Search Course
Search through all lessons and sections in this course
Searching...
No results found
No matches for ""
Try different keywords or check your spelling
ఈ లోకంలోని విశ్వాస సంప్రదాయాలు
Course Description
ఈ కోర్సు 17 ఎంపిక చేసిన కల్ట్స్ వారి మత సంప్రదాయాల ప్రాథమిక నమ్మకాలు మరియు చరిత్రలను వివరిస్తుంది, వాటిని చారిత్రాత్మక ప్రొటెస్టంట్ క్రైస్తవ మతంతో పోల్చి, బైబిల్ ద్వారా వారి సిద్ధాంతాలు మరియు ఆచరణలను అంచనా వేస్తుంది.
Introduction
ముద్రించగల PDF ఇక్కడ మరియు Additional Files/అనుబంధం/అదనపు ఫైళ్ళు లో అందుబాటులో ఉంది.
|
క్రైస్తవ మతంతో గుర్తించే మతాలు |
క్రైస్తవ మతం కానిది |
వేరుగా ఉన్న క్రైస్తవ సంప్రదాయాలు |
|---|---|---|
|
మోర్మనిజం |
హిందూ మతం |
సెవెన్-డే అడ్వెంటిజం |
|
యెహోవా సాక్షులు |
బౌద్ధమతం |
రోమన్ కాథోలిసిజం |
|
ఇగ్లేసియా ని క్రిస్టో |
తావోయిజం |
ఈస్టర్న్ ఆర్థడాక్సీ |
|
ఈస్టర్న్ లైట్నింగ్ |
ఇస్లాం |
శ్రేయస్సు సిద్ధాంతం |
|
అపోకలిప్టిక్ కల్ట్‌లు |
యూద మతం |
|
|
|
న్యూ ఏజ్ మతం |
|
|
|
ప్రకృతి మతాలు |
|
|
|
వూడూ |
|
తరగతి నాయకులకు వివరణలు మరియు పద్ధతులు
గ్రంథాలు కుండలీకరణంలో లేదా ప్రధాన వచనంలో జాబితా చేయబడినప్పుడు, తరగతి ముందుకు వెళ్ళే ముందు ఆ లేఖన వచనాలను చదవాలి.
మతపరమైన సమూహాల గురించి పాఠాలు (పాఠాలు 3-19) సాధారణంగా క్రింది దిశలలో వివరించిన నమూనాను అనుసరిస్తాయి. మొదటి రెండు పాఠాలు ప్రత్యేక అంశాలపై ఉంటాయి.
ఈ ఆదేశాలు తరగతిని అత్యున్నత స్థాయి నాణ్యతతో ఎలా బోధించవచ్చో వివరిస్తాయి. Shepherds Global Classroom (షెపర్డ్స్ గ్లోబల్ క్లాస్ రూమ్) నుండి ధృవీకరణ పత్రం పొందాలనుకునే విద్యార్థుల కోసం తరగతి నాయకుడు ఈ ప్రమాణాన్ని ఉంచాలి. ఈ అవసరాలను తీర్చలేని ఇతర రకాల సమూహాలకు, ఒక ఉపాధ్యాయుడు వారి సామర్థ్యానికి అనుగుణంగా అవసరాలను స్వీకరించి, వేరే ధృవీకరణ పత్రాన్ని ఇవ్వవచ్చు.
మేము అంచనా వేసినదని ప్రకారం ప్రతి పాఠం బాగా పూర్తి కావడానికి రెండు గంటలు పడుతుందని. సమూహం తక్కువ సమయం పాటు సమావేశమైతే, పాఠాన్ని రెండు సమావేశాలకు విభజించవచ్చు..
సమూహ కార్యకలాపాల క్రమం
(1) సువార్త సంభాషణ నివేదికలు (సుమారు: 20 నిమిషాలు,చాల నివేదికలు ఉంటే)
మునుపటి పాఠం నుండి సంభాషణ కేటాయింపును పూర్తి చేసిన విద్యార్థులు నివేదించాలి. వారు వారి సంభాషణను మాత్రమే వివరించాలి. ఇతర విద్యార్థులు భవిష్యత్తు కోసం సలహాలు ఇవ్వవచ్చు. ఒక నివేదికను విద్యార్థులు అధికంగా విమర్శించకుండా చూడాలి.
(2) తరగతి సమీక్ష సమయం (సుమారు: 5-10 నిమిషాలు)
తరగతి నాయకుడు మునుపటి పాఠం కోసం సమీక్ష ప్రశ్నలను అడగాలి, తరువాత ఇప్పటికే పూర్తీ చేయబడిన ఇతర పాఠాల నుండి కొన్ని సమీక్ష ప్రశ్నలు అడగాలి. దీని ఉద్దేశ్యం విద్యార్థుల దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిని పెంపొందించడం మరియు వారు కలిగి ఉన్న అపార్థాలను సరిచేయడం. సమీక్ష ప్రశ్నలు వారికి అత్యంత ముఖ్యమైన వాస్తవాలను గుర్తుంచుకోవడానికి సహాయపడతాయి. సమీక్ష ప్రశ్నలను ఉపయోగించడం ద్వారా బోధకుడు కోర్సును చాలా ప్రభావవంతంగా చేయగలడు. సమీక్ష ప్రశ్నలు ఈ కోర్సు చివరిలో కనిపిస్తాయి.
(3) మొదటి పరిచయం
ఎవరైనా "మొదటి పరిచయం " అనే పేరాను చదవాలి. ఇది ఎక్కువ వ్యాఖ్య లేదా చర్చ లేకుండా చేయాలి. అధ్యయనం చేయబడుతున్న సమూహం గురించి ఆసక్తిని సృష్టించడానికి కథలు ఎక్కువగా తీర్మానాలు లేకుండా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో, పాఠం చివరిలో ఉన్న సాక్ష్యం మొదటి పరిచయల్లో పేర్కొన్న అదే వ్యక్తి గురించి ఉంటుంది.
(4) లేఖన అధ్యయనం – భాగం 1 (సుమారు: 15 నిమిషాలు)
కేటాయించిన భాగాన్ని కలిసి బిగ్గరగా చదవండి. చాలా మంది విద్యార్థులు వరసగా పద్యాలను చదవగలిగేవారు. అప్పుడు విద్యార్థులు సారాంశం పేరా మరియు ప్రకటనల జాబితాను వ్రాయడానికి కొన్ని నిమిషాల మౌనం పాటించండి. (అవసర సూచనలు ప్రతి పాఠం లో ఉన్నాయి). వారు రాసిన తరువాత, చాలా మంది విద్యార్థులు వారు రాసిన వాటిని చెప్పనివ్వండి, తద్వారా ప్రతి ఒక్కరూ ఇతరుల నుండి నేర్చుకోవచ్చు.
(5) మతపరమైన సమూహ అధ్యయనం (సుమారు: 40 నిమిషాలు)
మత సమూహం గురించి అందించిన సమాచారాన్ని అధ్యయనం చేయండి. నాయకుడు లేదా సమూహంలోని మరొక వ్యక్తి సమూహానికి విషయాలను చదివి వివరించవచ్చు. వేర్వేరు విద్యార్థులు అంచులలో ఉల్లేఖనాలను చదివి వివరించగలరు.
చర్చా ప్రశ్నలు మరియు తరగతి కార్యకలాపాలు ► ద్వారా సూచిస్తారు. తరగతి నాయకుడు ప్రశ్న అడగాలి మరియు సమాధానం గురించి చర్చించడానికి విద్యార్థులకు సమయం ఇవ్వాలి. ప్రతి పాఠంలో వీటిలో అనేకం ఉంటాయి..
బోల్డ్ మరియు ఇటాలిక్ వచనలు మత సమూహం యొక్క తప్పుడు బోధనలు మరియు అభ్యాసాలను ఖండిస్తుంది. మత సమూహం గురించి వాస్తవాలను చదివిన తరువాత, తిరిగి వెళ్లి ఇచ్చిన వివరణలు మరియు లేఖన గ్రంథాలను చదవండి.
(6) సిద్ధాంతాల చేతి పుస్తకం ఉపయోగించడం (సుమారు: 20 నిమిషాలు)
సిద్ధాంతాల చేతి పుస్తకం అనేది పాఠాల తర్వాత ముద్రించిన ఈ కోర్సులోని ఒక విభాగం. పాఠంలోని ఈ సమయంలో, ఈ విభాగం క్రింద జాబితా చేయబడిన సిద్ధాంతాల చేతి పుస్తకంలోని అంశాలను చూడండి. విద్యార్థులు కలిసి లేఖనాలను చదవాలి మరియు శ్లోకాలు ఒక విషయాన్ని ఎలా నిరూపిస్తాయో వారు అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోవాలి. ప్రతి విద్యార్థి తాను గ్రంథం నుండి ఒక అంశాన్ని నిరూపించగలనని చూపించాలి. కొన్ని పాయింట్లు అనేక పాఠాలలో ఉపయోగించబడతాయి. విద్యార్థులు బాగా నేర్చుకుంటున్నట్లు అనిపిస్తే అదే పాయింట్ల సాధనను పునరావృతం చేయవలసిన అవసరం లేదు.
(7) సువార్త ప్రచారం ( సుమారు: 10 నిమిషాలు)
ఈ విభాగం నిర్దిష్ట మత సమూహ సభ్యులతో మాట్లాడేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని ఆచరణాత్మక విషయాలను అందిస్తుంది. కొన్ని పాఠాలలో ఈ విభాగం "సిద్ధాంతాల చేతి పుస్తకాన్ని ఉపయోగిస్తూ" విభాగంతో కలిపి ఉంటుంది.
(8) ఒక సాక్ష్యం
ఎవరైనా "ఒక సాక్ష్యం" అనే శీర్షిక గల విభాగాన్ని చదవండి. సాక్ష్యాలన్నీ నిజమైన జరిగినవి, అయితే కొన్నిసార్లు పేర్లు మార్చబడ్డాయి.
(9) లేఖన అధ్యయనం – భాగం 2 (సుమారు: 20 నిమిషాలు)
అధ్యయన సమావేశ కాలము ముగిసె సమయంలో, కేటాయించిన లేఖన భాగాన్ని మళ్ళీ చదవండి. ప్రతి విద్యార్థి వారు అధ్యయనం చేసిన మత సమూహంలోని సభ్యుడికి ఈ భాగంలో ఉన్న సందేశాన్ని వివరిస్తూ ఒక పేరా రాయడానికి కొన్ని నిమిషాలు వేచి ఉండండి. విద్యార్థులు వారు రాసిన వాటిని తరగతి గదిలో పంచుకోవచ్చు.
(10) కేటాయించిన పని
సువార్త ప్రదర్శనకు అవకాశాన్ని కేటాయించమని విద్యార్థులకు గుర్తు చేయడం ద్వారా ఎల్లప్పుడూ పాఠ సమయాన్ని ముగించండి. వీలైతే విద్యార్థులు అధ్యయనం చేస్తున్న మత సమూహ సభ్యులతో సంభాషించాలి. వారు సువార్త మరియు ఇతర క్రైస్తవ సత్యాలను ప్రదర్శించడానికి ప్రయత్నించాలి. ఆ నిర్దిష్ట మత సమూహానికి చెందిన సభ్యుడిని కనుగొనడం వారికి సాధ్యం కాకపోతే, వారు ఆ విషయాన్ని వినడానికి ఆసక్తి ఉన్న మరొకరిని కనుగొనాలి. వారు మతం యొక్క ప్రాథమిక నమ్మకాలను వివరించి, ఆపై బైబిలు యొక్క ప్రత్యుత్తరాన్ని ఇవ్వాలి. వారు తమ సంభాషణల గురించి తరగతికి చెప్పడానికి సిద్ధంగా ఉండాలి.
ప్రతి విద్యార్థి కోర్సు ద్వారా 10 వేర్వేరు మతాల గురించి సంభాషణలను నివేదించాలి. ప్రతి సంభాషణ యొక్క వ్రాతపూర్వక నివేదిక ఒక సువార్తికుడు తెలుసుకోవలసిన ముఖ్యమైన మతం యొక్క లక్షణాలను వివరించాలి. నివేదికలో, విద్యార్థి సంభాషణలో తాను ఏమి సమర్పించానో, అవతలి వ్యక్తి ఎలా స్పందించాడో వివరించాలి. ప్రతి సంభాషణ యొక్క నివేదిక రెండు పేజీల పొడవు ఉండాలి. మొదటి కొన్ని పాఠాల సమయంలో బోధకుడు ఈ నియామకాన్ని చాలాసార్లు వివరించాలి. విద్యార్థులు రాసిన మంచి పేపర్లను ఉదాహరణలుగా సమూహానికి చూపించవచ్చు.
10 సంభాషణలు మరియు రచన కేటాయింపులు ఈ కోర్సు యొక్క ప్రాథమిక కేటాయింపులు. ఈ పుస్తకం చివరలో ఒక ఫారం ముద్రించబడుతుంది, దీనిని బోధకుడు రికార్డులను ఉంచడానికి ఉపయోగించవచ్చు.
(11) సిఫార్సు చేసిన వనరులు
విద్యార్థులు ఏదైనా మత సమూహం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, వారు అందుబాటులో ఉన్న వనరులను చూడటానికి పుస్తకం వెనుక భాగంలో ఉన్న సిఫార్సు చేయబడిన వనరులను చూడవచ్చు.
Ready to Start Learning?
Select a lesson from the sidebar to begin your journey through this course.