బైబిల్ సంబంధమైన సువార్త మరియు శిష్యత్వము
పరిచయం
► ఒక విద్యార్థి, సమూహము కొరకు మత్తయి 28:18-20 వచనాలను చదవాలి.
ఈ ఆజ్ఞ అపొస్తలులకు మాత్రమే అని కొంతమంది నమ్ముచున్నారు.
► ఈ ఆజ్ఞ ఆ రోజు విన్న ప్రజలకు మాత్రమేనా? మీ సమాధానం వివరించండి.
విలియం కేరీ 1761-1834 నివసించారు. అతడు ఇంగ్లాండ్ నుండి వచ్చాడు. అతడు చెప్పులు కుట్టేవాడు, సువార్తను వ్యాప్తి చేయాలనే బలమైన కోరికతో రగిలిపోయేవాడు. అతడు ఉన్న సంఘానికి విదేశాలలో సువార్త ప్రకటించుట మీద పెద్దగా ఆసక్తి లేదు. వారు, దేవుడు ఇప్పటికే వీరిలో నిర్ణయించుకొన్న వారే వెళ్తారు దానికి మానవ సహాయం అక్కర లేదు అని నమ్మేవారు.
ఒక పాస్టర్స్ సమావేశంలో, కేరీ చర్చ కొరకు ఒక అంశమును సూచించాడు: భూదిగంతముల వరకు క్రీస్తు సంఘానికి ఈ గొప్ప ఆజ్ఞ ఇచ్చి ఉంటే, తప్పక క్రీస్తు ఈ గొప్ప ఆజ్ఞ నేరవేర్చు వరుకు అనగా, యుగ సమాప్తి వరకు తోడై ఉంటాడు, అని అన్నాడు. సమావేశ నాయకుడు, “యువకుడా, కూర్చోండి, మీరు అతి ఉత్సాహంగా ఉన్నారు (మతోన్మాదిలా). అన్యజనులను మార్చడానికి దేవుడు ఇష్టపడినప్పుడు, అతడు మీ సహాయం లేదా నా సహాయము లేకుండా చేస్తాడు,” అని అన్నాడు.
భూదిగంతముల వరకు సంఘానికి ఆజ్ఞ ఇవ్వబడిందని మనకు తెలుసు. సువార్తను ప్రకటించే వారితో, యుగ సమాప్తి వరకు తోడై ఉంటానని యేసు వాగ్దానం చేశాడు. ఈ సువార్త బాధ్యత అన్ని తరాల ద్వారా సంఘానికి చెపుతూనే ఉన్నాడు. అపొస్తలులు తమ జీవితకాలంలో ఆ పనిని పూర్తి చేయలేకపోయారు. కాని ప్రతి దేశంలోను, సకల జనులకు సువార్త ప్రకటించబడుతుందని యేసు చెప్పాడు (మత్తయి 24:14).
కాబట్టి సువార్త యొక్క బాధ్యత సంఘము యొక్క ప్రతి తరం ఒక వారసత్వంగా పొందుతుంది.
► మత్తయి 28:18-20 వివరాలను మళ్ళీ చూడండి. ప్రత్యేకంగా ఏమి ఆజ్ఞాపించబడింది?
యేసు యొక్క ఖచ్చితమైన ఆజ్ఞ ఏమిటంటే సంఘము ప్రతి స్థలానికి వెళ్లి శిష్యులనుగా చేయుట.
ఆజ్ఞలో సువార్త ప్రకటన ఉంటుంది, ఎందుకంటే అతడు మారుమనస్సు పొందితే తప్ప ఒక వ్యక్తి శిష్యుడిగా ఉండలేడు.
ఆజ్ఞ అంటే సంఘము సువార్త ప్రకటనకు మరియు శిష్యత్వ తర్ఫీదుకు ప్రాధాన్యత ఇవ్వాలి, మరియు ఉత్సాహపూరితమైన పరిచర్య చేయాలి; లేకపోతే, ఆదిమ సంఘము యొక్క ఉద్దేశము నెరవేర్చ జాలదు.
“సర్వ లోకము" (అంటే ప్రతి జాతి) అనే పదం విదేశాలకు సువార్త పని ఆజ్ఞాపించబడిందని చూపిస్తుంది, ఎందుకంటే ప్రతి జాతికి, సువార్తను వారి వద్దకు తీసుకొని వెళ్ళాలి. ఏ వర్గాన్ని, జాతిని మినహాయించకూడదు.
[1]ఆజ్ఞ అంటే సువార్త ప్రకటించడానికి మాత్రమే కాదు. బోధించే ప్రక్రియ కూడా అవసరం ఎందుకంటే యేసు మనకు ఆజ్ఞాపించిన ప్రతిదాన్ని బోధించాలి.
క్రీస్తు ఆజ్ఞలను పాటించటానికి ఉపాధ్యాయునికి పూర్తి వ్యక్తిగత సమర్పణ ఉండాలి, ఎందుకంటే అతడు మంచి మాదిరికలిగి ఉండాలి, క్రీస్తుకు విధేయత కలిగి జీవించటము ఎలాగో క్రొత్తగా నమ్మిన వారి ఎదుట దానిని చూపించాలి, విధేయతతో జీవించాలి.
మారుమనస్సు క్రీస్తుకు లోబడి ఉండుటకు కట్టుబడి ఉండాలి, ఎందుకంటే క్రీస్తు ఆజ్ఞలను నేర్చుకోవడము మాత్రమే సరిపోదు దాని ప్రకారము జీవించాలి. అతడు నేర్చుకున్న వాటిని పాటించకపోతే, అతడు శిష్యత్వపు పనిని వ్యతిరేకిస్తున్నవాడు. శిష్యత్వ ప్రక్రియ నేర్చుకొనుట మాత్రమే కాదు, దాని ప్రకారము జీవించుట.
మన యజమానుడు ఆయన తన మొదటి శిష్యులకు ఒక మార్గదర్శిగా ఇచ్చిన దిశలను, హామీలను మనం పూర్తిగా తీసుకుంటే, వారు మన కాలానికి తగినట్లుగా ఉండాలని నేను ఎప్పటినుంచో నమ్ముతున్నాను. అవి మన కాలానికి కూడా ఇవ్వబడ్డాయి.
(జె. హడ్సన్ టేలర్, “ది కాల్ టు సర్వీస్”).
Please select a section from the sidebar.