తరగతి నాయకునికి గమనిక: ఒకటి కంటే ఎక్కువ తరగతులు అవసరమైనప్పటికీ, ఈ పాఠంలో ఆచరణాత్మక కార్యకలాపాలు కొరకు తరగతిలో తగిన సమయం కేటాయించండి.
ఈ కోర్సులో, మనం బైబిల్ భాష్యానికి దశలను చూశాం: పరిశీలన, భాష్యం, అన్వయం. బైబిల్ భాష్యంలో చేసే సాధారణం తప్పులు నివారించాలని మనం నేర్చుకున్నాం. లేఖన అధ్యయనానికి అవసరమైన ముఖ్య సూత్రాలు చర్చించుకున్నాం. ప్రతి దశను అభ్యాసం చేశాం. ఈ పాఠంలో, ప్రక్రియ అంతటిని సమీక్షిద్దాం. అప్పుడు ఈ ప్రక్రియ ప్రకారంగా తరగతి అంతా పాత మరియు క్రొత్త నిబంధన వాక్యభాగాలు రెండిటిని అధ్యయనం చేస్తారు. మీరు మీ సొంత నైపుణ్యాలు కూడా అభ్యసించండి. అప్పుడు మీరు 1వ పాఠంలో మొదలుపెట్టిన కోర్సు ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తారు.
మొదలుపెట్టడానికి, క్రింది చిత్రాన్ని సమీక్షించండి:
ప్రాచీన ప్రపంచం నుండి మన ప్రపంచాన్ని వేరు చేసే చారిత్రిక-సాంస్కృతిక వ్యత్యాసాలు
3
వంతెన
వాక్యభాగంలో బోధించిన సూత్రం
4
పటం
క్రొత్త నిబంధనకు సంబంధం (పాత నిబంధన వాక్యభాగాలతో)
5
మన పట్టణం
మన లోకంలో ఆ సూత్రం యొక్క అన్వయింపు
ఈ పాఠంలోని తదుపరి భాగాలు బైబిల్ భాష్య ప్రక్రియ అంతటిని సమీక్షిస్తాయి. భాష్య ప్రక్రియలోని ప్రతి దశలో, భాష్యకర్తలు తమను సరైన ముగింపుకు నడిపించే ప్రశ్నలు అడగాలి. ఈ ప్రశ్నలు భాష్య సూత్రాలపై ఆధారపడతాయి.
ప్రక్రియలోని ప్రతి దశలో అడగవలసిన ప్రశ్నలు జాబితా చేయబడ్డాయి. ప్రశ్నలు ఎలా ఉపయోగించాలి మరియు సరైన భాష్యానికి అవి ఎందుకు ఉపయోగకరమో ఉదాహరణను చూపిస్తాయి.
ప్రశ్నల సేకరణ భాష్యానికి ఒక సాధన పెట్టెలా పరిగణించాలి. ఒక భవన నిర్మాణ ప్రాజెక్ట్ లో నిర్మాణకుడు ప్రతి పరికరాన్ని ఉపయోగించవలసిన అవసరం లేనట్లుగా, ఇక్కడ ప్రతి ప్రశ్న ప్రతి వాక్యభాగానికి వర్తించదు. ఒక ప్రశ్న యొక్క సమాధానం స్పష్టంగా లేనప్పుడు లేక ఎటువంటి సహకారాన్ని ఇవ్వనప్పుడు అది వాక్యభాగానికి సంబంధించినది కాదని భావించవచ్చు.
[1]చిత్రం: “Interpreting the Bible” ను Anna Boggs గీశారు, https://www.flickr.com/photos/sgc-library/52377290578, licensed under CC BY 2.0. Concept from J. Scott Duvall and J. Daniel Hays, Grasping God’s Word (Grand Rapids: Zondervan, 2012) లో లభిస్తుంది.
1 తిమోతికి పత్రిక రచయితయైన అపొస్తలుడైన పౌలు, తిమోతికి గురువు. ఇది, యువ సేవకుడైన తిమోతికి పౌలు ఇచ్చిన ఉపదేశం.
వీటిని అర్థం చేసుకోవడం, పౌలు ఉపదేశం సూటిగా ప్రతి క్రైస్తవునికి వర్తించదని గ్రహించడంలో మనకు సహాయపడుతుంది.
అసలు శ్రోతలు
వారు ఎవరు?
వారి లక్షణాలు ఏంటి?
ఫిలేమోను పత్రికను వ్యక్తిగతంగా విశ్వాసికి రాశాడు.
హెబ్రీ పత్రికను హింసించబడిన యూదా విశ్వాసులకు రాశాడు.
పరిస్థితులు
రక్షణ చరిత్రలోని ఏ కాలంలో ఈ లేఖనం రాయబడింది?
2 దినవృత్తాంతములు 7:14: “నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును.”
“నా జనులు” అను మాట దేవుని ప్రజలైన ఒక నిర్దిష్ట రాజ్యాన్ని సూచిస్తుంది. “దేశమును స్వస్థపరచుదును” అను వాగ్దానం సూటిగా సంఘానికి వర్తించవలసిన అవసరత లేదు.
సాంస్కృతిక నేపథ్యం ఏంటి? సాధ్యమైతే, అసలు సంస్కృతి గురించి అధ్యాయం చేయడానికి బైబిల్ నిఘంటువు ఉపయోగించండి. దీని వలన మీరు వారి సంస్కృతికి మన సంస్కృతికి మధ్య సారుప్యతలు, వ్యత్యాసాలు కనుగొనగలం.
2 కొరింథీయులకు 13:12: “పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకరికి ఒకరు వందనములు చేసికొనుడి.”
పవిత్రమైన ముద్దుతో వందనాలు చెప్పడం ఆ కాలంలోని క్రైస్తవుల సాంస్కృతిక పద్ధతి.
ప్రస్తుత సంఘటనలు ఏంటి?
సంఘంలో పరిస్థితి ఏంటి? (క్రొత్త నిబంధన వాక్యభాగాలు మాత్రమే)
పరిశీలన: సాహిత్య సందర్భ అవగాహన
పుస్తకం మరియు వాక్యభాగం యొక్క సాహిత్య రూప లక్షణాలు పరిగణించండి.
ఈ పుస్తకం/వాక్యభాగం యొక్క సాహిత్య రూపం ఏంటి?
ఈ సాహిత్య రూపం యొక్క లక్షణాలు ఏంటి?
కీర్తన 124:4-5:
సాహిత్య రూపం: కావ్యం
లక్షణాలు: సమాంతరత
ప్రకటన 12:3:
సాహిత్య రూపం: అంత్యకాల విషయాల్ని గురించిన సాహిత్యం
లక్షణాలు: జంతువులు సాదృశ్యమైనవి
పరిశీలన: పుస్తకం యొక్క విషయ అవగాహన
రచన ఉద్దేశ్యం ఏంటి? రచయిత ఏమి ఉద్ఘాటించాడో లేక రచయిత శ్రద్ధ చూపిన, వివరణ ఇచ్చిన లేక శ్రోతలను సవాలు చేసిన విషయాలు కోసం చూడండి.
1 కొరింథీయులకు 7:1: “మీరు వ్రాసినవాటివిషయము:”
కొరింథీ సంఘం ప్రశ్నలడుగుతూ తనకు రాసిన పత్రికకు సమాధానంగా పౌలు 1 కొరింథీయులకు పత్రికను రాశాడు.
రచయిత శ్రోతలకు ఏమి చెప్తున్నాడు? రచయిత పరిశీలనల తరువాత ఇవ్వబడిన ఆజ్ఞలు ఏవైనా, అవి రచయిత యొక్క స్పష్టమైన సూచనలుగా ఉన్నాయి. ఇవి, వాక్యభాగాన్ని ఎలా అన్వయించాలో సూచిస్తాయి.
పరిశీలన: వాక్యభాగం ఆరంభం మరియు ముగింపు నిర్ణయించాలి
చాలాసార్లు, ఎల్లప్పుడు కాదు, అధ్యాయ విభజన ఒక వాక్యభాగానికి ముగింపు లేక ఆరంభాన్ని సూచిస్తుంది. అప్పుడప్పుడు, ఒక అధ్యాయమంతా ఒక వాక్యభాగంగా ఉంటుంది. మరికొన్నిసార్లు, అధ్యాయ విభజనలు సరిగా ఉండవు, వాటిని వాక్యభాగ విభజనలుగా ఉపయోగించకూడదు. విషయంలో మార్పులు గ్రహించండి, ఇవి మార్పు ప్రకటనలతో గుర్తించబడతాయి. వాక్యభాగంలో మీరు అధికంగా చేర్చితే, ఒక ముఖ్య విషయం ఉండదు. వాక్యభాగంలో చాలినంత సమాచారం చేర్చకపోతే, పూర్తి అర్థాన్ని ఇవ్వలేదు.
ఈ వాక్యభాగంలో ఏ వచనాలు చేర్చబడ్డాయి?
2 కొరింథీయులకు 7:1: “ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక …”
ఇది చివరి అధ్యాయం ముగింపులో కనుగొన్న వాక్యభాగంలో భాగం, 2 కొరింథీయులకు 6:14-18.
యెషయా 52:13-15, యెషయా 53 వ వాక్యభాగంలోనే ఉంది.
పరిశీలన: వాక్యభాగం పుస్తకంతో ఎలా సంబంధం కలిగియుందో గ్రహించండి
ఇది విస్తృత విషయానికి సంబంధించిన కథనమేనా?
న్యాయాధిపతులు 17:5: “మీకా అను ఆ మనుష్యునికి దేవమందిర మొకటి యుండెను. మరియు అతడు ఏఫోదును గృహదేవతలను చేయించి తన కుమారులలో ఒకని ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడాయెను.”
ఒక మనుష్యునికి గృహదేవతలు మరియు ఏఫోదు ఉన్నాయి. ఈ వచనం మరియు న్యాయాధిపతులు 17-18 చుట్టూ ఉన్న కథనం న్యాయాధిపతులు గ్రంథమంతటి విషయాన్ని ఉదహరిస్తుంది, “ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను” (న్యాయాధిపతులు 17:6, న్యాయాధిపతులు 21:25).
ఇది తదుపరి అన్వయానికి వేదాంతాన్ని ఇస్తుందా?
ఇది పుస్తకంలోని మునుపటి భాగాలకు అన్వయమా?
ఎఫెసీయులకు 4-6, ప్రాథమికంగా ఎఫెసీయులకు 1-3లో బోధించబడిన వేదాంతం యొక్క ఆచరణాత్మక అన్వయం. “కాబట్టి” అనే పదం వేదాంత బోధన మరియు ఆచరణాత్మక అన్వయానికి మధ్య సంధిని సూచిస్తుంది.
వాక్యభాగం మరొక లేఖనాన్ని ఉటంకిస్తుందా లేక సూచిస్తుందా? క్రొత్త నిబంధన రచయితలు, పాత నిబంధన నుండి ఉల్లేఖనాలు లేక దృష్టాంతాలు ఉపయోగించారు.
రోమా 12:1: “కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది.”
ఈ వచనంలో, యాగము అను పదం పాత నిబంధనలో విషయాన్ని సూచించే మాట.
పరిశీలన: ముఖ్య పదాలను గమనించి, అధ్యయనం చేయడం
వాక్యభాగంలో ముఖ్య పదాలు ఏంటి?
1 కొరింథీ 2:14-15లో ముఖ్య పదాలు:
ప్రకృతి సంబంధియైనవాడు
ఆత్మ సంబంధియైనవాడు
రోమా 8లో ముఖ్య పదాలు:
శరీరం
ఆత్మ
ఈ సందర్భంలో వాటి అర్థం ఏంటి? ప్రతి పదం అధ్యయనం చేయండి.
పరిశీలన: ప్రతి మాట/ప్రకటనను పరీక్షించండి
దాని అర్థం ఏంటి? నిజానికి ప్రకటన ఏం సెలవిస్తుందో వివరించండి.
అది ఎందుకు చేర్చబడింది, ఇక్కడ ఎందుకు ఉంది? ఆ ప్రకటక ఇక్కడ చేర్చబడకపోతే ఏమౌతుందో ఎటువంటి వ్యత్యాసం కలుగుతుందో చూడండి.
భాష్యం: సందేశాన్ని సంగ్రహించండి
ఇప్పటివరకు మీరు వచనం లేక వాక్యభాగంలోని వివరాలను జాగ్రత్తగా పరిశీలించారు, వాస్తవిక శ్రోతలకు రచయిత ఇచ్చిన సందేశాన్ని ఇప్పుడు సంగ్రహించండి. వచనం యొక్క సారాంశం బహుశా ఒకే వాక్యంలో ఉండాలి. వాక్యభాగం యొక్క సారాంశం అనేక వాక్యాల్లో లేక పేరాల్లో ఉంటుంది.
ఈ దశ లక్ష్యం ఏంటంటే, రచయిత మొదటి శ్రోతలకు ఏం చెప్తున్నాడో గమనించడం. ఈ సమయం, ఊహించడానికి లేక సృజనాత్మకంగా ఉండడానికి కాదు. ప్రసంగం లేక బోధన చేసే సమయంలో మీరు సృజనాత్మకంగా ఉండొచ్చు, కాని ఇప్పుడు మీరు లేఖన అర్థాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. అర్థం లేఖనంలో నుండి రావాలి గాని మీ ఊహల్లో నుండి కాదు.
రచయిత మొదటి శ్రోతలకు ఏం చెప్తున్నాడు?
1 కొరింథీయులకు 1:10-13 ఈ విధంగా సంగ్రహించవచ్చు: “సిద్ధాంతం, సహవాసం విషయంలో ఏకీభవించండి, వేర్వేరు గుంపులుగా విభజించబడవద్దు. మీరు వాదించుకొంటున్నారని క్లోయె ఇంటివారివలన నాకు తెలిసింది. మీరు వేర్వేరు నాయకులను అనుసరిస్తున్నారు, కాని మీ కోసం చనిపోయింది కేవలం క్రీస్తు మాత్రమే.”
మీ సారాంశం పరీక్షించుకొండి. మీరు చేసిన పరిశీలనల నుండి వచ్చిన ఈ క్రింది ప్రశ్నలను పరిగణించండి:
రచయిత యొక్క వాస్తవిక పరిస్థితిని తగినంతగా పరిగణించానా?
ఈ వాక్యభాగం రాయడంలో రచయిత ఉద్దేశ్యం ఏంటి?
వాక్యభాగానికి నేను ఇచ్చిన భాష్యం పుస్తకమంతటి విషయానికి అనుగుణంగా ఉందా?
నా భాష్యం ఈ వాక్యభాగానికి పుస్తకంలో సరైన పాత్రను ఇస్తుందా?
వాక్యభాగ నిర్మాణం నా సారాంశానికి అనుగుణంగా ఉందా?
వాక్యభాగంలో ప్రతి అర్థం నా సారాంశానికి మద్దతు ఇస్తుందా?
రచయిత ముఖ్య పదాలు ఉపయోగించిన విధానాన్ని నేను సరిగా అర్థం చేసుకున్నానా?
భాష్యం: సూత్రం పేర్కొనండి
వాక్యభాగంలో, అన్ని కాలాలకు మరియు ప్రజలందరికీ వర్తించు ఒక సూత్రం కనుగొనండి. (వాక్యభాగం అనేక సూత్రాలు బోధించవచ్చు, కాని ఆచరించడానికి ఒకదానిని ఎన్నుకోండి.) ఒక్క వాక్యంలో పేర్కొనండి.
ఎఫెసీయులకు 4:25:లో కనిపించే ఒక సూత్రం: “ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను.”
మీ సూత్రం అసలు వాక్యభాగ సందేశానికి సరిగా సరిపోతుందో లేదో పరిశీలించండి:
ఈ సూత్రం వాక్యభాగంలో స్పష్టంగా బోధించబడిందా?
ఈ సూత్రం మిగిలిన లేఖనానికి అనుగుణంగా ఉందా?
ఈ సూత్రం అన్ని కాలాలకు, ప్రజలందరికీ వాస్తవమేనా?
ఈ సూత్రాన్ని ఇతర సత్యానికి అనుసంధానించండి:
లేఖనంలోని ఇతర చోట్ల ఏ సంబంధిత సత్యం వెల్లడిపరచబడింది?
ఈ సత్యం మన జ్ఞానాన్ని ఎలా పెంచుతుంది?
లేఖనమంతటిని మొత్తంగా పరిశీలిస్తే, నా భాష్యం సరిదిద్దవచ్చా?
ఈ సత్యం మరొక వాక్యభాగంతో విభేదిస్తుందా? అలాగైతే, అవి సమాధానపరచవచ్చా?
అన్వయం: ఆధునిక సందర్భానికి అన్వయించండి
మీరు కనుగొనిన సత్యం, అనేక మార్గాల్లో అన్వయించవచ్చు. ఒక నిర్దిష్టమైన ఆధునిక అన్వయాన్ని అందించండి.
ఈ సత్యాన్ని ఏ నిర్దిష్టమైన ఆధునిక పరిస్థితికి అన్వయించవచ్చు?
ఎప్పుడు, ఎక్కడ మరియు ఎవరికి ఈ ప్రకటనలు వర్తిస్తాయి?
సత్యం చర్యలో మరియు భావనలో ఎలా అన్వయించబడుతుంది?
నేను వాక్యభాగాన్ని తీవ్రంగా పరిగణిస్తే, నా జీవితంలో ఎటువంటి మార్పు కలుగుతుంది?
అనుదిన జీవితంలో దేవుని వాక్య ప్రకారంగా జీవించడంలో సహాయం చేయమని పరిశుద్ధాత్ముని అడగండి.
పత్రికల భాష్యం అభ్యసించండి
క్రొత్త నిబంధన పత్రికలను భాష్యం చెప్పేటప్పుడు, పత్రికను సాధ్యమైనంత పరిశీలించడం ద్వారా ఆరంభిస్తాం, పత్రికలోని సందేశాన్ని నిర్ణయించడానికి దానిని అధ్యయనం చేస్తాం మరియు సూత్రాలను లోకానికి అన్వయిస్తూ ముగిస్తాం. ఈ భాష్య ప్రక్రియ, మొదటి శ్రోతల ప్రపంచం నుండి ఆధునిక పాఠకుల ప్రపంచానికి మనల్ని నడిపిస్తుంది.
కలిసి అభ్యాసం చేయండి
► తరగతి అంతా కలిసి, 1 యోహాను 2:15-17 పై భాష్య ప్రక్రియను అభ్యసించండి. పైన వివరించిన ప్రశ్నలు, భాష్య ప్రక్రియతో పాటుగా, క్రొత్త నిబంధన పత్రికల లక్షణాలను సాహిత్య రూపాలుగా పరిగణించాలని గుర్తుంచుకోండి (6వ పాఠం చూడండి).
మీ సొంతంగా అభ్యాసం చేయండి
► ప్రతి విద్యార్థి వీటిలో ఒక వాక్యభాగం తీసుకొని, భాష్య ప్రకియ చేయాలి. ఆ తరువాత విద్యార్థులు ఇతర సభ్యులతో తమ తీర్మానాలు పంచుకోవాలి.
రోమా 13:8-10
ఎఫెసీ 6:18-20
2 తిమోతికి 4:6-8
యాకోబు 3:13-18
1 పేతురు 2:9-10
పాత నిబంధన ధర్మశాస్త్రం యొక్క భాష్యం అభ్యసించండి
మనం పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని భాష్యం చేసేటప్పుడు, మొదటి శ్రోతలకు దాని అర్థం ఏంటో మొదటిగా గ్రహించాలి. వాళ్ల పరిస్థితికి, మన పరిస్థితికి మధ్య వ్యత్యాసం చూడాలి, మరి ముఖ్యంగా మనం క్రొత్త నిబంధనలో జీవిస్తున్నామనే సత్యానికి సంబంధించిన వ్యత్యాసాలను చూడాలి. పాత నిబంధన ధర్మశాస్త్రంలో, అన్ని కాలాల్లో ప్రజలందరికీ వర్తించే సూత్రాన్ని గ్రహించాలి. ఆ తర్వాత ఆ సూత్రాన్ని మన జీవితాలకు అన్వయించుకోవచ్చు.
కలిసి అభ్యాసం చేయండి
► తరగతి అంతా కలిసి, సంఖ్యాకాండము 15:37-41పై భాష్య ప్రక్రియను అభ్యసించాలి. పైన వివరించిన ప్రశ్నలు, భాష్య ప్రక్రియతో పాటుగా, 6వ పాఠంలో ఇవ్వబడిన పాత నిబంధన ధర్మశాస్త్ర లక్షణాలను సాహిత్య రూపాలుగా పరిగణించాలని గుర్తుంచుకోండి.
మీ సొంతంగా అభ్యాసం చేయండి
► ప్రతి విద్యార్థి వీటిలో ఒక వాక్యభాగం తీసుకొని, భాష్య ప్రకియ చేయాలి. ఆ తరువాత విద్యార్థులు ఇతర సభ్యులతో తమ తీర్మానాలు పంచుకోవాలి.
లేవీయకాండము 19:9-10
నిర్గమకాండము 20:4-6
నిర్గమకాండము 22:10-13
ద్వితీయోపదేశకాండము 14:1-2
పాఠం10 అభ్యాసం
1వ పాఠంలో, క్రింది ఇవ్వబడిన వాక్యభాగాలలో ఒకదానిని మీరు ఎన్నుకున్నారు.
ద్వితీయోపదేశకాండము 6:1-9
యెహోషువ 1:1-9
మత్తయి 6:25-34
ఎఫెసీయులకు 3:14-21
కొలొస్సయులకు 3:1-16
భాష్యం ప్రయాణంలోని ప్రతి దశను మీరు ఆచరించారు, మీరు ఎన్నుకున్న వాక్యభాగాన్ని లోతుగా అధ్యయనం చేయండి. అలా చేసిన పిమ్మట, మీ అధ్యయనాన్ని వీటిలో ఒక విధంగా సిద్ధపరచండి:
1. మీరు ఈ కోర్సును సమూహంతో కలిసి తీసుకుంటే, మీ అధ్యయనాన్ని పంచుకునే ప్రదర్శనను సిద్ధం చేయండి. (1) మీ పరిశీలనలు చూపించండి, (2) వాక్యభాగంలో నుండి సూత్రాలు బోధించండి, మరియు (౩) నేటి విశ్వాసులకు వాక్య భాగం ఎలా వర్తిస్తుందో చూపించండి.
2. మీరు ఒంటరిగా అధ్యయనం చేస్తే, 5-6 పేజీల్లో (1) మీ పరిశీలనలు, (2) వాక్యభాగంలో బోధించబడిన సూత్రాలు, (3) నేటి విశ్వాసులకు అన్వయం రాయండి.
Print Course
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
No Changes – Course content must not be altered in any way.
No Profit Sales – Printed copies may not be sold for profit.
Free Use for Ministry – Churches, schools, and other training ministries may freely print and distribute copies—even if they charge tuition.
No Unauthorized Translations – Please contact us before translating any course into another language.
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.