స్థానిక ఇన్స్టిట్యూట్ చేతిపుస్తకము

స్థానిక ఇన్స్టిట్యూట్ చేతిపుస్తకము

పరిచయం

సంఘము బోధించవలెను. ప్రతి చోట తన ఆజ్ఞలను బోధించమని యేసు సంఘమునకు చెప్పాడు (మత్తయి 28:19). ఒక కాపరి బోధించువానిగా ఉండాలని పౌలు చెప్పాడు (1 తిమోతి 3:2). ఈ బోధన శిష్యరిక కార్యములో భాగముగా ఉన్నది. విశ్వాసులుగా ఎలా జీవించాలో, దేవుని మహిమ కొరకు ఎలా జీవించాలో సంఘము ప్రజలకు బోధిస్తుంది. ఈ బోధన విశ్వాసి ఉన్న ప్రతి చోట జరగాలి. బలమైన సంఘములలో తమ ప్రజలకు బోధించుటకు బైబిలానుసారమైన సత్యములు మరియు ఆచరణాత్మక పద్ధతులు ఉంటాయి.

సంఘము తర్ఫీదు చేయాలి.

నీవు అనేక సాక్షులయెదుట నావలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యముగల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము (2 తిమోతి 2:2).

బోధించు అవసరత పరిచర్య తర్ఫీదు కొరకు అవసరతను కూడా సృష్టిస్తుంది. ఇతరులకు బోధించగల పురుషులను తర్ఫీదు చేయమని పౌలు తిమోతికి చెప్పాడు (2 తిమోతి 2:2). తర్ఫీదు చేయుట అంటే కేవలం సమాచారమును బోధించుట మాత్రమే కాదు. తర్ఫీదు అంటే విశ్వాసుల స్వప్రయోజనము కొరకు వారికి బోధించుట మాత్రమే కాదు. తర్ఫీదు ఇతరులకు సహాయము చేయుటకు విశ్వాసులను సిద్ధపరుస్తుంది.

యేసు పరిచర్య తర్ఫీదు యొక్క ప్రాధాన్యతను కనుపరచాడు. ఆయన పరిచర్య ఆరంభములో, ఆయన సంఘమును నడిపించు మరియు వ్యాపింపజేయు కొందరు పురుషులను ఎన్నుకున్నాడు. ఆయన తన సమయమంతటిని జనసమూహములకు బోధించుచు గడపలేదు; బదులుగా, పన్నెండు మంది నాయకులను తర్ఫీదు చేయుటకు ఆయన తరచుగా సమయము వెచ్చించాడు. ఆయన తర్ఫీదుచేసిన వారి ద్వారా ఆయన తన పరిచర్యను వ్యాపింపజేశాడు.

Shepherds Global Classroom స్థానిక సేవకుల కొరకు ఇతరులకు బోధించదగిన తర్ఫీదు కార్యక్రమమును అందిస్తుంది.