిత్ర జీవితాన్ని ఆరంభించేలా చేయడానికి కృపకున్న సామర్థ్యాన్ని బోధించింది.
చరిత్రలో దేవుని ఉద్దేశ్యం గురించి యూదా మత భావన మరియు మెస్సీయ కొరకు నిరీక్షణ, భవిష్యత్తుకై నిరీక్షణనిచ్చాయి. నిరీక్షణ, దేవుని జోక్యంపై ఆధాపడి ఉంటుందే గాని, మానవ పరిష్కారాలపై కాదు. మెస్సీయ వచ్చాడని, నూతన యుగం ప్రారంభమైందని క్రైస్తవ మతం ప్రకటించింది.
► యూదా సంస్కృతి ప్రపంచాన్ని ఎలా మార్చింది మరియు సువార్త వ్యాప్తికి పరిస్థితులను ఎలా సిద్ధపరిచింది?
లేఖన అధ్యయనం - రోమా పత్రిక 7వ భాగం
ఈ లేఖన భాగంలో, తాను ఈ పత్రికను ఎందుకు రాస్తున్నాడో అపొస్తలుడు వివరించాడు. ఆయన వారిని దర్శించి, స్పెయిన్ లో మిషనరీ పరిచర్యను ప్రారంభించడానికి వారి సహాయాన్ని పొందాలి అనుకున్నాడు. ఈ పత్రిక యొక్క ఉద్దేశ్యం, దీని నిర్మాణాన్ని నిర్దేశిస్తుంది, ఎందుకంటే సువార్త అంటే ఏమిటో, అందరికీ ఇది ఎందుకు అవసరమో, సందేశకులు ఎందుకు ప్రాముఖ్యమో, తాను వెళ్లడానికి ఎందుకు అర్హుడో పౌలు వివరించాడు. ప్రపంచవ్యాప్త సౌవార్తీకరణ అనేది ఎల్లప్పుడూ దేవుని ప్రణాళిక అని ఆయన చూపించాడు.
► బృందం కొరకు ఒక విద్యార్థి రోమా 15:8-33 వచనాలు చదవాలి.
వచనాల వారీ వివరణ
(15:8) మెస్సీయాను గూర్చి యూదా పితరులకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలను యేసు నెరవేర్చాడు మరియు ఆయన యూదా దేశం మరియు మతం ద్వారా వచ్చాడు.
(15:9-12) అనేక పాత నిబంధన ఉల్లేఖనాల ద్వారా, సువార్త అన్యజనులకు అందించాలనేది ఎల్లప్పుడూ దేవుని ప్రణాళిక అని అపొస్తలుడు తెలియజేశాడు.పౌలు ఉల్లేఖించిన లేఖనాలలో, ప్రవక్తలు ఇలా ప్రవచించారు:
అన్యులు దేవునిని ఆరాధించువారవుతారు.
మెస్సీయా, అన్యులపై పరిపాలన చేస్తాడు.
అన్యులు, మెస్సీయా యందు నమ్మకముంచుతారు.
(15:13-14) అపొస్తలుడు, రోమా సంఘం కొరకు ఆశీర్వాద ప్రార్థనను చేసి, వాళ్ళు ఆత్మీయంగా బలంగా ఉన్నారని తాను నమ్ముతున్నానని చెబుతాడు. ఆ తరువాతి వచనాలలో, సువార్త పని కొరకు దర్శనం కలిగి ఉండుటకు వారిని ఆహ్వానిస్తాడు. ఆత్మీయంగా బలంగా ఉన్న ఆశీర్వాదకరమైన సంఘం, సౌవార్తిక పని పట్ల దర్శనం, భాగస్వామ్యం లేకుండా సంపూర్తి కాదు.
► దూర ప్రాంతాలలో ఉన్న సౌవార్తిక పరిచర్యకు సహకరించాలనే కోరిక సంఘానికి లేనట్లయితే ఏం జరుగుతుంది?
(15:15-16) అన్యజనులకు సువార్తను తీసుకువెళ్లడానికి తనకు ఉన్న ప్రత్యేక పిలుపు గురించి ఆయన వారికి చెప్పాడు. ఈ పని కోసం దేవుడు అతనికి ప్రత్యేక ఆత్మీయ వరాలను ఇచ్చాడు. అన్యజనుల సంఘాలు పవిత్రంగాను, నిజమైనవిగాను, దేవునికి ప్రీతికరమైనవిగా ఉండాలనేది ఆయన కోరిక.
(15:17-19) దేవుడు అతని పరిచర్యకు విజయాన్నిచ్చాడు. అనేకమంది అన్యులు దేవుని వాక్యానికి విధేయులుగా మారారు. ప్రజలు పశ్చాత్తాపపడి, దేవునికి విధేయత చూపే జీవితాన్ని కలిగి ఉండడం, పరిచర్యకు అత్యంత ప్రాముఖ్యమైన ఫలితం. విజయాన్ని సూచించే ఇతర సూచనలు అంత ప్రాముఖ్యం కాదు. అతని పరిచర్య కూడా దేవుని ద్వారా జరిగిన అద్భుతాల చేత గుర్తింపు పొందాయని ఆయన చెప్పాడు. ఆయన అనేక ప్రాంతాలన్నింటిలో సువార్తను ప్రకటించాడు.
(15:20-22) సువార్త ప్రకటించబడని ప్రాంతాలలో సువార్త ప్రకటించడం ఆయన వాడుక. ఆయన ఒక క్రమంలో ఆయా ప్రాంతాలలో సువార్తను ప్రకటించాడు. ఆ ప్రాధాన్యతను బట్టే ఆయన రోమాకు వెళ్లలేదు, ఎందుకంటే అక్కడ ఇప్పటికే సువార్త ప్రకటించబడింది.
(15:23-24) ఆయనకు దగ్గరలో ఉన్న ప్రతి ప్రాంతంలో ఆయన సువార్త ప్రకటించాడు. రోమా ప్రాంతాన్ని దాటి వెళ్ళి, స్పెయిన్ కు సువార్త యాత్ర చేయడానికి తనకు సహాయం చేయమని రోమా సంఘాన్ని కోరాడు. ఈ యాత్ర ఆయనకు సువార్తను ప్రకటించే అవకాశాన్ని, రోమాలో సహవాసాన్ని ఇస్తుంది. దానితో పాటు సువార్త అందని స్థలాల్లో సువార్త ప్రకటించడానికి కూడా సహాయం చేస్తుంది.
► సువార్తను వ్యాపింపజేయడంలో సహకరించడానికి ప్రతి సంఘంతో పాటు ప్రతి క్రైస్తవుడు ఎలా ఋణపడి ఉన్నారో వివరించండి (అవసరమైతే, మొదటి పాఠంలో 1:15వచనం యొక్క వివరణను చూడండి).
(15:25-29) అన్యుల సంఘం నుండి యూదుల సంఘానికి కానుకను తీసుకెళ్లడానికి గాను మొదటిగా యెరూషలేముకు వెళతాడు. ఈ కానుక చాలా ప్రాముఖ్యం. అర్పణను పంపడం ద్వారా, తాము యూదులకు ఋణస్తులమనే విషయాన్ని అన్యులు ఒప్పుకున్నారు, ఎందుకంటే యూదులైన క్రైస్తవులే వారికి సువార్తను తీసుకొని వచ్చారు. కానుకను పొందడం ద్వారా అన్యులు కూడా అదే సంఘంలో ఉన్నారని యూదులు ఒప్పుకున్నారు. అక్కడ మరొక ప్రత్యేకమైన క్రైస్తవ మతాలు లేవు. అందుకే యూదులైన విశ్వాసులు కానుకను అంగీకరించునట్లు ప్రార్థన చేయమని పౌలు కోరాడు.
(15:30-33) యెరూషలేములో ఆవిశ్వాసులైన యూదుల చేతిలో ప్రమాదం నుండి విడిపించబడునట్లు తన కొరకు ప్రార్థన చేయమని ఆయన అడిగాడు. తద్వారా ఆయన రోమా పట్టణానికి రాగలుగుతాడు. ఆయన ఎన్నుకొన్న విధానంలో కాకపోయినప్పటికిని, ఈ ప్రార్థనకు సమాధానం వచ్చింది. పౌలును యెరూషలేములో యూదా నాయకులు బంధించి, రోమా గవర్నరు యొద్దకు తీసుకెళ్ళి, విచారణ కొరకు రోమాకు పంపడం ద్వారా ఒక ఖైదీగా రోమాకు వచ్చాడు. (ఈ కథ, అపొస్తలుల కార్యాల గ్రంథంలో 21:26 నుండి ప్రారంభమై, ఈ గ్రంథం చివరి వరకు కొనసాగుతుంది.) పౌలు స్పెయిన్ కు వెళ్లాడో లేదో మనకు తెలీదు.
► స్పెయిన్ కి వెళ్లాలనుకున్న ప్రయాణం తన ప్రణాళికకు అనుగుణంగా జరగకపోయినప్పటికిని, పౌలు జీవితంలో జరిగిన సంఘటనల్లో దేవుని ఏర్పాటును మనం ఎలా చూడగలం?
లేఖన అధ్యయనం - రోమా పత్రిక 8వ భాగం
16వ అధ్యాయం యొక్క సారాంశం
పౌలు రాసిన ఇతర పత్రికలకంటే ఈ పత్రికలోనే ఎక్కువ మంది పేర్లను ప్రస్తావించి వందనాలు చెప్పాడు. అతను రోమాకు వెళ్లనందున, సంఘంతో తన సంబంధాన్ని ప్రారంభించడంలో సహాయం చేయడానికి అక్కడ ఉన్న తన పరిచయస్తులందరినీ అతను ప్రస్తావించి ఉండవచ్చు.
► బృందం కొరకు ఒక విద్యార్థి రోమా 16వ అధ్యాయాన్ని చదవాలి.
వచనాల వారీ వివరణ
(16:1-2) ఫీబే, ఈ పత్రికను తీసుకెళ్ళే వారితో కూడా ఉంది. ఆమె పరిచర్యలో తనకు సహాయం చేయమని పౌలు వారికి చెప్పాడు, ఎందుకంటే ఆమె అనేకమంది అవసరాలను తీర్చింది. ఇప్పటికే ఇతరులకు సహాయం చేసే వ్యక్తే, మనం సహాయం చేయడానికి ఉత్తమమైన వ్యక్తి.
(16:3-4) అకుల, ప్రిస్కిల్ల పౌలు కొరకు తమ జీవితాలను పణంగా పెట్టారు (వారిని గూర్చిన మరింత చరిత్ర కోసం అపొస్తలుల కార్యములు 18:1-3; 24-26 వచనాలను చూడండి).
(16:7, 11, 21) పౌలు యొక్క బంధువుల పేర్లు ఈ వచనాల్లో ప్రస్తావించబడ్డాయి.
(16:13) ఇక్కడ ప్రస్తావించిన స్త్రీ, వాస్తవానికి పౌలు తల్లి కాదు. రూఫు, యేసు సిలువను మోసిన కురేనీయుడైన సీమోను కుమారుడు కావచ్చు, ఎందుకంటే మార్కు. 15:21లో అతను సంఘానికి తెలిసిన వ్యక్తి అన్నట్లుగా అతని పేరు ప్రస్తావించబడింది.
(16:17-18) కొంతమంది వ్యక్తులు, తమ స్వంత రాజ్యాలను నిర్మించుకోవడానికి గాను సంఘం యొక్క మౌలిక సత్యాల నుండి ఇతరులను వేరు చేయడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు క్రీస్తుని కాదు గాని తమ స్వంత కోరికలను సేవిస్తున్నారు. వారి సందేశం, రక్షణను గూర్చిన హిత బోధకు భిన్నంగా ఉంటుంది. (3 యోహాను 1:9-10 మరియు 2 పేతురు 2:1-3 చూడండి).
(16:19) సత్యాన్ని గురించి మనం ఎంత నేర్చుకోగలమో అంత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం చెడును గురించి ఎక్కువగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. చెడు విషయాలను అధ్యయనం చేసే వ్యక్తులు అనారోగ్యకరమైన విషయాలపట్ల ఆకర్షణ మరియు వారి ఆలోచనను వక్రీకరించే ప్రమాదాన్ని ఎదుర్కొంటారు.
(16:20) క్రీస్తు కార్యం ద్వారా సంఘం అంతిమంగా సాతానుపై విజయం సాధిస్తుంది. (ఆదికాండము 3:15).
(16:22) తెర్తియు రచయిత కాదు, కానీ పౌలు పత్రికను అతనికి చెబుతూ ఉంటే రాసిన వ్యక్తి.
(16:25-27) ఈ వచనాలు పత్రిక యొక్క ప్రధాన అంశాన్ని సూచిస్తాయి. "నా సువార్త" మరియు "యేసు క్రీస్తునుగూర్చిన ప్రకటన" అనే మాటలను గమనించండి. సువార్త అనేది ఒక తాజా ప్రత్యక్షత మరియు ప్రవక్తల పూర్వ సందేశమని ఆయన మరలా ప్రస్తావించాడు. ఆయన మిషన్స్ ను గూర్చి ప్రస్తావించి, ఈ సందేశం దేశాలన్నింటి కొరకు ఉద్దేశించబడినదని గుర్తు చేస్తూ ముగించాడు. గొప్ప ఆదేశంలో యేసు చెప్పిందే, పరిచర్య యొక్క లక్ష్యం (మత్తయి 28:19-20): ప్రజలను క్రీస్తుకు విధేయతలోనికి తీసుకురావడం. 1:5లో సమస్త జనులను దేవునికి విధేయులుగా చేయడమే పరిచర్యకు కారణమని ప్రారంభించిన మాటతోనే పత్రిక ముగుస్తుంది.
రోమా పత్రిక నుండి సువార్త ప్రకటన
కేవలం రోమా పత్రిక నుండి కొన్ని వచనాలను ఉపయోగించి, సువార్తను వివరించవచ్చు. ఈ విధమైన సువార్త ప్రకటనను కొన్నిసార్లు "రోమా మార్గం" అని పిలుస్తారు.
ప్రతి అంశానికి మొదటి వివరణ వాక్యం, జ్ఞాపక ముంచుకోవాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన విషయం.
రోమా 3:23
"అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు."
ప్రతి వ్యక్తి, తనకు తప్పని తెలిసిన పనులను చేయడం ద్వారా పాపం చేశాడు. ఈ వచనం, ప్రజలు కలిగి ఉన్న నిజమైన సమస్యను చూపిస్తాయి. వాళ్ళు దేవునికి లోబడలేదు; వాళ్ళు ఉద్దేశ్యపూర్వకంగా దేవునికి అవిధేయత చూపారు. ఏ వ్యక్తి మినహాయింపు కాదు. ఎల్లప్పుడూ సరైన వాటిని చేయడాన్ని బట్టి ఏ వ్యక్తి దేవుని దృష్టికి అంగీకరించబడడు.
ఈ అంశాన్ని మరింతగా నొక్కి చెప్పడానికి, మీరు 3:11 (“నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు”) మరియు 5:12ను (ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను) వాడుకోవచ్చు.
రోమా 6:23
“ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము.”
పాపులు, నిత్యమరణాన్ని సంపాదించుకున్నారు, కానీ దేవుడు యేసు ద్వారా నిత్యజీవాన్ని బహుమానంగా అందిస్తున్నాడు.
పాపం ఎందుకు తీవ్రమైందో ఈ వచనం చూపిస్తుంది. పాపం వలన, మరణ శిక్ష ప్రతి వ్యక్తిపైకి వచ్చింది. దేవుని తీర్పైన నిత్యమరణానికి ప్రతి పాపి తగినవాడు.
మనం సంపాదించుకున్న మరణానికి భిన్నంగా, మనం సంపాదించని జీవపు బహుమానాన్ని దేవుడు అందిస్తున్నాడు.
రోమా 5:8
“అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.”
క్రీస్తు మన కొరకు మరణించుట ద్వారా దేవుని బహుమానం అందించబడింది.
మనం పొందాల్సిన తీర్పును మనం పొందాలని దేవుడు కోరుకోలేదు. ఆయన మనల్ని ప్రేమించాడు గనుక, మనం కనికరాన్ని పొందడానికి ఒక మార్గాన్ని అందించాడు. మనం క్షమాపణ పొందునట్లు అర్పణగా యేసు చనిపోయాడు. మనం రక్షణకు అర్హులమవ్వడానికి ఏదో ఒకటి చేసేవరకు దేవుడు ఎదురు చూడలేదు- మనం పాపులంగా ఉండగానే అది మన యొద్దకు వచ్చింది. రక్షణ, మంచి వ్యక్తుల కొరకు కాదు గాని పాపుల కొరకు అందించబడింది.
రోమా 10:9
“నీ నోటితో ఒప్పుకొని....విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు”
రక్షణ పొందడానికి కావాలసిందల్లా, పాపి తాను పాపినని ఒప్పుకొని, క్షమాపణ విషయమై దేవుని వాగ్దానాన్ని నమ్మడం.
పశ్చాత్తాపం సంగతేమిటి? ఒక వ్యక్తి తాను తప్పు చేశానని అంగీకరించి, క్షమాపణ పొందాలని కోరుకుంటే, అతను తన పాపాలను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడని ఉద్దేశించాడు.
రోమా 10:13
“ఎందుకనగా–ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడో వాడు రక్షింపబడును.”
రక్షణ, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంది. ఎవరికి మినహాయింపు లేదు. ఇతర అర్హతలేమి లేవు.
రోమా 5:1
“కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము”
మనం దేవుని వాగ్దానాన్ని నమ్మడం మనల్ని అపరాధులుగా కాక, దేవుని స్నేహితులనుగా చేస్తుంది.
దేవునితో సమాధానం కలిగి ఉండడం అంటే మనం ఆయనకు శత్రువులం కాదని భావం; మనం సమాధానపడ్డాం. దేవుని నుండి మనల్ని వేరు చేసిన పాపం, త్రోవలో నుండి తీసివేయబడింది. నీతిమంతులుగా తీర్చబడడం అంటే అపరాధులం కాదని భావించడం. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం అంటే, దేవుని వాగ్దానాలను నమ్మడమే, మనం క్షమాపణ కొరకు చేయాల్సిన పని.
రోమా 8:1
“కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు.”
మనం క్రీస్తుతో సంబంధాన్ని కలిగి ఉన్నాం గనుక, మనం చేసిన పాపాలను బట్టి మనం తీర్పుతీర్చబడం.
క్రీస్తు పాపరహిత జీవితాన్ని జీవించి, సిలువపై తన మరణం ద్వారా అవసరమైన న్యాయమును నెరవేర్చాడు. విశ్వాసం ద్వారా మనం ఆయనతో గుర్తింపు కలిగి ఉంటాం. ఆయనను బట్టి తండ్రియైన దేవుడు మనల్ని అంగీకరించాడు. మనం ఎప్పుడూ పాపం చేయలేదు అన్నట్లుగా మనతో వ్యవహరిస్తాడు.
ముగింపు
ఒక ఆవిశ్వాసి, దేవునికి ప్రార్థించి, తాను పాపినని ఒప్పుకొని, తన కొరకు యేసు అర్పణను ఆధారంగా క్షమాపణను అడగడం ద్వారా రక్షణ పొందవచ్చని వివరించాలి.
నేర్చుకొని అభ్యాసం చేయడానికి
ఈ పద్ధతిని నేర్చుకోవడానికి మరియు ఆచరించడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే, మీ బైబిల్ లో రోమా పత్రికలో ఉపయోగించాల్సిన ప్రతి వచనాన్ని వృత్తాకారములో లేదా గీతగీయడం ద్వారా ముందుగా గుర్తించాలి. తరువాత, దాన్ని ఉపయోగించే ప్రతి వచనం ప్రక్కన, దాని క్రమాన్ని చూపే సంఖ్యను రాయాలి. ఉదాహరణకు, మొదట ఉపయోగించాల్సిన వచనం పక్కన, 1వ అంకె రాయండి.
సువార్తను ప్రకటించడాన్ని సాధన చేయండి. ప్రతి వచనాన్ని చదివి, దానికి వివరణను ఇవ్వండి. ప్రతి వచనం తరువాత మొదటి వాక్యంలో ఉన్న అంశాలను చేర్చడానికి జాగ్రత్తపడండి. పిమ్మట, ఇతర వాక్యాలు సహాయకరంగా ఉంటే, వాటికి అవసరమైన వివరణను జోడించండి. ఈ పాఠంలో అందించిన అవే పదాలను ఉపయోగించాల్సిన అవసరం లేదు.
బైబిల్ తప్ప మరేమీ చూడకుండా ప్రకటించేటట్లుగా సాధన చేయండి.
పాఠం 12 - పునఃశ్చరణ ప్రశ్నలు
(1) మొదటి శతాబ్దంలో సువార్త వ్యాప్తికి మూడు గొప్ప సంస్కృతులు ప్రపంచాన్ని ఎలా సిద్ధం చేశాయో వివరించండి.
(2) అన్యజనుల వద్దకు సువార్త వెళ్లాలని దేవుడు ఎల్లప్పుడూ ప్రణాళిక కలిగి ఉన్నాడని అపొస్తలుడు ఎలా నిరూపించాడు?
(3) యెరూషలేము సంఘానికి కానుకలు ఎందుకు ప్రాముఖ్యం?
(4) పౌలు, రోమాలోనికి ఎలా చేరుకున్నాడు?
Print Course
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.