కుటుంబ బోధనా సాధనాలు
కుటుంబ బోధనా సాధనాలు
Audio Course Purchase

Search Course

Type at least 3 characters to search

Search through all lessons and sections in this course

Searching...

No results found

No matches for ""

Try different keywords or check your spelling

results found

Lesson 2: పిల్లలకు ప్రశ్నోత్తరాలు

1 min read

by Shepherds Global Classroom


బైబిలు గురించి ప్రశ్నలు

1. దేవుణ్ణి ఎలా ప్రేమించాలో, ఆయనకు ఎలా లోబడాలో మనం ఎక్కడ నేర్చుకుంటాం?

జవాబు: బైబిల్లో

2. బైబిలు అంటే ఏంటి?

జవాబు: దేవుడు-ప్రేరేపించిన 66 పుస్తకాలు దేవుని గురించి బోధిస్తాయి అలాగే, ఆయన పరిశుద్ధంగా ఉన్నట్లు మనం ఎలా పరిశుద్ధులుగా ఉండాలో బోధిస్తాయి

3. బైబిలు ఎవరు రాశారు?

జవాబు: సుమారు 1,600 సంవత్సరాల కాలంలో దేవుని నడిపింపులో, ప్రేరేపించబడిన 40 కంటే ఎక్కువ మంది వ్యక్తులు రాశారు.

4. బైబిల్లో ధర్మశాస్త్రంగా పిలువబడే ఐదు పుస్తకాల పేర్లు చెప్పండి.

జవాబు: ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము

5. ధర్మశాస్త్ర సందేశం ఏంటి?

జవాబు: దేవుడు పరిశుద్ధుడు, మనం ఆయనవలే ఉండాలని కోరుతున్నాడు.

6. పాత నిబంధన చారిత్రక పుస్తకాల పేర్లు పేర్కొనండి.

జవాబు: యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, 1 మరియు 2 సమూయేలు, 1 మరియు 2 రాజులు, 1 మరియు 2 దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు

7. చారిత్రక పుస్తకాల సందేశం ఏంటి?

జవాబు: మనం పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెంబడించినప్పుడు మేలు జరుగుతుంది. వెంబడించనప్పుడు కీడు జరుగుతుంది.

8. పాత నిబంధనలో కావ్య పుస్తకాల పేర్లు తెలపండి.

జవాబు: యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము

9. కావ్య పుస్తకాల సందేశం ఏంటి?

జవాబు: అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి వెదకినప్పుడే మనం ధన్యులం.

10. పాత నిబంధనలో పెద్ద ప్రవక్తల పుస్తకాల పేర్లు తెలపండి.

జవాబు: యెషయా, యిర్మీయా, విలాపవాక్యములు, యెహెజ్కేలు, దానియేలు

11. పాత నిబంధనలో చిన్న ప్రవక్తల పుస్తకాల పేర్లు తెలపండి.

జవాబు: హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకీ

12. వీటిని “చిన్న”ప్రవక్తలు అని ఎందుకు పిలుస్తారు?

జవాబు: ఇవి పెద్ద ప్రవక్తల పుస్తకాల కంటే చిన్నగా ఉంటాయి.

13. ప్రవక్తల సందేశం ఏంటి?

జవాబు: ధర్మశాస్త్రం యొద్దకు, దేవుని ప్రేమ దగ్గరికి తిరిగి రావాలి.

14. క్రొత్త నిబంధనలో సువార్తల పేర్లు చెప్పండి.

జవాబు: మత్తయి, మార్కు, లూకా, మరియు యోహాను

15. సువార్తల సందేశం ఏంటి?

జవాబు: యేసు మన కోసం వచ్చాడు, జీవించాడు, మరణించాడు మరియు తిరిగిలేచాడు.

16. యేసు పునరుత్థానం తర్వాత, ఆది సంఘ చరిత్రను తెలియజేసే పుస్తకం పేరు చెప్పండి.

జవాబు: అపొస్తలుల కార్యములు

17. అపొస్తలుల కార్యముల గ్రంథ సందేశం ఏంటి ?

జవాబు: సంఘంలోకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు, దేవుని వాక్యం విస్తరించింది.

18. పౌలు పత్రికలు పేర్కొనండి.

జవాబు: రోమా, 1 మరియు 2 కొరింథీ, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలొస్స, 1 మరియు 2 థెస్సలొ, 1 మరియు 2 తిమోతికి, తీతుకు, ఫిలేమోనుకు

19. పౌలు పత్రికల సందేశం ఏంటి?

జవాబు: దేవుని కృపలో, ఆయన నీతిలో జీవించడం.

20. సాధారణ పత్రికలు పేర్కొనండి.

జవాబు: హెబ్రీ, యాకోబు, 1 & 2 పేతురు, 1, 2 & 3 యోహాను, మరియు యూదా

21. సాధారణ పత్రికల సందేశం ఏంటి?

జవాబు: దేవుని ప్రజలుగా లోకంలో ఎలా జీవించాలి

22. బైబిల్లో చివరి పుస్తకం పేరు చెప్పండి.

జవాబు: ప్రకటన గ్రంధం

23. ప్రకటన గ్రంధం సందేశం ఏంటి?

జవాబు: యేసు రాజులరాజు మరియు ఆయన జయించిన తన సంఘం కోసం త్వరగా వస్తున్నాడు.

24. బైబిల్లో 66 పుస్తకాల పేర్లు తెలపండి.

జవాబు:

పాత నిబంధన

ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము,
యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, 1 మరియు 2 సమూయేలు, 1 మరియు 2 రాజులు, 1 మరియు 2 దినవృత్తాంతములు,
ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు,
యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము,
యెషయా, యిర్మీయా, విలాపవాక్యములు, యెహెజ్కేలు, దానియేలు,
హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము,
హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకీ

క్రొత్త నిబంధన

మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపొస్తలుల కార్యములు, రోమా, 1 & 2 కొరింథీ,
గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలొస్స,
1 & 2 థెస్సలొ, 1 & 2 తిమోతికి, తీతుకు,
ఫిలేమోనుకు, హెబ్రీ, యాకోబు, 1 & 2 పేతురు,
1, 2 & 3 యోహాను, యూదా, ప్రకటన గ్రంధం

25. దేవుడు-ప్రేరేపించిన ఈ 66 పుస్తకాల సందేశం ఏంటి?

జవాబు: అవి దేవుని గురించి బోధిస్తాయి, ఆయన పరిశుద్ధుడైయున్నట్టుగా మనం ఎలా పరిశుద్ధంగా ఉండాలో బోధిస్తాయి; మనం విమోచించబడి, యేసుక్రీస్తు స్వరూపంలోకి ఎలా మార్చబడతామో కూడా బోధిస్తాయి.[1]


[1]“మనం విమోచించబడి, యేసుక్రీస్తు స్వరూపంలోకి ఎలా మార్చబడతామో” అనే మాట మూల జవాబుకు అదనంగా చేర్చబడింది.