కుటుంబ బోధనా సాధనాలు
కుటుంబ బోధనా సాధనాలు
Audio Course Purchase

Search Course

Type at least 3 characters to search

Search through all lessons and sections in this course

Searching...

No results found

No matches for ""

Try different keywords or check your spelling

results found

Lesson 3: సామెతల గ్రంథంనుండి సూత్రాలు

1 min read

by Shepherds Global Classroom


తల్లిదండ్రులకు : సాధనం 3

ఈ సాధనం ఉద్దేశ్యం

ఈ సాధనం సామెతలు గ్రంథం నుండి జీవితానికి ఉపయోగపడే సూత్రాలు అందిస్తుంది, వీటిని కుటుంబంలో లేక పాఠశాలలో, లేక ఇతర అధ్యయన సందర్భాల్లో ఉపయోగించవచ్చు. ఈ మెటీరియల్<ని ఒకేసారి, ఒకే పాఠంగా బోధించడానికి రూపొందించలేదు. ప్రతిరోజు ఒకటి లేక రెండు సూత్రాలు బోధించడం, చర్చించడం మంచిది.

బోధనా పద్ధతి

(1) సూత్రానికి సంబంధించిన వచనాన్నిఎవరైనా చదవాలి. ఒకవేళ ఎక్కువ వచనాలు ఉంటే, తల్లి లేక తండ్రి/బోధకుడు ఏది ఉపయోగించాలో ఎన్నుకోవచ్చు.

(2) వచనంలోని పదాల్ని, వాక్యాల్ని శ్రోతలు సరిగా అర్థం చేసుకున్నారో లేదో తల్లిదండ్రులు/బోధకుడు నిర్థారించుకోవాలి.

(3) ఆ తర్వాత, తల్లిదండ్రులు/ బోధకుడు, వచనం ఆధారంగా సూత్రాన్ని పంచుకోవచ్చు.

(4) ఆ సూత్రం ఏ జీవిత పరిస్థితికి వర్తిస్తుందో తల్లిదండ్రులు/ బోధకుడు, ఇతరులు వివరించవచ్చు.

సామెతలు గ్రంథంలో భావనలు

సామెతలు గ్రంథంలో దేవునియందలి భయభక్తులు అనేది ఒక ముఖ్య విషయం. దేవునికి సరిగా భయభక్తులు చూపడం అంటే మూడు విషయాలు తెలుసుకోవడం: ఆయన ఎవరు, మనం ఆయనకు విధేయత చూపాలి మరియు అవిధేయత చూపితే తీర్పు తీర్చబడతాం.

సామెతలు గ్రంథంలో జ్ఞానం ప్రధాన విషయం. జ్ఞానం కలిగియుండడమంటే, దేవుని ఆలోచనలు మరియు విలువలు అనుసరించడమని అర్థం. దేవుడు ప్రతి విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూస్తాడు కాబట్టి, దేవుడు చెప్పింది నమ్మి, ఆయన మార్గాన్ని అనుసరించినప్పుడు మనం జ్ఞానులమౌతాం.

తల్లిదండ్రులు, బోధకులు సామెతలు గ్రంథంలోని సూత్రాల్ని అనుసరించడానికి వ్యక్తిగతంగా సమర్పించుకోవాలి. తమ జీవితాల్లో వాటిని పాటించాలి. వాళ్ల పిల్లలకు, విద్యార్ధులకు బోధించాలి, ఆపై జీవిత పరిస్థితుల్లో వాటిని ఎలా అన్వయించాలో చూడాలి.